హృదయమందుండు వాడు.
ఈశ్వర స్సర్వభూతానాం హృద్దేశౌ (అ)ర్జున తిష్టతి (శ్రీమద్భగవద్గీత - 18 - 61)
(అర్జునా ! సమస్త భూతములయొక్క హృదయమను ప్రదేశమందు ఈశ్వరుడు - భగవంతుడున్నాడు).
(అన్నింటిలోను నివసించియున్నవాడున్నూ, సర్వమునకు ఈశానుడు (శాసించువాడు), సర్వమునకు అధిపతి అయినవాడు, భూతములను పాలించువాడు అయిన సర్వేశ్వరుడు ప్రాణుల హృదయమందుండు ఆకాశమునందు శయనించుయున్నాడు).
(హృదయాకాశమందున్న పరమేశ్వరుడు అన్వేషింప తగినవాడు అని శ్రుతి చెప్పుచున్నది.
“తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత” (శ్రీమద్భగవద్గీత - 18 - 62)
(హృదయాకాశమందున్న ఆ పరమాత్మను అన్వేషింపవలెను - వెతకి తెలుసుకోవలెను). అంతటిలోనున్న పరమాత్మను హృదయాకాశమందెట్లు తెలుసుకొనుట యనగా - పరమాత్మ ఆకాశమందున్నట్లే హృదాయాకాశమందుండును - అతను భూమి మొదలగువాటి యన్నింటియందు నుండునుగనుక హృదయాకాశమందు కూడ ఉండును).
(అర్భకాకః = చిన్నదైన స్థానము కలవాడు; ఈ ఆత్మ హృదయములోపల అణువు, వ్రీహి, యవలు ధాన్యపుగింజవలె సూక్ష్మమైనదిగా నున్నది - అని శ్రుతి చెప్పుచున్నది. అన్నింటిలోను, అన్నిచోట్ల ఉన్న భగవంతుడు హృదయమను చిన్నవస్తువులో అణువువలె యవలువలె చిన్నవాడుగా నున్నాడని చెప్పబడినది - ఎట్లనగా - దేశములన్నింటికీ శ్రీరామచంద్రుడు అధిపతి అయినను అయోధ్యాపతి యని కూడ చెప్పుట కలదు - అట్లే పరబ్రహ్మ అన్నిచోట్ల, అన్నింటిలోను ఉన్నవాడైనను ఒకచిన్న వస్తువులో నుండుట సంభవమే కనుక అట్లు చెప్పబడినది - సాలగ్రామములో శ్రీహరి యున్నట్లు చెప్పబడినట్లే దానిలో భగవంతుడున్నాడని ఉపాసించిన అతను అనుగ్రహించునేకదా ! సూది రంధ్రములో దారమువలె ఆకాశమన్ని వస్తువులలో నున్నట్లే అణువులో పరబ్రహ్మ ఉండును అనుటలో దోషములేదు - ఇట్లు చెప్పుట ఉపాసన నిమిత్తము, పారమార్థికము.
కిమితి హృదయమేవ ప్రాయేణోచ్యతే? తత్రాహ - హృదయే పరమాత్మనో బుద్ధి వృత్తిర్గ్రాహకభవతి. అతః ఈశ్వరాభివ్యక్త స్థానత్వాత్ తదుక్తరితి | నైతవతా సర్వగతత్వహానిః -
(భగవంతుడు అన్ని దేశములలోను అన్ని వస్తువులలోను ఉన్నపుడు ఒక్క హృదయమే ఎందుకు చెప్పడమైనది - అనగా - హృదయమందలి బుద్ధి గ్రహించును. అందుచేత హృదయము ఈశ్వరాభివ్యక్తస్థానము కనుక - భగవంతుడు కనబడునట్లు చేయుస్థానము కనుక - ఇట్లు చెప్పబడినది. ఇట్లు చెప్పుటవలన భగవంతుడు సర్వగతుడు (అన్నింటిలోనుండువాడు) - అనుటకు హాని లేదు. (భోజరాజు తన ఆస్థానములోనున్న కవులకు కశీ విశ్వనాధుని దర్శించుకొనిరమ్మని ధనము ఇచ్చినపుడు వారందరు ప్రయాణసన్నాహములు చేసుకొనుచున్నను కాళిదాసు ఏమియు చేయకుండెను. రాజు దానికి కారణమడుగగా వారందఱికి విశ్వనాధుడు కాశీలోనే ఉన్నాడు కనుక వారచ్చటికి వెళ్ళుచున్నారు, నాకు మట్టుకు విశ్వనాధుడు నా హృదయములోనే యున్నాడు కనుక నేను కాశీ వెళ్ళనవసరము లేదు అని జబాబు చెప్పెను).
హృదియంత ద్విజానీయాత్ మనసః స్థితే కారణం ||.
(దేనినుండి విషయములు పైకి పోవుచున్నవో, దేనిలో లయమై పోవుచున్నవో అది మనసుయొక్క స్థితికి కారణమగుటవలన అదియే హృదయమని చెప్పబడుచున్నది).
(అన్నింటి యందును అంతర్యామిగా నుండువాడగుటచేత హృదయములో దగ్గరగా నున్నాడు అని ఉపాసనకు వీలగునని అట్లు చెప్పబడినది).
(కట్టెలలోన నుండు అగ్ని పైకి కనబడకుండనుండునట్లు - లోపలనున్నట్లు పైకి తెలియనీయకుండ నుండునట్లు శ్రీకృష్ణభగవానుడు సమస్త భూతముల హృదయమందున్నప్పటికీ పైకి కనబడడు).
(కంఠమందున్నమణి - అది ఉన్నట్లు మరచిపోవుటవలన - కంఠమందే ఉన్నప్పటికీ, తెలియక అది పోయినట్లే, లేనట్లే తలచినట్లు - భగవంతుడు తన హృదయములోనే ఉన్నప్పటికీ, ఉన్నట్లు తెలుసుకొనుట కష్టము).
(అన్నింటి హృదయములోను - అన్నింటి లోపల నేను ఉన్నాను).
(హృదయ పుండరీకే బుద్ధౌ చ సన్నివిష్టః సమ్యక్ నివిష్టః ప్రత్యగాత్మత్వేన స్థితః తత్ర అభివ్యక్తః ఇత్యర్థః).
(ఎల్లపుడు జనుల హృదయ పుండరీకమను బుద్ధిలో ప్రత్యగాత్మగా నుండుటచేత అభివ్యక్తమగువాడు, కనబడువాడు, లేక అట్లు ఉన్నట్లు సూచనలచేత తెలియుచేయువాడు) –
“సీ. అఖిలభూతములందు ఆత్మరూపంబున ఈశుండు హరియుండు నెల్లప్రొద్దు
బుద్ధ్యాది రూపంబుల కానబడును - - - “. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 2 - 36)
(భూతములన్నింటి హృదయము నిలయముగా గలవాడు).
hṛdayamaṃduṃḍu vāḍu.
īśvara ssarvabhūtānāṃ hṛddēśau (a)rjuna tiṣṭati (śrīmadbhagavadgīta - 18 - 61)
(arjunā ! samasta bhūtamulayokka hṛdayamanu pradēśamaṃdu īśvaruḍu - bhagavaṃtuḍunnāḍu).
(anniṃṭilōnu nivasiṃciyunnavāḍunnū, sarvamunaku īśānuḍu (śāsiṃcuvāḍu), sarvamunaku adhipati ayinavāḍu, bhūtamulanu pāliṃcuvāḍu ayina sarvēśvaruḍu prāṇula hṛdayamaṃduṃḍu ākāśamunaṃdu śayaniṃcuyunnāḍu).
(hṛdayākāśamaṃdunna paramēśvaruḍu anvēṣiṃpa taginavāḍu ani śruti ceppucunnadi.
“tamēva śaraṇaṃ gacca sarvabhāvēna bhārata” (śrīmadbhagavadgīta - 18 - 62)
(hṛdayākāśamaṃdunna ā paramātmanu anvēṣiṃpavalenu - vetaki telusukōvalenu). aṃtaṭilōnunna paramātmanu hṛdayākāśamaṃdeṭlu telusukonuṭa yanagā - paramātma ākāśamaṃdunnaṭlē hṛdāyākāśamaṃduṃḍunu - atanu bhūmi modalaguvāṭi yanniṃṭiyaṃdu nuṃḍunuganuka hṛdayākāśamaṃdu kūḍa uṃḍunu).
(arbhakākaḥ = cinnadaina sthānamu kalavāḍu; ī ātma hṛdayamulōpala aṇuvu, vrīhi, yavalu dhānyapugiṃjavale sūkṣmamainadigā nunnadi - ani śruti ceppucunnadi. anniṃṭilōnu, annicōṭla unna bhagavaṃtuḍu hṛdayamanu cinnavastuvulō aṇuvuvale yavaluvale cinnavāḍugā nunnāḍani ceppabaḍinadi - eṭlanagā - dēśamulanniṃṭikī śrīrāmacaṃdruḍu adhipati ayinanu ayōdhyāpati yani kūḍa ceppuṭa kaladu - aṭlē parabrahma annicōṭla, anniṃṭilōnu unnavāḍainanu okacinna vastuvulō nuṃḍuṭa saṃbhavamē kanuka aṭlu ceppabaḍinadi - sālagrāmamulō śrīhari yunnaṭlu ceppabaḍinaṭlē dānilō bhagavaṃtuḍunnāḍani upāsiṃcina atanu anugrahiṃcunēkadā ! sūdi raṃdhramulō dāramuvale ākāśamanni vastuvulalō nunnaṭlē aṇuvulō parabrahma uṃḍunu anuṭalō dōṣamulēdu - iṭlu ceppuṭa upāsana nimittamu, pāramārthikamu.
kimiti hṛdayamēva prāyēṇōcyatē? tatrāha - hṛdayē paramātmanō buddhi vṛttirgrāhakabhavati. ataḥ īśvarābhivyakta sthānatvāt taduktariti | naitavatā sarvagatatvahāniḥ -
(bhagavaṃtuḍu anni dēśamulalōnu anni vastuvulalōnu unnapuḍu okka hṛdayamē eṃduku ceppaḍamainadi - anagā - hṛdayamaṃdali buddhi grahiṃcunu. aṃducēta hṛdayamu īśvarābhivyaktasthānamu kanuka - bhagavaṃtuḍu kanabaḍunaṭlu cēyusthānamu kanuka - iṭlu ceppabaḍinadi. iṭlu ceppuṭavalana bhagavaṃtuḍu sarvagatuḍu (anniṃṭilōnuṃḍuvāḍu) - anuṭaku hāni lēdu. (bhōjarāju tana āsthānamulōnunna kavulaku kaśī viśvanādhuni darśiṃcukonirammani dhanamu iccinapuḍu vāraṃdaru prayāṇasannāhamulu cēsukonucunnanu kāḷidāsu ēmiyu cēyakuṃḍenu. rāju dāniki kāraṇamaḍugagā vāraṃdaṟiki viśvanādhuḍu kāśīlōnē unnāḍu kanuka vāraccaṭiki veḷḷucunnāru, nāku maṭṭuku viśvanādhuḍu nā hṛdayamulōnē yunnāḍu kanuka nēnu kāśī veḷḷanavasaramu lēdu ani jabābu ceppenu).
hṛdiyaṃta dvijānīyāt manasaḥ sthitē kāraṇaṃ ||.
(dēninuṃḍi viṣayamulu paiki pōvucunnavō, dēnilō layamai pōvucunnavō adi manasuyokka sthitiki kāraṇamaguṭavalana adiyē hṛdayamani ceppabaḍucunnadi).
(anniṃṭi yaṃdunu aṃtaryāmigā nuṃḍuvāḍaguṭacēta hṛdayamulō daggaragā nunnāḍu ani upāsanaku vīlagunani aṭlu ceppabaḍinadi).
(kaṭṭelalōna nuṃḍu agni paiki kanabaḍakuṃḍanuṃḍunaṭlu - lōpalanunnaṭlu paiki teliyanīyakuṃḍa nuṃḍunaṭlu śrīkṛṣṇabhagavānuḍu samasta bhūtamula hṛdayamaṃdunnappaṭikī paiki kanabaḍaḍu).
(kaṃṭhamaṃdunnamaṇi - adi unnaṭlu maracipōvuṭavalana - kaṃṭhamaṃdē unnappaṭikī, teliyaka adi pōyinaṭlē, lēnaṭlē talacinaṭlu - bhagavaṃtuḍu tana hṛdayamulōnē unnappaṭikī, unnaṭlu telusukonuṭa kaṣṭamu).
(anniṃṭi hṛdayamulōnu - anniṃṭi lōpala nēnu unnānu).
(hṛdaya puṃḍarīkē buddhau ca sanniviṣṭaḥ samyak niviṣṭaḥ pratyagātmatvēna sthitaḥ tatra abhivyaktaḥ ityarthaḥ).
(ellapuḍu janula hṛdaya puṃḍarīkamanu buddhilō pratyagātmagā nuṃḍuṭacēta abhivyaktamaguvāḍu, kanabaḍuvāḍu, lēka aṭlu unnaṭlu sūcanalacēta teliyucēyuvāḍu) –
“sī. akhilabhūtamulaṃdu ātmarūpaṃbuna īśuṃḍu hariyuṃḍu nellaproddu
buddhyādi rūpaṃbula kānabaḍunu - - - “. (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 2 - 36)
(bhūtamulanniṃṭi hṛdayamu nilayamugā galavāḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.