హంస హంసే త్యముం మంత్రం జీవో జపతి సర్వదా |
అజపా నామ గాయత్రీ యోగినాం మోక్షదా సదా ||“. (యోగచూడామణ్యుపనిషత్)
(‘హ’ అను అక్షరము పలుకునపుడు వాయువు శరీరమునుండి పైకి వెడలును - ‘స’ అను అక్షరము పలుకు నపుడు వాయువు శరీరములోనికి పోవును - ఈ రెండు అక్షరములు కలిసి ‘హంస’ అగుచున్నది).
(అహం + సః = నేనే ఆ పరబ్రహ్మను - ఈ ప్రకారముగా ఊపిరి తీసి విడుచునపుడల్ల ‘హంస’, ‘హంస’ అని అనాయాసముగా, అప్రయత్నముగా ఈ మంత్రము ఉచ్చరించబడుచున్నది. జీవుడు - ప్రాణమున్న ప్రతి జంతువు - ఎల్లపుడు ఈ మంత్రమును జపించుచున్నది – జపము చేయకయే మంత్ర రూపముగా అప్రయత్నముగా జరుగు చున్నది, కనుక ఇది అజపా మంత్రము - అని చెప్పబడుచున్నది. ఇదియే అజపా గాయత్రి, యోగులకు మోక్షము నిచ్చునది)
“అహం సః” (నేను ఆ పరబ్రహ్మను), “సో హం” = సః + అహం. “సః” లోని విసర్గ (ః) లోపించి ‘స’ అనునది ‘సో’ గా మారును. అప్పుడు ‘అహం’ లోని ‘అ’ లోపించి ‘హం’ మిగులును - ఇట్లు మిగిలిన రెండు అక్షరములు కలిసి ‘సోహం’ అగును - ఆ అక్షరములు వెనుకనుండు చదివితే హంసో అగును - అప్పుడు ‘సో’ ‘సః’ గా మారును. అప్పుడు ‘హంస’ యగును - అందుచేత హంస యనినను సోహం అనినను ఒకటే అర్థము - నేనే ఆ పరబ్రహ్మ అని “అహం బ్రహ్మస్మి” అను మహావాక్యము యొక్క అర్థమగును -
“అపానః కార్షతి ప్రాణం, ప్రాణో(అ)పానంచ కర్షతి |
అకారేణ బహిర్యాతి సకారేణ విశేత్పునః |
హస హంసే త్యముం మంత్రం జీవో జపతి సర్వదా ||“. (యోగశిఖోపనిషత్)
(అపాన వాయువు ప్రాణవాయువు నాకర్షించును - ప్రాణవాయువు అపానవాయువు నాకర్షించును, పైకి వచ్చినపుడు ‘హ’ అను శబ్దము కలుగును, లోనికి పోయినపుడు ’స’అను శబ్దము కలుగును).
‘హంస’ హంసేతి మంత్రోయం సర్వ జీవైశ్చ జప్యతే ||
గురువాక్యాత్ సుషుమ్నాయాం విపరీతో భవే జ్జపః |
‘సోహం’ ’సోహ’మితి ప్రోక్తో మంత్రయోగ ఉదాహృతిః |
ప్రతీతి ర్మంత్రయోగాచ్చ జాయతే జాయతే పశ్చమే పథే |
హకారేణతు సూర్యస్యాత్ సకారే ణేందురుచ్యతే |
సూర్యా చంద్ర మసో రైక్యం హఠ ఇత్యభిధీయతే |
హఠేన గ్రస్యతే జాడ్యం సర్వ దోష సముద్భవం ||” (యోగశిఖోపనిషత్)
(వాయువు శరీరములోనుండి పైకి విడిచినపుడు ‘హ’ అను శబ్దముతో పోవును. మరల లోపలికి పోవునపుడు ‘స’ అను శబ్దము కలుగును - ఇట్లు పైకి పోవునపుడు, మరల లోపలికి వచ్చునపుడు ‘హ’ ‘స’ అను శబ్దములు కలుగుచునే యుండును. ఇదియే ‘హంస’ యను మంత్రము - జీవులందఱు ప్రయత్నించకనే చేయుచున్నారు - ఈ శబ్దము గురు వాక్యము చేత సుషుమ్నా నాడి యందు విపరీత జపము అగుచున్నది. అనగా హంసః అనునది ‘సోహం’ (సః = సో) (అ) లోపించింది - అందుచేత సో + హం = సోహం అగుచున్నది. ‘సోహ’ ‘సోహ’ అను మంత్రమగుచున్నది. హంస మంత్రములోని ‘హ’ అనగా సూర్యుడు, సకారము చంద్రుడు కనుక ఈ సూర్య చంద్రుల ఐక్యము (కలియుట) హఠ యోగమని చెప్ప బడుచున్నది. హఠ యోగముచేత సమస్త రోగములవలన కలుగు జాడ్యము నశించును).
“హ కారశ్చ పుమాన్ ప్రోక్తస్స ఇతి ప్రకృతిర్మితా |
అజపే యం మతా శక్తిః |
బిందు ర్దక్షిణ భాగస్తో, వామభాగో విసర్గకః |
తేన దక్షిన హిమాఖ్యే భాగౌ స్త్రీ పుంస సంజ్ఞికౌ |
బిందుః పురుష ఇత్యుక్తో విసర్గః ప్రకృతిర్మితా |
పుంస్ప్రకృత్యాత్మకో హంసః తదాత్మకమిదం జగత్ |
పుం రూపం సావిదిత్వా స్వం సోహం(అ)భావముపాగతా |
స ఏవ పరమా తాభ్యో మనురస్య మహా మనోః |
సకారం చ హకారం చ లోపయిత్వా ప్రయోజయేత్ |
సంధించ పూర్వ రూపాఖ్యం తతో(అ)సౌ ప్రణవో భవేత్- “.
(లీల కొఱకు అర్థనారీశ్వరావతారము పొందిన పరమ శివుని యొక్క పురుష రూప భాగము ‘అహం’ అని చెప్పబడినది. ప్రకృతి భాగము ‘స’ అని చెప్పబడుచున్నది. ఆ ప్రకృతి పురుష రూపముతో తాదాత్మ్యమును పొందును. అజపా మంత్రము ‘సోహం’ అను మంత్రము కలుగును - దానిలో ‘స’ కారము ‘హ’ కారములు లోపించినందున ‘ఓం’ అను ప్రణవము - ఓంకారమంత్రమగుచున్నది. ఈ విషయము ప్రపంచసారమందు ఈ క్రింద విధముగా చెప్పబడినది: -
‘హ’ కారము పురుషుడు, ‘స’ కారము ప్రకృతి, ఈ రెండును కలిసి అజపా మంత్రమైనది. దీని దక్షిణ భాగ మందు బిందువు (o ఎడమ భాగమందు విసర్గ (ః). ఈ రెండు దక్షిణ ఎడమ భాగములు స్త్రీ పురుష సంజ్ఞలు కలవి. బిందువు పురుష సంజ్ఞ కలది, విసర్గ ప్రకృతి సంజ్ఞ కలది. పురుష ప్రకృతులు “హంసః”, వాటి రూపమే యీ జగత్తు - పురుష రూపము ప్రకృతిరూపము ‘సోహం’ అయినది. హంసః అనునది ‘సోహం’ అయినది. దానిలోని స + ఓ + అహ + ఒ) సకారము, హకారము, హకారము లోపించగా (మినహాయించగా) ‘ఓం’ అను రెండింటిని జత చేయగా ‘ఓం’ అను ప్రణవమంత్రము (ఓం కారము) అయినది.
haṃsa haṃsē tyamuṃ maṃtraṃ jīvō japati sarvadā |
ajapā nāma gāyatrī yōgināṃ mōkṣadā sadā ||“. (yōgacūḍāmaṇyupaniṣat)
(‘ha’ anu akṣaramu palukunapuḍu vāyuvu śarīramunuṃḍi paiki veḍalunu - ‘sa’ anu akṣaramu paluku napuḍu vāyuvu śarīramulōniki pōvunu - ī reṃḍu akṣaramulu kalisi ‘haṃsa’ agucunnadi).
(ahaṃ + saḥ = nēnē ā parabrahmanu - ī prakāramugā ūpiri tīsi viḍucunapuḍalla ‘haṃsa’, ‘haṃsa’ ani anāyāsamugā, aprayatnamugā ī maṃtramu uccariṃcabaḍucunnadi. jīvuḍu - prāṇamunna prati jaṃtuvu - ellapuḍu ī maṃtramunu japiṃcucunnadi – japamu cēyakayē maṃtra rūpamugā aprayatnamugā jarugu cunnadi, kanuka idi ajapā maṃtramu - ani ceppabaḍucunnadi. idiyē ajapā gāyatri, yōgulaku mōkṣamu niccunadi)
“ahaṃ saḥ” (nēnu ā parabrahmanu), “sō haṃ” = saḥ + ahaṃ. “saḥ” lōni visarga (ḥ) lōpiṃci ‘sa’ anunadi ‘sō’ gā mārunu. appuḍu ‘ahaṃ’ lōni ‘a’ lōpiṃci ‘haṃ’ migulunu - iṭlu migilina reṃḍu akṣaramulu kalisi ‘sōhaṃ’ agunu - ā akṣaramulu venukanuṃḍu cadivitē haṃsō agunu - appuḍu ‘sō’ ‘saḥ’ gā mārunu. appuḍu ‘haṃsa’ yagunu - aṃducēta haṃsa yaninanu sōhaṃ aninanu okaṭē arthamu - nēnē ā parabrahma ani “ahaṃ brahmasmi” anu mahāvākyamu yokka arthamagunu -
“apānaḥ kārṣati prāṇaṃ, prāṇō(a)pānaṃca karṣati |
akārēṇa bahiryāti sakārēṇa viśētpunaḥ |
hasa haṃsē tyamuṃ maṃtraṃ jīvō japati sarvadā ||“. (yōgaśikhōpaniṣat)
(apāna vāyuvu prāṇavāyuvu nākarṣiṃcunu - prāṇavāyuvu apānavāyuvu nākarṣiṃcunu, paiki vaccinapuḍu ‘ha’ anu śabdamu kalugunu, lōniki pōyinapuḍu ’sa’anu śabdamu kalugunu).
‘haṃsa’ haṃsēti maṃtrōyaṃ sarva jīvaiśca japyatē ||
guruvākyāt suṣumnāyāṃ viparītō bhavē jjapaḥ |
‘sōhaṃ’ ’sōha’miti prōktō maṃtrayōga udāhṛtiḥ |
pratīti rmaṃtrayōgācca jāyatē jāyatē paścamē pathē |
hakārēṇatu sūryasyāt sakārē ṇēṃdurucyatē |
sūryā caṃdra masō raikyaṃ haṭha ityabhidhīyatē |
haṭhēna grasyatē jāḍyaṃ sarva dōṣa samudbhavaṃ ||” (yōgaśikhōpaniṣat)
(vāyuvu śarīramulōnuṃḍi paiki viḍicinapuḍu ‘ha’ anu śabdamutō pōvunu. marala lōpaliki pōvunapuḍu ‘sa’ anu śabdamu kalugunu - iṭlu paiki pōvunapuḍu, marala lōpaliki vaccunapuḍu ‘ha’ ‘sa’ anu śabdamulu kalugucunē yuṃḍunu. idiyē ‘haṃsa’ yanu maṃtramu - jīvulaṃdaṟu prayatniṃcakanē cēyucunnāru - ī śabdamu guru vākyamu cēta suṣumnā nāḍi yaṃdu viparīta japamu agucunnadi. anagā haṃsaḥ anunadi ‘sōhaṃ’ (saḥ = sō) (a) lōpiṃciṃdi - aṃducēta sō + haṃ = sōhaṃ agucunnadi. ‘sōha’ ‘sōha’ anu maṃtramagucunnadi. haṃsa maṃtramulōni ‘ha’ anagā sūryuḍu, sakāramu caṃdruḍu kanuka ī sūrya caṃdrula aikyamu (kaliyuṭa) haṭha yōgamani ceppa baḍucunnadi. haṭha yōgamucēta samasta rōgamulavalana kalugu jāḍyamu naśiṃcunu).
“ha kāraśca pumān prōktassa iti prakṛtirmitā |
ajapē yaṃ matā śaktiḥ |
biṃdu rdakṣiṇa bhāgastō, vāmabhāgō visargakaḥ |
tēna dakṣina himākhyē bhāgau strī puṃsa saṃjñikau |
biṃduḥ puruṣa ityuktō visargaḥ prakṛtirmitā |
puṃsprakṛtyātmakō haṃsaḥ tadātmakamidaṃ jagat |
puṃ rūpaṃ sāviditvā svaṃ sōhaṃ(a)bhāvamupāgatā |
sa ēva paramā tābhyō manurasya mahā manōḥ |
sakāraṃ ca hakāraṃ ca lōpayitvā prayōjayēt |
saṃdhiṃca pūrva rūpākhyaṃ tatō(a)sau praṇavō bhavēt- “.
(līla koṟaku arthanārīśvarāvatāramu poṃdina parama śivuni yokka puruṣa rūpa bhāgamu ‘ahaṃ’ ani ceppabaḍinadi. prakṛti bhāgamu ‘sa’ ani ceppabaḍucunnadi. ā prakṛti puruṣa rūpamutō tādātmyamunu poṃdunu. ajapā maṃtramu ‘sōhaṃ’ anu maṃtramu kalugunu - dānilō ‘sa’ kāramu ‘ha’ kāramulu lōpiṃcinaṃduna ‘ōṃ’ anu praṇavamu - ōṃkāramaṃtramagucunnadi. ī viṣayamu prapaṃcasāramaṃdu ī kriṃda vidhamugā ceppabaḍinadi: -
‘ha’ kāramu puruṣuḍu, ‘sa’ kāramu prakṛti, ī reṃḍunu kalisi ajapā maṃtramainadi. dīni dakṣiṇa bhāga maṃdu biṃduvu (o eḍama bhāgamaṃdu visarga (ḥ). ī reṃḍu dakṣiṇa eḍama bhāgamulu strī puruṣa saṃjñalu kalavi. biṃduvu puruṣa saṃjña kaladi, visarga prakṛti saṃjña kaladi. puruṣa prakṛtulu “haṃsaḥ”, vāṭi rūpamē yī jagattu - puruṣa rūpamu prakṛtirūpamu ‘sōhaṃ’ ayinadi. haṃsaḥ anunadi ‘sōhaṃ’ ayinadi. dānilōni sa + ō + aha + o) sakāramu, hakāramu, hakāramu lōpiṃcagā (minahāyiṃcagā) ‘ōṃ’ anu reṃḍiṃṭini jata cēyagā ‘ōṃ’ anu praṇavamaṃtramu (ōṃ kāramu) ayinadi.
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.