← Back to వ · Booklets 41–50 (digitized file 5)

వీతరాగభయక్రోధః vītarāgabhayakrōdhaḥ

Original — తెలుగు
  1. రాగశ్చ, భయంచ క్రోధశ్చ వీతాః విగతాః యస్మాత్ సః.

(రాగము, భయము. రోధము - ఈ మూడు లేనివాడు - ఈ మూడింటిని విడిచిపెట్టినవాడు)

  1. అనాగతేషు స్పృహా రాగః, తద్రహితః; ప్రియ విశ్లేషా ప్రియాగమన హేతుదర్శన నిమిత్తం దుఃఖం, భయం, తద్రహితం ప్రియ విశ్లేశా ప్రియాగమన హేతుభూత చేతనాంతరగత దుఃఖ హేతుభూత స్వమనో వికారాః క్రోధః, తద్రహితః.

(ప్రాప్తించనివాటియందు స్పృహకలిగియుండుట రాగము; ప్రియమైనది తప్పిపోవుట, అప్రియమైనది వచ్చుట, ఇవి కలుగుటవలన దుఃఖము, భయము, ప్రియవిశ్లేషము, అప్రియాగమనము, కార్యము అయి ఇంకొకరివలన దుఃఖము కలుగునపుడు తన మనసులో కలుగు వికారము క్రోధము - ఈ మూడును - రాగము, భయము, క్రోధము - లేనివాడు).

  1. “విషయాంతరేషు ప్రీతిర్హిరాగః, తద్విరోధిషు నిరసనేచ్ఛాక్రోధః, ఆగామీష్ట విరోధ్యనిష్టాగమో త్పేక్షా భయం; తదేతదఖిలమపి న వాసుదేవ భక్తానాం అస్తి తదేక ప్రియత్వేన విషయాంతరే రాగాభావాత్ తత ఏవ తన్మూలక్రోధా భావాత్, తల్లాభ లాభాత్ వ్యతిరిక్తేష్టా నిషాభావేన భయా భవాచ్చ”.

(ఇతర విషయములందు ప్రీతి కలిగియుండుట రాగము. దానికి విరోధముగా - అడ్డుగా - నుండువారియందు కలుగు నిరసన చేయవలయునను కోరిక క్రోధము - ఇష్తమైనవి వచ్చుటప్పుడు అడ్డు కలుగుతుందేమో అనిన్నీ, ఇష్టముకానివి వచ్చునేమోయను భయము - ఈ మూడును విష్ణు భక్తులకు కలుగవు - ఎందుచేతననగా భగవంతుడు తప్ప ఇతరవస్తువునందు వారికి రాగము (అనురాగము - అభిలాష) ఉండవు. ఇందువలన లాభా లాభములు లేనందున, - విష్ణువునందే రాగము కలిగియుండుటచేత - క్రోధమునకు కారణమైన రాగము లేనప్పుడు క్రోధముండదు. ఇందువలన - లాభాలాభములు లేనందున వాటి గుఱించి భయముకూడా కలుగదు).

Transliteration
  1. rāgaśca, bhayaṃca krōdhaśca vītāḥ vigatāḥ yasmāt saḥ.

(rāgamu, bhayamu. rōdhamu - ī mūḍu lēnivāḍu - ī mūḍiṃṭini viḍicipeṭṭinavāḍu)

  1. anāgatēṣu spṛhā rāgaḥ, tadrahitaḥ; priya viślēṣā priyāgamana hētudarśana nimittaṃ duḥkhaṃ, bhayaṃ, tadrahitaṃ priya viślēśā priyāgamana hētubhūta cētanāṃtaragata duḥkha hētubhūta svamanō vikārāḥ krōdhaḥ, tadrahitaḥ.

(prāptiṃcanivāṭiyaṃdu spṛhakaligiyuṃḍuṭa rāgamu; priyamainadi tappipōvuṭa, apriyamainadi vaccuṭa, ivi kaluguṭavalana duḥkhamu, bhayamu, priyaviślēṣamu, apriyāgamanamu, kāryamu ayi iṃkokarivalana duḥkhamu kalugunapuḍu tana manasulō kalugu vikāramu krōdhamu - ī mūḍunu - rāgamu, bhayamu, krōdhamu - lēnivāḍu).

  1. “viṣayāṃtarēṣu prītirhirāgaḥ, tadvirōdhiṣu nirasanēcchākrōdhaḥ, āgāmīṣṭa virōdhyaniṣṭāgamō tpēkṣā bhayaṃ; tadētadakhilamapi na vāsudēva bhaktānāṃ asti tadēka priyatvēna viṣayāṃtarē rāgābhāvāt tata ēva tanmūlakrōdhā bhāvāt, tallābha lābhāt vyatiriktēṣṭā niṣābhāvēna bhayā bhavācca”.

(itara viṣayamulaṃdu prīti kaligiyuṃḍuṭa rāgamu. dāniki virōdhamugā - aḍḍugā - nuṃḍuvāriyaṃdu kalugu nirasana cēyavalayunanu kōrika krōdhamu - iṣtamainavi vaccuṭappuḍu aḍḍu kalugutuṃdēmō aninnī, iṣṭamukānivi vaccunēmōyanu bhayamu - ī mūḍunu viṣṇu bhaktulaku kalugavu - eṃducētananagā bhagavaṃtuḍu tappa itaravastuvunaṃdu vāriki rāgamu (anurāgamu - abhilāṣa) uṃḍavu. iṃduvalana lābhā lābhamulu lēnaṃduna, - viṣṇuvunaṃdē rāgamu kaligiyuṃḍuṭacēta - krōdhamunaku kāraṇamaina rāgamu lēnappuḍu krōdhamuṃḍadu. iṃduvalana - lābhālābhamulu lēnaṃduna vāṭi guṟiṃci bhayamukūḍā kalugadu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.