← Back to వ · Booklets 41–50 (digitized file 5)

వివాహ్యకన్యా vivāhyakanyā

Original — తెలుగు

శ్లో |. దక్షా, ప్రజాపతీ, సాధ్వీ పటువాక్య ప్రియంవదా |

గుణైరమీ భి స్సం యుక్తా సాస్త్రీ శ్రీరూపధారిణీ |

ఉపయేమే తతో భార్యాం సువర్ణాం సాధులక్షణాం |

జనకస్యా సగోత్రా యా మాతు రవ్య పిండకా |

దార కర్మణి యోగ్యా సా ద్విజానాం ధర్మ వృత్తయే |

స్త్రీ సంబందేప్యపస్మార క్షయ శ్విత్ర కులం త్యజేత్ |

అభిశస్త సమా యుక్తాం తదా కన్యా ప్రసూంత్య జేత్ |

రోగహీనాం భ్రాతృవతీం, స్వస్మాత్ కించిల్లఘీయనీం |

ఉద్వహేత ద్విజో భార్యాం తాం కన్యాం మృదు భాషిణీం |

సపర్వతర వృక్షాఖ్యా న నగో సర్పనామికాం |

సవాక్షి పుష్ప నామ్నంచ ప్రేత భూతాహ్వయాం త్యజేత్ |

న చాతిరిక్త హీనాంగం నాతి దీర్ఘాం న చా కృశాం |

నా లోమికాం నాతి లోమాం నాస్నిగ్థాం స్థూల మూర్థ జాం |

మోహా న్నోప యేమేన్మర్త్యం కులహీనాం చ కన్యకాం |

హీనోపయమా నా ద్యాతి సంతానస్య విహీనతాం |

లక్షణాని పరేక్షీత తతః కన్యాం సముద్వహేత్ |

సులక్షణా సదాచారా పత్యురాయుశ్చ వర్థ యేత్ |. (మాఘమహాత్మ్యం)

(చతురత గలదియు, సంతత కలుగచేయునదియు, పతివ్రతయు, తిన్ననివి, ప్రియములు నైన మాటలు గలదియు, చక్కదనము గలదియు, తండ్రికి సగోతృరాలు కానిదియు, తల్లికి సపిండురాలు కానిదియు అయిన ఇలాలు బ్రాహ్మణునకు స్వధర్మవృద్ధికై గ్రహింపతగినది. పిచ్చి, అరుతెవులు, బొల్లి, రోగము ఇవి గల వంశమునుండి కన్యకను గ్రహింపరాదు. బ్రహ్మహత్యాది పాతకములు, కలిగినదియు, ఆడుబిడ్డలనే పడయునదియు నైన వంశమున కన్యకను గొనతగదు - ముందు చెప్పిన వ్యాధులు లేనిదియు, అన్నదమ్ములతో గూడినదియు, తనకంటె చిన్నదియు, యోగ్యురాలును, తిన్నని మాటలు గలదియు నైన కన్యకను బ్రాహ్మణుడు వివాహము కావలయును; పర్వతనామము, వృక్షనామము, నక్షత్ర నామము, నదీ నదముల నామములు గలదియు, సర్పనామము కలదియు నగు కన్యకను, నేత్రములయు, పుష్పములయు నామధేయముగల కన్యకను, వృద్ధిలేని వంశమునందు పుట్టిన కన్యకను వివాహము కారాదు. హెచ్చు, తక్కువ అవయవములుగల దానిని, మిక్కిలి కృశించినదానిని, మిక్కిలి పొడవైనదానిని, రోమము లనిదానిని, విశేషించి రోమములున్నదానిని, కఠినదేహము కలదానిని, బిరుసుగల వెండ్రుకలు గలదానిని, మంచి కులము లేనిదానిని ఎంత మోహనాంగి నైనను పెండ్లాడరాదు - ఈ చెప్పిన అవగుణములలో ఏవియేని కలిగిన కన్యకను పెండ్లాడుటవలననే కొందఱు సంతానము లేనివారగుచున్నారు - కనుక ఈ లక్షణములన్నింటినీ పరిశీలించి చూచియే కన్యకను పరిగ్రహింపవలయును - మంచి లక్షణములును, మంచి ఆచారమును కలిగిన కన్యక తన పెనిమిటి ఆయుస్సును వృద్ధి నొందించును -)

Transliteration

ślō |. dakṣā, prajāpatī, sādhvī paṭuvākya priyaṃvadā |

guṇairamī bhi ssaṃ yuktā sāstrī śrīrūpadhāriṇī |

upayēmē tatō bhāryāṃ suvarṇāṃ sādhulakṣaṇāṃ |

janakasyā sagōtrā yā mātu ravya piṃḍakā |

dāra karmaṇi yōgyā sā dvijānāṃ dharma vṛttayē |

strī saṃbaṃdēpyapasmāra kṣaya śvitra kulaṃ tyajēt |

abhiśasta samā yuktāṃ tadā kanyā prasūṃtya jēt |

rōgahīnāṃ bhrātṛvatīṃ, svasmāt kiṃcillaghīyanīṃ |

udvahēta dvijō bhāryāṃ tāṃ kanyāṃ mṛdu bhāṣiṇīṃ |

saparvatara vṛkṣākhyā na nagō sarpanāmikāṃ |

savākṣi puṣpa nāmnaṃca prēta bhūtāhvayāṃ tyajēt |

na cātirikta hīnāṃgaṃ nāti dīrghāṃ na cā kṛśāṃ |

nā lōmikāṃ nāti lōmāṃ nāsnigthāṃ sthūla mūrtha jāṃ |

mōhā nnōpa yēmēnmartyaṃ kulahīnāṃ ca kanyakāṃ |

hīnōpayamā nā dyāti saṃtānasya vihīnatāṃ |

lakṣaṇāni parēkṣīta tataḥ kanyāṃ samudvahēt |

sulakṣaṇā sadācārā patyurāyuśca vartha yēt |. (māghamahātmyaṃ)

(caturata galadiyu, saṃtata kalugacēyunadiyu, pativratayu, tinnanivi, priyamulu naina māṭalu galadiyu, cakkadanamu galadiyu, taṃḍriki sagōtṛrālu kānidiyu, talliki sapiṃḍurālu kānidiyu ayina ilālu brāhmaṇunaku svadharmavṛddhikai grahiṃpataginadi. picci, arutevulu, bolli, rōgamu ivi gala vaṃśamunuṃḍi kanyakanu grahiṃparādu. brahmahatyādi pātakamulu, kaliginadiyu, āḍubiḍḍalanē paḍayunadiyu naina vaṃśamuna kanyakanu gonatagadu - muṃdu ceppina vyādhulu lēnidiyu, annadammulatō gūḍinadiyu, tanakaṃṭe cinnadiyu, yōgyurālunu, tinnani māṭalu galadiyu naina kanyakanu brāhmaṇuḍu vivāhamu kāvalayunu; parvatanāmamu, vṛkṣanāmamu, nakṣatra nāmamu, nadī nadamula nāmamulu galadiyu, sarpanāmamu kaladiyu nagu kanyakanu, nētramulayu, puṣpamulayu nāmadhēyamugala kanyakanu, vṛddhilēni vaṃśamunaṃdu puṭṭina kanyakanu vivāhamu kārādu. heccu, takkuva avayavamulugala dānini, mikkili kṛśiṃcinadānini, mikkili poḍavainadānini, rōmamu lanidānini, viśēṣiṃci rōmamulunnadānini, kaṭhinadēhamu kaladānini, birusugala veṃḍrukalu galadānini, maṃci kulamu lēnidānini eṃta mōhanāṃgi nainanu peṃḍlāḍarādu - ī ceppina avaguṇamulalō ēviyēni kaligina kanyakanu peṃḍlāḍuṭavalananē koṃdaṟu saṃtānamu lēnivāragucunnāru - kanuka ī lakṣaṇamulanniṃṭinī pariśīliṃci cūciyē kanyakanu parigrahiṃpavalayunu - maṃci lakṣaṇamulunu, maṃci ācāramunu kaligina kanyaka tana penimiṭi āyussunu vṛddhi noṃdiṃcunu -)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.