(సమస్త శోకములనుండి విడివడినవాడు, అనగా కృతకృత్యుడైనవాడు -)
(జననమరణములు మొదలగువాటివల్ల దుఃఖములేనివాడు)
(చైతన్యమాత్రము, మోక్షరూపుడగు అగుటవలన ఎల్లపుడు ఆనందస్వరూపుడు. అద్వితీయుడు పరబ్రహ్మ స్వరూపుడే అయినప్పటికీ ఆత్మ (జీవుడు) తనను ఆశ్రయించియుండునట్టిన్నీ సానుభవమైన అవిద్యచేత స్వాభావికమైన పురుషార్థమునకు ఆటంకము కలిగింపచేయబడినవాడై అనేక అనర్థములననుభవించి అవిద్యచేత కల్పింపబడిన సాధనములచేత తనకు ఇష్టమైన దానిని పురుషార్థముకానిదైనను, పురుషార్థమే యని భావించి, పరమపురుషార్థమైన మోక్షమును పొందలేక, మొసలి మొదలగు వాటిచే పట్టుపడినవివలె రాగము మొదలైన వాటివలె ఇటూ అటూ ఆకర్షింపబడినవాడై, దేవతులు, మనుష్యులు, జంతువులు అను అనేకభేదములుగల యోనులందు జన్మించుచు ఏదో ఒక పుణ్యకర్మ ఫలముగా బ్రాహ్మణులు మొదలగు అధికారుల శరీరమును పొంది, ఈశ్వరుని గుఱించి అయిన కర్మను అనుష్టించుటచేత - అనుసరించుటచేత - రాగము మొదలగు మలములను (కల్మషములను) వదలుకొనినవాడై, ఈ లోకమునందనుభవించు భోగములు నిత్యములనితెలుసుకొని వాటియందు అనురాగము - ఆశ - లేనివాడై, గురువును సమీపించి, గురువు ద్వారా వేదాంతశ్రవణము చేసి, దానిద్వారా “నేను బ్రహ్మను అయితిని” అను మహావాక్యర్థమగు బ్రహ్మాత్మ తత్వమును (బ్రహ్మమే ఆత్మ అను దాని తత్వమును) పొంది, అజ్ఞానము (బ్రహ్మజ్ఞానము లేకుండుట) దాని కార్యమువలన వీడ్వడినవాడై శోకములేనివాడగును).
(samasta śōkamulanuṃḍi viḍivaḍinavāḍu, anagā kṛtakṛtyuḍainavāḍu -)
(jananamaraṇamulu modalaguvāṭivalla duḥkhamulēnivāḍu)
(caitanyamātramu, mōkṣarūpuḍagu aguṭavalana ellapuḍu ānaṃdasvarūpuḍu. advitīyuḍu parabrahma svarūpuḍē ayinappaṭikī ātma (jīvuḍu) tananu āśrayiṃciyuṃḍunaṭṭinnī sānubhavamaina avidyacēta svābhāvikamaina puruṣārthamunaku āṭaṃkamu kaligiṃpacēyabaḍinavāḍai anēka anarthamulananubhaviṃci avidyacēta kalpiṃpabaḍina sādhanamulacēta tanaku iṣṭamaina dānini puruṣārthamukānidainanu, puruṣārthamē yani bhāviṃci, paramapuruṣārthamaina mōkṣamunu poṃdalēka, mosali modalagu vāṭicē paṭṭupaḍinavivale rāgamu modalaina vāṭivale iṭū aṭū ākarṣiṃpabaḍinavāḍai, dēvatulu, manuṣyulu, jaṃtuvulu anu anēkabhēdamulugala yōnulaṃdu janmiṃcucu ēdō oka puṇyakarma phalamugā brāhmaṇulu modalagu adhikārula śarīramunu poṃdi, īśvaruni guṟiṃci ayina karmanu anuṣṭiṃcuṭacēta - anusariṃcuṭacēta - rāgamu modalagu malamulanu (kalmaṣamulanu) vadalukoninavāḍai, ī lōkamunaṃdanubhaviṃcu bhōgamulu nityamulanitelusukoni vāṭiyaṃdu anurāgamu - āśa - lēnivāḍai, guruvunu samīpiṃci, guruvu dvārā vēdāṃtaśravaṇamu cēsi, dānidvārā “nēnu brahmanu ayitini” anu mahāvākyarthamagu brahmātma tatvamunu (brahmamē ātma anu dāni tatvamunu) poṃdi, ajñānamu (brahmajñānamu lēkuṃḍuṭa) dāni kāryamuvalana vīḍvaḍinavāḍai śōkamulēnivāḍagunu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.