- చీకటిలో త్రాటిని చూచి పామని భ్రాంతి పొందుదుము. అచట పాము నిజముగ లేదు - అట్లు లేకపోయినను
పామను భ్రాంతి ఎందులకు పొందవలయును? అచట త్రాడుండుట, అది త్రాడని తెలియకపోవుట, అను రెండు
అంశములు భ్రాంతి జ్ఞానమునకు కారణములని నిశ్చయింపనగును - ఎందువల్లననగా, అచట త్రాడు
లేనప్పుడుకాని, త్రాడని తెలిసినపుడుకాని పామను భ్రాంతియే కలుగదు. కావున త్రాడే అచ్చట సర్పమును
భాసింపచేయుచున్నది. అట్లు తోపింప చేయుచున్నను త్రాడు తన స్వరూపమును వీడలేదు, సర్పముగా
మారనులేదు. త్రాడు త్రాడుగనే యుండి స్వస్వరూపమును విడువక పామువలె భాసించుచున్నందున ఆ
కనబడునట్టి పాము ఈ రజువు వివర్తమనబడును - అది త్రాడని తెలియమియే, అనగా అజ్ఞానము సర్పరూపముగ
పరిణమించినది. అంచేత ఆ పామునకు త్రాడు వివర్తోపదానమని యనబడును. ఆ అజ్ఞానమే పరిణామొపాదాన కారణమని
యనబడును - అది త్రాడు అను జ్ఞానము కలిగినచో ఆ యజ్ఞానము పోవును - దానితో ఆ అజ్ఞానపరిణామమగు పాము
నశించును - ఈ పాము త్రాడు యొక్క యథార్థజ్ఞానమువలన నశించుచున్న దగుటవలన సత్యమనచెల్లదు,
కనబడుచున్నందున గొడ్రాలి బిడ్డవలె అత్యంతము అసత్యము కాదు - కావున ఈ పామును సత్యమనుటకు
వీలులేదు, అసత్యమనుటకునూ వీలులేదు - కాబట్టి దానిని సదసద్విలక్షణమని నిరూపింపవలసి వచ్చినది. త్రాడు
స్వరూపముయొక్క అజ్ఞానమున్నపుడు అనిర్వచనీయమగు సర్పమావిర్భవించునటుల బ్రహ్మ స్వరూపాజ్ఞానమున్నపుడు
అనిర్వచనీయ ప్రపంచము భాసించును. వస్తు యధార్థజ్ఞానమువలన స్వరూపాజ్ఞానము నశించును. అంతటితో
ప్రపంచముకూడ నశించును.
“జగత్తు బ్రహ్మము యొక్క వివర్త స్వరూపమని వేదాంతసిద్ధాంతము - అనగా, బ్రహ్మమే అజ్ఞానమువలన
జగత్స్వరూపముగా కానవచ్చుచున్నదని, సర్వము ఆ అజ్ఞాన జనితమని శ్రుతి బోధించుచున్నది.”
పురుషుడు త్రాటియందు దానితో నేమియు సంబంధములేని సర్పమును చూచుచున్నాడు. స్తంబమునందును
ప్రత్యక్షవిరుద్ధ ధర్మములుగల పురుషుని చూచుచున్నాడు. వాస్తవ స్థితిలో నా త్రాటికిగాని,
స్తంబమునకుగాని మార్పేమియు కలుగుటలేదు - ఇట్లే స్వయముగ మార్పునొందక యన్యాకారము తోచుటయే వివర్తము.
ఈ వివర్తమునందు కారణమై యుండు పదార్థము వివర్తోపాదానకారణము - ఈ ప్రపంచమునకు పరమేశ్వరుడు
వివర్తోపదానకారణము.
- “తాడు పాముగా కనబడినట్లు, ముత్యపుచిప్ప వెండిగా కనబడినట్లు పరబ్రహ్మ ప్రపంచముగా మారలేదు.
కాని సత్యమైన పరబ్రహ్మము అసత్యమైన ప్రపంచమువలె భాసించుచున్నది. బ్రహ్మ నిత్యమైనది, అవికారి -
వికారములు, లేక, మార్పులు లేనిది అని శ్రుతులు చెప్పుచున్నవి. అట్టి మార్పులు లేని పరబ్రహ్మ
ప్రపంచముగా మారినదని చెప్పతగదు. ప్రపంచము పరబ్రహ్మయొక్క పరిణామము - మార్పు - కాదు - అది
బ్రహ్మయొక్క వివర్తమే”. (అనగా, బ్రహ్మ బ్రహ్మవలెనుండగా అదియే అజ్ఞానమువలన - భ్రాంతివలన -
ప్రపంచముగా భాసించుచున్నది. అందుచేత ప్రపంచము పరబ్రహ్మయొక్క వివర్తము - ప్రపంచమునకు -
ప్రపంచములోని వస్తువులన్నింటికి - ఉపాదానము ప్రకృతి - (raw material - కుండకు మట్టివలె).
భగవంతుడు ఆ ప్రకృతిలో తన చైతన్యశక్తితో ప్రవేశించి దానిని చైతన్యవంతముగా చేయుటవలన దానిలోనుండి -
ఒకదానిలోనుండి ఒకటిగా - ఈ ప్రపంచములోని వస్తువు లన్నియు పుట్టినవి. అందుచేత అట్లు పుట్టిన
వస్తువులన్నింటి లోను ప్రకృతి అంశ, భగవంతుని అంశ (చైతన్య శక్తి) అను రెండును గలవు. ఈ
రెండింటిలో ఏ ఒకటియు రెండవ దానిని విడిచిలేదు. ఎంత చిన్న వస్తువులోనైనను ఈ రెండు అంశలు -
తత్వములు - పురుషుడు, ప్రకృతి - కలిసియే యున్నవి.
ఇందువలననే సృష్టి ప్రారంభమునుండి ఇప్పటివరకు జరుగుచున్నది - “జగతః పితరే వందే పార్వతీ
పరమేశ్వరౌ” ప్రకృతి కూడ భగవంతుని శక్తియే కనుక ఉన్నదంతా - ఒకే ఒక తత్వము - పరతత్వము. ఆ
తత్వమే ప్రతి వస్తువులోను నిమిత్త కారణముగాను, ఉపాదానకారణముగానున్నది. ఉన్నదంతా పరమేశ్వరుడే -
భగవంతుడే).
- “కారణ వస్తునః నిత్యసిద్ధ స్వస్వరూపా పరిత్యాగే నైవ అన్యథా భావమాత్రం వివర్తః ఇతి
శ్రుత్యుక్త్యనుభవ సిద్ధం - యథా శుక్త్యాదే రజాతావ భాసః, అయమేవ పక్షో వేదాంతాభిమతః. అత్ర
జగద్వివర్తోపాదాన రూపాధిష్ఠానం మాయోపహిత చైతన్యమేవ. న మాయా విశిష్ఠం, అవివేకినః తథా కథయంతి.
పరిణామ్యుపాదానం మాయా వివర్తోపాదానం ఉపహిత చైతన్యం ఇతి వివేకే సిద్ధే అపి తదుభయం మాయా విశిష్ట చైతన్యమితి
వదంతి. వివేచనా కుశలాః”.
(కారణ వస్తువు తన నిత్య సిద్ధ స్వరూపమును వదలకుండగనే ఇంకొక రూపముతో - ఇంకొక వస్తువుగా
- భాసించుట, - ప్రకాశించుట, కనబడుట - వివర్తము - అని శ్రుతిలో చెప్పబడిన విషయము అనుభవసిద్ధమే.
ముత్యపు చిప్ప వెండివలె తోచుట - ప్రకాశించుట. ఇదియే ఉపనిషత్తుల అభిమతము - అభిప్రాయము. జగత్తుకు
వివర్తోపాదాన రూప అదిష్ఠానము మాయోపహిత చైతన్యమే - మాయా విశిష్ట చైతన్యము కాదు - అవివేకులు - అజ్ఞానులు
ఇట్లు చెప్పుదురు - పరిణామ్యుపాదానము మాయా వివర్తోపాదానము ఉపహిత చైతన్యమని వివేకము కలిగినప్పటికీ ఆ
రెండునూ మాయా విశిష్ట చైతన్యమే యని వివేచన కుశలులు చెప్పుదురు)
- బ్రహ్మ జగత్తుకు వివర్తోపాదానకారణము -
(భిన్నమైన సత్యత్వముగల మార్పును వివర్తమందురు)
Transliteration
- cīkaṭilō trāṭini cūci pāmani bhrāṃti poṃdudumu. acaṭa pāmu nijamuga
lēdu - aṭlu lēkapōyinanu pāmanu bhrāṃti eṃdulaku poṃdavalayunu? acaṭa
trāḍuṃḍuṭa, adi trāḍani teliyakapōvuṭa, anu reṃḍu aṃśamulu bhrāṃti
jñānamunaku kāraṇamulani niścayiṃpanagunu - eṃduvallananagā, acaṭa trāḍu
lēnappuḍukāni, trāḍani telisinapuḍukāni pāmanu bhrāṃtiyē kalugadu.
kāvuna trāḍē accaṭa sarpamunu bhāsiṃpacēyucunnadi. aṭlu tōpiṃpa
cēyucunnanu trāḍu tana svarūpamunu vīḍalēdu, sarpamugā māranulēdu. trāḍu
trāḍuganē yuṃḍi svasvarūpamunu viḍuvaka pāmuvale bhāsiṃcucunnaṃduna ā
kanabaḍunaṭṭi pāmu ī rajuvu vivartamanabaḍunu - adi trāḍani teliyamiyē,
anagā ajñānamu sarparūpamuga pariṇamiṃcinadi. aṃcēta ā pāmunaku trāḍu
vivartōpadānamani yanabaḍunu. ā ajñānamē pariṇāmopādāna kāraṇamani
yanabaḍunu - adi trāḍu anu jñānamu kaliginacō ā yajñānamu pōvunu -
dānitō ā ajñānapariṇāmamagu pāmu naśiṃcunu - ī pāmu trāḍu yokka
yathārthajñānamuvalana naśiṃcucunna daguṭavalana satyamanacelladu,
kanabaḍucunnaṃduna goḍrāli biḍḍavale atyaṃtamu asatyamu kādu - kāvuna ī
pāmunu satyamanuṭaku vīlulēdu, asatyamanuṭakunū vīlulēdu - kābaṭṭi
dānini sadasadvilakṣaṇamani nirūpiṃpavalasi vaccinadi. trāḍu
svarūpamuyokka ajñānamunnapuḍu anirvacanīyamagu sarpamāvirbhaviṃcunaṭula
brahma svarūpājñānamunnapuḍu anirvacanīya prapaṃcamu bhāsiṃcunu. vastu
yadhārthajñānamuvalana svarūpājñānamu naśiṃcunu. aṃtaṭitō prapaṃcamukūḍa
naśiṃcunu.
“jagattu brahmamu yokka vivarta svarūpamani vēdāṃtasiddhāṃtamu -
anagā, brahmamē ajñānamuvalana jagatsvarūpamugā kānavaccucunnadani,
sarvamu ā ajñāna janitamani śruti bōdhiṃcucunnadi.”
puruṣuḍu trāṭiyaṃdu dānitō nēmiyu saṃbaṃdhamulēni sarpamunu
cūcucunnāḍu. staṃbamunaṃdunu pratyakṣaviruddha dharmamulugala puruṣuni
cūcucunnāḍu. vāstava sthitilō nā trāṭikigāni, staṃbamunakugāni mārpēmiyu
kaluguṭalēdu - iṭlē svayamuga mārpunoṃdaka yanyākāramu tōcuṭayē
vivartamu. ī vivartamunaṃdu kāraṇamai yuṃḍu padārthamu
vivartōpādānakāraṇamu - ī prapaṃcamunaku paramēśvaruḍu
vivartōpadānakāraṇamu.
- “tāḍu pāmugā kanabaḍinaṭlu, mutyapucippa veṃḍigā kanabaḍinaṭlu
parabrahma prapaṃcamugā māralēdu. kāni satyamaina parabrahmamu
asatyamaina prapaṃcamuvale bhāsiṃcucunnadi. brahma nityamainadi, avikāri
- vikāramulu, lēka, mārpulu lēnidi ani śrutulu ceppucunnavi. aṭṭi
mārpulu lēni parabrahma prapaṃcamugā mārinadani ceppatagadu. prapaṃcamu
parabrahmayokka pariṇāmamu - mārpu - kādu - adi brahmayokka vivartamē”.
(anagā, brahma brahmavalenuṃḍagā adiyē ajñānamuvalana - bhrāṃtivalana -
prapaṃcamugā bhāsiṃcucunnadi. aṃducēta prapaṃcamu parabrahmayokka
vivartamu - prapaṃcamunaku - prapaṃcamulōni vastuvulanniṃṭiki -
upādānamu prakṛti - (raw material - kuṃḍaku maṭṭivale). bhagavaṃtuḍu ā
prakṛtilō tana caitanyaśaktitō pravēśiṃci dānini caitanyavaṃtamugā
cēyuṭavalana dānilōnuṃḍi - okadānilōnuṃḍi okaṭigā - ī prapaṃcamulōni
vastuvu lanniyu puṭṭinavi. aṃducēta aṭlu puṭṭina vastuvulanniṃṭi lōnu
prakṛti aṃśa, bhagavaṃtuni aṃśa (caitanya śakti) anu reṃḍunu galavu. ī
reṃḍiṃṭilō ē okaṭiyu reṃḍava dānini viḍicilēdu. eṃta cinna
vastuvulōnainanu ī reṃḍu aṃśalu - tatvamulu - puruṣuḍu, prakṛti -
kalisiyē yunnavi.
iṃduvalananē sṛṣṭi prāraṃbhamunuṃḍi ippaṭivaraku jarugucunnadi -
“jagataḥ pitarē vaṃdē pārvatī paramēśvarau” prakṛti kūḍa bhagavaṃtuni
śaktiyē kanuka unnadaṃtā - okē oka tatvamu - paratatvamu. ā tatvamē
prati vastuvulōnu nimitta kāraṇamugānu, upādānakāraṇamugānunnadi.
unnadaṃtā paramēśvaruḍē - bhagavaṃtuḍē).
- “kāraṇa vastunaḥ nityasiddha svasvarūpā parityāgē naiva anyathā
bhāvamātraṃ vivartaḥ iti śrutyuktyanubhava siddhaṃ - yathā śuktyādē
rajātāva bhāsaḥ, ayamēva pakṣō vēdāṃtābhimataḥ. atra jagadvivartōpādāna
rūpādhiṣṭhānaṃ māyōpahita caitanyamēva. na māyā viśiṣṭhaṃ, avivēkinaḥ
tathā kathayaṃti. pariṇāmyupādānaṃ māyā vivartōpādānaṃ upahita caitanyaṃ
iti vivēkē siddhē api tadubhayaṃ māyā viśiṣṭa caitanyamiti vadaṃti.
vivēcanā kuśalāḥ”.
(kāraṇa vastuvu tana nitya siddha svarūpamunu vadalakuṃḍaganē iṃkoka
rūpamutō - iṃkoka vastuvugā - bhāsiṃcuṭa, - prakāśiṃcuṭa, kanabaḍuṭa -
vivartamu - ani śrutilō ceppabaḍina viṣayamu anubhavasiddhamē. mutyapu
cippa veṃḍivale tōcuṭa - prakāśiṃcuṭa. idiyē upaniṣattula abhimatamu -
abhiprāyamu. jagattuku vivartōpādāna rūpa adiṣṭhānamu māyōpahita
caitanyamē - māyā viśiṣṭa caitanyamu kādu - avivēkulu - ajñānulu iṭlu
ceppuduru - pariṇāmyupādānamu māyā vivartōpādānamu upahita caitanyamani
vivēkamu kaliginappaṭikī ā reṃḍunū māyā viśiṣṭa caitanyamē yani vivēcana
kuśalulu ceppuduru)
- brahma jagattuku vivartōpādānakāraṇamu -
(bhinnamaina satyatvamugala mārpunu vivartamaṃduru)
English
English translation not yet available for this entry. Let us know if you'd like to help.