(ఏది చేయవలసినది, ఏది చేయకూడనిది అను విషయమును విచారించి తెలుసుకొనుట)
(పరమాత్మ తత్వమును గుఱించి అయిన విచారము)
(పరమాత్మ తత్వమును గుఱించి అయిన జ్ఞానము)
మంచి చెడ్డలను తెలియు జ్ఞానము.
“చిన్మాత్ర ఆత్మా నిత్యః (సత్యః) నాశా ప్రతియోగీ క్రియా శూన్యః; తద్విలక్షణో అనాత్మతం, దృశ్యః, ప్రపంచో నాశప్రతియోగీ, అనిత్యః (అసత్యః) క్రియా సహితశ్చేతి వివేచనమేవ వివేకః” (విచారసాగరము)
(చైతన్య మాత్రుడైన ఆత్మ నిత్యుడు - మూడుకాలములందుండువాడు, నశించనిది, ఏ కర్మయును చేయనిది. ఇందుకు విలక్షణమైనది - వ్యతిరేక లక్షణములు కలది అనాత్మ, ఈ కనబడు ప్రపంచము, నశించు స్వభావము కలది, నిత్యము కానిది, కర్మలు చేయునది - అని ఆత్మ, అనాత్మల గుఱించి వివేచనమే వివేకము).
(పాలు నీళ్ళు కలిసినదానిలో పాలను నీళ్ళను వేరు వేరుగా తెలుసుకొనునట్లు ధృఢమైన ఉపనిషదుల అర్థమును తెలుసుకొని, ఆత్మయేదో, అనాత్మయేదో అను విషయమును విచారించుటవలన స్వస్వరూపజ్ఞానము తనయొక్క యథార్థమైన రూపము తానే పరమాత్మ యను జ్ఞానమును తెలుసుకొను వివేచనమే వివేకము. ఇటువంటి వివేకమువలన జగత్తు మిథ్యయను అపరోక్షజ్ఞానము కలుగును, అపరోక్షజ్ఞానము కాదు. ఊషర భూమియందు అరటి చెట్లు పెరగక, మిగిలిన భూమియందు పెరుగునట్లు శుద్ధమైన నిర్మలమైన అంతఃకరణమందు మలము విక్షేపము లేకపోవుటచేత వివేకము వైరాగ్యము మొదలగు ఇతర సాధనములు పుట్టును, ఇతర విధమున కలుగవు. అందుచేత మోక్షము కోరువారు చిత్తము కలిగి వివేకము మొదలగు సాధనములను సంపాదించుకొనవలెను)
(ఈ ప్రపంచములోని ప్రతి వస్తువులోను ఆత్మ, అనాత్మ అను రెండు వస్తువులు (పాళ్ళుగా) గలవు. అందులో ఆత్మ యేదో, అనాత్మ యేదో - చైతన్యము యొక్క అంశ యేదో, జడము (ప్రకృతి) యొక్క అంశ యేదో విభాగించి తెలుసుకొనుట వివేకము-).
(కంటి రోగము కాటుక (అంజనము - కంటి మందు) వేసిన నివృత్తికాగానే ఘటము మొదలగు పదార్థముల జ్ఞానము కలిగినట్లు - తత్వజ్ఞానము చేత - బ్రహ్మజ్ఞానము చేత కామము (అంధకారము, చీకటి) చేత ఆవరింపబడిన అజ్ఞానమను ఆవరణ నశింపగనే పరబ్రహ్మ సాక్షాత్కారము కలుగును. అప్పుడు సమ్యగ్దృష్టిచేత ఈ జగత్తు అంతయు పరబ్రహ్మ యొక్క ఆకారముగనే కనుపించును. ఇదియే వేదాంతములోని సిద్ధాంతము - ఉపనిషత్తులలో చేయబడిన సిద్దాంతము) అందుచేత పరమ శ్రేయస్సయిన మోక్షమునకు బ్రహ్మ సాక్షాత్కారమునకు వివేకము కారణమగుటవలన (సాధనమగుటవలన) దానికొఱకు ప్రయత్నము చేయవలయును).
(సత్ ఏది, అస్త ఏది అని నిర్ణయము చేయుట)- (నిత్యమేదో అనిత్యమేదో నిర్ణయించుకొనుట వలన కలిగిన యదార్థ జ్ఞానము.
(ఇది దేహము, ఇది ఆత్మ యని ఈ రెండింటికిని భేదము తెలుసుకొనుట).
శశో నిమీల నేనేవ మృత్యుం పరిజిహీర్షతి |“. (నైష్కర్మ్యసిద్ధి - 4 - 16)
(కుందేలు కళ్ళు మూసుకొనుటచేత మృత్యువును తప్పించుకొనవచ్చునని తలచి చనిపోయినట్లు ఈ వివేక జ్ఞానము చేతనే బ్రహ్మజ్ఞానము కలుగునని తలచెదరు - బ్రహ్మజ్ఞానము మహావాక్యము వలన కలుగును).
(ēdi cēyavalasinadi, ēdi cēyakūḍanidi anu viṣayamunu vicāriṃci telusukonuṭa)
(paramātma tatvamunu guṟiṃci ayina vicāramu)
(paramātma tatvamunu guṟiṃci ayina jñānamu)
maṃci ceḍḍalanu teliyu jñānamu.
“cinmātra ātmā nityaḥ (satyaḥ) nāśā pratiyōgī kriyā śūnyaḥ; tadvilakṣaṇō anātmataṃ, dṛśyaḥ, prapaṃcō nāśapratiyōgī, anityaḥ (asatyaḥ) kriyā sahitaścēti vivēcanamēva vivēkaḥ” (vicārasāgaramu)
(caitanya mātruḍaina ātma nityuḍu - mūḍukālamulaṃduṃḍuvāḍu, naśiṃcanidi, ē karmayunu cēyanidi. iṃduku vilakṣaṇamainadi - vyatirēka lakṣaṇamulu kaladi anātma, ī kanabaḍu prapaṃcamu, naśiṃcu svabhāvamu kaladi, nityamu kānidi, karmalu cēyunadi - ani ātma, anātmala guṟiṃci vivēcanamē vivēkamu).
(pālu nīḷḷu kalisinadānilō pālanu nīḷḷanu vēru vērugā telusukonunaṭlu dhṛḍhamaina upaniṣadula arthamunu telusukoni, ātmayēdō, anātmayēdō anu viṣayamunu vicāriṃcuṭavalana svasvarūpajñānamu tanayokka yathārthamaina rūpamu tānē paramātma yanu jñānamunu telusukonu vivēcanamē vivēkamu. iṭuvaṃṭi vivēkamuvalana jagattu mithyayanu aparōkṣajñānamu kalugunu, aparōkṣajñānamu kādu. ūṣara bhūmiyaṃdu araṭi ceṭlu peragaka, migilina bhūmiyaṃdu perugunaṭlu śuddhamaina nirmalamaina aṃtaḥkaraṇamaṃdu malamu vikṣēpamu lēkapōvuṭacēta vivēkamu vairāgyamu modalagu itara sādhanamulu puṭṭunu, itara vidhamuna kalugavu. aṃducēta mōkṣamu kōruvāru cittamu kaligi vivēkamu modalagu sādhanamulanu saṃpādiṃcukonavalenu)
(ī prapaṃcamulōni prati vastuvulōnu ātma, anātma anu reṃḍu vastuvulu (pāḷḷugā) galavu. aṃdulō ātma yēdō, anātma yēdō - caitanyamu yokka aṃśa yēdō, jaḍamu (prakṛti) yokka aṃśa yēdō vibhāgiṃci telusukonuṭa vivēkamu-).
(kaṃṭi rōgamu kāṭuka (aṃjanamu - kaṃṭi maṃdu) vēsina nivṛttikāgānē ghaṭamu modalagu padārthamula jñānamu kaliginaṭlu - tatvajñānamu cēta - brahmajñānamu cēta kāmamu (aṃdhakāramu, cīkaṭi) cēta āvariṃpabaḍina ajñānamanu āvaraṇa naśiṃpaganē parabrahma sākṣātkāramu kalugunu. appuḍu samyagdṛṣṭicēta ī jagattu aṃtayu parabrahma yokka ākāramuganē kanupiṃcunu. idiyē vēdāṃtamulōni siddhāṃtamu - upaniṣattulalō cēyabaḍina siddāṃtamu) aṃducēta parama śrēyassayina mōkṣamunaku brahma sākṣātkāramunaku vivēkamu kāraṇamaguṭavalana (sādhanamaguṭavalana) dānikoṟaku prayatnamu cēyavalayunu).
(sat ēdi, asta ēdi ani nirṇayamu cēyuṭa)- (nityamēdō anityamēdō nirṇayiṃcukonuṭa valana kaligina yadārtha jñānamu.
(idi dēhamu, idi ātma yani ī reṃḍiṃṭikini bhēdamu telusukonuṭa).
śaśō nimīla nēnēva mṛtyuṃ parijihīrṣati |“. (naiṣkarmyasiddhi - 4 - 16)
(kuṃdēlu kaḷḷu mūsukonuṭacēta mṛtyuvunu tappiṃcukonavaccunani talaci canipōyinaṭlu ī vivēka jñānamu cētanē brahmajñānamu kalugunani talacedaru - brahmajñānamu mahāvākyamu valana kalugunu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.