“వ. హేతుమద్భావంబున శోకహేతువహంకార మమకారాత్మకంబయిన ద్వైతభ్రమంబనియును, ద్వైత భ్రమంబునకు గారణంబు దేహంబనియును, దేహంబునకు బీజంబు లింగంబనియును, లింగంబునకు మూలంబు గుణంబులనియును, గుణంబులకు నిదానంబు ప్రకృతియనియును,”బ్రహ్మాహ” మనెయెడు జ్ఞానంబున లీనయై ప్రకృతి లేకుండుననియు, ప్రకృతి యడంగుటయ నైర్గుణ్యంబనియును, నైర్గుణ్యంబువలన గార్య లింగ నాశనంబగు ననియును, గార్యలింగ నాశనంబున నసంభవంబగుననియు, బ్రకృతిం బాసి క్రమ్మఱ స్థూల శరీరప్రాప్తుండుగాక పురుషుండు సమ్యగ్భోగంబున నుండుననియును, నిశ్చయించి, యర్జనుండు విరక్తుండై యూరకుండె“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 15 - 343). (భాగవతము -1-381-వ)
“va. hētumadbhāvaṃbuna śōkahētuvahaṃkāra mamakārātmakaṃbayina dvaitabhramaṃbaniyunu, dvaita bhramaṃbunaku gāraṇaṃbu dēhaṃbaniyunu, dēhaṃbunaku bījaṃbu liṃgaṃbaniyunu, liṃgaṃbunaku mūlaṃbu guṇaṃbulaniyunu, guṇaṃbulaku nidānaṃbu prakṛtiyaniyunu,”brahmāha” maneyeḍu jñānaṃbuna līnayai prakṛti lēkuṃḍunaniyu, prakṛti yaḍaṃguṭaya nairguṇyaṃbaniyunu, nairguṇyaṃbuvalana gārya liṃga nāśanaṃbagu naniyunu, gāryaliṃga nāśanaṃbuna nasaṃbhavaṃbagunaniyu, brakṛtiṃ bāsi krammaṟa sthūla śarīraprāptuṃḍugāka puruṣuṃḍu samyagbhōgaṃbuna nuṃḍunaniyunu, niścayiṃci, yarjanuṃḍu viraktuṃḍai yūrakuṃḍe”. (śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 15 - 343). (bhāgavatamu -1-381-va)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.