"యజ్" అను ధాతువునుండి యజః అనుమాట కలిగినది. వృత్త గీతి వర్జితములైనవి యజస్సులు - "యా న గీతిర్నచ పాదబద్ధం తత్ ప్రశ్లిష్ట పఠితం యజుః" (ప్రశ్లిష్టమనగా యుక్తితో చెప్పబడినది).
దేవపూజార్థకము కనుక యజుర్వేదమని చెప్పబడినది - యజ్ఞయాగాది కర్మలను వివరించునది.
"వ. - - - యజుర్వేద ధరుండగు వైశంపాయనుని శిష్య సంఘంబులు నిఖిల క్రతువుల నాధ్వర్య కృత్యంబులచే దేజరిల్లీరి. మఱియు నతని శుష్యుండగు యాజ్ఞవల్క్యుండు గుర్వపరాధంబు సేసిన నా దురువు కంపితుండై యధీత వేదంబుల మరలం దనకిచ్చి పొమ్మనిన నతండు దాని జదివిన యజుర్గణంబును దదుక్త క్రమంబున గ్రక్క నవి రుధిరాక్తంబగు రూపంబు దాల్చిన యజుర్గణాధిష్టిత శాఖాది దేవతులు తిత్తిరి పక్షులై భుజొయించిరి, దానంజేసి యా శాఖలు తైతిరీయంబులయ్యె నంత నిర్వేదియగు నా యాజ్ఞవల్క్యుండపరిమిత నిర్వేదంబు నొంది యుగ్ర తపంబున సూర్యుని సంతుష్టుం గావించిన నతండు సంతసిల్లి హయరూపంబు దాల్చి యజుర్గణంబు నతని కుపదేశించె; గావున నది వాజసనేయ శాఖయని వాకృవ్వబడె. నిట్లు యజుర్వేదంబు లోకంబున బ్రవర్తిల్లె".
(శ్రీమదాంధ్రమహాభాగవతము - 12 - 30)
"yaj" anu dhātuvunuṃḍi yajaḥ anumāṭa kaliginadi. vṛtta gīti varjitamulainavi yajassulu - "yā na gītirnaca pādabaddhaṃ tat praśliṣṭa paṭhitaṃ yajuḥ" (praśliṣṭamanagā yuktitō ceppabaḍinadi).
dēvapūjārthakamu kanuka yajurvēdamani ceppabaḍinadi - yajñayāgādi karmalanu vivariṃcunadi.
"va. - - - yajurvēda dharuṃḍagu vaiśaṃpāyanuni śiṣya saṃghaṃbulu nikhila kratuvula nādhvarya kṛtyaṃbulacē dējarillīri. maṟiyu natani śuṣyuṃḍagu yājñavalkyuṃḍu gurvaparādhaṃbu sēsina nā duruvu kaṃpituṃḍai yadhīta vēdaṃbula maralaṃ danakicci pommanina nataṃḍu dāni jadivina yajurgaṇaṃbunu dadukta kramaṃbuna grakka navi rudhirāktaṃbagu rūpaṃbu dālcina yajurgaṇādhiṣṭita śākhādi dēvatulu tittiri pakṣulai bhujoyiṃciri, dānaṃjēsi yā śākhalu taitirīyaṃbulayye naṃta nirvēdiyagu nā yājñavalkyuṃḍaparimita nirvēdaṃbu noṃdi yugra tapaṃbuna sūryuni saṃtuṣṭuṃ gāviṃcina nataṃḍu saṃtasilli hayarūpaṃbu dālci yajurgaṇaṃbu natani kupadēśiṃce; gāvuna nadi vājasanēya śākhayani vākṛvvabaḍe. niṭlu yajurvēdaṃbu lōkaṃbuna bravartille".
(śrīmadāṃdhramahābhāgavatamu - 12 - 30)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.