← Back to హ · Booklets 51–60 (digitized file 6)

హఠయోగము haṭhayōgamu

Original — తెలుగు
  1. ‘హ’ కారః కీర్తిత స్సూర్యః ‘ఠ’ కారశ్చంద్ర ఉచ్యతే |

సూర్యా చంద్రమసౌ యోగాత్ హఠయోగో నిగద్యతే ||. (యోగశిఖోపనిషత్)

(హ = సూర్యుడు, ఠ = చంద్రుడు - సూర్య చంద్రుల సంయోగమువలన - అనగా సూర్యనాడి, చంద్రనాడి అను రెండింటి సం యోగమువలన - లేక, సూర్య చంద్రులనెడి ప్రాణవాయువు, అపానవాయువుల యొక్క సం యోగము వలన, అనగా ప్రాణాయామము చేయుటచేత హఠ యోగము సిద్ధించును).

(వాయు ధారణరూపమైనది, అణిమాది సిద్ధులను కలుగచేయునది, కాని మోక్షమునకు సాధనముకాదు. మోక్షము కోరినవారు జ్ఞానము నభ్యసించవలెను - “జ్ఞానా దేవతు కైవల్యం” (జ్ఞానమువలననే మోక్షము కలుగును) అని చెప్పబడీంది క్నుక. హఠయోగమువలన శారీరికపాటవము కలుగును - దానివలన సుఖము కలుగును, శరీరాగ్యము బాగుగ నుండును, దానివలన దీర్ఘాయువు కలుగును).

(కఠినమగు యోగము - ఒంటికాలుమీదనిలబడి, చేతులు మీదకెత్తి మొదలగు పనులు చేయుతయే కఠినమైన యోగము).

Transliteration
  1. ‘ha’ kāraḥ kīrtita ssūryaḥ ‘ṭha’ kāraścaṃdra ucyatē |

sūryā caṃdramasau yōgāt haṭhayōgō nigadyatē ||. (yōgaśikhōpaniṣat)

(ha = sūryuḍu, ṭha = caṃdruḍu - sūrya caṃdrula saṃyōgamuvalana - anagā sūryanāḍi, caṃdranāḍi anu reṃḍiṃṭi saṃ yōgamuvalana - lēka, sūrya caṃdrulaneḍi prāṇavāyuvu, apānavāyuvula yokka saṃ yōgamu valana, anagā prāṇāyāmamu cēyuṭacēta haṭha yōgamu siddhiṃcunu).

(vāyu dhāraṇarūpamainadi, aṇimādi siddhulanu kalugacēyunadi, kāni mōkṣamunaku sādhanamukādu. mōkṣamu kōrinavāru jñānamu nabhyasiṃcavalenu - “jñānā dēvatu kaivalyaṃ” (jñānamuvalananē mōkṣamu kalugunu) ani ceppabaḍīṃdi knuka. haṭhayōgamuvalana śārīrikapāṭavamu kalugunu - dānivalana sukhamu kalugunu, śarīrāgyamu bāguga nuṃḍunu, dānivalana dīrghāyuvu kalugunu).

(kaṭhinamagu yōgamu - oṃṭikālumīdanilabaḍi, cētulu mīdaketti modalagu panulu cēyutayē kaṭhinamaina yōgamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.