← Back to య · Booklets 41–50 (digitized file 5)

యజ్ఞోపవీతము yajñōpavītamu

Original — తెలుగు

"గాయత్రి మారు రూపమగు యజ్ఞోపవీతము మూడు సూత్రములుగలది. అందు ఒక్కొక్క సూత్రము మూడేసి అంతరసూత్రములుగలది. ఆ అంతర సూత్రములందొక్కొక్కటిమూడు మూడు పోగులు గలది, గాన మూడు పెద్ద పోగులుగల ఆ యజ్ఞోపవీతము ఇరువదియేడు పోగులు గలది అయ్యెను. ఆ తంతువులే ఇరువదియేడు భేదములుగల జగత్తు. ఆ జగద్రూపమగు యజ్ఞఓపవీతమునే గాయత్రి అని ద్విజాతులు ధరించి సర్వకర్మలు చేయవలెను - - - యజ్ఞోపవీతమందలి మూడు తంతువులకు కూటస్థానమైన ముడియే బ్రహ్మముడి".

బ్రహ్మచారి ఒక యజ్ఞోపవీతమునే ధరింపవలయు - గృహస్థాశ్రమములోనుండువాడు రెండవదానిని ధరింపవలయును - బుజము మీద బట్ట లేకుండ ఏ పనియు చేయరాదు కనుక ఉత్తరీయార్థం మూడవ యజ్ఞోపవీతము ధరించవలయును –

" యజ్ఞోపవీతౌద్వే ధార్యే శ్రౌతే స్మార్తే చ కర్మణి |

తృతీయ ముత్తరీయార్థం వస్త్రాభావే తదిష్యతి".

శ్రౌత స్మార్త కర్మలననుష్టించుటకు యజ్ఞోపవీతము అవసరము - "శ్రౌత స్మార్త సకల నిత్యకర్మానుష్ఠాన యోగ్యతా ఫల సిద్ధ్యర్ధం యజ్ఞోపవీతధారణం కరిష్యే" -

నిత్యకర్మలను చేయుటకు యోగ్యత కలిగియుండుటకు - అధికారి యగుటకు - యజ్ఞోపవీతధారణము ఆవశ్యకము).

Transliteration

"gāyatri māru rūpamagu yajñōpavītamu mūḍu sūtramulugaladi. aṃdu okkokka sūtramu mūḍēsi aṃtarasūtramulugaladi. ā aṃtara sūtramulaṃdokkokkaṭimūḍu mūḍu pōgulu galadi, gāna mūḍu pedda pōgulugala ā yajñōpavītamu iruvadiyēḍu pōgulu galadi ayyenu. ā taṃtuvulē iruvadiyēḍu bhēdamulugala jagattu. ā jagadrūpamagu yajñaōpavītamunē gāyatri ani dvijātulu dhariṃci sarvakarmalu cēyavalenu - - - yajñōpavītamaṃdali mūḍu taṃtuvulaku kūṭasthānamaina muḍiyē brahmamuḍi".

brahmacāri oka yajñōpavītamunē dhariṃpavalayu - gṛhasthāśramamulōnuṃḍuvāḍu reṃḍavadānini dhariṃpavalayunu - bujamu mīda baṭṭa lēkuṃḍa ē paniyu cēyarādu kanuka uttarīyārthaṃ mūḍava yajñōpavītamu dhariṃcavalayunu –

" yajñōpavītaudvē dhāryē śrautē smārtē ca karmaṇi |

tṛtīya muttarīyārthaṃ vastrābhāvē tadiṣyati".

śrauta smārta karmalananuṣṭiṃcuṭaku yajñōpavītamu avasaramu - "śrauta smārta sakala nityakarmānuṣṭhāna yōgyatā phala siddhyardhaṃ yajñōpavītadhāraṇaṃ kariṣyē" -

nityakarmalanu cēyuṭaku yōgyata kaligiyuṃḍuṭaku - adhikāri yaguṭaku - yajñōpavītadhāraṇamu āvaśyakamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.