← Back to వ · Booklets 41–50 (digitized file 5)

వృజనం vṛjanaṃ

Original — తెలుగు
  1. పాపం; దుష్కృతం; దుఃఖం; సంసార దుఃఖం -

(పాపము, దుష్కర్మ, దుఃఖము, సంసారము వలన కలుగు దుఃఖము).

  1. "సర్వం జ్ఞాన ప్లవేనైవ వృజినం నంతరిష్యసి" (శ్రీమద్భగవద్గీత - 4 - 36)

(అన్ని విధములగు దుఃఖములు - సంసారమునకు సంబంధించినవన్నియు జ్ఞానముచేత - బ్రహ్మజ్ఞానముచేత - జ్ఞానము అను పడవ చేత - తరింపవచ్చును - దాట వచ్చును - పోగొట్టుకొనవచ్చును).

  1. పాపార్ణవమిదం సర్వం జ్ఞానం పోతం విథాయచ |

పునరావృత్తిశూన్యత్వాత్ సుఖేనాతి కమిష్యసి |

ధర్మాత్మకం కర్మ సర్వం వృజిన శబ్దతః |

అభిప్రేతం ముముక్షోహి బంధ హేతుతయా యతః |

హేయ పుణ్య మపీత్యేవం భగవన్మనముత్తమం ||. (గీతాభావప్రకాశము - 4 - 223; 224)

(పాపసముద్రమైన సర్వమును జ్ఞానము అను పడవతో సుఖముతో దాటగలవు. పుణ్యపాపములగు కర్మలన్నియు వృజినం అని చెప్పబడినవి. ఎందుచేత ననగా పుణ్యమైనను, పాపమైనను మోక్షమును కోరువారికి బంధకమే. అందుచేత హేయమైనవి. వృజినము అని చెప్పబడినది).

Transliteration
  1. pāpaṃ; duṣkṛtaṃ; duḥkhaṃ; saṃsāra duḥkhaṃ -

(pāpamu, duṣkarma, duḥkhamu, saṃsāramu valana kalugu duḥkhamu).

  1. "sarvaṃ jñāna plavēnaiva vṛjinaṃ naṃtariṣyasi" (śrīmadbhagavadgīta - 4 - 36)

(anni vidhamulagu duḥkhamulu - saṃsāramunaku saṃbaṃdhiṃcinavanniyu jñānamucēta - brahmajñānamucēta - jñānamu anu paḍava cēta - tariṃpavaccunu - dāṭa vaccunu - pōgoṭṭukonavaccunu).

  1. pāpārṇavamidaṃ sarvaṃ jñānaṃ pōtaṃ vithāyaca |

punarāvṛttiśūnyatvāt sukhēnāti kamiṣyasi |

dharmātmakaṃ karma sarvaṃ vṛjina śabdataḥ |

abhiprētaṃ mumukṣōhi baṃdha hētutayā yataḥ |

hēya puṇya mapītyēvaṃ bhagavanmanamuttamaṃ ||. (gītābhāvaprakāśamu - 4 - 223; 224)

(pāpasamudramaina sarvamunu jñānamu anu paḍavatō sukhamutō dāṭagalavu. puṇyapāpamulagu karmalanniyu vṛjinaṃ ani ceppabaḍinavi. eṃducēta nanagā puṇyamainanu, pāpamainanu mōkṣamunu kōruvāriki baṃdhakamē. aṃducēta hēyamainavi. vṛjinamu ani ceppabaḍinadi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.