చీకటిలో త్రాడును చూచి అది పాము అని భ్రమపడి, తర్వాత అది పాము కాదు త్రాడు అని తెలుసుకొనుట యదార్థజ్ఞానము - ఉన్నది ఉన్నట్లు తెలుసుకొనుట, “నేను బ్రహ్మ స్వరూపుడను” అను యదార్థజ్ఞానము కలుగుటవలన నేను జీవుడను అను భ్రమ నివర్తించును - దానివలన సంసారబంధము తెగును, దుఃఖముపోవును - “తరతి శోకమాత్మవిత్” (ఆత్మజ్ఞానము కలిగినవానికి ప్రవాహరూపమైన సంసారమును - జననమరణములను) లేకుండపోవును.
శరీరమును పొందియుండుటచేత జీవుడు తాను భగవంతినికే చెందినవాడను, తన సర్వ వ్యాపారములు వానికొఱకే చేయుచున్నానని, తాను పరతంత్రుడనిని స్వస్వరూపమును మఱచిపోయి ఆధ్యాత్మిక, ఆధిదైవిక, ఆది భౌతిక తాపములచేత దుఃఖితుండై యుండును - గురువు అనుగ్రహముకలిగి జ్ఞానోదయమైన తర్వాత తన యదార్థ స్వరూపము భాసించును -.
cīkaṭilō trāḍunu cūci adi pāmu ani bhramapaḍi, tarvāta adi pāmu kādu trāḍu ani telusukonuṭa yadārthajñānamu - unnadi unnaṭlu telusukonuṭa, “nēnu brahma svarūpuḍanu” anu yadārthajñānamu kaluguṭavalana nēnu jīvuḍanu anu bhrama nivartiṃcunu - dānivalana saṃsārabaṃdhamu tegunu, duḥkhamupōvunu - “tarati śōkamātmavit” (ātmajñānamu kaliginavāniki pravāharūpamaina saṃsāramunu - jananamaraṇamulanu) lēkuṃḍapōvunu.
śarīramunu poṃdiyuṃḍuṭacēta jīvuḍu tānu bhagavaṃtinikē ceṃdinavāḍanu, tana sarva vyāpāramulu vānikoṟakē cēyucunnānani, tānu parataṃtruḍanini svasvarūpamunu maṟacipōyi ādhyātmika, ādhidaivika, ādi bhautika tāpamulacēta duḥkhituṃḍai yuṃḍunu - guruvu anugrahamukaligi jñānōdayamaina tarvāta tana yadārtha svarūpamu bhāsiṃcunu -.
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.