← Back to వ · Booklets 41–50 (digitized file 5)

వివక్తదేశము vivaktadēśamu

Original — తెలుగు
  1. విజనదేశం, జనవర్జిత దేశం.

(జనములేని దేశము, జనసంబంధములేని ప్రదేశము)

  1. ఏకాంత ప్రదేశము; ప్రతిబంధకము లేని చోటు; అడ్డులేని చోటు; పరిశుద్ధమైన ప్రదేశము.

  2. వివక్తః స్వభావతః సంస్కారేణవా అశుచ్యాదిభిః సర్ప చోర వ్యాఘ్ర భయాదిభిశ్చ రహితః, అరణ్య నదీ పులిన దేవ గృహాదిః వివక్తో దేశః - (వివక్తే హి దేశే చిత్తం ప్రసీదతి తతః ఆత్మాది భావనా వివిక్తే సంజాయతే)

(స్వభావమువలన గాని, సంస్కారమువలనగాని, అశుచి మొదలగునవి లేనటువంటిన్నీ, సర్పములు, దొంగలు, పులులు మొదలగువాటివలన భయము లేనటువంటిన్నీ అయిన అడవి, నదిమలిన దేశము, దేవగృహము (కోవిల) మొదకగునవి వివక్త దేశము - వివక్తమైన దేశమందుమనస్సు నిశ్చలముగా నుండును. అందుచేత వివక్త దేశమందు ఆత్మభావన, - ఆత్మ గుఱించి అయిన భావన - ధ్యానము - కలుగును).

  1. “సర్వైః ధ్యాన విరోధిభిః వివిక్తే దేశే -”.

(ధ్యానమునకు ఆటంకము కలుగచేయునవి లేనిచోటు).

  1. మనుష్యః కిమపి సాధనం కర్తుం చేష్టేత. యావత్ స విషయ వాసనా బద్ధే జన సముదాయే మోహక విషయ పరిపూర్ణే స్థానేచ స్థాన్యతి; తావత్ భగవతి, తస్య మనో యోగో అత్యంత దుష్కరో అస్తి. అత ఏవ సాధకే నైకాంత దేశే స్థితేన సతా భక్తేః సాధనం కర్తవ్యమితి ప్రతిపాదితం - - - ఏకాంత దేశ సేవనేన లోక సంగస్య పరిత్యక్తతయా లోక బంధనం స్వయమేవ సిధిలం భవిష్యతి.

(మానవుడు ఏదేని యొక సాధనము చేయ యత్నించును. అట్టివాడు విషయవాసనా బంధము కలదిన్నీ, మోహమును కలిగించు విషయములతో నిండియున్నదిన్నీ అయిన స్థలమందుండునంతకాలము అతని మనో యోగము మిక్కిలి దుష్కరమగును - అందుచేత ఏకాంత ప్రదేశములో భక్తి సాధనము చేయవలయును అని చెప్పబడినది. ఏకాంత ప్రదేశమందుండుటచేత లోకముతో సంబంధము విడిచివేయుటచేత అతనికి లోకమువలన కలుగు బంధము దానంతట అదే శిధిలమైపోవును).

Transliteration
  1. vijanadēśaṃ, janavarjita dēśaṃ.

(janamulēni dēśamu, janasaṃbaṃdhamulēni pradēśamu)

  1. ēkāṃta pradēśamu; pratibaṃdhakamu lēni cōṭu; aḍḍulēni cōṭu; pariśuddhamaina pradēśamu.

  2. vivaktaḥ svabhāvataḥ saṃskārēṇavā aśucyādibhiḥ sarpa cōra vyāghra bhayādibhiśca rahitaḥ, araṇya nadī pulina dēva gṛhādiḥ vivaktō dēśaḥ - (vivaktē hi dēśē cittaṃ prasīdati tataḥ ātmādi bhāvanā viviktē saṃjāyatē)

(svabhāvamuvalana gāni, saṃskāramuvalanagāni, aśuci modalagunavi lēnaṭuvaṃṭinnī, sarpamulu, doṃgalu, pululu modalaguvāṭivalana bhayamu lēnaṭuvaṃṭinnī ayina aḍavi, nadimalina dēśamu, dēvagṛhamu (kōvila) modakagunavi vivakta dēśamu - vivaktamaina dēśamaṃdumanassu niścalamugā nuṃḍunu. aṃducēta vivakta dēśamaṃdu ātmabhāvana, - ātma guṟiṃci ayina bhāvana - dhyānamu - kalugunu).

  1. “sarvaiḥ dhyāna virōdhibhiḥ viviktē dēśē -”.

(dhyānamunaku āṭaṃkamu kalugacēyunavi lēnicōṭu).

  1. manuṣyaḥ kimapi sādhanaṃ kartuṃ cēṣṭēta. yāvat sa viṣaya vāsanā baddhē jana samudāyē mōhaka viṣaya paripūrṇē sthānēca sthānyati; tāvat bhagavati, tasya manō yōgō atyaṃta duṣkarō asti. ata ēva sādhakē naikāṃta dēśē sthitēna satā bhaktēḥ sādhanaṃ kartavyamiti pratipāditaṃ - - - ēkāṃta dēśa sēvanēna lōka saṃgasya parityaktatayā lōka baṃdhanaṃ svayamēva sidhilaṃ bhaviṣyati.

(mānavuḍu ēdēni yoka sādhanamu cēya yatniṃcunu. aṭṭivāḍu viṣayavāsanā baṃdhamu kaladinnī, mōhamunu kaligiṃcu viṣayamulatō niṃḍiyunnadinnī ayina sthalamaṃduṃḍunaṃtakālamu atani manō yōgamu mikkili duṣkaramagunu - aṃducēta ēkāṃta pradēśamulō bhakti sādhanamu cēyavalayunu ani ceppabaḍinadi. ēkāṃta pradēśamaṃduṃḍuṭacēta lōkamutō saṃbaṃdhamu viḍicivēyuṭacēta ataniki lōkamuvalana kalugu baṃdhamu dānaṃtaṭa adē śidhilamaipōvunu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.