వేదాంగము - వ్యాకరణమువలన వేదశబ్దముల శుద్ధతయొక్క జ్ఞానమగును - ఆ వ్యాకరణసూత్రరూపమైన అష్టాధ్యాయిని పాణిని చేసియున్నాడు - కాత్యాయనుడు, పతంజలి ఆ సూత్రములకు వ్యాఖ్యానరూపమైన వార్తిక భాష్యములు చేసియున్నారు - పాణిని వ్యాకరణముచే వేదశబ్దముల శుద్ధత తెలియుచున్నది. అందువలన అది వేదాంగము.
వేదార్థ గ్రహణమునకు వ్యాకరనము ముఖ్యాంగము. వేదసంబంధమగు వ్యాకరణము శివుని నిర్మితమని ప్రతీతి. దీనిని వ్యాకరణార్ణవమందురు. ఇందు 6400 సూత్రములు గలవు - అనేక భాష్యములును, వార్తికములును వీనికి గలవందురు.
అక్షరములను శబ్దములను నేర్చి కూర్చి యర్థవంతముగను సవ్యముగ నుపయోగించు విధానమును వ్యాకరణశాస్త్రము తెలుపును. ఇందు ఉదాత్తానుదాత్త స్వరితములను యుచ్చారణ భేదములు తెలుపబడును - సరియగు పదములను కూర్చుకొనుటకును, సందర్భానుకూల పదప్రయోగ విధానమును విపుల భావములను కొద్ది మాటలలో కుదించి చెప్పుటకును భాషా స్పష్టత నివారణార్థము వ్యాకరణము చదువవలసియున్నది.
"ఈ వ్యాకరణమునకు పాణిని మహర్షి సూత్రకారుడు. ఈ సూత్ర భాష్య కర్త పతంజలి మహాశయుడు దేనినే మహా భాష్యమందురు".
vēdāṃgamu - vyākaraṇamuvalana vēdaśabdamula śuddhatayokka jñānamagunu - ā vyākaraṇasūtrarūpamaina aṣṭādhyāyini pāṇini cēsiyunnāḍu - kātyāyanuḍu, pataṃjali ā sūtramulaku vyākhyānarūpamaina vārtika bhāṣyamulu cēsiyunnāru - pāṇini vyākaraṇamucē vēdaśabdamula śuddhata teliyucunnadi. aṃduvalana adi vēdāṃgamu.
vēdārtha grahaṇamunaku vyākaranamu mukhyāṃgamu. vēdasaṃbaṃdhamagu vyākaraṇamu śivuni nirmitamani pratīti. dīnini vyākaraṇārṇavamaṃduru. iṃdu 6400 sūtramulu galavu - anēka bhāṣyamulunu, vārtikamulunu vīniki galavaṃduru.
akṣaramulanu śabdamulanu nērci kūrci yarthavaṃtamuganu savyamuga nupayōgiṃcu vidhānamunu vyākaraṇaśāstramu telupunu. iṃdu udāttānudātta svaritamulanu yuccāraṇa bhēdamulu telupabaḍunu - sariyagu padamulanu kūrcukonuṭakunu, saṃdarbhānukūla padaprayōga vidhānamunu vipula bhāvamulanu koddi māṭalalō kudiṃci ceppuṭakunu bhāṣā spaṣṭata nivāraṇārthamu vyākaraṇamu caduvavalasiyunnadi.
"ī vyākaraṇamunaku pāṇini maharṣi sūtrakāruḍu. ī sūtra bhāṣya karta pataṃjali mahāśayuḍu dēninē mahā bhāṣyamaṃduru".
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.