పూర్వ రూపం ఉండగానే రూపాంతరంగా తోచేది వివర్తము - యధా కటక మకుట దివత్ - అది యెలాగంటే – “తెరలోన భారతరామాయణాది కలలాడే బహు చిత్రపతిమలంగల చిత్తోపాధిని ప్రకాశించే దీప ప్రభే విచిత్ర చతురంగ సేనలై తోచును. పరమాత్మయు మాయోపాధివల్ల జీవ జగదాకృతియై తోచుననెడిదే ప్రసిద్ధం”. (బ్రహ్మవిద్యా సుధార్ణవము - 3)
అసలు వస్తువు ఎట్టి మార్పును పొందకుండ ఇంకొక వస్తువు వలె కనబడుట. చీకటిలో త్రాడును చూచి పామని భ్రమించునపుడు ఆ త్రాడు పాముగా మాఱినట్లు అగపడుట. ఈ ప్రకారముగానే ముత్యపు చిప్ప చీకటిలో వెండిగా కనబడుట వివర్తము - త్రాడు, ముత్యపు చిప్ప వాటి స్వరూపములు మారకుండగనే - అవి త్రాడు, ముత్యపు చిప్పవలె నుండగనే, పాముగాను, వెండిగాను కనబడుట. ఈ ప్రకారముగానే సూర్య కిరణములు కిరణములవలె ఉండగనే అవి మరుభూమిలో జలముగా - ఎండమావులుగా కనబడుట. చీకటిలో ఒక చెట్టు మొరడు మనిషివలె తోచుట. ఇది భ్రాంతివలన కలుగునది - ఇట్లగుటయే వివర్తము.
“పరిణామో నామ ఉపాదాన సమసత్తాక కార్యాపత్తిః, వివర్తోనామ ఉపాదాన విషమ సత్తాక కార్యాపత్తిః, ప్రాతిభాసిక రజతం చావిద్యాపేక్షయా పరిణామః, చైతన్యాపేక్షయా వివర్త ఇతి చోచ్యతే” (వేదాంతపరిభాషా)
(పరిణామమనగా ఉపాదానముతో సమమైన సత్తాగల కార్యము - కార్యవస్తువు కారణవస్తువునుండి కలుగుట. వివర్తమనగా ఉపాదాన వస్తువు - ఉపాదానకారణము - కంటె వేఱైన సత్తాగల వస్తువు - కార్య వస్తువు కారణ వస్తువునుండి ఉత్పన్నమగుట. త్రాడు కానివస్తువగు పాముగా కనబడుట - ముత్యపు చిప్ప అవిద్యవలన (అజ్ఞానము వలన) వెండిగా మారుట (కనబడుట) పరిణామము. ఆ మార్పు చైతన్యమువలన కలుగుట వివర్తము)
(ఉపాదానముకంటె వేఱైన సత్తా ఉపాదానము యొక్క కార్యమునకు కలుగుట పరిణామము -)
(ఉపాదానముకంటె వేరుకాని కార్యము పుట్టినపుడు అది ఉపాదాన కారణమే. ఉపాదానముతో సమానమైన సత్తాగల కార్యము ఉత్పత్తియగుట వివర్తము. కారణమే కార్యముయొక్క ఆకారముతో పుట్టుట. పాల సత్తాతో సమానమైన సత్తాగల పెరుగు (అనుకార్యము) పాలనుండి కలిగినట్లు.
(పూర్వ స్వరూపము మారనప్పటికీ, లేనటువంటి ఇతర వస్తువులుగా (ఇతర రూపములుగా) ఒక వస్తువు (కనబడుట) తోచుట. భ్రాంతిచే ఒక వస్తువును ఇంకొక వస్తువుగా గ్రహించుట. ఒక వస్తువు ఒక అవస్థనుండి ఇంకొక అవస్థకు నిజముగా మారకున్నను మారినట్లు కనబడుట).
pūrva rūpaṃ uṃḍagānē rūpāṃtaraṃgā tōcēdi vivartamu - yadhā kaṭaka makuṭa divat - adi yelāgaṃṭē – “teralōna bhāratarāmāyaṇādi kalalāḍē bahu citrapatimalaṃgala cittōpādhini prakāśiṃcē dīpa prabhē vicitra caturaṃga sēnalai tōcunu. paramātmayu māyōpādhivalla jīva jagadākṛtiyai tōcunaneḍidē prasiddhaṃ”. (brahmavidyā sudhārṇavamu - 3)
asalu vastuvu eṭṭi mārpunu poṃdakuṃḍa iṃkoka vastuvu vale kanabaḍuṭa. cīkaṭilō trāḍunu cūci pāmani bhramiṃcunapuḍu ā trāḍu pāmugā māṟinaṭlu agapaḍuṭa. ī prakāramugānē mutyapu cippa cīkaṭilō veṃḍigā kanabaḍuṭa vivartamu - trāḍu, mutyapu cippa vāṭi svarūpamulu mārakuṃḍaganē - avi trāḍu, mutyapu cippavale nuṃḍaganē, pāmugānu, veṃḍigānu kanabaḍuṭa. ī prakāramugānē sūrya kiraṇamulu kiraṇamulavale uṃḍaganē avi marubhūmilō jalamugā - eṃḍamāvulugā kanabaḍuṭa. cīkaṭilō oka ceṭṭu moraḍu maniṣivale tōcuṭa. idi bhrāṃtivalana kalugunadi - iṭlaguṭayē vivartamu.
“pariṇāmō nāma upādāna samasattāka kāryāpattiḥ, vivartōnāma upādāna viṣama sattāka kāryāpattiḥ, prātibhāsika rajataṃ cāvidyāpēkṣayā pariṇāmaḥ, caitanyāpēkṣayā vivarta iti cōcyatē” (vēdāṃtaparibhāṣā)
(pariṇāmamanagā upādānamutō samamaina sattāgala kāryamu - kāryavastuvu kāraṇavastuvunuṃḍi kaluguṭa. vivartamanagā upādāna vastuvu - upādānakāraṇamu - kaṃṭe vēṟaina sattāgala vastuvu - kārya vastuvu kāraṇa vastuvunuṃḍi utpannamaguṭa. trāḍu kānivastuvagu pāmugā kanabaḍuṭa - mutyapu cippa avidyavalana (ajñānamu valana) veṃḍigā māruṭa (kanabaḍuṭa) pariṇāmamu. ā mārpu caitanyamuvalana kaluguṭa vivartamu)
(upādānamukaṃṭe vēṟaina sattā upādānamu yokka kāryamunaku kaluguṭa pariṇāmamu -)
(upādānamukaṃṭe vērukāni kāryamu puṭṭinapuḍu adi upādāna kāraṇamē. upādānamutō samānamaina sattāgala kāryamu utpattiyaguṭa vivartamu. kāraṇamē kāryamuyokka ākāramutō puṭṭuṭa. pāla sattātō samānamaina sattāgala perugu (anukāryamu) pālanuṃḍi kaliginaṭlu.
(pūrva svarūpamu māranappaṭikī, lēnaṭuvaṃṭi itara vastuvulugā (itara rūpamulugā) oka vastuvu (kanabaḍuṭa) tōcuṭa. bhrāṃticē oka vastuvunu iṃkoka vastuvugā grahiṃcuṭa. oka vastuvu oka avasthanuṃḍi iṃkoka avasthaku nijamugā mārakunnanu mārinaṭlu kanabaḍuṭa).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.