← Back to య · Booklets 41–50 (digitized file 5)

యక్ష రక్షో గణములు yakṣa rakṣō gaṇamulu

Original — తెలుగు

’తే. అందులో యక్షరక్షస్సులును జనింప

వారికప్పుడు క్షుత్తృషల్ వఱలగొంద

ఱా చతుర్ముఖు భక్షింతమనిరి కొంద

ఱతని రక్షింతమని తగనాడి రంత’.

వ. ఇట్లు పలుకుచు భక్షించువారలయి ధాత సన్నిధికిం జనిన నతండు భయ విహ్వలుడై - “యేను మీ జనకుండను, మీరలు మత్పుత్రులరు, నన్ను హింసింపకుండు” అనుచు - “మమా జక్షత, రక్షత” యను శబ్దంబులు పలుకం దన్నిమిత్తంబున యక్షరక్షోనామంబులు ప్రకటంబులయ్యె. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 721, 722)

Transliteration

’tē. aṃdulō yakṣarakṣassulunu janiṃpa

vārikappuḍu kṣuttṛṣal vaṟalagoṃda

ṟā caturmukhu bhakṣiṃtamaniri koṃda

ṟatani rakṣiṃtamani taganāḍi raṃta’.

va. iṭlu palukucu bhakṣiṃcuvāralayi dhāta sannidhikiṃ janina nataṃḍu bhaya vihvaluḍai - “yēnu mī janakuṃḍanu, mīralu matputrularu, nannu hiṃsiṃpakuṃḍu” anucu - “mamā jakṣata, rakṣata” yanu śabdaṃbulu palukaṃ dannimittaṃbuna yakṣarakṣōnāmaṃbulu prakaṭaṃbulayye. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 721, 722)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.