నాన్యథా తద్భవేన్నూనం యుగ ధర్మో(అ)త్రకారణం |
యే ధర్మరసికాః జీవాః తేవై సత్ర యుగే(అ)భవన్ | ధర్మార్థ రసికాః యేతు తేవై త్రేతాయుగే(అ)భవన్ |
ధర్మార్థ కామరసికాః ద్వాపరే చా భవన్ యుగే |
అర్థ కామ పరాస్సర్వే కలౌ అస్మిన్ భవంతి హి |
యుగధర్మస్తు, రాజేంద్ర నయాతి వ్యత్యయం పునః |
కాలః కర్తాస్తి ధర్మస్య హ్య ధర్మస్య చ వై పునః |
యే వై కృతయుగే, రాజన్, సంభవంతీ వ మానవాః |
కృత్వా తే పుణ్యకర్మాణి దేవలోకాన్ వ్రజంతి వై |
బ్రాహ్మణాః, క్షత్రియాః, వైశ్యాః శూద్రాశ్చ నృపసత్తమ |
స్వధర్మనిరతాః యాంతి లోకాన్ కర్మ జితాన్ కిల |
సత్యం దయా తధా దానం స్వదారగమనం తథా |
అద్రోహః సర్వ భూతేషు, సమతా సర్వ జంతుషు |
ఏ తత్సాధారణం ధర్మం కృత్వా సత్య యుగే ప్రనః |
స్వర్గం యాంతి తరే వర్ణాః ధర్మతో రజకాదయః |
తథా త్రేతా యుగే రాజన్, ద్వాపరేధ యుగే తథా |
కలావస్మిన్ యుగే పాపే నరకం యాంతి మానవాః |
నూనం సత్య యుగే, రాజన్, బ్రాహ్మణాః వేదపారగాః |
పరాశక్త్యర్చన రతాః దేవీ దర్శన లాలసాః |
గాయత్రీ ప్రణవాసక్తాః గాయత్రీ ధ్యాన కారిణః |
గాయత్రీ జప సంసక్తాః మాయా బీజైక జాపినః |
గ్రామే గ్రామే పరాం చా యాః ప్రసాదకరణోత్సుకాః |
స్వకర్మ నిరతాస్సర్వే సత్య శౌచ దయాన్వితాః |
త్రయ్యుక్త కర్మనిరతాః తత్వజ్ఞాన విశారదాః |
అభవన్ క్షత్రియాస్తత్ర ప్రజాభరణ తత్పరాః |
వైశ్యాస్తు కృషి వాణిజ్య గో సేవా నిరతస్తథా |
శూద్రాః సేవా పరాస్తత్ర పుణ్యే సత్య యిగే నృప |
పరాంబ పూజనా సక్తాః సర్వే వర్ణాః పరే యుగే |
తథా త్రేతాయుగే కించిత్ న్యూనాః ధర్మస్య సంస్థితిః |
ద్వాపరేణ విశేషేణ న్యూనా సత్య యుగ స్థితిః |
పూర్వం యే రాక్షసా, రాజన్, తే, కలౌ బ్రాహ్మణా స్స్మృతాః |
పాషాండ నిరతాః ప్రాయో భవంతి జన పంచకాః |
అసత్యవాదిన స్సర్వే వేద ధర్మ వివర్జితాః |
దాంభికాః లోకచతురాః మానినో వేద వర్జితాః |
శూద్ర సేవా పరా కేచిత్ నానా ధర్మ ప్రవర్తకాః |
వేదనిందాకరా కేచిత్ క్రూరాః ధర్మభ్రష్టా తివాదుకాః |
యధా యధా కలిర్వృద్ధిం యాతి, రాజన్, తథా తథా |
ధర్మస్య సత్య మూలస్య క్షయస్సర్వాత్మనా భవేత్ |
తధైవ క్షత్రియాః వైశ్యాః శూద్రాశ్చ ధర్మవర్జితాః |
అసత్య వాదినః పాపాః తథా వర్ణేతరాః కలౌ |
శూద్ర ధర్మరతా విప్రాః ప్రతిగ్రహ పరాయణాః |
భవిష్యంతి కలౌ, రాజన్, యుగే వృద్ధిం గతాః కిల |
కామచరాస్త్రియః కామలోభమోహ సమన్వితాః |
పాపా మిధ్యాభి వాదిన్యః సదా క్లేశరతా, నృప |
స్వ భర్తృ వంచకా నిత్యం ధర్మ భాషణ పండితాః |
భవం త్యేవం విదా నార్యః పాపిష్టాశ్చ కలౌ యుగే |
ఆహారశుద్ధ్యా, నృపతే చిత్తశుద్ధిస్తు జాయతే |
శుద్ధే చిత్తే ప్రకాశస్యాత్ ధర్మస్య, నృపసత్తమ |
వృత్త సంకర దోషేణ జాయతే ధర్మ సంకరః |
ధర్మస్య సంకరే జాతే నూనం స్యాత్ వర్ణ సంకరః |
ఏవం కలియుగే భూప సర్వధర్మ వివర్జతే |
స్వవర్ణ ధర్మ వార్తైషా న కుత్రావ్యుపలభ్యతే |
మహం తోపి చ ధర్మజ్ఞాః అధర్మం కుర్వతే నృప |
కలి స్వభావ ఏ వైషః పరిహార్యో న కేనచిత్ |
తస్మాదత్ర మనుష్యాణాం స్వభావాత్ పాప కారిణాం |
నిష్కృతిర్నహి, రాజేంద్ర, సామాన్యోపాయ తో భవేత్ ||“. (దేవీపురాణం)
(కాలముననుసరించి ఏ యుగమందెటువంటి ప్రజలు కలుగుదురో ఆ ప్రకారముగానే యుగ ధర్మములుండును. మరియొక విధముగా నుండవు. దీనికి కారణమేమనగా - సత్యయుగమందు (కృతయుగమందు) ప్రజలు ధర్మమార్గానువర్తులై యుందురు. త్రేతాయుగములో ప్రజలు ధర్మార్థములను పురుషార్థములను పాటించువారగుదురు. ద్వాపరయుగములో ప్రజలు ధర్మము, అర్థము, కామము అను మూడు పురుషార్థములను పాటించువారగుదురు. కలికాలమందు ప్రజలందఱు అర్థ కామములను అవలంభించువారగుదురు. ధర్మమునకు అర్థములకు కాలమే కర్త. కృతయుగమందు పుట్టిన మానవులు పుణ్యకర్మలను చేసి దేవలోకమునకు పోవుదురు - బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు వారి వారికి నిర్ణయించబడిన ధర్మమును అనుష్టించుచు కర్మచేత పొందబడు లోకములను పొందుదురు. సత్యము, దయ, దానము, స్వభార్యను పొందుట, ఏ భూతములకైనను ద్రోహము చేయకుండుట, సమస్త జంతువుల యడల సమముగా నుండుట - ఈ మొదలగు సాధారణ ధర్మములననుసరించి ఇతర వర్ణములవారు (రజకులు మొదలగువారు) స్వర్గమును పొందుదురు. త్రేతాయుగములోను ద్వాపరయుగములోను కూడ ఈ ప్రకారముగానే జరుగును. పాపము కూడిన ఈ కలియుగమందు మానవులు నరకమును పొందుదురు -
సత్య యుగమందు, కృతయుగమందు బ్రాహ్మణులు వేదపారగులు - వేదమును తుదిముట్ట చదివినవారు - పరాశక్తిని (దేవిని) పూజించుటయందు రతిగలవారు, దేవుని దర్శించుటయందు - బ్రహ్మ సాక్షాత్కారమును పొందుటయందు ఉత్సాహము కలవారు, గాయత్రి మంత్రమందు, ప్రణవోపాసనయందు ఆసక్తి గలవారు, గాయత్రిని ధ్యానించువారు, గాయత్రిని జపించువారు, మాయా బీజమును జపించువారు, వారి వారి కర్మలందు నిరతులయినవారు, సత్యము శౌచము, దయ కలవారు, వేద త్రయములో చెప్పిన కర్మలనొనర్చు వారు, భగవత్తత్త్వజ్ఞానమును బాగుగా తెల్సినవారు, అగుదురు. క్షత్రియులు ప్రజలను రక్షించుటయందు తత్పరులై యుందురు. వైశ్యులు వ్యవసాయము, వ్యాపారము (వాణిజ్యము) గోసేవ వీటిలో నిరతులై యుందురు. శూద్రులు సేవాపరులై యుందురు. అన్ని వర్ణములవారు దేవీపూజ చేయుటయందాసక్తి గలవారగుదురు. త్రేతాయుగము ధర్మములు ఇంత కొంచెము తగ్గియుండును. ద్వాపరయుగము విశేషముగా తగ్గి యుండును - పూర్వము ఎవరు రాక్షసులోవారే కలియుగములో బ్రాహ్మణులని చెప్పబడుదురు. పాషాండ ధర్మము నవలంభించువారు జనులను వంచించువారు, అబద్ధమునాడువారు, వేదములో చెప్పిన ధర్మములను పాటించనివారు, దాంభికులు, లోకములో చతురులు, అభిమానము కలవారు, వేదములను వదలివేసినవారు, శూద్రులను సేవించువారు. అనేక ధర్మముల నవలంభింపచేయువారు (ప్రవర్తింపచేయువారు), క్రూరులు, ధర్మమార్గము నుండి భ్రష్టులయినవారు, అతివాదము చేయువారు. కలి వృద్ధి అయినకొలది సత్యమునకు మూలమైన ధర్మము క్షీణించుచుండును. ఆ ప్రకారముగానే క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు ధర్మముననుసరించనివారు, అబద్ధమాడువారు పాపులు అగుదురు. ఇతర వర్ణములవారుకూడ ఈ ప్రకారముగానే యుందురు. బ్రాహ్మణులు, శూద్రుల ధర్మముననుసరించువారు, ఇతరులవలన ధనము మొదలగువాటిని పరిగ్రహించువారు, కలియుగము వృద్ధిని పొందినకొలది, అగుదురు. స్త్రీలు కామము, లోభము, మోహము కలవారై కామ చారులగుదురు (కామోప భోగమందు చరించువారగుదురు లేక, ఇష్టము వచ్చిన ప్రకారము సంచరించు వారగుదురు). పాపులు, అబద్ధమాడువారు, భర్తలను వంచించు వారగుదురు, ధర్మములను చెప్పువారు కలియుగములో స్త్రీలగుదురు. ఆఅహార శుద్ధివలన చిత్తశుద్ధి కలుగును. చిత్తశుద్ధి కలిగిన ధర్మము ప్రకాశ మగును - వృత్తిసంకర దోషమువలన ధర్మ సంకరమగును, ధర్మ సంకరము వలన వర్ణసంకరమగును. అందు ఏ విధమైన ధర్మములు లేనటువంటి కలియుగమందు స్వవర్ణధర్మమనెడు మాటయే యుండదు. వర్ణములు కలిసిపోవుటచేత వర్ణధర్మమనునదియే యుండదు. ధర్మములు తెలిసిన మహానుభావులుకూడ అధర్మమునే చేయుదురు. ఇది కలియుగ స్వభావము - దీనిని తప్పించుట ఎవరికి అలవికాదు - అందుచేత కలియుగములో స్వభావము చేతనే పాపములను చేయు మనుష్యులకు సామాన్యోపాయ ములద్వారా నిష్కృతి లేదు).
“వ. - - - కృత త్రేతా ద్వాపర కలియుగంబులను యుగ చతుష్టయంబును గ్రమంబుగా ప్రవర్తించు - ధర్మబునకు సత్య, దయా, తపో దానంబులు నాలుగుపాదంబులై నడచు. శాంతి దాంత్యాత్మజ్ఞాన వర్ణాశ్రమాచారంబులు మొదలగునవి గలిగి ధర్మంబు మొదటి యుగంబున నాలుగు పాదంబులం బరిపూర్ణంబై ప్రవర్తిల్లు - శాంతి, దాంతి కర్మాచరణాది రూపంబగు ధర్మంబు మూడుపాదంబుల రెండవ యుగంబునం బ్రవర్తిల్లు. విప్రార్చనా హింసా వ్రత జపానుష్టానాది లక్షణంబులు గలిగి ధర్మంబు రెండు పాదంబుల, మూడవ యుగంబునం దేజరిల్లు. మఱియు జనులు కలియుగంబున ధర్మరహితులు, నన్యాయకారులు, క్రోధమాత్సర్య లోభ మోహాది దుర్గుణ విశిష్టులు, వర్ణాశ్రమాచార రహితులు, దురాచారులు, దురన్న భక్షకులు, శూద్ర సేవారతులు, నిర్దయులు, నిష్కారణ వైరులు, దయా సత్య శౌచాది విహీనులు, ననృతవాదులు, మాయోపాయులు, ధనవిహీనులు, దోషైక దృక్కులు నై, పాప చరితులగు రాజుల సేవించి, జననీ జనక సుత సోదర బంధు దాయాద సుహృజ్జనులం బరిత్యజించి సురతాపేక్షులై కులంబులం జెఱచు చుండెదరు. మఱియు క్షేమ డానురంబుల బ్రజా క్షయంబగు. బ్రాహ్మణులు దుష్ప్రతిగ్రహ విహారులై యజ్ఞాది కర్మంబులు పరార్థపరులై చేయించు హీనులై నశించెదరట్లుగాన యీ కలియుగంబున నొక్క ముహూర్తమాత్రంబైన నారాయణ స్మరణ పరాయణులై మనంబున శ్రీ నృసిమ్హ వాసుదేవ సంకర్షణాది నామంబుల నచంచల భక్తిం దలంచువారలకు గ్రతుశత ఫలంబు గలుగు”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 12 - 20)
పరాదరజ్ఞః స ఋషిః కాలేనా వ్యక్తరం హిసా |
యుగధర్మ వ్యతికరం ప్రాప్తం భువి యుగే యుగే |
భేరికానంచ భావానాం శక్తి హ్రాసం చ తత్కృతం |
అశ్రద్ధ ధానా న్నిసత్వాన్ దుర్మేథాన్ హ్రసితాయుషః |
దుర్భగాంశ్చ జనాన్ వీక్ష్యమునిర్దిప్యేన చక్షుషా |
సర్వ వర్ణాశ్రమాణాం యద్దద్ధ్యౌహిత మయోం దృక్ ||. (శ్రీమద్భాగవతం - 1 - 2 - 16 to 18)
“వ్యక్తంబుగాని వేగంబుగల కాలంబునంజేసి, యుగధర్మంబులకు భువి సాంకర్యంబునొందు. యుగ యుగంబుల భౌతిక శరీరంబులకు శక్తి సన్నంబగు, పురుషులు నిస్సత్వులు, ధైర్యశూన్యులు, మందప్రజ్ఞలు, అల్పాయువులు, దుర్బలులు నయ్యెదరు-”.
(శ్రీమదాంధ్రమహాభాగవతము - స్కం - 1 - )
nānyathā tadbhavēnnūnaṃ yuga dharmō(a)trakāraṇaṃ |
yē dharmarasikāḥ jīvāḥ tēvai satra yugē(a)bhavan | dharmārtha rasikāḥ yētu tēvai trētāyugē(a)bhavan |
dharmārtha kāmarasikāḥ dvāparē cā bhavan yugē |
artha kāma parāssarvē kalau asmin bhavaṃti hi |
yugadharmastu, rājēṃdra nayāti vyatyayaṃ punaḥ |
kālaḥ kartāsti dharmasya hya dharmasya ca vai punaḥ |
yē vai kṛtayugē, rājan, saṃbhavaṃtī va mānavāḥ |
kṛtvā tē puṇyakarmāṇi dēvalōkān vrajaṃti vai |
brāhmaṇāḥ, kṣatriyāḥ, vaiśyāḥ śūdrāśca nṛpasattama |
svadharmaniratāḥ yāṃti lōkān karma jitān kila |
satyaṃ dayā tadhā dānaṃ svadāragamanaṃ tathā |
adrōhaḥ sarva bhūtēṣu, samatā sarva jaṃtuṣu |
ē tatsādhāraṇaṃ dharmaṃ kṛtvā satya yugē pranaḥ |
svargaṃ yāṃti tarē varṇāḥ dharmatō rajakādayaḥ |
tathā trētā yugē rājan, dvāparēdha yugē tathā |
kalāvasmin yugē pāpē narakaṃ yāṃti mānavāḥ |
nūnaṃ satya yugē, rājan, brāhmaṇāḥ vēdapāragāḥ |
parāśaktyarcana ratāḥ dēvī darśana lālasāḥ |
gāyatrī praṇavāsaktāḥ gāyatrī dhyāna kāriṇaḥ |
gāyatrī japa saṃsaktāḥ māyā bījaika jāpinaḥ |
grāmē grāmē parāṃ cā yāḥ prasādakaraṇōtsukāḥ |
svakarma niratāssarvē satya śauca dayānvitāḥ |
trayyukta karmaniratāḥ tatvajñāna viśāradāḥ |
abhavan kṣatriyāstatra prajābharaṇa tatparāḥ |
vaiśyāstu kṛṣi vāṇijya gō sēvā niratastathā |
śūdrāḥ sēvā parāstatra puṇyē satya yigē nṛpa |
parāṃba pūjanā saktāḥ sarvē varṇāḥ parē yugē |
tathā trētāyugē kiṃcit nyūnāḥ dharmasya saṃsthitiḥ |
dvāparēṇa viśēṣēṇa nyūnā satya yuga sthitiḥ |
pūrvaṃ yē rākṣasā, rājan, tē, kalau brāhmaṇā ssmṛtāḥ |
pāṣāṃḍa niratāḥ prāyō bhavaṃti jana paṃcakāḥ |
asatyavādina ssarvē vēda dharma vivarjitāḥ |
dāṃbhikāḥ lōkacaturāḥ māninō vēda varjitāḥ |
śūdra sēvā parā kēcit nānā dharma pravartakāḥ |
vēdaniṃdākarā kēcit krūrāḥ dharmabhraṣṭā tivādukāḥ |
yadhā yadhā kalirvṛddhiṃ yāti, rājan, tathā tathā |
dharmasya satya mūlasya kṣayassarvātmanā bhavēt |
tadhaiva kṣatriyāḥ vaiśyāḥ śūdrāśca dharmavarjitāḥ |
asatya vādinaḥ pāpāḥ tathā varṇētarāḥ kalau |
śūdra dharmaratā viprāḥ pratigraha parāyaṇāḥ |
bhaviṣyaṃti kalau, rājan, yugē vṛddhiṃ gatāḥ kila |
kāmacarāstriyaḥ kāmalōbhamōha samanvitāḥ |
pāpā midhyābhi vādinyaḥ sadā klēśaratā, nṛpa |
sva bhartṛ vaṃcakā nityaṃ dharma bhāṣaṇa paṃḍitāḥ |
bhavaṃ tyēvaṃ vidā nāryaḥ pāpiṣṭāśca kalau yugē |
āhāraśuddhyā, nṛpatē cittaśuddhistu jāyatē |
śuddhē cittē prakāśasyāt dharmasya, nṛpasattama |
vṛtta saṃkara dōṣēṇa jāyatē dharma saṃkaraḥ |
dharmasya saṃkarē jātē nūnaṃ syāt varṇa saṃkaraḥ |
ēvaṃ kaliyugē bhūpa sarvadharma vivarjatē |
svavarṇa dharma vārtaiṣā na kutrāvyupalabhyatē |
mahaṃ tōpi ca dharmajñāḥ adharmaṃ kurvatē nṛpa |
kali svabhāva ē vaiṣaḥ parihāryō na kēnacit |
tasmādatra manuṣyāṇāṃ svabhāvāt pāpa kāriṇāṃ |
niṣkṛtirnahi, rājēṃdra, sāmānyōpāya tō bhavēt ||“. (dēvīpurāṇaṃ)
(kālamunanusariṃci ē yugamaṃdeṭuvaṃṭi prajalu kalugudurō ā prakāramugānē yuga dharmamuluṃḍunu. mariyoka vidhamugā nuṃḍavu. dīniki kāraṇamēmanagā - satyayugamaṃdu (kṛtayugamaṃdu) prajalu dharmamārgānuvartulai yuṃduru. trētāyugamulō prajalu dharmārthamulanu puruṣārthamulanu pāṭiṃcuvāraguduru. dvāparayugamulō prajalu dharmamu, arthamu, kāmamu anu mūḍu puruṣārthamulanu pāṭiṃcuvāraguduru. kalikālamaṃdu prajalaṃdaṟu artha kāmamulanu avalaṃbhiṃcuvāraguduru. dharmamunaku arthamulaku kālamē karta. kṛtayugamaṃdu puṭṭina mānavulu puṇyakarmalanu cēsi dēvalōkamunaku pōvuduru - brāhmaṇulu, kṣatriyulu, vaiśyulu, śūdrulu vāri vāriki nirṇayiṃcabaḍina dharmamunu anuṣṭiṃcucu karmacēta poṃdabaḍu lōkamulanu poṃduduru. satyamu, daya, dānamu, svabhāryanu poṃduṭa, ē bhūtamulakainanu drōhamu cēyakuṃḍuṭa, samasta jaṃtuvula yaḍala samamugā nuṃḍuṭa - ī modalagu sādhāraṇa dharmamulananusariṃci itara varṇamulavāru (rajakulu modalaguvāru) svargamunu poṃduduru. trētāyugamulōnu dvāparayugamulōnu kūḍa ī prakāramugānē jarugunu. pāpamu kūḍina ī kaliyugamaṃdu mānavulu narakamunu poṃduduru -
satya yugamaṃdu, kṛtayugamaṃdu brāhmaṇulu vēdapāragulu - vēdamunu tudimuṭṭa cadivinavāru - parāśaktini (dēvini) pūjiṃcuṭayaṃdu ratigalavāru, dēvuni darśiṃcuṭayaṃdu - brahma sākṣātkāramunu poṃduṭayaṃdu utsāhamu kalavāru, gāyatri maṃtramaṃdu, praṇavōpāsanayaṃdu āsakti galavāru, gāyatrini dhyāniṃcuvāru, gāyatrini japiṃcuvāru, māyā bījamunu japiṃcuvāru, vāri vāri karmalaṃdu niratulayinavāru, satyamu śaucamu, daya kalavāru, vēda trayamulō ceppina karmalanonarcu vāru, bhagavattattvajñānamunu bāgugā telsinavāru, aguduru. kṣatriyulu prajalanu rakṣiṃcuṭayaṃdu tatparulai yuṃduru. vaiśyulu vyavasāyamu, vyāpāramu (vāṇijyamu) gōsēva vīṭilō niratulai yuṃduru. śūdrulu sēvāparulai yuṃduru. anni varṇamulavāru dēvīpūja cēyuṭayaṃdāsakti galavāraguduru. trētāyugamu dharmamulu iṃta koṃcemu taggiyuṃḍunu. dvāparayugamu viśēṣamugā taggi yuṃḍunu - pūrvamu evaru rākṣasulōvārē kaliyugamulō brāhmaṇulani ceppabaḍuduru. pāṣāṃḍa dharmamu navalaṃbhiṃcuvāru janulanu vaṃciṃcuvāru, abaddhamunāḍuvāru, vēdamulō ceppina dharmamulanu pāṭiṃcanivāru, dāṃbhikulu, lōkamulō caturulu, abhimānamu kalavāru, vēdamulanu vadalivēsinavāru, śūdrulanu sēviṃcuvāru. anēka dharmamula navalaṃbhiṃpacēyuvāru (pravartiṃpacēyuvāru), krūrulu, dharmamārgamu nuṃḍi bhraṣṭulayinavāru, ativādamu cēyuvāru. kali vṛddhi ayinakoladi satyamunaku mūlamaina dharmamu kṣīṇiṃcucuṃḍunu. ā prakāramugānē kṣatriyulu, vaiśyulu, śūdrulu dharmamunanusariṃcanivāru, abaddhamāḍuvāru pāpulu aguduru. itara varṇamulavārukūḍa ī prakāramugānē yuṃduru. brāhmaṇulu, śūdrula dharmamunanusariṃcuvāru, itarulavalana dhanamu modalaguvāṭini parigrahiṃcuvāru, kaliyugamu vṛddhini poṃdinakoladi, aguduru. strīlu kāmamu, lōbhamu, mōhamu kalavārai kāma cārulaguduru (kāmōpa bhōgamaṃdu cariṃcuvāraguduru lēka, iṣṭamu vaccina prakāramu saṃcariṃcu vāraguduru). pāpulu, abaddhamāḍuvāru, bhartalanu vaṃciṃcu vāraguduru, dharmamulanu ceppuvāru kaliyugamulō strīlaguduru. āahāra śuddhivalana cittaśuddhi kalugunu. cittaśuddhi kaligina dharmamu prakāśa magunu - vṛttisaṃkara dōṣamuvalana dharma saṃkaramagunu, dharma saṃkaramu valana varṇasaṃkaramagunu. aṃdu ē vidhamaina dharmamulu lēnaṭuvaṃṭi kaliyugamaṃdu svavarṇadharmamaneḍu māṭayē yuṃḍadu. varṇamulu kalisipōvuṭacēta varṇadharmamanunadiyē yuṃḍadu. dharmamulu telisina mahānubhāvulukūḍa adharmamunē cēyuduru. idi kaliyuga svabhāvamu - dīnini tappiṃcuṭa evariki alavikādu - aṃducēta kaliyugamulō svabhāvamu cētanē pāpamulanu cēyu manuṣyulaku sāmānyōpāya muladvārā niṣkṛti lēdu).
“va. - - - kṛta trētā dvāpara kaliyugaṃbulanu yuga catuṣṭayaṃbunu gramaṃbugā pravartiṃcu - dharmabunaku satya, dayā, tapō dānaṃbulu nālugupādaṃbulai naḍacu. śāṃti dāṃtyātmajñāna varṇāśramācāraṃbulu modalagunavi galigi dharmaṃbu modaṭi yugaṃbuna nālugu pādaṃbulaṃ baripūrṇaṃbai pravartillu - śāṃti, dāṃti karmācaraṇādi rūpaṃbagu dharmaṃbu mūḍupādaṃbula reṃḍava yugaṃbunaṃ bravartillu. viprārcanā hiṃsā vrata japānuṣṭānādi lakṣaṇaṃbulu galigi dharmaṃbu reṃḍu pādaṃbula, mūḍava yugaṃbunaṃ dējarillu. maṟiyu janulu kaliyugaṃbuna dharmarahitulu, nanyāyakārulu, krōdhamātsarya lōbha mōhādi durguṇa viśiṣṭulu, varṇāśramācāra rahitulu, durācārulu, duranna bhakṣakulu, śūdra sēvāratulu, nirdayulu, niṣkāraṇa vairulu, dayā satya śaucādi vihīnulu, nanṛtavādulu, māyōpāyulu, dhanavihīnulu, dōṣaika dṛkkulu nai, pāpa caritulagu rājula sēviṃci, jananī janaka suta sōdara baṃdhu dāyāda suhṛjjanulaṃ barityajiṃci suratāpēkṣulai kulaṃbulaṃ jeṟacu cuṃḍedaru. maṟiyu kṣēma ḍānuraṃbula brajā kṣayaṃbagu. brāhmaṇulu duṣpratigraha vihārulai yajñādi karmaṃbulu parārthaparulai cēyiṃcu hīnulai naśiṃcedaraṭlugāna yī kaliyugaṃbuna nokka muhūrtamātraṃbaina nārāyaṇa smaraṇa parāyaṇulai manaṃbuna śrī nṛsimha vāsudēva saṃkarṣaṇādi nāmaṃbula nacaṃcala bhaktiṃ dalaṃcuvāralaku gratuśata phalaṃbu galugu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 12 - 20)
parādarajñaḥ sa ṛṣiḥ kālēnā vyaktaraṃ hisā |
yugadharma vyatikaraṃ prāptaṃ bhuvi yugē yugē |
bhērikānaṃca bhāvānāṃ śakti hrāsaṃ ca tatkṛtaṃ |
aśraddha dhānā nnisatvān durmēthān hrasitāyuṣaḥ |
durbhagāṃśca janān vīkṣyamunirdipyēna cakṣuṣā |
sarva varṇāśramāṇāṃ yaddaddhyauhita mayōṃ dṛk ||. (śrīmadbhāgavataṃ - 1 - 2 - 16 to 18)
“vyaktaṃbugāni vēgaṃbugala kālaṃbunaṃjēsi, yugadharmaṃbulaku bhuvi sāṃkaryaṃbunoṃdu. yuga yugaṃbula bhautika śarīraṃbulaku śakti sannaṃbagu, puruṣulu nissatvulu, dhairyaśūnyulu, maṃdaprajñalu, alpāyuvulu, durbalulu nayyedaru-”.
(śrīmadāṃdhramahābhāgavatamu - skaṃ - 1 - )
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.