← Back to వ · Booklets 41–50 (digitized file 5)

విశ్వాత్మా viśvātmā

Original — తెలుగు
  1. విశ్వస్య ఆత్మా - విశ్వాత్మా - (శ్రీశంకరః)

(ప్రపంచమంతటికి ఆత్మ అయినవాడు)

  1. విశ్వమేవాత్మా శరీరం యస్య స విశ్వాత్మా -

(ప్రపంచమే శరీరముగా గలవాడు)

  1. విశ్వం ఆత్మస్వరూపం యస్య ఇతి విశ్వాత్మా -

(ప్రపంచము శరీరముగా గలవాడు)

  1. .ప్రపంచక శరీరతయా ప్రపంచ స్వరూపః -

(ప్రపంచకమే శరీరముగా కలిగియుండుటచేత ప్రపంచమే రూపముగా గలవాడు).

  1. జగదంతర్యామీ -

(జగత్తు లోపల సంచరించువాడు)

  1. సర్వాంతర్యామి -

(అన్నింటిలోను అంతర్యమిగా లోపల సంచరించువాడు - జగత్తులోనుండు వస్తువులన్నింటిలోను సంచరించువాడు)

  1. విశ్వ శరీరకః, విశ్వస్యాంతరాత్మా ఇతివా -

(విశ్వము లేక ప్రపంచకము శరీరముగా గలవాడు, లేక విశ్వము లోపలనుండు ఆత్మ అయినవాడు)

  1. విశ్వస్య చిదచిదాత్మక ప్రపంచస్య అంతః ప్రవిశ్య యం అపరిత్యక్తస్వరూపే స్వభావేన శాసనేన ధారకః - అనేన విశ్వస్య శరీరత్వం ఉక్తం ఇతి జీవనాం పరతంత్ర భేదో అభ్యుపగతిః ఇతివేదితవ్యం

(విశ్వమనగా చిత్ అచిత్ వస్తువులుగల ప్రపంచము - దానిలోపల ప్రవేశించి తన స్వస్వరూపమునకు హాని లేకుండగ - స్వస్వరూపమును వదలకుండ - శాసించు స్వభావముతో దానిని ధరించువాడు. ఇట్లు చెప్పుటవలన విశ్వము శరీరముగా గలవాడని చెప్పబడినది).

  1. జగదుపాదానత్వేన తదభేదాత్ విశ్వాత్మత్వం.

(జగత్తునకు ఉపాదానకారణమగుటచేత దానికంటె వేరుకానివాడగుటచేత విశ్వమే - జగత్తే శరీముగా కలవాడు)

  1. విశ్వం పంచీకృత పంచమహాభూత తతా తత్కార్యాత్మకం స్థూలం జగత్, వెరాజం శరీరం, తస్మిన్ జగరితే చాహం మమేత్యభిమానం, ఇత్యర్థః -

(విశ్వమనగా పంచీకృతము చేయబడిన పంచ మహా భూతములు, వాటి కార్యములు అయిన స్థూల జగత్తు, విరాట్పురుషుని శరీరము - దానిలో జాగ్రదవస్థ లోనుండు ‘నేను, నాది’ అను అభిమానము కలది.)

  1. “యథా వ్యవహితో వహ్నిర్దారేష్వేకః స్వయోనిషు |

నానేవ భాతి విశ్వాత్మా భూతేషు చ తథా పుమాన్ |” (శ్రీమద్భాగతం - 12 - 31)

“వ. - - - అగ్ని యొక్కరుండయ్యు బెక్కు మ్రాకులందు దేజరిల్లుచు బెక్కండ్రై తోచు తెఱంగున విశ్వాత్మకుండైన పురుషుండొక్కండ తన వలనం గలిగిన నిఖిల భూతంబులందు నంతర్యామి రూపంబున దీపించు.” (శ్రీమహాభాగవతము - 1 - 2- 59)

  1. స్వాజ్ఞైః స్వాతిరేకేణాస్తి ఇతి విశ్వసనీయం విశ్వం, స్వా విద్యా పదతత్కార్య జాతమేవ యస్యాత్మా శరీరం సో అయం విశ్వాత్మా, విరాట్ -

(బ్రహ్మజ్ఞానము లేనివారికి పరబ్రహ్మకంటె వ్యతిరేకముఘా (వేరుగా) నున్నదని అను విశ్వాసము కలిగించునది కనుక విశ్వము - ప్రంచము - తన అవిద్యాకార్యమైన ప్రపంచమే శరీరముగా కలవాడు విశ్వాత్మ - విరాట్పురుషుడు)

  1. “విగ్రహో దేవదేవస్య విశ్వమేతచ్చరా చరం” (పరాశరోపపురాణము)

(చరాచరములు - జంగమములు, స్థావరములు కలిసియున్న విశ్వమంతయు దేవతులకు దేవుడైన శ్రీమహావిష్ణువుయొక్క విగ్రహమే - శరీరమే, రూపమే)

  1. విశ్వస్మాత్ విలక్షణం -

(విశ్వముకంటె - ప్రపంచముకంటె వేరు లక్షణములుకలవాడు).

  1. “పరమాత్మాచ విశ్వాత్మా విశ్వరూపధరో హరిః” (శ్రీవిష్ణుపూరాణము)

(విశ్వరూపమును ధరించన శ్రీమహావిష్ణువే - విశ్వరూపమును ధరించుటవలన శ్రీమహావిష్ణువే విశ్వాత్మయని, పరమాత్మయని చెప్పబడుచున్నాడు)

  1. “క. విశ్వాత్ముడు, విశ్వేశుడు,

విశ్వమయుండఖిలనేత విష్ణుడజుం డీ

విశ్వములో దానుండును

విశ్వము దనలోన చాల వెలుగుచునుండున్“. ( శ్రీమదాంధ్రమహాభాగవతము - 6 - 100)

  1. “నారాయణం మహా జ్ఞేయం, విశ్వాత్మానం పరాయణం” - (మంత్రపుష్పము - 3)

(బ్రహ్మజ్ఞానముద్వారా తెలుసుకోతగినవాడు - జ్ఞేయ బ్రహ్మ - విశ్వమునకు ఆత్మ అయినవాడు, పరం మోక్షరూపమైనవాడు నారాయణుడే).

  1. “విశ్వాత్మకం వ్యాపకం”.

(ప్రపంచమంతటికి ఆత్మ యినవాడు - ప్రపంచములోని జీవులందఱికి ఒకే ఆత్మ అయినవాడు - ప్రపంచమంతటిలోను - దానిలోని వస్తువులన్నింటిలోను పూర్తిగా వ్యాపించియుండువాడు) (ప్రపంచములోని వస్తువులొక్కఒక్క దానికి ఆత్మ అయినవాడు)

Transliteration
  1. viśvasya ātmā - viśvātmā - (śrīśaṃkaraḥ)

(prapaṃcamaṃtaṭiki ātma ayinavāḍu)

  1. viśvamēvātmā śarīraṃ yasya sa viśvātmā -

(prapaṃcamē śarīramugā galavāḍu)

  1. viśvaṃ ātmasvarūpaṃ yasya iti viśvātmā -

(prapaṃcamu śarīramugā galavāḍu)

  1. .prapaṃcaka śarīratayā prapaṃca svarūpaḥ -

(prapaṃcakamē śarīramugā kaligiyuṃḍuṭacēta prapaṃcamē rūpamugā galavāḍu).

  1. jagadaṃtaryāmī -

(jagattu lōpala saṃcariṃcuvāḍu)

  1. sarvāṃtaryāmi -

(anniṃṭilōnu aṃtaryamigā lōpala saṃcariṃcuvāḍu - jagattulōnuṃḍu vastuvulanniṃṭilōnu saṃcariṃcuvāḍu)

  1. viśva śarīrakaḥ, viśvasyāṃtarātmā itivā -

(viśvamu lēka prapaṃcakamu śarīramugā galavāḍu, lēka viśvamu lōpalanuṃḍu ātma ayinavāḍu)

  1. viśvasya cidacidātmaka prapaṃcasya aṃtaḥ praviśya yaṃ aparityaktasvarūpē svabhāvēna śāsanēna dhārakaḥ - anēna viśvasya śarīratvaṃ uktaṃ iti jīvanāṃ parataṃtra bhēdō abhyupagatiḥ itivēditavyaṃ

(viśvamanagā cit acit vastuvulugala prapaṃcamu - dānilōpala pravēśiṃci tana svasvarūpamunaku hāni lēkuṃḍaga - svasvarūpamunu vadalakuṃḍa - śāsiṃcu svabhāvamutō dānini dhariṃcuvāḍu. iṭlu ceppuṭavalana viśvamu śarīramugā galavāḍani ceppabaḍinadi).

  1. jagadupādānatvēna tadabhēdāt viśvātmatvaṃ.

(jagattunaku upādānakāraṇamaguṭacēta dānikaṃṭe vērukānivāḍaguṭacēta viśvamē - jagattē śarīmugā kalavāḍu)

  1. viśvaṃ paṃcīkṛta paṃcamahābhūta tatā tatkāryātmakaṃ sthūlaṃ jagat, verājaṃ śarīraṃ, tasmin jagaritē cāhaṃ mamētyabhimānaṃ, ityarthaḥ -

(viśvamanagā paṃcīkṛtamu cēyabaḍina paṃca mahā bhūtamulu, vāṭi kāryamulu ayina sthūla jagattu, virāṭpuruṣuni śarīramu - dānilō jāgradavastha lōnuṃḍu ‘nēnu, nādi’ anu abhimānamu kaladi.)

  1. “yathā vyavahitō vahnirdārēṣvēkaḥ svayōniṣu |

nānēva bhāti viśvātmā bhūtēṣu ca tathā pumān |” (śrīmadbhāgataṃ - 12 - 31)

“va. - - - agni yokkaruṃḍayyu bekku mrākulaṃdu dējarillucu bekkaṃḍrai tōcu teṟaṃguna viśvātmakuṃḍaina puruṣuṃḍokkaṃḍa tana valanaṃ galigina nikhila bhūtaṃbulaṃdu naṃtaryāmi rūpaṃbuna dīpiṃcu.” (śrīmahābhāgavatamu - 1 - 2- 59)

  1. svājñaiḥ svātirēkēṇāsti iti viśvasanīyaṃ viśvaṃ, svā vidyā padatatkārya jātamēva yasyātmā śarīraṃ sō ayaṃ viśvātmā, virāṭ -

(brahmajñānamu lēnivāriki parabrahmakaṃṭe vyatirēkamughā (vērugā) nunnadani anu viśvāsamu kaligiṃcunadi kanuka viśvamu - praṃcamu - tana avidyākāryamaina prapaṃcamē śarīramugā kalavāḍu viśvātma - virāṭpuruṣuḍu)

  1. “vigrahō dēvadēvasya viśvamētaccarā caraṃ” (parāśarōpapurāṇamu)

(carācaramulu - jaṃgamamulu, sthāvaramulu kalisiyunna viśvamaṃtayu dēvatulaku dēvuḍaina śrīmahāviṣṇuvuyokka vigrahamē - śarīramē, rūpamē)

  1. viśvasmāt vilakṣaṇaṃ -

(viśvamukaṃṭe - prapaṃcamukaṃṭe vēru lakṣaṇamulukalavāḍu).

  1. “paramātmāca viśvātmā viśvarūpadharō hariḥ” (śrīviṣṇupūrāṇamu)

(viśvarūpamunu dhariṃcana śrīmahāviṣṇuvē - viśvarūpamunu dhariṃcuṭavalana śrīmahāviṣṇuvē viśvātmayani, paramātmayani ceppabaḍucunnāḍu)

  1. “ka. viśvātmuḍu, viśvēśuḍu,

viśvamayuṃḍakhilanēta viṣṇuḍajuṃ ḍī

viśvamulō dānuṃḍunu

viśvamu danalōna cāla velugucunuṃḍun”. ( śrīmadāṃdhramahābhāgavatamu - 6 - 100)

  1. “nārāyaṇaṃ mahā jñēyaṃ, viśvātmānaṃ parāyaṇaṃ” - (maṃtrapuṣpamu - 3)

(brahmajñānamudvārā telusukōtaginavāḍu - jñēya brahma - viśvamunaku ātma ayinavāḍu, paraṃ mōkṣarūpamainavāḍu nārāyaṇuḍē).

  1. “viśvātmakaṃ vyāpakaṃ”.

(prapaṃcamaṃtaṭiki ātma yinavāḍu - prapaṃcamulōni jīvulaṃdaṟiki okē ātma ayinavāḍu - prapaṃcamaṃtaṭilōnu - dānilōni vastuvulanniṃṭilōnu pūrtigā vyāpiṃciyuṃḍuvāḍu) (prapaṃcamulōni vastuvulokkaokka dāniki ātma ayinavāḍu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.