← Back to హ · Booklets 51–60 (digitized file 6)

హృదాయాకాశం hṛdāyākāśaṃ

Original — తెలుగు
  1. “హృదయమితి పుండరీకాకారో మాంస పిండః (ఖండః); ప్రాణాయతనో అనేక నాడీ సుషిర ఊర్ధ్వనాళో అధో ముఖో విశిస్య మాశేపశౌ ప్రసిద్ధ ఉపలభ్యతే. తస్యాంతర్య ఏష ఆకాశః ప్రసిద్ధ ఏవ కరకాకాశవత్”.

(హృదయమనగా పుండరీకము వంటి ఆకారము గల మాంసపు ముద్ద, ప్రాణమునకు నిలవయిన చోటు - అనేక నాడులు సుషిరములు క్రిందకు మీదకు ప్రసరించునవి కలది. దాని లోపలనుండు ఆకాశము - ఇదియే హృదయాకాశము).

  1. “సవా ఏష మహానిజ ఆత్మా యో(అ)యం విజ్ఞాన మయః ప్రాణేషు య ఏషో (అ)ంతర్హృదయ ఆకాశస్త స్మిం చ్ఛేతే సర్వస్య వశీ” -

(అన్నింటినీ తన వశములో నుంచుకొని యున్నవాడు, మహాత్ముడు, విజ్ఞానమయుడు, జన్మలేనివాడు అయిన ఆత్మ, ప్రాణులలో హృదయము లోపలయున్న ఆకాశములో శయనించి యుండువాడు).

  1. ఆత్మోపలబ్దికి ఉచితమగు స్థానమని హృదయకాశములో నున్నాడని చెప్పుటకాని పరిమిత ప్రదేశము గుఱించి చెప్పుటకాదు. “గుహాం ప్రవిష్టౌ” (గుహను ప్రవేశించినవారు) - జీవబ్రహ్మలు - శరీరములో ప్రవేశించినవాడు జీవుడు, ప్రకృతిలో ప్రవేశించినవాడు పరబ్రహ్మ).
Transliteration
  1. “hṛdayamiti puṃḍarīkākārō māṃsa piṃḍaḥ (khaṃḍaḥ); prāṇāyatanō anēka nāḍī suṣira ūrdhvanāḷō adhō mukhō viśisya māśēpaśau prasiddha upalabhyatē. tasyāṃtarya ēṣa ākāśaḥ prasiddha ēva karakākāśavat”.

(hṛdayamanagā puṃḍarīkamu vaṃṭi ākāramu gala māṃsapu mudda, prāṇamunaku nilavayina cōṭu - anēka nāḍulu suṣiramulu kriṃdaku mīdaku prasariṃcunavi kaladi. dāni lōpalanuṃḍu ākāśamu - idiyē hṛdayākāśamu).

  1. “savā ēṣa mahānija ātmā yō(a)yaṃ vijñāna mayaḥ prāṇēṣu ya ēṣō (a)ṃtarhṛdaya ākāśasta smiṃ cchētē sarvasya vaśī” -

(anniṃṭinī tana vaśamulō nuṃcukoni yunnavāḍu, mahātmuḍu, vijñānamayuḍu, janmalēnivāḍu ayina ātma, prāṇulalō hṛdayamu lōpalayunna ākāśamulō śayaniṃci yuṃḍuvāḍu).

  1. ātmōpalabdiki ucitamagu sthānamani hṛdayakāśamulō nunnāḍani ceppuṭakāni parimita pradēśamu guṟiṃci ceppuṭakādu. “guhāṃ praviṣṭau” (guhanu pravēśiṃcinavāru) - jīvabrahmalu - śarīramulō pravēśiṃcinavāḍu jīvuḍu, prakṛtilō pravēśiṃcinavāḍu parabrahma).
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.