“నీవు సుహృద్బాంధవ స్నేహంబు వర్జించి, యింద్రియ సౌఖ్యంబులం బొరయక క్షోణితంబునం గల పుణ్యతీర్థంబుల నవగాహనంబు సేయుచు మానసవాగక్షి శ్రోత్రఘ్రాణేంద్రియ గృహ్యమానంబగు వస్తుజాతం బెల్ల నశ్వరంబుగా నెఱుంగుము- పురుషుండు నానర్థ కామంబుల నంగీకరించి, నిజగుణదోషంబుల మోహితుండై యుండుంగావున, హస్తిపకుండు గంధనాగంబుల బంధించు చందంబున నింద్రియంబులను మనోవికారంబులను నిగ్రహించి యీషణత్రయంబును వర్జించిమోదఖేదంబుల సముండవుగా వర్తించుచు నీ జగంబంతయు నాత్మాధిష్టి తంబుగా నెఱింగి, మాయాదు లాత్మతత్వాధీనంబులుగా దెలియుచు, జ్ఞానవిజ్ఞానయుక్తుడవై యాత్మానుభవ భవ సంతుష్టుండవై విశ్వంబును నన్నుగా భావించి వర్తింపవలయును”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 11 - 91)
“nīvu suhṛdbāṃdhava snēhaṃbu varjiṃci, yiṃdriya saukhyaṃbulaṃ borayaka kṣōṇitaṃbunaṃ gala puṇyatīrthaṃbula navagāhanaṃbu sēyucu mānasavāgakṣi śrōtraghrāṇēṃdriya gṛhyamānaṃbagu vastujātaṃ bella naśvaraṃbugā neṟuṃgumu- puruṣuṃḍu nānartha kāmaṃbula naṃgīkariṃci, nijaguṇadōṣaṃbula mōhituṃḍai yuṃḍuṃgāvuna, hastipakuṃḍu gaṃdhanāgaṃbula baṃdhiṃcu caṃdaṃbuna niṃdriyaṃbulanu manōvikāraṃbulanu nigrahiṃci yīṣaṇatrayaṃbunu varjiṃcimōdakhēdaṃbula samuṃḍavugā vartiṃcucu nī jagaṃbaṃtayu nātmādhiṣṭi taṃbugā neṟiṃgi, māyādu lātmatatvādhīnaṃbulugā deliyucu, jñānavijñānayuktuḍavai yātmānubhava bhava saṃtuṣṭuṃḍavai viśvaṃbunu nannugā bhāviṃci vartiṃpavalayunu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 11 - 91)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.