(1) స బాహ్యాంతరమంధకారమయం ఆకాశం
(2) స బాహ్యాంతరే కాలానల సదృశం పరాకాశం
(3) స బాహ్యాంతరే అపరిమిత ద్యుతి నిభం తత్వం మహాకాశం
(4) స బాహ్యంతరే సూర్యనిభం సూర్యాకాశం.
(5) అనిర్వచనీయ జ్యోతిః సర్వ వ్యాపకం నిరతిశయానంద లక్షణం పరమాకాశం. (మండల బ్రాహ్మణోపనిషత్)
(ఆకాశము అయిదు విధములుగా నున్నది –
(1) లోపల బైట అంధకారముతో నిండియుండునది ఆకాశము
(2) లోపల బైట ప్రళయకాలమందలి అగ్నివలె నుండు పరాకాశము
(3) లోపల బైట పరిమితి లేని కాంతిగల తత్వరూపమైనది మహాకాశము
(4) లోపల బైట సూర్యునివలె ప్రకాశించునది సూర్యాకాశము-
(5) చెప్పుటకలవికానంత జ్యోతి స్వరూపము, అన్నింటిలో ను వ్యాపించియుండునది, అన్నింటికి మించిన ఆనందలక్షణముకలది పరమాకాశము -).
"గుణరహితాకాశం, విస్ఫురత్తారకాకార సందీప్యమానా గాఢతమోసమం పరమాకాశం, కాలానల సమద్యోతమానం మహాకాశం; సర్వోకృష్ట పరమద్యుతి ప్రద్యోతమానం తత్వాకాశం భవతి; కోటి సూర్య ప్రకాశ వైభవ సంకాశం సూర్యాకాశం భవతి".
(అద్వయ తారకోపనిషత్)
(ఆకాశము అయిదు విధములు - గుణరహితాకాశము, పరమాకాశము, మహాకాశము, తత్వాకాశము, సూర్యాకాశము. గుణరహితాకాశమనగా నక్షత్రములతో కూడియున్నను గాఢమైన తమస్సు - చీకటితో సమానమైనది. ప్రళయకాలమందలి అగ్నితో సమముగా ప్రకాశించునది పరమాకాశము, అన్నింటికంటె ఉత్తమమై గొప్ప తేజసు కలది మహాకాశము, తత్వాకాశము - అన్నింటికంటె గొప్ప తేజస్సుతో ప్రకాశించునది తత్వాకాశము, కోటి సూర్యుల ప్రకాశవైభవముతో సమానమైనది సూర్యాకాశము -).
(1) sa bāhyāṃtaramaṃdhakāramayaṃ ākāśaṃ
(2) sa bāhyāṃtarē kālānala sadṛśaṃ parākāśaṃ
(3) sa bāhyāṃtarē aparimita dyuti nibhaṃ tatvaṃ mahākāśaṃ
(4) sa bāhyaṃtarē sūryanibhaṃ sūryākāśaṃ.
(5) anirvacanīya jyōtiḥ sarva vyāpakaṃ niratiśayānaṃda lakṣaṇaṃ paramākāśaṃ. (maṃḍala brāhmaṇōpaniṣat)
(ākāśamu ayidu vidhamulugā nunnadi –
(1) lōpala baiṭa aṃdhakāramutō niṃḍiyuṃḍunadi ākāśamu
(2) lōpala baiṭa praḷayakālamaṃdali agnivale nuṃḍu parākāśamu
(3) lōpala baiṭa parimiti lēni kāṃtigala tatvarūpamainadi mahākāśamu
(4) lōpala baiṭa sūryunivale prakāśiṃcunadi sūryākāśamu-
(5) ceppuṭakalavikānaṃta jyōti svarūpamu, anniṃṭilō nu vyāpiṃciyuṃḍunadi, anniṃṭiki miṃcina ānaṃdalakṣaṇamukaladi paramākāśamu -).
"guṇarahitākāśaṃ, visphurattārakākāra saṃdīpyamānā gāḍhatamōsamaṃ paramākāśaṃ, kālānala samadyōtamānaṃ mahākāśaṃ; sarvōkṛṣṭa paramadyuti pradyōtamānaṃ tatvākāśaṃ bhavati; kōṭi sūrya prakāśa vaibhava saṃkāśaṃ sūryākāśaṃ bhavati".
(advaya tārakōpaniṣat)
(ākāśamu ayidu vidhamulu - guṇarahitākāśamu, paramākāśamu, mahākāśamu, tatvākāśamu, sūryākāśamu. guṇarahitākāśamanagā nakṣatramulatō kūḍiyunnanu gāḍhamaina tamassu - cīkaṭitō samānamainadi. praḷayakālamaṃdali agnitō samamugā prakāśiṃcunadi paramākāśamu, anniṃṭikaṃṭe uttamamai goppa tējasu kaladi mahākāśamu, tatvākāśamu - anniṃṭikaṃṭe goppa tējassutō prakāśiṃcunadi tatvākāśamu, kōṭi sūryula prakāśavaibhavamutō samānamainadi sūryākāśamu -).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.