← Back to వ · Booklets 41–50 (digitized file 5)

వ్యాపీ vyāpī

Original — తెలుగు
  1. వ్యాపన శీలః

(వ్యాపించియుండు స్వభావము కలవాడు కనుక శ్రీమహావిష్ణువు వ్యాపి అని చెప్పబడుచున్నాడు)

  1. "వ్యాపనాద్వాపీ మహాదేవః -" ఇతి శ్రుతిః.

(వ్యాపించియుండువాడు కనుక మహాదేవుడు వ్యాపియని చెప్పబడుచున్నాడు అని శ్రుతి చెప్పుచున్నది)

  1. "కారణత్వేన సర్వకార్యాణాం వ్యాపనాద్వా వ్యాపీ" (శ్రీశంకరః)

(సమస్త కార్యవస్తువులందును, వాటికి కారమగుటచేత వాటిలో వ్యాపించి యుండుటవలన - కుండకు కారణమైనట్టి మట్టి కుండ అంతటిలోను వ్యాపించి యుండునట్లు - వ్యాపీ అని భగవంతుడు చెప్పబడుచున్నాడు).

  1. ఆకాశవత్ సర్వగతత్వాత్ వ్యాపీ -"ఆకాశవత్ సర్వ గతశ్చ నిత్యః" ఇతి శ్ర్రుతిః. (శ్రీశంకరః)

(ఆకాశమువలె అన్నింటిలోను ప్రవేశించి యుండువాడు, వ్యాపించి యుండువాడు - ప్రవేశించి వ్యాపించి యుండువాడు - నిత్యుడు అని శ్రుతి చెప్పుచున్నది).

  1. జగద్వ్యాపీ (ప్రపంచమంతటను వ్యాపించి యుండువాడు)

  2. "విశ్వాత్మకం వ్యాపకం" (శ్రీరామకర్ణామృతం - 1 - 31)

(జగత్తు అంతటికీ ఆత్మ అయినందున దానంతటిలోను పూర్తిగా వ్యాపించి యుండువాడు)

  1. "అతి సూక్ష్మతయా సర్వచేతనాంతః ప్రవేశ స్వభావః"

(మిక్కిలి చిన్నది యగుటచేత చేతన వస్తువులన్నింటి లోపల ప్రవేశించియుండు స్వభావము కలవాడు)

  1. యచ్చ కించిత్ జగత్సత్యం దృశ్యతే శ్రూయతేపివా |

అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః (మంత్రపుష్పం - 5)

(చరాచరాత్మకమైన ఈ జగత్తు ఏ కొంచెము కనబడుచున్నదో, ఇంకా ఉన్నది యని ఒకరు చెప్పగా వినుచున్నామో, అట్టి యీ ప్రపంచమంతయు - చూచినది, వినబడినది, ఇంకను మిగిలియున్నది. అంతటిలోను - లోను పైన శ్రీమన్నారాయణుడు (భగవంతుడు) వ్యాపించియున్నాడు).

  1. "వ్యాపినే (అ)నేక రూపైక స్వరూపాయ నమోనమః" (విష్ణుపురాణము)

(ఒకడే అయినను - ఒకే రూపము గలవాడైనను అనేక రూపములు గలవాడు, అన్నింటిలోను వ్యాపించి యుండువాడు అయిన వానిని గుఱించి నమస్కారము చేయుచున్నాను)

  1. "ఈశ్వరోనైక దేశ మాత్రే వర్తతే, కింతు సర్వత్ర వ్యాపకః.అస్తి ఈశ్వరః ఏక దేశమాత్రే వర్తతే ఇత్యంగీకారే స ఈశ్వరః అనిత్యో భవేత్ - యస్య దేశతః అంతో అస్తి తస్య కాలతః అపి అంతో అస్తి ఇతి నియమాత్ - యత్ అనిత్యం తత్ కర్తృజన్యం ఇతి నియమాత్. ఈశ్వరస్య కర్తా కశ్చిత్ అస్తి ఇత్యేతత్ న ఘటతే - ఈశ్వరస్య దేశతః అంతోనాస్తి, కింతు ఈశ్వరః వ్యాపకః, అత ఏవ నిత్యః".

(ఈశ్వరుడు - పరబ్రహ్మ - ఒకచోటనే యుండువాడుకాడు, అంతటను వ్యాపించియుండువాడు. ఈశ్వరుడు ఒకే చోటనుండు వాడైనయడల అతను నిత్యుడుకాడు, అనిత్యుడు, అన్నికాలములందుండువాడుకాడు. ఎవడు ఒకే స్థలమందుండి ఇంకొక స్థలమందుండడో - దేశ పరిచ్ఛేదము కలదో వానికి కాల పరిచ్ఛేదము కూడ కలదు. అనగా, ఒక కాలమందుండువాడు ఇంకొక కాలమందుండడు అను నియమమునుబట్టి ఏది నిత్యముకానిదో అది ఒక కర్త చేసిన పని. ఈశ్వరునకు కర్త లేడు - జన్మ లేదు - ఈశ్వరునకు దేశ పరిచ్ఛేదము లేదు. అనగా, ఒకచోటనున్న ఈశ్వరుడు ఇంకొకచోట ఉండడు అను నియమము లేదు - ఎందుచేతననగా ఈశ్వరుడు వ్యాపకుడు - అన్నింటియందు, అన్ని స్థలములందు వ్యాపించియుండువాడు - అందుచేత వ్యాపి)

  1. "స్వాభివ్యం జక సంకోచాత్ సంకోచప్రతి చాత్మనః |

నస్వరూపేణ చిద్రూపం సర్వవ్యాపి సదా ఖలు |

జ్ఞాతరూపేణ చా జ్ఞాత స్వరూపేణ చ సాక్షిణః |

సర్వం భాతి తథాభాతి తతస్తద్వ్యాపి సర్వదా |

స్వయం సేద్ధం మ శక్యేం హి జడాత్మకమిదం జగత్ |

చిత్సంబంధి బలేనైవ ఖలుభాతి న చాన్యథా |

అధో(అ)వభాస్యం సకలం వ్యాప్య తద్భాస కశ్శివః |

స్వతో వ్యాపి న చావ్యాపి సంకోశ్చ చశ్చాన్య సంభవాత్ ||". (సూతసంహితాయాం)

"నను ఆత్మనః ఆహ - వ్యాపిత్వమనుప పన్నం తత్తద్దేహేషు సంకోచ దర్శినాది త్యతః ఆహ - "స్వాభివ్యం జకేతి". స్వస్య ఆత్మనః స్వప్రాకాశ చిద్రూపస్యాప్యావరణా జ్ఞానాపనయన ద్వారా యదభివ్యంజకమంతః కరణాది తత్పరిచ్ఛేదవశేన చిదాత్మని పరిచ్ఛేద ప్రతిభాసో రక్తః స్ఫటిక ఇతివత్, న స్వాభావిక ఇత్యర్థః కుతః? ఇత్యాహః - ‘చిదితి’ - సదా సర్వదా ఉత్పత్తిస్థిత్యాదికాలే సర్వస్యాపి ప్రపంచస్యాధ్యస్తస్య చిల్లక్షణం బ్రహ్మహి రూపం అధ్యస్తస్యాధిష్ఠాన దవ్యతి రిక్తత్వాత్ - ఏతేనకాలవస్తుకృత పరిచ్ఛేదే నిరస్తే. దేశకృతమపి నిరస్యతి - "జ్ఞాతరూపేణేతి" ప్రతిభాసమానమపి సర్వం జగత్ జ్ఞాతరూపేణ జ్ఞానవిషయీ; కృతత్వాకారేణ తథా అజ్ఞాతరూపేణ అజ్ఞాన విషయత్వాకారేణచ సాక్షి చిన్మాత్రస్యాత్మనో భాతి. అతః చిత్ప్రకాశ వ్యతిరేకః కుత్రాపి నాస్తీతి. దేశకృతపరిచ్ఛేదోపి నవిద్యతే - ఇత్యర్థః - - - దృశ్యమజ్ఞాన తత్కార్య లక్షణం సర్వం జగద్వాప్య వర్తమానః స్వభావత ఏవ వ్యాపి."

(జగత్తు జడాత్మకము - స్వయముగా వ్యాపించుటకు శక్తి లేనిది. భగవంతుని శక్తి వల్లనే ప్రకాశించుచున్నది - స్ఫటికము ప్రక్కనున్న ఎరుపురంగుగల వస్తువునుబట్టి ఎర్రగా కనబడినట్లు - జగత్తు అంతటను శివుడు వ్యాపించి దానిని ప్రకాశింప చేయుచున్నాడు - శివుడు స్వయముగా వ్యాపించు శక్తి గలవాడు).

  1. "సిద్ధాంతే" సజాతీయ విజాతీయ స్వగత భేదాభావాత్ వ్యాపకస్య లక్షణం -"సదేవ సోమ్య ఇదమగ్ర ఆసీత్, ఏకమేవ అద్వితీయం" ఇతి చాందోగ్య శ్రుత్యనుసారి ఇదం లక్షణం. అత్ర ఏకవదేన సజాతీయ భేదో నిషిధ్యతే; ‘ఏవ’ కారేణ విజాతీయ భేద నిషేధో భవతి. అద్వితీయ పదేన స్వగత భేదనిషేధశ్చ భవతి. ఏతల్లక్షణానుసారేణ దేశకాలవస్తు కృత పరిచ్చేద రహితత్వమపివ్యాపకస్య లక్షణమితి సిద్ధం

(విచారసాగరం)

"ఆత్మా వ్యాపకః ఏక ఏవ" ఏక పదేన దేశకృతో అంతో నిషిద్ధః. తథాహి యద్వస్తు పరిచ్ఛిన్నం తత్ నానా భవతికింతు ఆకాశవదేకమేవ. యస్మాత్ ఆత్మా ఏకః తస్మాత్ న పరిచ్ఛిన్నః, కింతు వ్యాపకః తస్మాత్ ఏవ ఆత్మా దేశకృతాంత రహితః భవతి. న్యాయమతేతు నానా వ్యాపకా అంగీక్రియతే. అదద్వైత శ్రుతేః వక్షమాణయుక్తేః లోకానుభవస్యచ విరుద్ధం ఉక్త శ్రుతిగతైకపదేన ఆత్మనః దేశకృతో అంతః నిషిద్ధ్యతే.

నిశ్చయ వాచకేన ఏవ కారేణ ఆత్మనః నిరపేక్ష వ్యాపకత్వం బోధ్యతే. తేన చ కాలకృతో అంతః ప్రతిషిద్ధ్యతే.

అద్వితీయ పదేన భేద ప్రతియోగ్యవ్యవస్తు నిషేధాత్ ఆత్మని వస్తుకృతో అపి అంతః ప్రతిషిద్ధః. ఇత్థం సిద్ధాంతోక్తం ఉభయ విధమపి వ్యాపకత్వ లక్షణం. శ్రుత్యనుసారి వ్యాపకత్వ నిర్వచనం శ్రుత్యైవ ప్రదర్శితం - "యత్ర నాన్యత్ పశ్యతి, నాన్యత్ శ్రుణోతి, నాన్యత్ విజనాతి స భూమా" ఇతి వస్తుకృత పరిచ్ఛేదాభావ సిద్ధ్యైన దేశకాలకృత పరిచ్ఛేదా భావో అపి అర్థాత్ సిద్ధః, దేశకాల యోరపి వస్త్వంతర్గతత్వాత్ -

(త్రివిధపరిచ్ఛేదము అనగా ఒక స్థలమందుండి ఇంకొక స్థలమందు లేకుండుట. కాలగత పరిచ్ఛేదమనగా ఒక కాలమందుండి ఇంకొక కాలమందుండకుండుట. వస్తుగత పరిచ్ఛేదమనగా ఒకవస్తువునందుండి ఇంకొక వస్తువునందు లేకపోవుట. ఇట్టి త్రివిధ పరిచ్ఛేదము లేకుండుట వ్యాపకముయొక్క లక్షణము అని సిద్ధాంతము - " ఈ కనుపించు ప్రపంచమంతయు సృష్టికి ముందు సత్పదార్థము గానే ఉండెను; అది ఒక్కటే, అదిగాక రెండవ వస్తువు లేదు -" అని ఛాందోగ్యోపనిషత్ లో యీ లక్షణము చెప్పబడినది. సత్పదార్థము - ఆత్మ - ఒక్కటే యుండెను అనిచెప్పుటవలన ఆత్మకు సజాతీయ విజాతీయ భేదము లేదని చెప్పబడినది. ఆత్మ వంటిది ఇంకొకటి లేదు ’ ఏకమేవ ’ అనుటలోని ఏవ పదముచే విజాతీయ పదము లేదని చెప్పబడినది. అనగా, ఆత్మవంటిదికాక ఇతర వస్తువు - ఆత్మకాని వస్తువు ఇంకొకటి లేదు అని చెప్పడమైనది. ‘అద్వితీయం’ అను మాటచేత స్వగతభేదము లేదని చెప్పబడినది. ఈ లక్షణము ప్రకారము దేశకాలవస్తు పతిచ్ఛేదము లేకపోవుట వ్యాపియొక్క లక్షణము - అనుట సిద్ధము -

(‘ఆత్మ వ్యాపి, ఒక్కడే’ అని చెప్పుటవలన దేశపరిచ్ఛేదము ఆత్మకు లేదనుట సిద్ధము - (సిద్ధించినది). ఏ వస్తువు పరిఛ్ఛిన్నమైనదో (అనగా, దేశకాలవస్తు పరిచ్ఛేదము కలదో) అది నానా (అనేకము) అగును కాని ఆత్మ ఆకాశమువలె ఒకటే. ఆత్మ ఆకాశమువలన ఒకటే అయినందున పరిచ్ఛేదరహితమైనది, వ్యాపకము కలది, వ్యాపి (అన్నింటిలోను వ్యాపించియుండునది -) అందుచేత ఆత్మ దేశపరిచ్ఛేదము లేనిది. న్యాయమతము ప్రకారము నానా వ్యాపకము అని అంగీకరింపబడినది. ‘అద్వితీయం’ అనుదానికిన్నీ, లోకములోని అనుభవమునకున్నూ విరుద్ధము. ఈ శ్రుతివాక్యమును బట్టి ఆత్మకు దేశపరిచ్ఛేదము లేదు. ఆత్మకు దేసపరిచ్ఛేదము లేదు - అని స్పష్టము - పైన చెప్పిన శ్రుతి వాక్యములో ‘ఏవ’ అని నిశ్చయము చేసినట్లు చెప్పుటచేత ఆత్మకి అపేక్షలేదని చెప్పడమైనది. దీనివలన కాలపరిచ్ఛేదము లేదని చెప్పబడినది.

పై శ్రుతి వాక్యములో ‘అద్వితీయం’ అని చెప్పుటచేత - ఇతర వస్తువు లేదనుటవలన వస్తు పరిచ్ఛేదము లేదని చెప్పడమైనది. ఈ ప్రకారముగా రెండు విధములుగాను వ్యాపకత్వ లక్షణము సిద్ధాంతము చేయబడినది. వ్యాపకత్వ లక్షణముగుఱించి శ్రుతిలో ఈ విధముగా చెప్పబడినది : - "ఎక్కడ ఇతరము వినబడదో, ఇతరము చూడబడదో, ఇతరము తెలియబడదో అది భూమా" అని చెప్పియుండుటచేత వస్తు పరిచ్ఛేదము లేదు - దీని అర్థము దేశమువలన, కాలమువలన పరిచ్ఛేదము లేదు - అనుట సిద్ధము, దేశకాలములు చెప్పినపుడు వస్తువుకూడ చెప్పినట్లే - కనుక).

  1. పరిపూర్ణః

(ప్రపంచమంతటిలోను పూర్తిగా వ్యాపించియుండువాడు కనుక ప్రపంచమంతటిలోను పూర్తిగా నిండియుండువాడు - అందుచేత పరిపూర్ణుడు) (ఆకాశము, కాలము, దిక్కులు, ఆత్మ - ఇవి అంతటను అన్నింటిలోను వ్యాపించియుండునవి.)

  1. సర్వం ఇదం జగత్ సదాఖ్యేన బ్రహ్మణా సాకాశం వ్యాప్తం, ఆకాశేన ఘటాదయః ఇవ.

(కుండ మొదలగువాటిలో ఆకాశము వ్యాపించియుండునట్లు ఆకాశముతో కూడి యీ సమస్త జగత్తును లోను సత్పదార్థమైన బ్రహ్మ వ్యాపించియున్నాడు).

  1. "దేశకాల వస్తు పరిచ్ఛేద శూన్యం, అనంతం, నిరతిశయం మహత్ -" (విచారసాగరము)

(దేశకాల వస్తువులచేత పరిచ్ఛేదము లేనివాడు - అనగా, అన్ని దేశములందు - అంతట - అన్ని కాలములందు, అన్ని వస్తువులందు ఉండువాడు. ఏ విధముగానైనను అంతము లేనివాడు - అన్నింటికంటె గొప్పదైన మహత్తత్త్వముకలవాడు)

Transliteration
  1. vyāpana śīlaḥ

(vyāpiṃciyuṃḍu svabhāvamu kalavāḍu kanuka śrīmahāviṣṇuvu vyāpi ani ceppabaḍucunnāḍu)

  1. "vyāpanādvāpī mahādēvaḥ -" iti śrutiḥ.

(vyāpiṃciyuṃḍuvāḍu kanuka mahādēvuḍu vyāpiyani ceppabaḍucunnāḍu ani śruti ceppucunnadi)

  1. "kāraṇatvēna sarvakāryāṇāṃ vyāpanādvā vyāpī" (śrīśaṃkaraḥ)

(samasta kāryavastuvulaṃdunu, vāṭiki kāramaguṭacēta vāṭilō vyāpiṃci yuṃḍuṭavalana - kuṃḍaku kāraṇamainaṭṭi maṭṭi kuṃḍa aṃtaṭilōnu vyāpiṃci yuṃḍunaṭlu - vyāpī ani bhagavaṃtuḍu ceppabaḍucunnāḍu).

  1. ākāśavat sarvagatatvāt vyāpī -"ākāśavat sarva gataśca nityaḥ" iti śrrutiḥ. (śrīśaṃkaraḥ)

(ākāśamuvale anniṃṭilōnu pravēśiṃci yuṃḍuvāḍu, vyāpiṃci yuṃḍuvāḍu - pravēśiṃci vyāpiṃci yuṃḍuvāḍu - nityuḍu ani śruti ceppucunnadi).

  1. jagadvyāpī (prapaṃcamaṃtaṭanu vyāpiṃci yuṃḍuvāḍu)

  2. "viśvātmakaṃ vyāpakaṃ" (śrīrāmakarṇāmṛtaṃ - 1 - 31)

(jagattu aṃtaṭikī ātma ayinaṃduna dānaṃtaṭilōnu pūrtigā vyāpiṃci yuṃḍuvāḍu)

  1. "ati sūkṣmatayā sarvacētanāṃtaḥ pravēśa svabhāvaḥ"

(mikkili cinnadi yaguṭacēta cētana vastuvulanniṃṭi lōpala pravēśiṃciyuṃḍu svabhāvamu kalavāḍu)

  1. yacca kiṃcit jagatsatyaṃ dṛśyatē śrūyatēpivā |

aṃtarbahiśca tatsarvaṃ vyāpya nārāyaṇa sthitaḥ (maṃtrapuṣpaṃ - 5)

(carācarātmakamaina ī jagattu ē koṃcemu kanabaḍucunnadō, iṃkā unnadi yani okaru ceppagā vinucunnāmō, aṭṭi yī prapaṃcamaṃtayu - cūcinadi, vinabaḍinadi, iṃkanu migiliyunnadi. aṃtaṭilōnu - lōnu paina śrīmannārāyaṇuḍu (bhagavaṃtuḍu) vyāpiṃciyunnāḍu).

  1. "vyāpinē (a)nēka rūpaika svarūpāya namōnamaḥ" (viṣṇupurāṇamu)

(okaḍē ayinanu - okē rūpamu galavāḍainanu anēka rūpamulu galavāḍu, anniṃṭilōnu vyāpiṃci yuṃḍuvāḍu ayina vānini guṟiṃci namaskāramu cēyucunnānu)

  1. "īśvarōnaika dēśa mātrē vartatē, kiṃtu sarvatra vyāpakaḥ.asti īśvaraḥ ēka dēśamātrē vartatē ityaṃgīkārē sa īśvaraḥ anityō bhavēt - yasya dēśataḥ aṃtō asti tasya kālataḥ api aṃtō asti iti niyamāt - yat anityaṃ tat kartṛjanyaṃ iti niyamāt. īśvarasya kartā kaścit asti ityētat na ghaṭatē - īśvarasya dēśataḥ aṃtōnāsti, kiṃtu īśvaraḥ vyāpakaḥ, ata ēva nityaḥ".

(īśvaruḍu - parabrahma - okacōṭanē yuṃḍuvāḍukāḍu, aṃtaṭanu vyāpiṃciyuṃḍuvāḍu. īśvaruḍu okē cōṭanuṃḍu vāḍainayaḍala atanu nityuḍukāḍu, anityuḍu, annikālamulaṃduṃḍuvāḍukāḍu. evaḍu okē sthalamaṃduṃḍi iṃkoka sthalamaṃduṃḍaḍō - dēśa paricchēdamu kaladō vāniki kāla paricchēdamu kūḍa kaladu. anagā, oka kālamaṃduṃḍuvāḍu iṃkoka kālamaṃduṃḍaḍu anu niyamamunubaṭṭi ēdi nityamukānidō adi oka karta cēsina pani. īśvarunaku karta lēḍu - janma lēdu - īśvarunaku dēśa paricchēdamu lēdu. anagā, okacōṭanunna īśvaruḍu iṃkokacōṭa uṃḍaḍu anu niyamamu lēdu - eṃducētananagā īśvaruḍu vyāpakuḍu - anniṃṭiyaṃdu, anni sthalamulaṃdu vyāpiṃciyuṃḍuvāḍu - aṃducēta vyāpi)

  1. "svābhivyaṃ jaka saṃkōcāt saṃkōcaprati cātmanaḥ |

nasvarūpēṇa cidrūpaṃ sarvavyāpi sadā khalu |

jñātarūpēṇa cā jñāta svarūpēṇa ca sākṣiṇaḥ |

sarvaṃ bhāti tathābhāti tatastadvyāpi sarvadā |

svayaṃ sēddhaṃ ma śakyēṃ hi jaḍātmakamidaṃ jagat |

citsaṃbaṃdhi balēnaiva khalubhāti na cānyathā |

adhō(a)vabhāsyaṃ sakalaṃ vyāpya tadbhāsa kaśśivaḥ |

svatō vyāpi na cāvyāpi saṃkōśca caścānya saṃbhavāt ||". (sūtasaṃhitāyāṃ)

"nanu ātmanaḥ āha - vyāpitvamanupa pannaṃ tattaddēhēṣu saṃkōca darśinādi tyataḥ āha - "svābhivyaṃ jakēti". svasya ātmanaḥ svaprākāśa cidrūpasyāpyāvaraṇā jñānāpanayana dvārā yadabhivyaṃjakamaṃtaḥ karaṇādi tatparicchēdavaśēna cidātmani paricchēda pratibhāsō raktaḥ sphaṭika itivat, na svābhāvika ityarthaḥ kutaḥ? ityāhaḥ - ‘ciditi’ - sadā sarvadā utpattisthityādikālē sarvasyāpi prapaṃcasyādhyastasya cillakṣaṇaṃ brahmahi rūpaṃ adhyastasyādhiṣṭhāna davyati riktatvāt - ētēnakālavastukṛta paricchēdē nirastē. dēśakṛtamapi nirasyati - "jñātarūpēṇēti" pratibhāsamānamapi sarvaṃ jagat jñātarūpēṇa jñānaviṣayī; kṛtatvākārēṇa tathā ajñātarūpēṇa ajñāna viṣayatvākārēṇaca sākṣi cinmātrasyātmanō bhāti. ataḥ citprakāśa vyatirēkaḥ kutrāpi nāstīti. dēśakṛtaparicchēdōpi navidyatē - ityarthaḥ - - - dṛśyamajñāna tatkārya lakṣaṇaṃ sarvaṃ jagadvāpya vartamānaḥ svabhāvata ēva vyāpi."

(jagattu jaḍātmakamu - svayamugā vyāpiṃcuṭaku śakti lēnidi. bhagavaṃtuni śakti vallanē prakāśiṃcucunnadi - sphaṭikamu prakkanunna erupuraṃgugala vastuvunubaṭṭi erragā kanabaḍinaṭlu - jagattu aṃtaṭanu śivuḍu vyāpiṃci dānini prakāśiṃpa cēyucunnāḍu - śivuḍu svayamugā vyāpiṃcu śakti galavāḍu).

  1. "siddhāṃtē" sajātīya vijātīya svagata bhēdābhāvāt vyāpakasya lakṣaṇaṃ -"sadēva sōmya idamagra āsīt, ēkamēva advitīyaṃ" iti cāṃdōgya śrutyanusāri idaṃ lakṣaṇaṃ. atra ēkavadēna sajātīya bhēdō niṣidhyatē; ‘ēva’ kārēṇa vijātīya bhēda niṣēdhō bhavati. advitīya padēna svagata bhēdaniṣēdhaśca bhavati. ētallakṣaṇānusārēṇa dēśakālavastu kṛta pariccēda rahitatvamapivyāpakasya lakṣaṇamiti siddhaṃ

(vicārasāgaraṃ)

"ātmā vyāpakaḥ ēka ēva" ēka padēna dēśakṛtō aṃtō niṣiddhaḥ. tathāhi yadvastu paricchinnaṃ tat nānā bhavatikiṃtu ākāśavadēkamēva. yasmāt ātmā ēkaḥ tasmāt na paricchinnaḥ, kiṃtu vyāpakaḥ tasmāt ēva ātmā dēśakṛtāṃta rahitaḥ bhavati. nyāyamatētu nānā vyāpakā aṃgīkriyatē. adadvaita śrutēḥ vakṣamāṇayuktēḥ lōkānubhavasyaca viruddhaṃ ukta śrutigataikapadēna ātmanaḥ dēśakṛtō aṃtaḥ niṣiddhyatē.

niścaya vācakēna ēva kārēṇa ātmanaḥ nirapēkṣa vyāpakatvaṃ bōdhyatē. tēna ca kālakṛtō aṃtaḥ pratiṣiddhyatē.

advitīya padēna bhēda pratiyōgyavyavastu niṣēdhāt ātmani vastukṛtō api aṃtaḥ pratiṣiddhaḥ. itthaṃ siddhāṃtōktaṃ ubhaya vidhamapi vyāpakatva lakṣaṇaṃ. śrutyanusāri vyāpakatva nirvacanaṃ śrutyaiva pradarśitaṃ - "yatra nānyat paśyati, nānyat śruṇōti, nānyat vijanāti sa bhūmā" iti vastukṛta paricchēdābhāva siddhyaina dēśakālakṛta paricchēdā bhāvō api arthāt siddhaḥ, dēśakāla yōrapi vastvaṃtargatatvāt -

(trividhaparicchēdamu anagā oka sthalamaṃduṃḍi iṃkoka sthalamaṃdu lēkuṃḍuṭa. kālagata paricchēdamanagā oka kālamaṃduṃḍi iṃkoka kālamaṃduṃḍakuṃḍuṭa. vastugata paricchēdamanagā okavastuvunaṃduṃḍi iṃkoka vastuvunaṃdu lēkapōvuṭa. iṭṭi trividha paricchēdamu lēkuṃḍuṭa vyāpakamuyokka lakṣaṇamu ani siddhāṃtamu - " ī kanupiṃcu prapaṃcamaṃtayu sṛṣṭiki muṃdu satpadārthamu gānē uṃḍenu; adi okkaṭē, adigāka reṃḍava vastuvu lēdu -" ani chāṃdōgyōpaniṣat lō yī lakṣaṇamu ceppabaḍinadi. satpadārthamu - ātma - okkaṭē yuṃḍenu aniceppuṭavalana ātmaku sajātīya vijātīya bhēdamu lēdani ceppabaḍinadi. ātma vaṃṭidi iṃkokaṭi lēdu ’ ēkamēva ’ anuṭalōni ēva padamucē vijātīya padamu lēdani ceppabaḍinadi. anagā, ātmavaṃṭidikāka itara vastuvu - ātmakāni vastuvu iṃkokaṭi lēdu ani ceppaḍamainadi. ‘advitīyaṃ’ anu māṭacēta svagatabhēdamu lēdani ceppabaḍinadi. ī lakṣaṇamu prakāramu dēśakālavastu paticchēdamu lēkapōvuṭa vyāpiyokka lakṣaṇamu - anuṭa siddhamu -

(‘ātma vyāpi, okkaḍē’ ani ceppuṭavalana dēśaparicchēdamu ātmaku lēdanuṭa siddhamu - (siddhiṃcinadi). ē vastuvu parichchinnamainadō (anagā, dēśakālavastu paricchēdamu kaladō) adi nānā (anēkamu) agunu kāni ātma ākāśamuvale okaṭē. ātma ākāśamuvalana okaṭē ayinaṃduna paricchēdarahitamainadi, vyāpakamu kaladi, vyāpi (anniṃṭilōnu vyāpiṃciyuṃḍunadi -) aṃducēta ātma dēśaparicchēdamu lēnidi. nyāyamatamu prakāramu nānā vyāpakamu ani aṃgīkariṃpabaḍinadi. ‘advitīyaṃ’ anudānikinnī, lōkamulōni anubhavamunakunnū viruddhamu. ī śrutivākyamunu baṭṭi ātmaku dēśaparicchēdamu lēdu. ātmaku dēsaparicchēdamu lēdu - ani spaṣṭamu - paina ceppina śruti vākyamulō ‘ēva’ ani niścayamu cēsinaṭlu ceppuṭacēta ātmaki apēkṣalēdani ceppaḍamainadi. dīnivalana kālaparicchēdamu lēdani ceppabaḍinadi.

pai śruti vākyamulō ‘advitīyaṃ’ ani ceppuṭacēta - itara vastuvu lēdanuṭavalana vastu paricchēdamu lēdani ceppaḍamainadi. ī prakāramugā reṃḍu vidhamulugānu vyāpakatva lakṣaṇamu siddhāṃtamu cēyabaḍinadi. vyāpakatva lakṣaṇamuguṟiṃci śrutilō ī vidhamugā ceppabaḍinadi : - "ekkaḍa itaramu vinabaḍadō, itaramu cūḍabaḍadō, itaramu teliyabaḍadō adi bhūmā" ani ceppiyuṃḍuṭacēta vastu paricchēdamu lēdu - dīni arthamu dēśamuvalana, kālamuvalana paricchēdamu lēdu - anuṭa siddhamu, dēśakālamulu ceppinapuḍu vastuvukūḍa ceppinaṭlē - kanuka).

  1. paripūrṇaḥ

(prapaṃcamaṃtaṭilōnu pūrtigā vyāpiṃciyuṃḍuvāḍu kanuka prapaṃcamaṃtaṭilōnu pūrtigā niṃḍiyuṃḍuvāḍu - aṃducēta paripūrṇuḍu) (ākāśamu, kālamu, dikkulu, ātma - ivi aṃtaṭanu anniṃṭilōnu vyāpiṃciyuṃḍunavi.)

  1. sarvaṃ idaṃ jagat sadākhyēna brahmaṇā sākāśaṃ vyāptaṃ, ākāśēna ghaṭādayaḥ iva.

(kuṃḍa modalaguvāṭilō ākāśamu vyāpiṃciyuṃḍunaṭlu ākāśamutō kūḍi yī samasta jagattunu lōnu satpadārthamaina brahma vyāpiṃciyunnāḍu).

  1. "dēśakāla vastu paricchēda śūnyaṃ, anaṃtaṃ, niratiśayaṃ mahat -" (vicārasāgaramu)

(dēśakāla vastuvulacēta paricchēdamu lēnivāḍu - anagā, anni dēśamulaṃdu - aṃtaṭa - anni kālamulaṃdu, anni vastuvulaṃdu uṃḍuvāḍu. ē vidhamugānainanu aṃtamu lēnivāḍu - anniṃṭikaṃṭe goppadaina mahattattvamukalavāḍu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.