← Back to య · Booklets 41–50 (digitized file 5)

యోగి yōgi

Original — తెలుగు
  1. యోగాభ్యాస తత్పరః.

(యోగాభ్యాసము చేయుటలో తత్పరుడైనవాడు, దానియందే నిష్ట కలిగియుండువాడు).

  1. యోగానుష్టాతా - యోగం అనతిష్టతి ఇతి యోగీ.

(యోగము ననుష్టించువాడు)

  1. సమాహిత చిత్తః. (శ్రీశంకరః)

(సమాహితమైన చిత్తము కలవాడు)

  1. శ్రవణాదౌ సమాహిత చిత్తః

(శ్రవణము, మననము మొదలగువాటియందు సమాహితమైన చిత్తముకలవాడు).

  1. అధ్యాత్మవేది.

(అధ్యాత్మమును తెలిసినవాడు - ఆత్మ తత్వమును తెలిసినవాడు)

  1. బ్రహ్మవిద్యావాన్ ఇత్యర్థః. (బ్రహ్మజ్ఞానము కలవాడు)

  2. చిత్తవృత్తి నిరోధ పరాయణః

(చిత్తవృత్తిని అరికట్టుటలో ఆసక్తి కలవాడు - తన్మయుడై యుండువాడు).

  1. ముముక్షుః((మోక్షమును కోరువాడు)

  2. యన నియమాసనా ద్యష్టాంగ యోగయుక్తః.

(యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము మొదలగు అష్టాంగములు గల యోగము ననుష్టించువాడు).

  1. కాలత్రయజ్ఞానీ, అతీంద్రియ వస్తు జ్ఞానవాన్ ఇత్యర్థః.

(భూతభవిష్యద్వర్తమానములను మూడుకాలములందు జరుగువాటిగుఱించిన జ్ఞానము కలవాడు. ఇంద్రియముల శక్తికి మించిన వస్తువులగుఱించిన జ్ఞానము కలవాడు).

  1. పరమార్థ తత్వజ్ఞః - ధ్యాననిష్టః.

(పరమార్థ తత్వమును - బ్రహ్మతత్వమును తెలిసినవాడు)

  1. యోగారూఢః. (యోగమును పూర్తిగా అభ్యసించినవాడు)

  2. వశీ

(శరీరమును, ఇంద్రియములను, మనస్సును తన వశములో నుంచుకొనినవాడు - ఇంద్రియజయము కలవాడు).

  1. "యోగోజ్ఞానం - తేనైవ గమ్యత్వాత్ యోగీ, యోగః సమాధిః, సహిస్వాత్మని సర్వదా సమాధత్తే స్వాత్మానం తేనవా యోగీ". (శ్రీశంకరః)

(యోగమనగా జ్ఞానము - బ్రహ్మజ్ఞానము; జ్ఞానయోగము. జ్ఞానముచేతనే పొందతగినది యోగము. యోగమనగా సమాధి).

  1. “జ్ఞానప్రాప్త్యుపాయత్వేన ఈశ్వరే సమర్ప్య కర్మాణి ఆత్మనః ఫలం అనభిసందాయ అను తిష్టతి యః సః యోగీ". (శ్రీశంకరః)

(బ్రహ్మజ్ఞానము సంపాదించుటకు ఉపాయమగుటచేత కర్మలను భగవంతునికి సమర్పించి తనకు ఆ కర్మల ఫలమునాశించక యుండువాడు)

  1. స్వర్ణే లోష్టే గృహే (అ)రణ్యే సుస్నిగ్ధే చందనే తథా |

సమతా భావనా యస్య సయోగీ పరికీర్తితః ||.

(బంగారమునందు, మట్టిబెడ్డయందు, ఇంటియందు, అడవియందు, చందనమందు సమానమైన భావము కలవాడు యోగియని చెప్పబడుచున్నాడు - యోగమునందు సిద్ధిని పొందినవాడు).

  1. "శరీరస్థం ప్రాణమగ్నినా సహ యోగాభ్యాసేన సమం న్యూనం వా యః కరోతి స యోగి పుంగవో భవతి". (శాండిల్యోపనిషత్)

(తన శరీరములోనున్న ప్రాణమును యోగాభ్యాసమువలన కలుగు అగ్నితో సమమైనదిగా, దానికంటె హెచ్చు అయినదిగా చేయువాడు యోగిపుంగవుడు).

  1. "వృత్తికల్పనే జాగరూకస్సన్ భగవాన్ వర్తతే ఇతి మత్వా హింసాది రాహిత్యేన వృత్తిం కుర్వన్ యదృచ్ఛయా సంప్రాప్త ద్రవ్యేణ తుష్టస్సన్, యత్ర కుత్రవా వసన్, రజస్తమోగుణైః అలిప్తస్సన్ యోగీ సర్వదా ఆత్మానుసంధానం కుర్వన్ స్థాతవ్యః."

(భగవంతుడనువాడున్నాడు అని కర్మలు చేయుటలో జాగ్రత్తకలవాడై హింస కలిగింపక కర్మ చేయుచు, అయాచితముగా దానంతట వచ్చిన ద్రవ్యముతో, సంతుష్టి పొందుచు, ఎక్కడనైనను ఒకచోట నివసించుచు, రజస్తమోగుణములంటనివాడై ఎల్లపుడు అత్మానుసంధానము చేయుచుండువాడు యోగి.)

  1. "సర్వాపహ్నవసిద్ధ నిష్ఫ్రతి యోగిక బ్రహ్మమాత్ర పర్యసానతయా మనో యుం జంత ఇతి యోగినః, సమ్యక్ జ్ఞానినః"

(అన్ని విధములైన ఉపాధులచే కప్పబడకయుండు కేవల పరబ్రహ్మవలె మిగిలియుండునట్లు మనస్సును వశములో నుంచువారు యోగులు - సమ్యక్ జ్ఞానలు; బ్రహ్మజ్ఞానలు.)

  1. "యో (అ)oతస్సుఖో (అ)oతరారామ స్తధాంతర్జ్యోతి రేవ యః |

స యోగీ బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతో (అ)ధిగచ్చతి ||". (శ్రీమద్భగవద్గీత - 5 - 24)

"ఆత్మన్యం తః సుఖం యస్య కీడా యస్యాంతరాత్మని |

యస్యాత్మన్యేవ విజ్ఞానం న బాహ్యేంద్రియై ర్జడే |

వైషయికం సుఖం తస్య సాధనం తన్మతిస్తథా |

ఏ తత్త్రయం పరిత్యక్తం యస్య స్వాభావికం మలం |

- - - స సమాహిత ధీర్బ్రహ్మ సచ్చిదానందమవ్యయం |

అధ్యస్త ద్వైతశూన్యత్వా న్నిర్వాణ మగతాగతం |

అవిద్యా వృత్తిభేదేన ప్రాప్తం ప్రప్నోతి తద్వపుః ||". (గీతాభావప్రకాశము - 5 - 206 to 210)

(ఆత్మయందే - ఆత్మధ్యానమునందే అంతఃసుఖమును - మనసులో సుఖముననుభవించువాడు, ఆత్మయందే క్రీడగలవాడు, అనగా బాహ్యేంద్రియములవలన విషయములకు సంబంధించిన సుఖముకాక ఆత్మ విషయికమైన సుఖము గలవాడు, సమాహితమైన మనస్సు గలవాడు యోగి. అత్తి యోగి బ్రహ్మభూతుడై బ్రహ్మనిర్వాణమును పొందును -)

  1. “అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః |

స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిః నచాక్రియః |

యం సన్యాసమితి ప్రాహుర్యోగం తం విద్ధి పాండవ |

నహ్య నన్యస్త సంకల్పో యోగోభవతి కశ్చన ||

యధా హి నేంద్రియార్థేషు నకర్మ స్వనుషజ్జతే |

సర్వ సంకల్ప సన్యాసీ యోగారూఢస్తదోచ్యతే ||" (శ్రీమద్భగవద్గీత - 6 - 1, 2, 4)

"ఫలాభిలాష సంత్యాగీ విష్ణ్వారాధన తత్పరః |

స సన్యాసీ ఫలత్యాగా ద్యోగీ చిత్తసమాధితః |

న నిరగ్నిరనేనోక్తః సన్యాసీ కర్మవర్జితః |

అక్రియశ్చిత్త సం రోదాద్యోగీత్యత్ర వివేచనం |

యద్యపీ దృఙ్మ కర్మ్యస్తి తథాపి స్తూయతే తథా |

కామనా త్యాగసామ్యేన సన్యాసీ త్యాది శబ్దతః ||

యం కర్మ తత్ఫలత్యాగం ప్రాహుః సన్యాసమా గమాః |

ఫలాభిలాష కర్తృత్వాభిమాన త్యాగ యోగతః |

యోగం తం విద్ధి తత్ప్రాప్తౌ సాధనత్వస్య సామ్యతః |

- - - నాత్యక్త ఫల సంకల్పో యోగీ భవతి కశ్చన |

- - - యస్మింశ్చిత్త సమాధాన కాలే కర్మసు తత్ఫలే |

తస్మాద్ధ్యాతృ ధియా కర్త్రభోక్తృ ధియా తథా |

అహం కర్తస్య భోగ్యం తత్ఫలం మేచేతి రంజనాం |

న కరోతి పరిత్యక్త సర్వకామతయా మునిః |

ఇహా ముత్రార్థ కామానాం హేతూనాధ్యాసి కాన్యతః |

సంత్యుక్తం శీలమస్యాసౌప్రాప్తయోగస్త దోచ్యతే ||". (గీతాభావప్రకాశము - 6 - 9 to12, 13, 14, 20 to 22)

(కర్మఫలము నపేక్షించక భగవంతుని భక్తితో ఆరాధించుటయందు తత్పరుడై యుండునో అట్టివాడు కర్మఫలమును వదలివేయుటవలన (న్యాసము చేయుటవలన) సన్యాసియని, చిత్త సమాధానము కలిగియుండుటచేత యోగియనియు చెప్పబడును - అగ్నిహోత్రముద్వారా చేయుకర్మలను విడిచిపెట్టినవాడు నిరగ్నికాడు, మిగిలిన నిత్యనైమిత్తిక కర్మలను విడిచిపెట్టు సన్యాసియును కాడు.)(కర్మఫలమును విడిచివేసినందువలన యే కర్మను ఆగమములు సన్యాసమని చెప్పుచున్నవో దానినే ఫలమందభిలాష లేకపోవుటచేత, ఆ కర్మయందు కర్తృత్వాభిమానము (తానే కర్తను అను అభిమానము) లేకపోవుటవలన అదియే యోగము. ఆ రెండింటిని సాధించుటలో సామ్యము కలిగియుండుటవలన సన్యాసమే యోగము. సంకల్పము (కర్మఫలమందు కోరిక) వదలనివాడు ఎవడు కూడా యోగికాలేడు. తాను చేయుకర్మలందు చిత్తమును సమాధాన పఱచుకొనినపుడు ఈ కర్మలు మిధ్యలు, వీటికి కర్త ఆత్మ - నేను కాను - అను బుద్ధితో నేను ఈ కర్మకు కర్మను, దీని ఫలము నాకు అగుగాక యను అభిలాషను అన్ని కోరికలను విడిచి చేయుటచేత, పొందడో, ఈ లోకములోను, పరలోకములోను కలుగు కర్మఫలములు అధ్యాసికములు అని తలచి వాటిని వదలివేయు శీలముగల ముని యగువాడు (సాంతముగ యోగము నవలంభించువాడు - యోగారూఢుడు - యోగిపదమును ఆరోహించినవాడు - యెక్కినవాడు.)

  1. "కా యేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి |

యోగినః కర్మకుర్వంతి సంగం త్యక్త్వాత్మ శుద్ధయే ||". (శ్రీమద్భగవద్గీత - 5 - 11)

"త్యక్త్వా ఫలాభిలాషం తు కర్మ కుర్వంతి కర్మిణః |

చిత్త శుద్ధ్యైధియా చైవ కా యేన మనసేంద్రియైః |

కేవలైరితి సర్వేషాం కాయాదీనాం విశేషణం |

ఈశ్వరార్థం కరోమీదం నైతన్మమ ఫలాయచ |

స్వామ్యర్థం భృత్య ఇవచ మమతా బలవర్జితైః ||” (గీతాభావప్రకాశము - 5 - 86, 87)

(చేయు కర్మలవలన కలుగు ఫలమందాసక్తివదలి శరీరముతోటి, మనసుతోటి, ఇంద్రియములతోటి యోగులు - కర్మయోగము చేయువారు - చిత్తశుద్ధి కొఱకు కర్మలు చేయుదురు - ఈ కర్మను నేను ఈశ్వరునికొఱకు (భగవంతునికొఱకు) చేయుచున్నాను - నాకు ఈ కర్మఫలము దక్కవలెనని కాదు. యజమాని గుఱించి సేవకుడు చేయునట్లు - నాదియను మమకారము దానియందు లేనట్లు చేయుదురు.)

  1. "అజిహ్వ షండకః పంగురంధో బధిర ఏవచ |

ముగ్ధశ్చ ముచ్యతే యోగీ షడ్భిరేతైర్న సంశయః ||".

(జిహ్వ చాపల్యము లేనివాడు - ఇది మృష్టాన్నము, ఇదికాదు అను విచక్షణసేయక ఆహారము తీసుకొనువాడున్నూ, చిన్నపిల్లయందును, పదహారేండ్ల వయస్సులోనుండు స్త్రీయందును, ముసలి స్త్రీయందును, ఒకేరీతిగా వికారము లేకుండువాడును, కాలకృత్యములు తీర్చుకొనుటకును భోజనము చేయుటకును తప్ప దూరము సంచరించుకుండువాడును, ఏ పని చేయుచున్నను దృష్టి దూరముగా పోనీక యుండువాడును, హితమైన వాక్కును వినుచు, మనోహరమైనదే వినుచువినకయుండువాడువలెనుండువాడును, విషయములు తనకు తటస్థపడినను వాటి పైకి మనస్సును పోనీయకయుండువాడును - ఇట్టి గుణములుగలవాడు యోగి - అట్టి యోగి ముక్తుడగును).

  1. "ఏతస్యాః బుద్ధేర్జన్మనః ప్రాగాత్మనో దేహాది వ్యతిరిక్తత్వ కర్తృత్వ భోక్తృత్వాద్యపేక్షఓ ధర్మాధర్మ వివేక పూర్వకో మోక్షసాధనానుష్ఠాన లక్షణో యోగః, తద్విషయా బుద్ధిర్యోగ బుద్ధిః. సా యేషాం కర్మణా ముచితా భవతి తే యోగినః " (శ్రీశంకరః)

(ముందటి జన్మలో ఆత్మకంటె దేహము మొదలగునవి వ్యతిరేకమైనవి అనిన్నీ, పుణ్యపాపవిచక్షణగలదిన్నీ, మోక్షమునకు సాధనమైన లక్షణము కలదిన్నీ యోగము, ఆ యోగము విషయముగాగలది యోగబుద్ధి. అది కర్మిష్టులకు కలిగిన వారు యోగము)

  1. "కామక్రోధ లోభ మోహ మదమత్సరంబులను నరిషడ్వర్గంబుల జయించి జరామరణవిరహితంబుగా వాయువశంబు చేసి గాత్ర పవిత్రంబు కొఱకు షట్కర్మనిరతుండయి పురనగర గ్రామంబులు పరిత్యజించి, పర్వతారణ్యంబుల సంచరించుచు, శరీర ధారణార్థంబు నియతస్వల్ప భోజనుండై, ఖేద మోదంబులు సరియకా భావించి, లోభమోహంబులు వర్జించి, నిర్జితేంద్రియుండయి, నన్నె కాని యొండెఱుంగక యాత్మనిష్టచే బవిత్రాంతఃకరణుండైన యోగినాయందు గలయు".

(శ్రీమదాంధ్రమహాభాగవతము - 11 - 99)

  1. "యథారవిస్సర్వ రసాన్ ప్రభుంక్తే హుతాశనశ్చాపి హి సర్వభక్షకః |

తధైవ యోగీ విషయాన్ ప్రభుంక్తే న లిప్యతే కర్మశుభా శుభైశ్చ ||".

(సూర్యుడు సర్వరసములను భుజించునట్లే, అగ్ని తనలో హుతమైన వాటినన్నింటినీ భుజించునట్లే యోగుయగువాడు విషయములను భుజించినను (అనుభవించినను) ఆ కర్మలవలన కలుగు పాపపుణ్యములు అతనిని అంటవు.)

  1. “కృత్వా మహాపాతక కోటి కోటి హత్వా చ భూతాని పృథగ్విధాని |

దగ్థ్వా సమస్తం స చరాచరం తన్నలిప్యతే జ్ఞానబలేన యోగీ ||".

(కోట్లకొలది మహాపాపములను చేసినను, భూతముల ననేకవిధములగా చంపినను - హింసించినను, ఈ చరాచరజగత్తు నంతటిని మంటకలిపినను యోగి యగువానికి ఆ కర్మఫలములంటవు.)

  1. "యతంతో యోగినశ్చైవం పశ్యంత్యాత్మన్యవ స్థితం |

యతంతోప్యకృతాత్మానో నైవం పశ్యంత్య చేతసః ||". (శ్రీమద్భగవద్గీత - 15 - 11)

(శరీరము నాశ్రయించి యున్నపుడు - త్రిగుణములతో కలిసియున్నపుడు భోక్తగా నుండువాడును అగు జీవుని (తనలోనున్న భగవదంశను) మూఢులు (ఆత్మజ్ఞానము లేనివారు) కనుగొనలేరు. బ్రహ్మజ్ఞానులు దానిని చూచెదరు. ఈ జీవుని (జీవాత్మను) సమాహితచిత్తముగల యోగులు తమలోనే (బుద్ధియందు) చూచెదరు. యోగులు కానివారు వారిలో జీవాత్మరూపములోనున్న పరమాత్మను చూడలేరు - భోజరాజు చరిత్రలో - కవులు కొందఱు భగవంతుడైన విశ్వనాధుని చూచుటకు రాజు కాశీకి పంపగా పోయిరి. కాళిదాసు తనలో భగవంతుడుండుటచేత తాను వెళ్ళలేదు - అని భోజరాజుతో చెప్పెను.

"సదా భోగభాజాం సమారే విభాతం |

ముదా యోగభాజామదూరే విభాతం |

చిదానందకందం సదా రాఘవేశం |

విదేహాత్మజనంద కందం ప్రపద్యే ||". (శ్రీరామకర్ణామృతం - 4 - 107)

"మ. తత భోగాను విహార చిత్తులకు బొందన్ దూరమై భక్తిసం

యుత యోగీంద్రులకెల్ల దాసగుచు వేద్యుండై చిదానందుడై

క్షితిపుత్రీ హృదయ ప్రమోదకరుడై చెల్వొందు శ్రీరామునిన్

సతతంబున్ శరణంబు వేడెదను మోక్షశ్రీరమా కాంక్షినై ".

  1. "యథా దీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృతా |

యోగినో యతచిత్తస్య యుంజతో యోగమాత్మనః" (శ్రీమద్భగవద్గీత - 6 - 19)

"యథాదీపః వాతవర్జితే స్థానే స్థితః న చలతి, తథా యోగినః యత చిత్తస్య సం యత అంతఃకరణస్య - యోగం అనుతిష్టతః - యోగజ్ఞైః - చిత్తప్రచార దర్శభిః, యోగం ఉపమా స్మృతా, చింతితః" (శ్రీశంకరః)

(గాలి విస్తారముగాలేని చోట దీపము కదలకుండ నెట్లుండునో సం యత అంతఃకరణముగల యోగి యట్లే యుండును అని యోగమును గుఱించి తెలిసినవారు - చిత్తవృత్తి గుఱించి తెలిసినవారు - ఉపమానముగా చెప్పుదురు).

"నివాతస్థతయా నిశ్చల స ప్రభాదీపవత్ నివృత్త రస కలేతర మనోవృత్తితయా నిశ్చలో జ్ఞానప్రభో ఆత్మా తిష్టతి ఇత్యర్థః"

(శ్రీమాన్ రామానుజః)

(గాలి లేనిచోట కదలక కాంతినిచ్చు దీపమువలె ఇతర మనోవృత్తి లేకుండుటచే నిశ్చలమైన జ్ఞానకాంతి గలవాడై యోగియుండును).

  1. "తపస్విభ్యో అధికో యోగీ జ్ఞానిభ్యోపి మతో(అ)ధికః |

కర్మిభ్యశ్చాథికో యోగీ తస్మాద్యోగీ భవార్జున ||"

“యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా |

శ్రద్ధవాన్ భజతే యో మాం సమేయుక్తతమో మతః ||" (శ్రీమద్భగవద్గీత - 6 - 46, 47)

(భవగవాన్ శ్రీమద్భగవద్గీత యాం సర్వ విధేషు యోగిషు ఏతైర్యుపర్యుక్తైర్లక్షణైః యుక్తః భక్తి యోగిన మేవ సర్వోత్తమ మకథయత్ | తపస్విభ్యః శాస్త్రజ్ఞానిభ్యః సకామ కర్మభ్యశ్చ యోగీ శ్రేష్టో అస్తి పరంతు సంపూర్ణయోగిష్టపి స భక్తియోగీ మమమతే పరమః. శ్రేష్టోస్తి యో మయి శ్రద్ధావానస్తి తథా మద్గతేనాంతరాత్మనా నిరంతరం మాం భజతి)

(తపస్వికంటె, జ్ఞానులకంటె, కర్మిష్టులకంటె, యోగియగువాడు - చిత్త సమాధానముకలయోగి అధికుడు. అందుచేత నీవు యోగి యగుము - పైన చెప్పినవారిలో ఒకరికంటె ఒకరు అధికులు - తపస్విలుకంటె జ్ఞానయోగులు అధికులు, జ్ఞనయోగులకంటె యోగులు అధికులు - అనగా భక్తి యోగులు అందఱికంటె అధికులు - ఈ భక్తియోగులలో మనస్సులో నన్నే (భగవంతునే) శ్రద్ధకలిగి నిరంతరం ధ్యానించువాడు ఉత్తముడు. చాంద్రాయణము మొదలగు వ్రతములు చేయు తపోయోగులకంటె, కర్మఫలమందు కోరికగల జ్యోతిష్టోమాది కర్మలు చేయు యోగులకంటె, జ్ఞానయోగులకంటె - జ్ఞానమునకు సాధనమైన చిత్తసమాధానముగల యోగులు అధికులు).

"శ్రద్ధా ధి క్యోదయా వధి యోగీ సంస్తూయతే (అ)దునా |

తపః కృచ్చ్రోపవాసాది తత్సర్వేభ్యోపి యోగ్యసౌ |

ఉత్కృష్టో బ్రహ్మవిద్ జ్ఞానీ నిర్వృత్తికమనా యతః |

జ్యోతిష్టో మాది కర్మానుష్ఠాయిభ్యశ్చా ధిక్యో మతః |

మోక్షానర్హతయా జ్ఞాత్వా త్కర్మణాం చ తపస్వినాం |

పరోక్ష జ్ఞానవిద్భ్యో ప్యపరోక్ష జ్ఞాని నో వరాః |

తేభ్యో (అ)ప్యేవం మనోనాశ వాసనా క్షయ సం యుతః |

జీవన్ముక్తో మునిర్యోగీ శ్రేష్టః సర్వోత్తమో యతః"

"యోగినాం వసు రుద్రావిభక్తానాం ఛేదచేతసాం |

సర్వేషామపి మధ్యేయో వాసుదేవే మయీశ్వరే |

పుణ్య పుంజోదయాత్ప్రేమ్ణా నివిష్టే నాంతరాత్మనా |

ప్రగ్భవార్జిత సంస్కార పాటవాత్ సాధు సంగమాత్ |

శ్రద్ధ దానః సదాభూతత్వాచింత యత్యాదరాచ్చ మాం |

సగుణం నిర్గుణం వాపి నారాయణమధీశ్వరం |

అనన్యభక్త్యాపరయా స మద్భక్తోహ్య నన్యధీః |

సర్వేభోయుక్త చిత్తేభ్యో శ్రేష్టో నిత్య సమాహితః |

సర్వజ్ఞస్య మమాత్యంత నిశ్చితో నాత్రసంశయః |

యోగాభ్యాస శ్రమే తుల్యే సమానే భజనశ్రమే |

మద్భక్తాస్యైవ ముఖ్యత్వం మత్పరాఙ్ముఖ యోగినః ||". (గీతాభావప్రకాశము - 6 - 242 to 253)

(భగవంతునియందు అధిక శ్రద్ధకలిగి యుండుటవలన యోగియగువాడు తపస్విలకంటె, జ్ఞానులకంటె అధికుడని భగవంతుడగు శ్రీకృష్ణుడు కొనియాడెను - బహు కష్టమైన ఉపవాసము మొదలగు తపస్సులను చేయువారికంటె మనోవృత్తులులేనివాడగు బ్రహ్మజ్ఞాని అధికుడు. జ్యోతిష్టోమాది కర్మలు చేయువారు జ్ఞానము లేనివారుకనుక వారికంటె జ్ఞానులు - జ్ఞానయోగులు - అధికులు. జ్ఞానులకు పరోక్షజ్ఞానము కలుగును. వారికంటె అపరోక్షజ్ఞానము గలవారు అధికులు. వారికంటె మనోనాశము, వాసనా క్షయముగల జీవన్ముక్తుడగు యోగి అధికుడు.)

(యోగులందఱికన్న భగవద్భక్తుడగువాడు - భక్తియోగి - అధికుడు అని శ్రీకృష్ణభగవానుని ఆశయము - వేఱువేఱు మనసులు, అభిప్రాయములుగల వసువులు రుద్రులు మొదలగు యోగులందఱికంటె వాసుదేవుడనగు నాయందు (భగవంతునియందు) పూర్వపుణ్యమువలన కలిగిన సత్సంగమువలన శ్రద్ధతో నారాయణుడైన నన్ను సగుణరూపునిగానైనను, నిర్గుణరూపునిగానైనను గొప్ప అనన్యభక్తిచేత ఇతరమంది మనస్సులేనివాడై చింతించువాడు నాభక్తుడు నిత్యము, సమాహితమైన మనస్సుగలవాడు, ఇతర యోగులందఱికంటెను శ్రేష్టుడు. సర్వము తెలిసినా నిర్ణయమిది - ఇందులో సంశయములేదు - యోగాభ్యాసములో యోగులందఱికి శ్రమము సమానమే అయినను, నా భక్తులుకాని యోగులకంటె నా భక్తులైన యోగులు ముఖ్యులు - నా భక్తులైయుండుటే వీరి ఆధిక్యమునకు కారణము).

  1. "సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వానశేషతః |

మనసైవేంద్రియగ్రామం వినియమ్య సమంతతః |

శనైశ్శనైరు పరమేద్బుద్ధ్యా ధృతిగృహీతయా |

ఆత్మ సంస్థం మనః కృత్వా న కించిదపి చింతయత్ |

యతో యతో నిశ్చరతి మనశ్చంచల మస్థిరం |

తతస్తతో నియమ్యైతదాత్మన్యేవ వశం నయేత్ |

ప్రశాంతమనసం హ్యేనం యోగినం సుఖముత్తమం |

ఉపైతి శాంతరజసం బ్రహ్మభూత వకల్మషం |

యుంజన్నేవం సదాత్మానం యోగీ విగతకల్మషః |

సుఖేన బ్రహ్మ సంస్పర్శ మత్యంతం సుఖమశ్నుతే ||". (శ్రీమద్భగవద్గీత - 6 - 24 to 28)

"ఇదం మే స్యాదిదం మే స్యాదితి సంకల్ప జానిమాన్ |

శోభనాధ్యాసజాన్ కామాన్ దుష్టేష్విషయేష్వపి |

శోభనాధ్యాసజాన్ కామాన్ దుష్టేష్విషయేష్వపి |

త్యక్త్వా భోగాభిలాషాఖ్యాన్ దోషదృష్ట్యాప్య శేషతః |

సర్వాన్దృహిణి లోకాం తాన్వాసనా నహితాన్మునిః |

ప్రత్యాహృత్యేంద్రియ గ్రామం విషయేభ్యా సమంతతః |

కామాపాయే విశేషేణ యుక్తా యా ధీస్తయా మనః |

ఆత్మన్యేవసమాప్తిర్హి యస్య తద్బ్రహ్మ గోచరం |

కృత్వా విచింతయే నాన్యద్గతి మన్యాం నవాశ్రయేత్ |

ఆత్మైవాస్త్యఖిలం నాన్యద్గతి మన్యం నిశ్చిత్య వా మునిః |

నాన్యద్వి చింతయే త్కించిద్యోగస్యాయం పరో(అ)వధిః ||.”

"ఏవం కుర్వన్ సమాదితం యోగీ చిత్త నిరోధనం |

చిత్తవిక్షేప హేతూనాం శబ్దాదీనాం చ మధ్యతః |

యస్మాద్యస్మాద్యస్మా న్నిమిత్తాత్తచ్ఛబ్దా దేశ్చం చలం మనః |

అనాద్యవిద్య యాధ్యాసా ద్విక్షిప్తం సద్బహిర్వజ్రేత్ |

తతస్తతో (అ)పి విక్షేప నిమిత్తాత్తన్మనో మునిః |

కృత్వా నిర్వృత్తికం ప్రత్యగాత్మన్యేవా ద్వయే సుఖే |

స్వప్రకాశపరానందఘనే తత్వే వశం నయేత్ |

సమస్త దుఃఖ సీమేయం యన్మనోదృశ్య గోచరం |

సమస్త సుఖ సీమేయం యన్మనో బ్రహ్మగోచరం |

విచార్యైనం థియా విద్వాన్వేదాంతాచార్య వాక్కతః |

భోగానుత్సృజ్య తద్ధేతూన్కామాం స్త్యక్త్వా శ్రయేద్ధరిం |

యత్రయత్ర మనోగచ్చేచ్ఛ బ్దాదౌ భోగగోచరే |

తంతం విచార్య విషయం సవైరాగ్యాద్వివేకతః |

అభాసీకృత్య దోషాణామాకరత్వాదసక్తతిః |

తత ఆకృష్య పరమానంద రూపే చిదాత్మని స్థాపయేదితి తాత్పర్య శ్రీమద్భగవతోహరేః ||.”

"యోగాభ్యాస బలాదేవం యోగినశ్చిత్త మాత్మని |

ప్రగామ్యతి తతో(అ)త్యంతం శాంతం నిర్వత్తికః స్థిరం |

మనోయస్య తధా శాంత రజో విక్షేపకం మలం |

కల్మషం లయహేతుర్యత్తమో యస్య నవిద్యతే |

ధర్మాధర్మాదిరూపం వా కల్మషం నో భవప్రదం |

యస్య తం బ్రహ్మవస్త్వేవ సర్వమస్తీతి వేదినం |

సమ్యక్ జ్ఞాతే పరే తత్వే క్షీణే మోహమయే మలే |

బ్రహ్మభూతం మునిం శాంతముపైతి సుఖముత్తమం |

దృశ్యం నాస్తి పరం బ్రహ్మైవాస్తి సర్వం నిరంతరం |

ఇతి నిశ్చయవంతం తంసుఖం సముపగచ్ఛతి |

అభావే చిత్త తద్వృత్త్యోః సుషుప్తే చిత్సుఖం పరం |

స్వయ మావిర్భవేత్యేవం హి శబ్దోద్యోత యత్యయం ||".

"స్ఫుటీ కరోతి భగవాన్ యోగినం సుఖమీరితం |

మనసైవేంద్రియ గ్రామ మిత్యాద్యుక్త క్రమేణయః |

యోగేన నిత్య సంబంధీ మనో నిత్యం సమాధధిత్ |

సంసారహేతు ధర్మాది మల శూన్యో(అ)తి నిర్మలః |

అనాయాసేన మద్భక్త్యా యోగప్రత్యూహ వర్జితం |

సుఖం బ్రహ్మస్వరూపం యదపరిచ్చిన్న మాంతరం |

లయ విక్షేప శూన్యత్వాత్ తద్వ్యాప్నోతి నిరంతరం |

స్వయం బ్రహ్మసుఖం యోగీ భూతవా తిష్టతి నిశ్చలః ||.” (గీతాభావప్రకాశము - 6 - 113 to 136)

(దుష్టమైన విషయములందు "ఇది నాది అయిన బాగుండును, ఇది నాకు కావలెను" అను సంకల్పమువలన కలుగు భోగానుభవముగుఱించి కలుగు కోరికలను - బ్రహ్మలోకము పొందుటవరకు గల కోరికలను - అన్నింటిని వాటివాటి వాసనలతో సహా విడిచిపెట్టి, విషయములన్నింటినుండి ఇంద్రిలములను అరికట్టి, మనస్సును ఆత్మయందే నిలిపి, బ్రహ్మసాక్షాత్కారము పొందునట్లుగా చేసి, "అంతా ఆత్మయే, ఆత్మకానిది ఇంకొకటి లేదు - ఇంకొకగతి లేదు, ఆత్మతత్వ యింకొకటి ఆశ్రయము లేదు - ఇంకొక గతి లేదు" అని నిశ్చయించి యోగి యగువాడు ఇంకొకదానిని గుఱించి ఆలోచించకూడదు - ఇదియే యోగమునకు పరమావధి)

(ఈ ప్రకారముగా చిత్తవిక్షేపమునకు కారణమైన శబ్దము మొదలగు ఇంద్రియములనుండి నిత్తమును నిరోధించుట యను సమాధిలో నుండి, అనాదియగు అవిద్యవలన ఏ విషయముల కారణముగా మనస్సు బ్రహ్మధ్యానమునందుండక చంచలమగుచున్నదో ఆయా వాటిని బైటకు విడిచిపెట్టవలెను - మనస్సును దాని వృత్తులందు పోనీయకుండునట్లు చేసి, అద్వయుడు, ప్రత్యగాత్మ, స్వయంప్రకాశుడు, పరానందఘనుడు అయిన బ్రహ్మమునందుండునట్లు, తనవశములోనుండునట్లు చేసుకొనవలెను. మనస్సునకు గోచరమగు ఈ సమస్త ప్రపంచము అన్ని విధముల దుఃఖములకు స్థానము అనిన్నీ, మనస్సునకు గోచరమైన బ్రహ్మము అన్ని విధములైన సుఖములకు సీమ అనియు, ఉపనిషద్వాక్యములద్వారా విచారించి తెలుసుకొని భోగములను, వాటికి కారణములైన కోరికలను వదలివేసి, హరిని - భగవంతుని ఆశ్రయించవలెను - ఏ యే శబ్దాదులగు భోగముల విషయమై మనస్సు పోవుచుండునో వాటిని కనిపెట్టి, వైరాగ్యముచేత, వివేకముచేత వాటిని దోషయుక్తములని, అసత్యములని వదలివేసి, పరమానందరూపమగు చిదాత్మయందు మనసును నిలుపవలయును -(ఈ ప్రకారముగా చేయు యోగాభ్యాస బలముచేత, యోగుల చిత్తము ఆత్మయందు వృత్తిరహితమైనటువంటిన్నీ, స్థిరమైనటువంటిన్నీ శాంతిని పొందును. రజోగుణ విక్షేపకమైన మలము, లయహేతువైన తమోగుణము లేనిది, ధర్మాధర్మాది రూపమై జన్మకారణమైన కల్మషం లేనిది అయిన పరబ్రహ్మమే ఉన్నది అని తెలుసుకొను స్థితిని పొందును. బ్రహ్మతత్వమును తెలుసుకొనగా, మోహము క్షీణించగా, అటువంటి యోగిని ఉత్తమసుఖమైన శాంతి (మోక్షము) దానంతట అదే చెందును. ఈ కనబడు ప్రపంచమనునదే లేదు, ఉన్నదంతయు పరబ్రహ్మమే యని నిశ్చయమైన మనస్సు నిరంతరము కలిగియుండు యోగికి అట్టి సుఖము కలుగును. సుషుప్తిలో చిత్తము దాని వృత్తులు లేనప్పుడు పరమసుఖమనునది తనంతట అదే పొందును).

Transliteration
  1. yōgābhyāsa tatparaḥ.

(yōgābhyāsamu cēyuṭalō tatparuḍainavāḍu, dāniyaṃdē niṣṭa kaligiyuṃḍuvāḍu).

  1. yōgānuṣṭātā - yōgaṃ anatiṣṭati iti yōgī.

(yōgamu nanuṣṭiṃcuvāḍu)

  1. samāhita cittaḥ. (śrīśaṃkaraḥ)

(samāhitamaina cittamu kalavāḍu)

  1. śravaṇādau samāhita cittaḥ

(śravaṇamu, mananamu modalaguvāṭiyaṃdu samāhitamaina cittamukalavāḍu).

  1. adhyātmavēdi.

(adhyātmamunu telisinavāḍu - ātma tatvamunu telisinavāḍu)

  1. brahmavidyāvān ityarthaḥ. (brahmajñānamu kalavāḍu)

  2. cittavṛtti nirōdha parāyaṇaḥ

(cittavṛttini arikaṭṭuṭalō āsakti kalavāḍu - tanmayuḍai yuṃḍuvāḍu).

  1. mumukṣuḥ((mōkṣamunu kōruvāḍu)

  2. yana niyamāsanā dyaṣṭāṃga yōgayuktaḥ.

(yamamu, niyamamu, āsanamu, prāṇāyāmamu modalagu aṣṭāṃgamulu gala yōgamu nanuṣṭiṃcuvāḍu).

  1. kālatrayajñānī, atīṃdriya vastu jñānavān ityarthaḥ.

(bhūtabhaviṣyadvartamānamulanu mūḍukālamulaṃdu jaruguvāṭiguṟiṃcina jñānamu kalavāḍu. iṃdriyamula śaktiki miṃcina vastuvulaguṟiṃcina jñānamu kalavāḍu).

  1. paramārtha tatvajñaḥ - dhyānaniṣṭaḥ.

(paramārtha tatvamunu - brahmatatvamunu telisinavāḍu)

  1. yōgārūḍhaḥ. (yōgamunu pūrtigā abhyasiṃcinavāḍu)

  2. vaśī

(śarīramunu, iṃdriyamulanu, manassunu tana vaśamulō nuṃcukoninavāḍu - iṃdriyajayamu kalavāḍu).

  1. "yōgōjñānaṃ - tēnaiva gamyatvāt yōgī, yōgaḥ samādhiḥ, sahisvātmani sarvadā samādhattē svātmānaṃ tēnavā yōgī". (śrīśaṃkaraḥ)

(yōgamanagā jñānamu - brahmajñānamu; jñānayōgamu. jñānamucētanē poṃdataginadi yōgamu. yōgamanagā samādhi).

  1. “jñānaprāptyupāyatvēna īśvarē samarpya karmāṇi ātmanaḥ phalaṃ anabhisaṃdāya anu tiṣṭati yaḥ saḥ yōgī". (śrīśaṃkaraḥ)

(brahmajñānamu saṃpādiṃcuṭaku upāyamaguṭacēta karmalanu bhagavaṃtuniki samarpiṃci tanaku ā karmala phalamunāśiṃcaka yuṃḍuvāḍu)

  1. svarṇē lōṣṭē gṛhē (a)raṇyē susnigdhē caṃdanē tathā |

samatā bhāvanā yasya sayōgī parikīrtitaḥ ||.

(baṃgāramunaṃdu, maṭṭibeḍḍayaṃdu, iṃṭiyaṃdu, aḍaviyaṃdu, caṃdanamaṃdu samānamaina bhāvamu kalavāḍu yōgiyani ceppabaḍucunnāḍu - yōgamunaṃdu siddhini poṃdinavāḍu).

  1. "śarīrasthaṃ prāṇamagninā saha yōgābhyāsēna samaṃ nyūnaṃ vā yaḥ karōti sa yōgi puṃgavō bhavati". (śāṃḍilyōpaniṣat)

(tana śarīramulōnunna prāṇamunu yōgābhyāsamuvalana kalugu agnitō samamainadigā, dānikaṃṭe heccu ayinadigā cēyuvāḍu yōgipuṃgavuḍu).

  1. "vṛttikalpanē jāgarūkassan bhagavān vartatē iti matvā hiṃsādi rāhityēna vṛttiṃ kurvan yadṛcchayā saṃprāpta dravyēṇa tuṣṭassan, yatra kutravā vasan, rajastamōguṇaiḥ aliptassan yōgī sarvadā ātmānusaṃdhānaṃ kurvan sthātavyaḥ."

(bhagavaṃtuḍanuvāḍunnāḍu ani karmalu cēyuṭalō jāgrattakalavāḍai hiṃsa kaligiṃpaka karma cēyucu, ayācitamugā dānaṃtaṭa vaccina dravyamutō, saṃtuṣṭi poṃducu, ekkaḍanainanu okacōṭa nivasiṃcucu, rajastamōguṇamulaṃṭanivāḍai ellapuḍu atmānusaṃdhānamu cēyucuṃḍuvāḍu yōgi.)

  1. "sarvāpahnavasiddha niṣphrati yōgika brahmamātra paryasānatayā manō yuṃ jaṃta iti yōginaḥ, samyak jñāninaḥ"

(anni vidhamulaina upādhulacē kappabaḍakayuṃḍu kēvala parabrahmavale migiliyuṃḍunaṭlu manassunu vaśamulō nuṃcuvāru yōgulu - samyak jñānalu; brahmajñānalu.)

  1. "yō (a)otassukhō (a)otarārāma stadhāṃtarjyōti rēva yaḥ |

sa yōgī brahma nirvāṇaṃ brahmabhūtō (a)dhigaccati ||". (śrīmadbhagavadgīta - 5 - 24)

"ātmanyaṃ taḥ sukhaṃ yasya kīḍā yasyāṃtarātmani |

yasyātmanyēva vijñānaṃ na bāhyēṃdriyai rjaḍē |

vaiṣayikaṃ sukhaṃ tasya sādhanaṃ tanmatistathā |

ē tattrayaṃ parityaktaṃ yasya svābhāvikaṃ malaṃ |

- - - sa samāhita dhīrbrahma saccidānaṃdamavyayaṃ |

adhyasta dvaitaśūnyatvā nnirvāṇa magatāgataṃ |

avidyā vṛttibhēdēna prāptaṃ prapnōti tadvapuḥ ||". (gītābhāvaprakāśamu - 5 - 206 to 210)

(ātmayaṃdē - ātmadhyānamunaṃdē aṃtaḥsukhamunu - manasulō sukhamunanubhaviṃcuvāḍu, ātmayaṃdē krīḍagalavāḍu, anagā bāhyēṃdriyamulavalana viṣayamulaku saṃbaṃdhiṃcina sukhamukāka ātma viṣayikamaina sukhamu galavāḍu, samāhitamaina manassu galavāḍu yōgi. atti yōgi brahmabhūtuḍai brahmanirvāṇamunu poṃdunu -)

  1. “anāśritaḥ karmaphalaṃ kāryaṃ karma karōti yaḥ |

sa sanyāsī ca yōgī ca na niragniḥ nacākriyaḥ |

yaṃ sanyāsamiti prāhuryōgaṃ taṃ viddhi pāṃḍava |

nahya nanyasta saṃkalpō yōgōbhavati kaścana ||

yadhā hi nēṃdriyārthēṣu nakarma svanuṣajjatē |

sarva saṃkalpa sanyāsī yōgārūḍhastadōcyatē ||" (śrīmadbhagavadgīta - 6 - 1, 2, 4)

"phalābhilāṣa saṃtyāgī viṣṇvārādhana tatparaḥ |

sa sanyāsī phalatyāgā dyōgī cittasamādhitaḥ |

na niragniranēnōktaḥ sanyāsī karmavarjitaḥ |

akriyaścitta saṃ rōdādyōgītyatra vivēcanaṃ |

yadyapī dṛṅma karmyasti tathāpi stūyatē tathā |

kāmanā tyāgasāmyēna sanyāsī tyādi śabdataḥ ||

yaṃ karma tatphalatyāgaṃ prāhuḥ sanyāsamā gamāḥ |

phalābhilāṣa kartṛtvābhimāna tyāga yōgataḥ |

yōgaṃ taṃ viddhi tatprāptau sādhanatvasya sāmyataḥ |

- - - nātyakta phala saṃkalpō yōgī bhavati kaścana |

- - - yasmiṃścitta samādhāna kālē karmasu tatphalē |

tasmāddhyātṛ dhiyā kartrabhōktṛ dhiyā tathā |

ahaṃ kartasya bhōgyaṃ tatphalaṃ mēcēti raṃjanāṃ |

na karōti parityakta sarvakāmatayā muniḥ |

ihā mutrārtha kāmānāṃ hētūnādhyāsi kānyataḥ |

saṃtyuktaṃ śīlamasyāsauprāptayōgasta dōcyatē ||". (gītābhāvaprakāśamu - 6 - 9 to12, 13, 14, 20 to 22)

(karmaphalamu napēkṣiṃcaka bhagavaṃtuni bhaktitō ārādhiṃcuṭayaṃdu tatparuḍai yuṃḍunō aṭṭivāḍu karmaphalamunu vadalivēyuṭavalana (nyāsamu cēyuṭavalana) sanyāsiyani, citta samādhānamu kaligiyuṃḍuṭacēta yōgiyaniyu ceppabaḍunu - agnihōtramudvārā cēyukarmalanu viḍicipeṭṭinavāḍu niragnikāḍu, migilina nityanaimittika karmalanu viḍicipeṭṭu sanyāsiyunu kāḍu.)(karmaphalamunu viḍicivēsinaṃduvalana yē karmanu āgamamulu sanyāsamani ceppucunnavō dāninē phalamaṃdabhilāṣa lēkapōvuṭacēta, ā karmayaṃdu kartṛtvābhimānamu (tānē kartanu anu abhimānamu) lēkapōvuṭavalana adiyē yōgamu. ā reṃḍiṃṭini sādhiṃcuṭalō sāmyamu kaligiyuṃḍuṭavalana sanyāsamē yōgamu. saṃkalpamu (karmaphalamaṃdu kōrika) vadalanivāḍu evaḍu kūḍā yōgikālēḍu. tānu cēyukarmalaṃdu cittamunu samādhāna paṟacukoninapuḍu ī karmalu midhyalu, vīṭiki karta ātma - nēnu kānu - anu buddhitō nēnu ī karmaku karmanu, dīni phalamu nāku agugāka yanu abhilāṣanu anni kōrikalanu viḍici cēyuṭacēta, poṃdaḍō, ī lōkamulōnu, paralōkamulōnu kalugu karmaphalamulu adhyāsikamulu ani talaci vāṭini vadalivēyu śīlamugala muni yaguvāḍu (sāṃtamuga yōgamu navalaṃbhiṃcuvāḍu - yōgārūḍhuḍu - yōgipadamunu ārōhiṃcinavāḍu - yekkinavāḍu.)

  1. "kā yēna manasā buddhyā kēvalairiṃdriyairapi |

yōginaḥ karmakurvaṃti saṃgaṃ tyaktvātma śuddhayē ||". (śrīmadbhagavadgīta - 5 - 11)

"tyaktvā phalābhilāṣaṃ tu karma kurvaṃti karmiṇaḥ |

citta śuddhyaidhiyā caiva kā yēna manasēṃdriyaiḥ |

kēvalairiti sarvēṣāṃ kāyādīnāṃ viśēṣaṇaṃ |

īśvarārthaṃ karōmīdaṃ naitanmama phalāyaca |

svāmyarthaṃ bhṛtya ivaca mamatā balavarjitaiḥ ||” (gītābhāvaprakāśamu - 5 - 86, 87)

(cēyu karmalavalana kalugu phalamaṃdāsaktivadali śarīramutōṭi, manasutōṭi, iṃdriyamulatōṭi yōgulu - karmayōgamu cēyuvāru - cittaśuddhi koṟaku karmalu cēyuduru - ī karmanu nēnu īśvarunikoṟaku (bhagavaṃtunikoṟaku) cēyucunnānu - nāku ī karmaphalamu dakkavalenani kādu. yajamāni guṟiṃci sēvakuḍu cēyunaṭlu - nādiyanu mamakāramu dāniyaṃdu lēnaṭlu cēyuduru.)

  1. "ajihva ṣaṃḍakaḥ paṃguraṃdhō badhira ēvaca |

mugdhaśca mucyatē yōgī ṣaḍbhirētairna saṃśayaḥ ||".

(jihva cāpalyamu lēnivāḍu - idi mṛṣṭānnamu, idikādu anu vicakṣaṇasēyaka āhāramu tīsukonuvāḍunnū, cinnapillayaṃdunu, padahārēṃḍla vayassulōnuṃḍu strīyaṃdunu, musali strīyaṃdunu, okērītigā vikāramu lēkuṃḍuvāḍunu, kālakṛtyamulu tīrcukonuṭakunu bhōjanamu cēyuṭakunu tappa dūramu saṃcariṃcukuṃḍuvāḍunu, ē pani cēyucunnanu dṛṣṭi dūramugā pōnīka yuṃḍuvāḍunu, hitamaina vākkunu vinucu, manōharamainadē vinucuvinakayuṃḍuvāḍuvalenuṃḍuvāḍunu, viṣayamulu tanaku taṭasthapaḍinanu vāṭi paiki manassunu pōnīyakayuṃḍuvāḍunu - iṭṭi guṇamulugalavāḍu yōgi - aṭṭi yōgi muktuḍagunu).

  1. "ētasyāḥ buddhērjanmanaḥ prāgātmanō dēhādi vyatiriktatva kartṛtva bhōktṛtvādyapēkṣaō dharmādharma vivēka pūrvakō mōkṣasādhanānuṣṭhāna lakṣaṇō yōgaḥ, tadviṣayā buddhiryōga buddhiḥ. sā yēṣāṃ karmaṇā mucitā bhavati tē yōginaḥ " (śrīśaṃkaraḥ)

(muṃdaṭi janmalō ātmakaṃṭe dēhamu modalagunavi vyatirēkamainavi aninnī, puṇyapāpavicakṣaṇagaladinnī, mōkṣamunaku sādhanamaina lakṣaṇamu kaladinnī yōgamu, ā yōgamu viṣayamugāgaladi yōgabuddhi. adi karmiṣṭulaku kaligina vāru yōgamu)

  1. "kāmakrōdha lōbha mōha madamatsaraṃbulanu nariṣaḍvargaṃbula jayiṃci jarāmaraṇavirahitaṃbugā vāyuvaśaṃbu cēsi gātra pavitraṃbu koṟaku ṣaṭkarmaniratuṃḍayi puranagara grāmaṃbulu parityajiṃci, parvatāraṇyaṃbula saṃcariṃcucu, śarīra dhāraṇārthaṃbu niyatasvalpa bhōjanuṃḍai, khēda mōdaṃbulu sariyakā bhāviṃci, lōbhamōhaṃbulu varjiṃci, nirjitēṃdriyuṃḍayi, nanne kāni yoṃḍeṟuṃgaka yātmaniṣṭacē bavitrāṃtaḥkaraṇuṃḍaina yōgināyaṃdu galayu".

(śrīmadāṃdhramahābhāgavatamu - 11 - 99)

  1. "yathāravissarva rasān prabhuṃktē hutāśanaścāpi hi sarvabhakṣakaḥ |

tadhaiva yōgī viṣayān prabhuṃktē na lipyatē karmaśubhā śubhaiśca ||".

(sūryuḍu sarvarasamulanu bhujiṃcunaṭlē, agni tanalō hutamaina vāṭinanniṃṭinī bhujiṃcunaṭlē yōguyaguvāḍu viṣayamulanu bhujiṃcinanu (anubhaviṃcinanu) ā karmalavalana kalugu pāpapuṇyamulu atanini aṃṭavu.)

  1. “kṛtvā mahāpātaka kōṭi kōṭi hatvā ca bhūtāni pṛthagvidhāni |

dagthvā samastaṃ sa carācaraṃ tannalipyatē jñānabalēna yōgī ||".

(kōṭlakoladi mahāpāpamulanu cēsinanu, bhūtamula nanēkavidhamulagā caṃpinanu - hiṃsiṃcinanu, ī carācarajagattu naṃtaṭini maṃṭakalipinanu yōgi yaguvāniki ā karmaphalamulaṃṭavu.)

  1. "yataṃtō yōginaścaivaṃ paśyaṃtyātmanyava sthitaṃ |

yataṃtōpyakṛtātmānō naivaṃ paśyaṃtya cētasaḥ ||". (śrīmadbhagavadgīta - 15 - 11)

(śarīramu nāśrayiṃci yunnapuḍu - triguṇamulatō kalisiyunnapuḍu bhōktagā nuṃḍuvāḍunu agu jīvuni (tanalōnunna bhagavadaṃśanu) mūḍhulu (ātmajñānamu lēnivāru) kanugonalēru. brahmajñānulu dānini cūcedaru. ī jīvuni (jīvātmanu) samāhitacittamugala yōgulu tamalōnē (buddhiyaṃdu) cūcedaru. yōgulu kānivāru vārilō jīvātmarūpamulōnunna paramātmanu cūḍalēru - bhōjarāju caritralō - kavulu koṃdaṟu bhagavaṃtuḍaina viśvanādhuni cūcuṭaku rāju kāśīki paṃpagā pōyiri. kāḷidāsu tanalō bhagavaṃtuḍuṃḍuṭacēta tānu veḷḷalēdu - ani bhōjarājutō ceppenu.

"sadā bhōgabhājāṃ samārē vibhātaṃ |

mudā yōgabhājāmadūrē vibhātaṃ |

cidānaṃdakaṃdaṃ sadā rāghavēśaṃ |

vidēhātmajanaṃda kaṃdaṃ prapadyē ||". (śrīrāmakarṇāmṛtaṃ - 4 - 107)

"ma. tata bhōgānu vihāra cittulaku boṃdan dūramai bhaktisaṃ

yuta yōgīṃdrulakella dāsagucu vēdyuṃḍai cidānaṃduḍai

kṣitiputrī hṛdaya pramōdakaruḍai celvoṃdu śrīrāmunin

satataṃbun śaraṇaṃbu vēḍedanu mōkṣaśrīramā kāṃkṣinai ".

  1. "yathā dīpō nivātasthō nēṃgatē sōpamā smṛtā |

yōginō yatacittasya yuṃjatō yōgamātmanaḥ" (śrīmadbhagavadgīta - 6 - 19)

"yathādīpaḥ vātavarjitē sthānē sthitaḥ na calati, tathā yōginaḥ yata cittasya saṃ yata aṃtaḥkaraṇasya - yōgaṃ anutiṣṭataḥ - yōgajñaiḥ - cittapracāra darśabhiḥ, yōgaṃ upamā smṛtā, ciṃtitaḥ" (śrīśaṃkaraḥ)

(gāli vistāramugālēni cōṭa dīpamu kadalakuṃḍa neṭluṃḍunō saṃ yata aṃtaḥkaraṇamugala yōgi yaṭlē yuṃḍunu ani yōgamunu guṟiṃci telisinavāru - cittavṛtti guṟiṃci telisinavāru - upamānamugā ceppuduru).

"nivātasthatayā niścala sa prabhādīpavat nivṛtta rasa kalētara manōvṛttitayā niścalō jñānaprabhō ātmā tiṣṭati ityarthaḥ"

(śrīmān rāmānujaḥ)

(gāli lēnicōṭa kadalaka kāṃtiniccu dīpamuvale itara manōvṛtti lēkuṃḍuṭacē niścalamaina jñānakāṃti galavāḍai yōgiyuṃḍunu).

  1. "tapasvibhyō adhikō yōgī jñānibhyōpi matō(a)dhikaḥ |

karmibhyaścāthikō yōgī tasmādyōgī bhavārjuna ||"

“yōgināmapi sarvēṣāṃ madgatēnāṃtarātmanā |

śraddhavān bhajatē yō māṃ samēyuktatamō mataḥ ||" (śrīmadbhagavadgīta - 6 - 46, 47)

(bhavagavān śrīmadbhagavadgīta yāṃ sarva vidhēṣu yōgiṣu ētairyuparyuktairlakṣaṇaiḥ yuktaḥ bhakti yōgina mēva sarvōttama makathayat | tapasvibhyaḥ śāstrajñānibhyaḥ sakāma karmabhyaśca yōgī śrēṣṭō asti paraṃtu saṃpūrṇayōgiṣṭapi sa bhaktiyōgī mamamatē paramaḥ. śrēṣṭōsti yō mayi śraddhāvānasti tathā madgatēnāṃtarātmanā niraṃtaraṃ māṃ bhajati)

(tapasvikaṃṭe, jñānulakaṃṭe, karmiṣṭulakaṃṭe, yōgiyaguvāḍu - citta samādhānamukalayōgi adhikuḍu. aṃducēta nīvu yōgi yagumu - paina ceppinavārilō okarikaṃṭe okaru adhikulu - tapasvilukaṃṭe jñānayōgulu adhikulu, jñanayōgulakaṃṭe yōgulu adhikulu - anagā bhakti yōgulu aṃdaṟikaṃṭe adhikulu - ī bhaktiyōgulalō manassulō nannē (bhagavaṃtunē) śraddhakaligi niraṃtaraṃ dhyāniṃcuvāḍu uttamuḍu. cāṃdrāyaṇamu modalagu vratamulu cēyu tapōyōgulakaṃṭe, karmaphalamaṃdu kōrikagala jyōtiṣṭōmādi karmalu cēyu yōgulakaṃṭe, jñānayōgulakaṃṭe - jñānamunaku sādhanamaina cittasamādhānamugala yōgulu adhikulu).

"śraddhā dhi kyōdayā vadhi yōgī saṃstūyatē (a)dunā |

tapaḥ kṛccrōpavāsādi tatsarvēbhyōpi yōgyasau |

utkṛṣṭō brahmavid jñānī nirvṛttikamanā yataḥ |

jyōtiṣṭō mādi karmānuṣṭhāyibhyaścā dhikyō mataḥ |

mōkṣānarhatayā jñātvā tkarmaṇāṃ ca tapasvināṃ |

parōkṣa jñānavidbhyō pyaparōkṣa jñāni nō varāḥ |

tēbhyō (a)pyēvaṃ manōnāśa vāsanā kṣaya saṃ yutaḥ |

jīvanmuktō muniryōgī śrēṣṭaḥ sarvōttamō yataḥ"

"yōgināṃ vasu rudrāvibhaktānāṃ chēdacētasāṃ |

sarvēṣāmapi madhyēyō vāsudēvē mayīśvarē |

puṇya puṃjōdayātprēmṇā niviṣṭē nāṃtarātmanā |

pragbhavārjita saṃskāra pāṭavāt sādhu saṃgamāt |

śraddha dānaḥ sadābhūtatvāciṃta yatyādarācca māṃ |

saguṇaṃ nirguṇaṃ vāpi nārāyaṇamadhīśvaraṃ |

ananyabhaktyāparayā sa madbhaktōhya nanyadhīḥ |

sarvēbhōyukta cittēbhyō śrēṣṭō nitya samāhitaḥ |

sarvajñasya mamātyaṃta niścitō nātrasaṃśayaḥ |

yōgābhyāsa śramē tulyē samānē bhajanaśramē |

madbhaktāsyaiva mukhyatvaṃ matparāṅmukha yōginaḥ ||". (gītābhāvaprakāśamu - 6 - 242 to 253)

(bhagavaṃtuniyaṃdu adhika śraddhakaligi yuṃḍuṭavalana yōgiyaguvāḍu tapasvilakaṃṭe, jñānulakaṃṭe adhikuḍani bhagavaṃtuḍagu śrīkṛṣṇuḍu koniyāḍenu - bahu kaṣṭamaina upavāsamu modalagu tapassulanu cēyuvārikaṃṭe manōvṛttululēnivāḍagu brahmajñāni adhikuḍu. jyōtiṣṭōmādi karmalu cēyuvāru jñānamu lēnivārukanuka vārikaṃṭe jñānulu - jñānayōgulu - adhikulu. jñānulaku parōkṣajñānamu kalugunu. vārikaṃṭe aparōkṣajñānamu galavāru adhikulu. vārikaṃṭe manōnāśamu, vāsanā kṣayamugala jīvanmuktuḍagu yōgi adhikuḍu.)

(yōgulaṃdaṟikanna bhagavadbhaktuḍaguvāḍu - bhaktiyōgi - adhikuḍu ani śrīkṛṣṇabhagavānuni āśayamu - vēṟuvēṟu manasulu, abhiprāyamulugala vasuvulu rudrulu modalagu yōgulaṃdaṟikaṃṭe vāsudēvuḍanagu nāyaṃdu (bhagavaṃtuniyaṃdu) pūrvapuṇyamuvalana kaligina satsaṃgamuvalana śraddhatō nārāyaṇuḍaina nannu saguṇarūpunigānainanu, nirguṇarūpunigānainanu goppa ananyabhakticēta itaramaṃdi manassulēnivāḍai ciṃtiṃcuvāḍu nābhaktuḍu nityamu, samāhitamaina manassugalavāḍu, itara yōgulaṃdaṟikaṃṭenu śrēṣṭuḍu. sarvamu telisinā nirṇayamidi - iṃdulō saṃśayamulēdu - yōgābhyāsamulō yōgulaṃdaṟiki śramamu samānamē ayinanu, nā bhaktulukāni yōgulakaṃṭe nā bhaktulaina yōgulu mukhyulu - nā bhaktulaiyuṃḍuṭē vīri ādhikyamunaku kāraṇamu).

  1. "saṃkalpa prabhavān kāmān tyaktvā sarvānaśēṣataḥ |

manasaivēṃdriyagrāmaṃ viniyamya samaṃtataḥ |

śanaiśśanairu paramēdbuddhyā dhṛtigṛhītayā |

ātma saṃsthaṃ manaḥ kṛtvā na kiṃcidapi ciṃtayat |

yatō yatō niścarati manaścaṃcala masthiraṃ |

tatastatō niyamyaitadātmanyēva vaśaṃ nayēt |

praśāṃtamanasaṃ hyēnaṃ yōginaṃ sukhamuttamaṃ |

upaiti śāṃtarajasaṃ brahmabhūta vakalmaṣaṃ |

yuṃjannēvaṃ sadātmānaṃ yōgī vigatakalmaṣaḥ |

sukhēna brahma saṃsparśa matyaṃtaṃ sukhamaśnutē ||". (śrīmadbhagavadgīta - 6 - 24 to 28)

"idaṃ mē syādidaṃ mē syāditi saṃkalpa jānimān |

śōbhanādhyāsajān kāmān duṣṭēṣviṣayēṣvapi |

śōbhanādhyāsajān kāmān duṣṭēṣviṣayēṣvapi |

tyaktvā bhōgābhilāṣākhyān dōṣadṛṣṭyāpya śēṣataḥ |

sarvāndṛhiṇi lōkāṃ tānvāsanā nahitānmuniḥ |

pratyāhṛtyēṃdriya grāmaṃ viṣayēbhyā samaṃtataḥ |

kāmāpāyē viśēṣēṇa yuktā yā dhīstayā manaḥ |

ātmanyēvasamāptirhi yasya tadbrahma gōcaraṃ |

kṛtvā viciṃtayē nānyadgati manyāṃ navāśrayēt |

ātmaivāstyakhilaṃ nānyadgati manyaṃ niścitya vā muniḥ |

nānyadvi ciṃtayē tkiṃcidyōgasyāyaṃ parō(a)vadhiḥ ||.”

"ēvaṃ kurvan samāditaṃ yōgī citta nirōdhanaṃ |

cittavikṣēpa hētūnāṃ śabdādīnāṃ ca madhyataḥ |

yasmādyasmādyasmā nnimittāttacchabdā dēścaṃ calaṃ manaḥ |

anādyavidya yādhyāsā dvikṣiptaṃ sadbahirvajrēt |

tatastatō (a)pi vikṣēpa nimittāttanmanō muniḥ |

kṛtvā nirvṛttikaṃ pratyagātmanyēvā dvayē sukhē |

svaprakāśaparānaṃdaghanē tatvē vaśaṃ nayēt |

samasta duḥkha sīmēyaṃ yanmanōdṛśya gōcaraṃ |

samasta sukha sīmēyaṃ yanmanō brahmagōcaraṃ |

vicāryainaṃ thiyā vidvānvēdāṃtācārya vākkataḥ |

bhōgānutsṛjya taddhētūnkāmāṃ styaktvā śrayēddhariṃ |

yatrayatra manōgaccēccha bdādau bhōgagōcarē |

taṃtaṃ vicārya viṣayaṃ savairāgyādvivēkataḥ |

abhāsīkṛtya dōṣāṇāmākaratvādasaktatiḥ |

tata ākṛṣya paramānaṃda rūpē cidātmani sthāpayēditi tātparya śrīmadbhagavatōharēḥ ||.”

"yōgābhyāsa balādēvaṃ yōginaścitta mātmani |

pragāmyati tatō(a)tyaṃtaṃ śāṃtaṃ nirvattikaḥ sthiraṃ |

manōyasya tadhā śāṃta rajō vikṣēpakaṃ malaṃ |

kalmaṣaṃ layahēturyattamō yasya navidyatē |

dharmādharmādirūpaṃ vā kalmaṣaṃ nō bhavapradaṃ |

yasya taṃ brahmavastvēva sarvamastīti vēdinaṃ |

samyak jñātē parē tatvē kṣīṇē mōhamayē malē |

brahmabhūtaṃ muniṃ śāṃtamupaiti sukhamuttamaṃ |

dṛśyaṃ nāsti paraṃ brahmaivāsti sarvaṃ niraṃtaraṃ |

iti niścayavaṃtaṃ taṃsukhaṃ samupagacchati |

abhāvē citta tadvṛttyōḥ suṣuptē citsukhaṃ paraṃ |

svaya māvirbhavētyēvaṃ hi śabdōdyōta yatyayaṃ ||".

"sphuṭī karōti bhagavān yōginaṃ sukhamīritaṃ |

manasaivēṃdriya grāma mityādyukta kramēṇayaḥ |

yōgēna nitya saṃbaṃdhī manō nityaṃ samādhadhit |

saṃsārahētu dharmādi mala śūnyō(a)ti nirmalaḥ |

anāyāsēna madbhaktyā yōgapratyūha varjitaṃ |

sukhaṃ brahmasvarūpaṃ yadapariccinna māṃtaraṃ |

laya vikṣēpa śūnyatvāt tadvyāpnōti niraṃtaraṃ |

svayaṃ brahmasukhaṃ yōgī bhūtavā tiṣṭati niścalaḥ ||.” (gītābhāvaprakāśamu - 6 - 113 to 136)

(duṣṭamaina viṣayamulaṃdu "idi nādi ayina bāguṃḍunu, idi nāku kāvalenu" anu saṃkalpamuvalana kalugu bhōgānubhavamuguṟiṃci kalugu kōrikalanu - brahmalōkamu poṃduṭavaraku gala kōrikalanu - anniṃṭini vāṭivāṭi vāsanalatō sahā viḍicipeṭṭi, viṣayamulanniṃṭinuṃḍi iṃdrilamulanu arikaṭṭi, manassunu ātmayaṃdē nilipi, brahmasākṣātkāramu poṃdunaṭlugā cēsi, "aṃtā ātmayē, ātmakānidi iṃkokaṭi lēdu - iṃkokagati lēdu, ātmatatva yiṃkokaṭi āśrayamu lēdu - iṃkoka gati lēdu" ani niścayiṃci yōgi yaguvāḍu iṃkokadānini guṟiṃci ālōciṃcakūḍadu - idiyē yōgamunaku paramāvadhi)

(ī prakāramugā cittavikṣēpamunaku kāraṇamaina śabdamu modalagu iṃdriyamulanuṃḍi nittamunu nirōdhiṃcuṭa yanu samādhilō nuṃḍi, anādiyagu avidyavalana ē viṣayamula kāraṇamugā manassu brahmadhyānamunaṃduṃḍaka caṃcalamagucunnadō āyā vāṭini baiṭaku viḍicipeṭṭavalenu - manassunu dāni vṛttulaṃdu pōnīyakuṃḍunaṭlu cēsi, advayuḍu, pratyagātma, svayaṃprakāśuḍu, parānaṃdaghanuḍu ayina brahmamunaṃduṃḍunaṭlu, tanavaśamulōnuṃḍunaṭlu cēsukonavalenu. manassunaku gōcaramagu ī samasta prapaṃcamu anni vidhamula duḥkhamulaku sthānamu aninnī, manassunaku gōcaramaina brahmamu anni vidhamulaina sukhamulaku sīma aniyu, upaniṣadvākyamuladvārā vicāriṃci telusukoni bhōgamulanu, vāṭiki kāraṇamulaina kōrikalanu vadalivēsi, harini - bhagavaṃtuni āśrayiṃcavalenu - ē yē śabdādulagu bhōgamula viṣayamai manassu pōvucuṃḍunō vāṭini kanipeṭṭi, vairāgyamucēta, vivēkamucēta vāṭini dōṣayuktamulani, asatyamulani vadalivēsi, paramānaṃdarūpamagu cidātmayaṃdu manasunu nilupavalayunu -(ī prakāramugā cēyu yōgābhyāsa balamucēta, yōgula cittamu ātmayaṃdu vṛttirahitamainaṭuvaṃṭinnī, sthiramainaṭuvaṃṭinnī śāṃtini poṃdunu. rajōguṇa vikṣēpakamaina malamu, layahētuvaina tamōguṇamu lēnidi, dharmādharmādi rūpamai janmakāraṇamaina kalmaṣaṃ lēnidi ayina parabrahmamē unnadi ani telusukonu sthitini poṃdunu. brahmatatvamunu telusukonagā, mōhamu kṣīṇiṃcagā, aṭuvaṃṭi yōgini uttamasukhamaina śāṃti (mōkṣamu) dānaṃtaṭa adē ceṃdunu. ī kanabaḍu prapaṃcamanunadē lēdu, unnadaṃtayu parabrahmamē yani niścayamaina manassu niraṃtaramu kaligiyuṃḍu yōgiki aṭṭi sukhamu kalugunu. suṣuptilō cittamu dāni vṛttulu lēnappuḍu paramasukhamanunadi tanaṃtaṭa adē poṃdunu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.