ఏ పదార్థమునకు బ్రహ్మజ్ఞానములేక బాధ (నాశము) గానేరదో, బ్రహ్మజ్ఞానము వలననే బాధ యగునో, ఆ పదార్థమందు వ్యవహారసత్త చెప్పబడియున్నది. దేహేంద్రియాది ప్రపంచరూపమైన ఏ ఈశ్వర సృష్టికలదో దానికి బ్రహ్మజ్ఞానములేక బాధ (నాశము) గానేరదు - బ్రహ్మజ్ఞానము చేతనే బాధ యగును. బాధ యనగా అపరోక్షమిథ్యా నిశ్చయము - (జన్మ మరణ బంధ మోక్షాది వ్యవహారము చేయునట్టి సత్త యనగా అస్తితత్వము ఏది గలదో అది వ్యవహారసత్త.)
"జాగ్రదావస్థయందు ఘటాది సత్తయే విదేహ కైవల్య పర్యంతంబును సుప్తి, మూర్చ మొదలగునవస్థలందు తోపకుండి, వెండియు, లేచి చూచినను నెప్పటియట్లు తోచుటం జేసి వ్యావహారిక సత్త యనంబడు" - (వివేకచింతామణి - పరమానందతీర్థ)
ē padārthamunaku brahmajñānamulēka bādha (nāśamu) gānēradō, brahmajñānamu valananē bādha yagunō, ā padārthamaṃdu vyavahārasatta ceppabaḍiyunnadi. dēhēṃdriyādi prapaṃcarūpamaina ē īśvara sṛṣṭikaladō dāniki brahmajñānamulēka bādha (nāśamu) gānēradu - brahmajñānamu cētanē bādha yagunu. bādha yanagā aparōkṣamithyā niścayamu - (janma maraṇa baṃdha mōkṣādi vyavahāramu cēyunaṭṭi satta yanagā astitatvamu ēdi galadō adi vyavahārasatta.)
"jāgradāvasthayaṃdu ghaṭādi sattayē vidēha kaivalya paryaṃtaṃbunu supti, mūrca modalagunavasthalaṃdu tōpakuṃḍi, veṃḍiyu, lēci cūcinanu neppaṭiyaṭlu tōcuṭaṃ jēsi vyāvahārika satta yanaṃbaḍu" - (vivēkaciṃtāmaṇi - paramānaṃdatīrtha)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.