(ఒక గోడ మీద పడిన సూర్యకంతి గోడను ప్రకాశింపచేయును. అట్లే, అద్దముద్వారా ఆ గోడమీద పడిన ఆ కాంతి నేరుగా పడిన సూర్యకాంతితో కలిసిపోయి ఆ గోడను ప్రకాశింప చేయును - సూర్యుని కాంతి నేరుగా భూమిమీద పడును. ఆ సూర్యుని కాంతియే చంద్రునిమీద పడి భూమి మీద వెన్నెల రూపముగా పడును - ఈ రెండును సూర్యకాంతులే. అట్లే అదే గోడను ప్రకాశించునట్లు చేయుచున్నవి. నేరుగా పడిన సూర్యకాంతి స్వరూపజ్ఞానము - అద్దముద్వారా పడిన కాంతివలన కలుగు జ్ఞానము వృత్తిజ్ఞానము. సుషుప్త్యవస్థలో స్వరూప జ్ఞానము. జాగ్రత్స్వప్నములలో కలుగు జ్ఞానము వృత్తిజ్ఞానము - స్వరూపజ్ఞానము ఈ మూడు అవస్థలలోను కలుగును -).
(oka gōḍa mīda paḍina sūryakaṃti gōḍanu prakāśiṃpacēyunu. aṭlē, addamudvārā ā gōḍamīda paḍina ā kāṃti nērugā paḍina sūryakāṃtitō kalisipōyi ā gōḍanu prakāśiṃpa cēyunu - sūryuni kāṃti nērugā bhūmimīda paḍunu. ā sūryuni kāṃtiyē caṃdrunimīda paḍi bhūmi mīda vennela rūpamugā paḍunu - ī reṃḍunu sūryakāṃtulē. aṭlē adē gōḍanu prakāśiṃcunaṭlu cēyucunnavi. nērugā paḍina sūryakāṃti svarūpajñānamu - addamudvārā paḍina kāṃtivalana kalugu jñānamu vṛttijñānamu. suṣuptyavasthalō svarūpa jñānamu. jāgratsvapnamulalō kalugu jñānamu vṛttijñānamu - svarūpajñānamu ī mūḍu avasthalalōnu kalugunu -).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.