← Back to వ · Booklets 41–50 (digitized file 5)

వ్యాహృతి త్రయము vyāhṛti trayamu

Original — తెలుగు
  1. "భూర్భువస్సువః" -

("భూః భువః సువః" అను మూడును వ్యాహృతులు).

"భూరాది భేదేన తిస్యః" (భూః మొదలగు భేదములతో - భూః, భువః, సువః అనునవి మూడు).

  1. భూకారశ్చ తు భూలోకో భువర్లోకో భువస్తథా |

స్వకార స్సురలోకశ్చ |

గాయత్ర్యా స్థాన నిర్ణయః |

ఇచ్ఛా శక్తిస్తు భూలోకః, క్రియా శక్తిర్భువస్తథా |

స్వకారో జ్ఞానశక్తిశ్చ భూర్భువస్వ స్వరూపకాః ||.

(భూః, భువః, సువః అను మూడు వ్యాహృతులు. ‘భూః’ అనగా భూలోకము, భువః అనగా భువర్లోకము, స్వః అనగా సురలోకము (దేవలోకము - స్వర్గలోకము). ఇవి గాయత్రీ స్థానములు. శక్తి త్రయములోని ఇచ్ఛాశక్తి భూలోకము, క్రియాశక్తి భువర్లోకము, జ్ఞానశక్తి స్వర్గలోకము-)

  1. భూర్భువస్సువరితి వా ఏతాస్తి స్రో వ్యాహృతయః.మహః ఇతి వ్యాహృతిం మహా చమస్యనామా ఋషిః తిస్రూణాం వ్యాహృతీనాం చతుర్ధీ వక్తి. భూరాది వ్యాహృతి చతుష్టయే భూలోకాంతరిక్ష స్వర్గలోకాదిత్య రూపార్థ చతుష్టయ దృష్టిః కర్తవ్యః ఇత్యర్థః -

(భూః, భువః, స్వః అను మూడును వ్యాహృతులు. ఈ మూడు వ్యాహృతులకు మహః అను వ్యాహృతిని మహాచముడను ఋషి నాలుగవదానిని చెప్పెను - "భూః" మొదలగు ఈ నాలుగు వ్యాహృతులందు భూలోకము, అంతరిక్షము, స్వర్గలోకము - ఆదిత్యలోకము అను దృష్టి (మనస్సు; అభిప్రాయము) కలిగియుండవలెను).

  1. "భూః, భువః స్వః మహః" ఇతి వ్యాహృతి చతుష్టయః తాసాం చతుర్థీ వ్యాహృతిః మహః తద్బ్రహ్మ స ఆత్మా; ఇతరాశ్చ వ్యాహృతయః లోకాః దేవాః అవయవాః అంగాని - మహావ్యాహృతిః హిరణ్యగర్భస్య బ్రహ్మణః మధ్యభాగః ఆత్మా ఇతి కల్ప్యతే. ఇతరశ్చ వ్యాహృతయః పాదాద్యవయవత్వేన కల్ప్యంతే. వ్యాహృతి చతుష్టయే చతుర్విధోపాసనం దర్శయతి. భూరిత్యాదినా భూరాది వ్యాహృతి చతుష్టయే భూలోకాంతరిక్ష స్వర్గలోకాదిత్య రూపార్థ చతుష్టయ దృష్టిః కర్తవ్యా.

భూరాద్యాః చతస్రో వ్యాహృతయోపి ఉక్త ప్రకారేణ ప్రత్యేకం చతస్రః, అతిః షోడశ వ్యాహృతయః సంపద్యంతే - చతుష్ప్రకారాః.

"ఏకైకః వ్యాహృతిః చతుర్థా భవతి - భూః అయం లోకః; అగ్నిః, ఋగ్వేదః, ప్రాణః, భువః అంతరిక్షం, వాయుః, సామవేదః, అపానః, సువః అసౌ లోకః ఆదిత్యః, యజుర్వేదః, వ్యానః, మహః ఆదిత్యః, చంద్రమాః, బ్రహ్మ, అన్నం ఏతా చతస్రశ్చతుర్థాః".

(భూః, భువః, స్వః, మహః, అనునవి నాలుగు వ్యాహృతులు. వీటిలో నాలుగవది అయిన మహః అనునది పరబ్రహ్మ, అదియే ఆత్మ. మిగిలిన వ్యాహృతులు లోకములు దేవతలు, అవయవములు, అంగములు. మహః అను వ్యాహృతి హిరణ్యగర్భుడగు బ్రహ్మయొక్క మధ్యభాగము ఆత్మ యని మిగిలిన వ్యాహృతులు పాదములు మొదలగు అవయవములు అని కల్పించబడుచున్నవి. ఈ నాలుగు వ్యాహృతులను నాలుగు విధములుగ ఉపాసన చేయవలయునని చెప్పబడినది. అది ఎట్లనగా - భూః మొదలగు వ్యాహృతలందు భూలోకము, అంతరిక్షము, స్వర్గలోకము, ఆదిత్యలోకము అను దృష్టి నుంచవలెను.)

(పైన చెప్పిన నాలుగు వ్యాహృతులు ఒక్కొక్కటి నాలుగు విధములు - మొత్తము పదియారు వ్యాహృతులని చెప్పబడినవి. అది ఎట్లంటే - ‘భూః’ అనగా ఈ లోకము, అగ్ని, ఋగ్వేదము, ప్రాణము (ప్రాణవాయువు). భువః అనగా అంతరిక్షము, వాయువు, సామవేదము, అపానము. సువః అనగా, అసౌ లోకః, ఆదిత్యః, యజుర్వేదః, వ్యానః, మహః అనగా ఆదిత్యః, చంద్రుడు, బ్రహ్మ, అన్నం. ఈ నాలుగు విధములు కలిసి పదియారు వ్యాహృతులు -)

  1. వివిధకర్మలయందు వాడబడుచున్నవి కనుక వ్యాహృతులు.
Transliteration
  1. "bhūrbhuvassuvaḥ" -

("bhūḥ bhuvaḥ suvaḥ" anu mūḍunu vyāhṛtulu).

"bhūrādi bhēdēna tisyaḥ" (bhūḥ modalagu bhēdamulatō - bhūḥ, bhuvaḥ, suvaḥ anunavi mūḍu).

  1. bhūkāraśca tu bhūlōkō bhuvarlōkō bhuvastathā |

svakāra ssuralōkaśca |

gāyatryā sthāna nirṇayaḥ |

icchā śaktistu bhūlōkaḥ, kriyā śaktirbhuvastathā |

svakārō jñānaśaktiśca bhūrbhuvasva svarūpakāḥ ||.

(bhūḥ, bhuvaḥ, suvaḥ anu mūḍu vyāhṛtulu. ‘bhūḥ’ anagā bhūlōkamu, bhuvaḥ anagā bhuvarlōkamu, svaḥ anagā suralōkamu (dēvalōkamu - svargalōkamu). ivi gāyatrī sthānamulu. śakti trayamulōni icchāśakti bhūlōkamu, kriyāśakti bhuvarlōkamu, jñānaśakti svargalōkamu-)

  1. bhūrbhuvassuvariti vā ētāsti srō vyāhṛtayaḥ.mahaḥ iti vyāhṛtiṃ mahā camasyanāmā ṛṣiḥ tisrūṇāṃ vyāhṛtīnāṃ caturdhī vakti. bhūrādi vyāhṛti catuṣṭayē bhūlōkāṃtarikṣa svargalōkāditya rūpārtha catuṣṭaya dṛṣṭiḥ kartavyaḥ ityarthaḥ -

(bhūḥ, bhuvaḥ, svaḥ anu mūḍunu vyāhṛtulu. ī mūḍu vyāhṛtulaku mahaḥ anu vyāhṛtini mahācamuḍanu ṛṣi nālugavadānini ceppenu - "bhūḥ" modalagu ī nālugu vyāhṛtulaṃdu bhūlōkamu, aṃtarikṣamu, svargalōkamu - ādityalōkamu anu dṛṣṭi (manassu; abhiprāyamu) kaligiyuṃḍavalenu).

  1. "bhūḥ, bhuvaḥ svaḥ mahaḥ" iti vyāhṛti catuṣṭayaḥ tāsāṃ caturthī vyāhṛtiḥ mahaḥ tadbrahma sa ātmā; itarāśca vyāhṛtayaḥ lōkāḥ dēvāḥ avayavāḥ aṃgāni - mahāvyāhṛtiḥ hiraṇyagarbhasya brahmaṇaḥ madhyabhāgaḥ ātmā iti kalpyatē. itaraśca vyāhṛtayaḥ pādādyavayavatvēna kalpyaṃtē. vyāhṛti catuṣṭayē caturvidhōpāsanaṃ darśayati. bhūrityādinā bhūrādi vyāhṛti catuṣṭayē bhūlōkāṃtarikṣa svargalōkāditya rūpārtha catuṣṭaya dṛṣṭiḥ kartavyā.

bhūrādyāḥ catasrō vyāhṛtayōpi ukta prakārēṇa pratyēkaṃ catasraḥ, atiḥ ṣōḍaśa vyāhṛtayaḥ saṃpadyaṃtē - catuṣprakārāḥ.

"ēkaikaḥ vyāhṛtiḥ caturthā bhavati - bhūḥ ayaṃ lōkaḥ; agniḥ, ṛgvēdaḥ, prāṇaḥ, bhuvaḥ aṃtarikṣaṃ, vāyuḥ, sāmavēdaḥ, apānaḥ, suvaḥ asau lōkaḥ ādityaḥ, yajurvēdaḥ, vyānaḥ, mahaḥ ādityaḥ, caṃdramāḥ, brahma, annaṃ ētā catasraścaturthāḥ".

(bhūḥ, bhuvaḥ, svaḥ, mahaḥ, anunavi nālugu vyāhṛtulu. vīṭilō nālugavadi ayina mahaḥ anunadi parabrahma, adiyē ātma. migilina vyāhṛtulu lōkamulu dēvatalu, avayavamulu, aṃgamulu. mahaḥ anu vyāhṛti hiraṇyagarbhuḍagu brahmayokka madhyabhāgamu ātma yani migilina vyāhṛtulu pādamulu modalagu avayavamulu ani kalpiṃcabaḍucunnavi. ī nālugu vyāhṛtulanu nālugu vidhamuluga upāsana cēyavalayunani ceppabaḍinadi. adi eṭlanagā - bhūḥ modalagu vyāhṛtalaṃdu bhūlōkamu, aṃtarikṣamu, svargalōkamu, ādityalōkamu anu dṛṣṭi nuṃcavalenu.)

(paina ceppina nālugu vyāhṛtulu okkokkaṭi nālugu vidhamulu - mottamu padiyāru vyāhṛtulani ceppabaḍinavi. adi eṭlaṃṭē - ‘bhūḥ’ anagā ī lōkamu, agni, ṛgvēdamu, prāṇamu (prāṇavāyuvu). bhuvaḥ anagā aṃtarikṣamu, vāyuvu, sāmavēdamu, apānamu. suvaḥ anagā, asau lōkaḥ, ādityaḥ, yajurvēdaḥ, vyānaḥ, mahaḥ anagā ādityaḥ, caṃdruḍu, brahma, annaṃ. ī nālugu vidhamulu kalisi padiyāru vyāhṛtulu -)

  1. vividhakarmalayaṃdu vāḍabaḍucunnavi kanuka vyāhṛtulu.
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.