లోకమున వ్యవహరింపదగు ఘటపటాది వస్తువులు శాశ్వతములుకావు - బ్రహ్మవలె శాశ్వతములు కావు. కాని, శుక్తిరజిత రజ్జు సర్పాదులకన్నను, కలలందు కన్న వస్తువులకన్నను లోకమున శాశ్వతములుగా తోచుట సత్యము. కావున యివి వ్యావహారిక సద్వస్తువులు - - - శుక్తిరజిత రజ్జు సర్పాదులును, స్వప్న పదార్థములును అవి కనబడు పర్యంతమే ఉండునవి, కావున ప్రాతి భాసిక సద్వస్తువులనియు వేదాంతులు పేర్కొనుదురు. గొడ్రాలి కొడుకు, కుందేటి కొమ్ము, గగనకుసుమము మొదలగునవి యేవేళలందును లేని వస్తువులు. కావున వీనిని శూన్యములని చెప్పుదురు -
lōkamuna vyavahariṃpadagu ghaṭapaṭādi vastuvulu śāśvatamulukāvu - brahmavale śāśvatamulu kāvu. kāni, śuktirajita rajju sarpādulakannanu, kalalaṃdu kanna vastuvulakannanu lōkamuna śāśvatamulugā tōcuṭa satyamu. kāvuna yivi vyāvahārika sadvastuvulu - - - śuktirajita rajju sarpādulunu, svapna padārthamulunu avi kanabaḍu paryaṃtamē uṃḍunavi, kāvuna prāti bhāsika sadvastuvulaniyu vēdāṃtulu pērkonuduru. goḍrāli koḍuku, kuṃdēṭi kommu, gaganakusumamu modalagunavi yēvēḷalaṃdunu lēni vastuvulu. kāvuna vīnini śūnyamulani ceppuduru -
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.