← Back to హ · Booklets 51–60 (digitized file 6)

హింసా hiṃsā

Original — తెలుగు
  1. ప్రాణి బాధా; ప్రాణి పీడా

  2. అన్యోన్య తాపక వధాదులు - ఒకరినొకరు బాధ పెట్టుట; చంపుట, మొదలగునవి.

  3. అగ్నిష్టో మాయ పశ్వాలంబన వృత్యతిరిక్త హింసా -

(అగ్నిష్టోమమను యజ్ఞము కొఱకు కానిది హింస).

  1. దేవతోద్దేశేన యత్పశుహనినం తదా లంభనం, న తు హింసా - “యా వేద విహితా హింసా న సా హింసా ఇతి క్తీర్త్త్యతే” ఇతి వచనాత్. భక్షణోద్దేశేన క్రియమానం లౌకిక హననం తు హింసైవ.

(వేదములో చేయవచ్చునని చెప్పబడిన హింస హింసకాదు అని చెప్పబడియుండుటచేత దేవతుల గుఱించి (దేవతుకకు అర్పించుటకై) పశువుని హింసించుట హింసకాదు. ఆహారమువలె తినుటకు చేసిన లౌకిక హింస హింసయే) (హింస కాయికము, వాచికము, మానసికము అని మూడు విధములు)

  1. “శ్లో||. అహింసా తథా విద్ధి వేదోక్తాం, మునిసత్తమ |

రాగిణాం సాపి హింసైవ నిస్పృహాణాం న సామితా |

అరాగేణ చ యత్కర్మ తథాహంకారవర్జితం |

సా హింసైవ, మహాభాగ ! ముముక్షూణాం జితాత్మనాం ||“. (శ్రీదేవీపురాణము)

(వేదములో చేయవలసినదని చెప్పబడినది హింసకాదు. అది రాగులు చేసిన హింసయే యగును. దాని యందు స్పృహలేనివారికి (విరాగులకు) అది హింసకాదు. అహంకారములేక విరాగులు చేసిన కర్మ చేయనిదియే అని విద్వాంసులు చెప్పుదురు).

  1. రాగరూపోపాధినా కృతాతు హింసైవ భవతి. ఆల్బ్రేంధనోపాధినా పశ్వాలంబస్య హింసా త్వం, అన్యథా హింసాత్వభావః.

(రాగముతో - అనురాగముతో - ఫలాపేక్షతో - చేసిన హింస హింస యగును. అగ్నికి తడిసిన కర్రల (పచ్చి కర్రల) వలననే పొగవచ్చును - అట్లుగాకున్న అగ్నికి పొగ ఉండదు. అత్లే రాగముతో పశువును చంపిన అది హింస యగును. ఇతర విధమున హింస చేసినను అది హింస కాదు).

  1. మాంసాశనం యేకుర్వంతితైః కార్యం పశుహింసనం |

మహిషాజ పరాహాణం బలిదానం విశిష్యతే |

దేవ్యగ్రే నిహతా యాంతి పశవః స్వర్గమవ్యయం |

న హింసా పశు జాతత్ర నిఘ్నతాం తత్కృతే(అ)నఘ |

అహింసా యాజ్ఞకే ప్రోక్తా సర్వ శాస్త్ర వినిర్ణయే ||.

(మాంసాహారులు పశుహింస చేయవచ్చును; పోతులు, పందులు మొదలగువాటిని బలియిచ్చుట మేలు - దేవి యెదుట చంపబడిన - బలి యివ్వబడిన - పశువులు అవ్యయమైన స్వర్గమును పొందును - అట్లు పశువులను చంపుట హింస కాదు అని శాస్త్రములన్నియు చెప్పుచున్నవి).

  1. శాస్త్రములో నిషేధించిన ప్రాణులను వధించుట.

  2. “ఆ. శుద్ధ సాధులందు సురలందు శ్రుతులందు

గోవులందు విప్రకోటియందు

ధర్మపదవియందు దగిలి నాయందు వా

డెన్నడలుగు నాడెహింసనొందు“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - 4 - 111)

Transliteration
  1. prāṇi bādhā; prāṇi pīḍā

  2. anyōnya tāpaka vadhādulu - okarinokaru bādha peṭṭuṭa; caṃpuṭa, modalagunavi.

  3. agniṣṭō māya paśvālaṃbana vṛtyatirikta hiṃsā -

(agniṣṭōmamanu yajñamu koṟaku kānidi hiṃsa).

  1. dēvatōddēśēna yatpaśuhaninaṃ tadā laṃbhanaṃ, na tu hiṃsā - “yā vēda vihitā hiṃsā na sā hiṃsā iti ktīrttyatē” iti vacanāt. bhakṣaṇōddēśēna kriyamānaṃ laukika hananaṃ tu hiṃsaiva.

(vēdamulō cēyavaccunani ceppabaḍina hiṃsa hiṃsakādu ani ceppabaḍiyuṃḍuṭacēta dēvatula guṟiṃci (dēvatukaku arpiṃcuṭakai) paśuvuni hiṃsiṃcuṭa hiṃsakādu. āhāramuvale tinuṭaku cēsina laukika hiṃsa hiṃsayē) (hiṃsa kāyikamu, vācikamu, mānasikamu ani mūḍu vidhamulu)

  1. “ślō||. ahiṃsā tathā viddhi vēdōktāṃ, munisattama |

rāgiṇāṃ sāpi hiṃsaiva nispṛhāṇāṃ na sāmitā |

arāgēṇa ca yatkarma tathāhaṃkāravarjitaṃ |

sā hiṃsaiva, mahābhāga ! mumukṣūṇāṃ jitātmanāṃ ||“. (śrīdēvīpurāṇamu)

(vēdamulō cēyavalasinadani ceppabaḍinadi hiṃsakādu. adi rāgulu cēsina hiṃsayē yagunu. dāni yaṃdu spṛhalēnivāriki (virāgulaku) adi hiṃsakādu. ahaṃkāramulēka virāgulu cēsina karma cēyanidiyē ani vidvāṃsulu ceppuduru).

  1. rāgarūpōpādhinā kṛtātu hiṃsaiva bhavati. ālbrēṃdhanōpādhinā paśvālaṃbasya hiṃsā tvaṃ, anyathā hiṃsātvabhāvaḥ.

(rāgamutō - anurāgamutō - phalāpēkṣatō - cēsina hiṃsa hiṃsa yagunu. agniki taḍisina karrala (pacci karrala) valananē pogavaccunu - aṭlugākunna agniki poga uṃḍadu. atlē rāgamutō paśuvunu caṃpina adi hiṃsa yagunu. itara vidhamuna hiṃsa cēsinanu adi hiṃsa kādu).

  1. māṃsāśanaṃ yēkurvaṃtitaiḥ kāryaṃ paśuhiṃsanaṃ |

mahiṣāja parāhāṇaṃ balidānaṃ viśiṣyatē |

dēvyagrē nihatā yāṃti paśavaḥ svargamavyayaṃ |

na hiṃsā paśu jātatra nighnatāṃ tatkṛtē(a)nagha |

ahiṃsā yājñakē prōktā sarva śāstra vinirṇayē ||.

(māṃsāhārulu paśuhiṃsa cēyavaccunu; pōtulu, paṃdulu modalaguvāṭini baliyiccuṭa mēlu - dēvi yeduṭa caṃpabaḍina - bali yivvabaḍina - paśuvulu avyayamaina svargamunu poṃdunu - aṭlu paśuvulanu caṃpuṭa hiṃsa kādu ani śāstramulanniyu ceppucunnavi).

  1. śāstramulō niṣēdhiṃcina prāṇulanu vadhiṃcuṭa.

  2. “ā. śuddha sādhulaṃdu suralaṃdu śrutulaṃdu

gōvulaṃdu viprakōṭiyaṃdu

dharmapadaviyaṃdu dagili nāyaṃdu vā

ḍennaḍalugu nāḍehiṃsanoṃdu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 7 - 4 - 111)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.