← Back to వ · Booklets 41–50 (digitized file 5)

వ్యాసః vyāsaḥ

Original — తెలుగు
  1. "వేదవిస్తార కరణాత్ వ్యాస నామాభవన్ ఋషిః" (దేవీభాగవతము)

(వేదమును విస్తరింపచేయుటవలన ఈ ఋషి వ్యాసుడని చెప్పబడినాడు)

  1. వేదవిస్తారో విభాగ పూర్వకో విస్తారః, తస్య కరణాత్ వ్యాసనామా భవిత్ - వేదవ్యాసః.

(వేదమును విస్తరింపచేయడమనగా వేదమును విభాగించుట. అది చేయుటవలన వ్యాసుడని పేరు కలిగెను).

  1. "ఋగ్వేదాది విభాగేన చతుర్థాః వేదాః వ్యస్తాః కృతాః | ఆద్యో వేద ఏక వింశతి థా కృతః, ద్వితీయః ఏకోత్తర శతథా కృతః; సామవేదః సహస్రథాకృతః; అధర్వవేదో నవథాశాఖా భేదేన కృతః. ఏవం అన్యాని చ పురాణాని వ్యస్తాని అనేన ఇతి వ్యాసో బ్రహ్మ" (శ్రీశంకరః)

(వేదములను ఋగ్వేదము మొదలగు నాలుగు వేదములుగా విభజించెను, విస్తరించెను. ఋగ్వేదము ఏక వింశతి భాగములుగాను, యజుర్వేదము ఏకోత్తర శత భాగములుగాను, సామవేదము వేయి శాఖలుగను, అధర్వణవేదము తొమ్మిది శాఖలుగను విభజించెను, విస్తరించెను. ఈ ప్రకారముగానే పురాణములను విస్తరింపచేసెను. అందుచేత బ్రహ్మయే వ్యాసుడని చెప్పబడెను).

  1. "కృష్ణద్వైపాయ నం విద్ధి వ్యాసం నారాయణం ప్రభుం |

ఇతిస్మృతేః సజ్జనోపకారిక భగవదవతారత్వాత్ చ వ్యాసః సర్వజ్ఞః భగవాన్"

(కృష్ణద్వైపాయనుడైన వ్యాసుడు "ప్రభువగు భగవంతుడైన నారాయణుడే" అని స్మృతిలో చెప్పబడి యుండుటచేత సజ్జనులకుపకారముచేయు భగవంతుని అవతారమే యగుటవలన వ్యాసుడు సర్వజ్ఞుడు -)

  1. "ద్వాపరాంతేషు విశ్వాత్మా విష్ణుః విశ్వంభరః ప్ర భుః |

వ్యాసనామ్నా చరత్యస్మిన్ అవతీర్య మహీతలే ||".

(ద్వాపరయుగమందలి అంతమందు - ప్రతి ద్వాపరయుగము యొక్క అంతమందు విశ్వాత్ముడు, ప్రభువు, విశ్వంభరుడు అయిన విష్ణువు ఈ భూమియందు వ్యాసుడను పేరుతో అవతరించి సంచరించును).

  1. "వ్యాసో నారాయణస్వయం"

(వ్యాసుడు స్వయముగా నారాయణుడే)

  1. "వ్యాసరే ద్వాపరే విష్ణు వ్యాసరూపే మహామునే"

(ఓ మునీంద్రా ! ప్రతి ద్వాపర యుగమందు విఉష్ణువు వ్యాసరూపముతో జన్మించును).

  1. "ద్వాపరే సమనుప్రాప్తే తృతీయే యుగపర్యయే |

జాతః పరాశరాద్యోగీ వాసవ్యాం కలయం హరేః ||". (శ్రీమద్భాగవతం - 1 - 4 -14)

"వ. తృతీయంబైన ద్వాపరయుగంబు దీఱు సమయంబున నుపరిచర వసువు వీర్యంబున జన్మించి వాసవినా దగు సత్యవతియందు బరాశరునికి హరికళంజేసి విజ్ఞానియైన వేదవ్యాసుండు జన్మించి - - -." (శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 4 - 45)

  1. "మన్వంతరేషు సర్వేషు ద్వాపరే ద్వాపరేయుగే |

ప్రాదుః కరోతి ధర్మార్థీ పురాణాని యథావిధి ||". (శ్రీదేవీ భాగవతము - 1 - 6 - 3)

(అన్ని మన్వంతరములందును, ప్రతి ద్వాపరయుగమందును, వ్యాసుడు పురాణములను రచించెను).

  1. "పరాశరసుతః శ్రీమాన్ వ్యాసో వాక్యమధా బ్రవీత్ |

మయా వా సుమహత్తప్తం తవః పరమదారుణం |

భూతం భవ్య భవిష్యంచ జానీయామీతి సత్తమాః |

తస్యమే తప్త తపసో నిగృహీతేంద్రియస్యచ |

నారాయణ ప్రసాదేన క్షీర దస్యానుకూలతః | త్రైకాలికమిదం జ్ఞానం ప్రాదూర్భూతం యధేప్సితః |

యధావృత్తి హి కల్పా దౌ దృష్టం మే జ్ఞాన చక్షుషా ||" (శ్రీమహాభారతము - శాంతిపర్వము - 340)

(పరాశరకుమారుడు అయిన వ్యాసుడు ఇట్లు పలికెను - నేను పరమదారుణమైన తపస్సు చేసితిని. దాని ఫలితముగా నాకు భూత భవిష్యద్వర్తమాన కాలములు (కాలములలో) జరుగునవి తెలుసును - ఇంద్రియ నిగ్రహము - ఇంద్రియజయము గల నాకు అట్టి తపస్సు వలనను భగవంతుని అనుగ్రహము వలనను నాకు మూడుకాలముల గుఱించి అయిన జ్ఞానము ఇష్టానుసారముగ కలిగినది. కల్ప ప్రారంభమున ఏది జరిగినదో అది నేను నా జ్ఞాననేత్రముతో చూచితిని).

  1. అతీతా నా గత వర్తమానజ్ఞుండైన యా ఋషి - - | (శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 3 - 45)

  2. ఉ. సత్యవతీవధూటి మును శంతను పెండ్లముగానినాడు సాం

గత్యమునం బరాశరుడు గర్భము సేసిన బాదరాయణుం

డత్యదికుండు శ్రీహరి కళాంశజుడై ప్రభవించె నిత్యమున్

సత్యములైన వేదముల సాంగములన్ విభజింప దక్షుడై. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 9 - 22 - 669)

  1. "చ. ప్రతి యుగమందు సంకుచితభావులు నల్పతరాయువుల్ సుదు

ర్గతికులునైన మర్త్యుల కగమ్యులున్ స్వకృతంబులున్ సుశా

శ్వతములునైన వేదతరు శాఖలు దా విభజించి నట్తి స

న్నుతుడగు పరాశరప్రియ తనూజుడు నా హరి పుట్టె నర్మిలిన్" (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 7 -194)

  1. "సీ. అరవింద నాభుని అపరావతారమై జననమందిన పరాశర సుతుండు

చతుర వర్ణాశ్రమాచార ధర్మంబులు ఠవణింప లోలో విడంబనంబు

లగు కామ్య కథలు పెక్కర్థి గల్పించుచు హరికథా వర్ణనమందు లోన

నించు కించుకకాని యేర్పడ జెప్పమి నంచిత విజ్ఞానమాత్మ నిలువ

తే. కున్న జింతించి మఱి నారదోపదిష్టు

డఘుచు, హరివర్ణనామృత మాత్మ గ్రోలి

విమల సిజ్ఞాన నిధియన వినుతికెక్కి

ధన్యుడయ్యెను లోకైక మాన్యుడగుచు ". (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 5 - 189)

  1. "భగవాన్ బాదరాయణః" అని వ్యాసుడు ప్రసిద్ధికెక్కెను.

ఆ. "బాదరాయణుండు భగవంతుడనఘండు

పరమ గుహ్యమైన భాగవతము

నందనుండు నయిన నాకు జెప్పెను - - ". (శ్రీమదాంధ్రమహాభాగవతము - 9 - 22 - 670)

వ్యాసుడే కృష్ణ ద్వైపాయనుడు - అతడే బాదరాయణుడు.

  1. "అష్టాదశ పురాణానాం కర్తా సత్యవతీ సుతః "

(పదినెనిమిది పురాణములు రచించినవాడు సత్యవతి కుమారుడైన వ్యాసుడు)

Transliteration
  1. "vēdavistāra karaṇāt vyāsa nāmābhavan ṛṣiḥ" (dēvībhāgavatamu)

(vēdamunu vistariṃpacēyuṭavalana ī ṛṣi vyāsuḍani ceppabaḍināḍu)

  1. vēdavistārō vibhāga pūrvakō vistāraḥ, tasya karaṇāt vyāsanāmā bhavit - vēdavyāsaḥ.

(vēdamunu vistariṃpacēyaḍamanagā vēdamunu vibhāgiṃcuṭa. adi cēyuṭavalana vyāsuḍani pēru kaligenu).

  1. "ṛgvēdādi vibhāgēna caturthāḥ vēdāḥ vyastāḥ kṛtāḥ | ādyō vēda ēka viṃśati thā kṛtaḥ, dvitīyaḥ ēkōttara śatathā kṛtaḥ; sāmavēdaḥ sahasrathākṛtaḥ; adharvavēdō navathāśākhā bhēdēna kṛtaḥ. ēvaṃ anyāni ca purāṇāni vyastāni anēna iti vyāsō brahma" (śrīśaṃkaraḥ)

(vēdamulanu ṛgvēdamu modalagu nālugu vēdamulugā vibhajiṃcenu, vistariṃcenu. ṛgvēdamu ēka viṃśati bhāgamulugānu, yajurvēdamu ēkōttara śata bhāgamulugānu, sāmavēdamu vēyi śākhaluganu, adharvaṇavēdamu tommidi śākhaluganu vibhajiṃcenu, vistariṃcenu. ī prakāramugānē purāṇamulanu vistariṃpacēsenu. aṃducēta brahmayē vyāsuḍani ceppabaḍenu).

  1. "kṛṣṇadvaipāya naṃ viddhi vyāsaṃ nārāyaṇaṃ prabhuṃ |

itismṛtēḥ sajjanōpakārika bhagavadavatāratvāt ca vyāsaḥ sarvajñaḥ bhagavān"

(kṛṣṇadvaipāyanuḍaina vyāsuḍu "prabhuvagu bhagavaṃtuḍaina nārāyaṇuḍē" ani smṛtilō ceppabaḍi yuṃḍuṭacēta sajjanulakupakāramucēyu bhagavaṃtuni avatāramē yaguṭavalana vyāsuḍu sarvajñuḍu -)

  1. "dvāparāṃtēṣu viśvātmā viṣṇuḥ viśvaṃbharaḥ pra bhuḥ |

vyāsanāmnā caratyasmin avatīrya mahītalē ||".

(dvāparayugamaṃdali aṃtamaṃdu - prati dvāparayugamu yokka aṃtamaṃdu viśvātmuḍu, prabhuvu, viśvaṃbharuḍu ayina viṣṇuvu ī bhūmiyaṃdu vyāsuḍanu pērutō avatariṃci saṃcariṃcunu).

  1. "vyāsō nārāyaṇasvayaṃ"

(vyāsuḍu svayamugā nārāyaṇuḍē)

  1. "vyāsarē dvāparē viṣṇu vyāsarūpē mahāmunē"

(ō munīṃdrā ! prati dvāpara yugamaṃdu viuṣṇuvu vyāsarūpamutō janmiṃcunu).

  1. "dvāparē samanuprāptē tṛtīyē yugaparyayē |

jātaḥ parāśarādyōgī vāsavyāṃ kalayaṃ harēḥ ||". (śrīmadbhāgavataṃ - 1 - 4 -14)

"va. tṛtīyaṃbaina dvāparayugaṃbu dīṟu samayaṃbuna nuparicara vasuvu vīryaṃbuna janmiṃci vāsavinā dagu satyavatiyaṃdu barāśaruniki harikaḷaṃjēsi vijñāniyaina vēdavyāsuṃḍu janmiṃci - - -." (śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 4 - 45)

  1. "manvaṃtarēṣu sarvēṣu dvāparē dvāparēyugē |

prāduḥ karōti dharmārthī purāṇāni yathāvidhi ||". (śrīdēvī bhāgavatamu - 1 - 6 - 3)

(anni manvaṃtaramulaṃdunu, prati dvāparayugamaṃdunu, vyāsuḍu purāṇamulanu raciṃcenu).

  1. "parāśarasutaḥ śrīmān vyāsō vākyamadhā bravīt |

mayā vā sumahattaptaṃ tavaḥ paramadāruṇaṃ |

bhūtaṃ bhavya bhaviṣyaṃca jānīyāmīti sattamāḥ |

tasyamē tapta tapasō nigṛhītēṃdriyasyaca |

nārāyaṇa prasādēna kṣīra dasyānukūlataḥ | traikālikamidaṃ jñānaṃ prādūrbhūtaṃ yadhēpsitaḥ |

yadhāvṛtti hi kalpā dau dṛṣṭaṃ mē jñāna cakṣuṣā ||" (śrīmahābhāratamu - śāṃtiparvamu - 340)

(parāśarakumāruḍu ayina vyāsuḍu iṭlu palikenu - nēnu paramadāruṇamaina tapassu cēsitini. dāni phalitamugā nāku bhūta bhaviṣyadvartamāna kālamulu (kālamulalō) jarugunavi telusunu - iṃdriya nigrahamu - iṃdriyajayamu gala nāku aṭṭi tapassu valananu bhagavaṃtuni anugrahamu valananu nāku mūḍukālamula guṟiṃci ayina jñānamu iṣṭānusāramuga kaliginadi. kalpa prāraṃbhamuna ēdi jariginadō adi nēnu nā jñānanētramutō cūcitini).

  1. atītā nā gata vartamānajñuṃḍaina yā ṛṣi - - | (śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 3 - 45)

    1. satyavatīvadhūṭi munu śaṃtanu peṃḍlamugānināḍu sāṃ

gatyamunaṃ barāśaruḍu garbhamu sēsina bādarāyaṇuṃ

ḍatyadikuṃḍu śrīhari kaḷāṃśajuḍai prabhaviṃce nityamun

satyamulaina vēdamula sāṃgamulan vibhajiṃpa dakṣuḍai. (śrīmadāṃdhramahābhāgavatamu - 9 - 22 - 669)

  1. "ca. prati yugamaṃdu saṃkucitabhāvulu nalpatarāyuvul sudu

rgatikulunaina martyula kagamyulun svakṛtaṃbulun suśā

śvatamulunaina vēdataru śākhalu dā vibhajiṃci naṭti sa

nnutuḍagu parāśarapriya tanūjuḍu nā hari puṭṭe narmilin" (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 7 -194)

  1. "sī. araviṃda nābhuni aparāvatāramai jananamaṃdina parāśara sutuṃḍu

catura varṇāśramācāra dharmaṃbulu ṭhavaṇiṃpa lōlō viḍaṃbanaṃbu

lagu kāmya kathalu pekkarthi galpiṃcucu harikathā varṇanamaṃdu lōna

niṃcu kiṃcukakāni yērpaḍa jeppami naṃcita vijñānamātma niluva

tē. kunna jiṃtiṃci maṟi nāradōpadiṣṭu

ḍaghucu, harivarṇanāmṛta mātma grōli

vimala sijñāna nidhiyana vinutikekki

dhanyuḍayyenu lōkaika mānyuḍagucu ". (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 5 - 189)

  1. "bhagavān bādarāyaṇaḥ" ani vyāsuḍu prasiddhikekkenu.

ā. "bādarāyaṇuṃḍu bhagavaṃtuḍanaghaṃḍu

parama guhyamaina bhāgavatamu

naṃdanuṃḍu nayina nāku jeppenu - - ". (śrīmadāṃdhramahābhāgavatamu - 9 - 22 - 670)

vyāsuḍē kṛṣṇa dvaipāyanuḍu - ataḍē bādarāyaṇuḍu.

  1. "aṣṭādaśa purāṇānāṃ kartā satyavatī sutaḥ "

(padinenimidi purāṇamulu raciṃcinavāḍu satyavati kumāruḍaina vyāsuḍu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.