← Back to క్ష · Booklets 51–60 (digitized file 6)

క్షేత్రజ్ఞః kṣētrajñaḥ

Original — తెలుగు
  1. క్షత్రమును తెలిసినవాడు.క్షేత్రమనగాపొలము - దాని సంగతి పూర్తిగా తెలిసినవాడు - దానిలో దేనిని ఎట్లు పండించుటకు వీలగునో బాగుగా తెలిసినవాడు - అట్లే క్షేత్రమనగా శరీరము. దాని లోపలనుండి దానిని బాగుగా నెఱిగినవాడు - జీవుడు, ఆత్మ (జీవాత్మ) (పరమాత్మ) అన్ని జీవుల శరీరము అను ఉపాధిలో అంతర్యామిగా నుండు జీవాత్మ - పరమాత్మ.

  2. సర్వ ప్రాణినా మంతర్యామి తయా ఆత్మరూపః -

(సమస్త ప్రాణులలోను, జీవులలోను, అంతర్యామిగా నుండు ఆత్మ అయినవాడు).

  1. “క్షేత్రం శరీరం జానాతీతి క్షేత్రజ్ఞః” (శ్రీశంకరః)

(క్షేత్రమనగా శరీరము; దానిని తెలిసినవాడు క్షేత్రజ్ఞుడు).

  1. క్షేత్రాఖ్యాని శరీరాణి తేషాం చైవ యధా సుఖం |

తానిదేత్తిసయోగాత్మా తతః క్షేత్రజ్ఞ ఉచ్యతే ||.

(క్షేత్రములనగా శరీరములు - వాటి సుఖమును తెలిసినవాడు యోగాత్ముడు,క్షేత్రజ్ఞుడు).

  1. “క్షేత్రాణి హి శరీరాణి బీజాం చాపి శుభా శుభం |

తాని వేత్తి స యోగాత్మా, తతః క్షేత్రజ్ఞ ఉచ్యతే -“. (మహాభారతే)

(శరీరములు క్షేత్రములు - పొలము వంటివి - దానిలో నాటు విత్తనములు శుభా శుభములు, కష్ట సుఖములు, సుఖ దుఃఖములు, పాప పుణ్యములు - వాటిని తెలిసినవాడు ప్రత్యగాత్మ - శరీరములోనుండు జీవుడు - అతనే క్షేత్రజ్ఞుడు అని చెప్పబడుచున్నాడు).

  1. ఏ తత్ శరీరం క్షేత్రం యః వేత్తి, విజానాతి ఆపాద తల మస్తకం, జ్ఞానేన విషయీ కరోతి, స్వాభావికేన వా వివేత్తి విభాగతః, తం వేదితారం ప్రాహుః కధయంతి క్షేత్రజ్ఞః ఇతి.

(ఈ శరీరము క్షేత్రము; దీనిని పాదము మొదలు శిరస్సు వరకు తెలుసుకొనువాడు - అనగా, జ్ఞానముచేత విషయములను తెలుసుకొనునో, లేక స్వభావమువలన తెలుసుకొనునో వానిని క్షేత్రజ్ఞుడని చెప్పుచున్నారు).

  1. “ప్రతి దేహంతు చిన్మాత్రో ఘటాకాశ ఇవ స్థితః |

దేహం సాక్షితయా జానన్ క్షేత్రజ్ఞ ఇతి కధ్యతే ||“.

(ఘటాకాశమువలె - కుండలోనుండు ఆకాశమువలె ప్రతి దేహమందు చైతన్య స్వరూపుడగు పరమాత్మ సాక్షిగా నుండి దానిని తెలుసుకొనుచున్నాడు కనుక క్షేత్రజ్ఞుడు).

  1. క్షేత్రం శరీరం యథావత్ జానాతీతి క్షేత్రజ్ఞః -

(శరీరమను క్షేత్రమును యథార్థముగా తెలిసినవాడు క్షేత్రజ్ఞుడు).

  1. విశ్వమూర్థా విశ్వభుజో విశ్వపాదాక్షి నాసికః |

ఏకశ్చరతి దేహేషు స్యైర చారీ యథా సుఖం ||

క్షేత్రాణి చ శరీరాణి జ్ఞానాని చ శుభా శుభే |

తాని వేత్తి స యోగాత్మా తతః క్షేత్రజ్ఞ ఉచ్యతే ||.

(అనేకమైన శిరస్సులు, భుజములు, పాదములు, కళ్ళు, నాలుకలు గల ప్రపంచములోని శరీరములన్నియు భగవంతునివే కనుక పరమాత్మ ఒక్కడే ఇన్ని దేహములందు తన యిష్టము వచ్చినట్లు సంచరించుచున్నాడు. ఈ శరీరములన్నియు క్షేత్రములు - వాతిని తెలుసుకొనుట యనగా శరీరముల వలన కలుగు శుభా శుభములను - కష్ట సుఖములను తెలుసుకొనువాడు, కనుక క్షేత్రజ్ఞుడని చెప్పబడుచున్నాడు).

  1. “క్షేత్రం జ్ఞం చాపి మాం విద్ది” (శ్రీమద్భగవద్గీత - 13 -2)

“ఇత్యాదినా అంతర్యామి రూపేణ సర్వస్యాత్మత యైక్యాభిధానాం”. (శ్రీమాన్ రామానుజః)

(క్షేత్రజ్ఞుడు - క్షేత్రములన్నింటియందుండు క్షేత్రజ్ఞుడుగా నుండువాడను నేనే అను తెలుసుకొనుము - అని శ్రీమద్భగవద్గీతలో శ్రీకృష్ణభగవానుడు చెప్పుటవలన అంతర్యామిగా అన్ని శరీరములలోనున్నవాడు ఒక్కడే అయిన భగవంతుడగుటచేత అన్ని శరీరములను - క్షేత్రములందును - భగవంతుడనువాడు ఒక్కడే యగుటవలన అన్ని శరీరములకు క్షేత్రజ్ఞుడొక్కడే).

  1. “ఉన్మీలిత నిమీలత మధ్యస్థ జీవ పరమాత్మనోర్మధ్యే జీవాత్మ క్షేత్రజ్ఞః ఇతి విజ్ఞాయతే”. (శారీరకోపనిషత్)

(ఉన్మీలత నిమీలతముల మధ్య - కనురెప్పపాటులమధ్యనుండు జీవ పరమాత్మలలో జీవాత్మ క్షేత్రజ్ఞుడని చెప్పబడుచున్నాడు).

  1. అంతర్యామీ; ఆత్మవ్యాపీ -

(అన్నింటిలోను సంచరించుచు నుండువాడు).

  1. బుద్ధి మొదలగువాటికి ద్రష్టయై యుండువాడు.

  2. “పంచ సూక్ష్మ భూతములు, మహాభూతములకు కారణమగు అహంకారము, అహంకార కారణమగుబుద్ధి, బుద్ధికి కారణమగు మూల ప్రకృతి (అవ్యాకృత బ్రహ్మ శక్తి), దశేంద్రియములు, మనస్సు, ఇంద్రియ విషయములగు స్థూల భూతములు (శబ్దాదులు), ఇచ్ఛా ద్వేష దుఃఖములును, వీటి సంఘాతమైన శరీరమును దాని యందు తోచు చేతనమును, ధృతియును కలిసి క్షేత్రమనబడుచున్నది”.

“ఏ తే పరాపరే ప్రోక్తే క్షేత్ర క్షేత్రజ్ఞ లక్షణే |

ప్రకృతి యోని రప్యేషాం ఏతద్యోనీని తానివై |

చరా చరా సర్వాణి భూతానీత్యుపధారయ |

ఏవం చోపాధి భూతమే క్షేత్ర క్షేత్రజ్ఞ లక్షణే |

జగతః ప్రకృతీ యస్మాత్ తద్ద్వారాహం తతో హరిః |

సర్వజ్ఞో(అ)నంత శక్తిశ్చ మాయోపాధి రధీశ్వరః |

సర్వస్య కార్య వర్గస్య జగతో జన్మ కారణం |

వినాశ కారణం తద్వత్ స్థిర జంగమ రూపిణః |

స్వాప్నిక స్యేవ విశ్వస్య మాయికస్యాస్య సర్వతః |

ఉపాదానం తథా ద్రష్టా మాయావి త్వాదహం హరిః ||“. (గీతాభావప్రకాశము - 7- 37 to 41)

(క్షేత్ర క్షేత్రజ్ఞ లక్షణములైనట్టి యీ నా పరాప్రకౄతి అపరా ప్రకృతి యీ చరాచరములైన సమస్త భూతములకు యోని (అనగా, పుట్టుక స్థానము). ఈ చరాచర రూపములైన భూతములన్నియు నీ ప్రకృతిలోనుండి పుట్టినవి. ఈ భూతములుకా ప్రకృతి యోనిగా గలవి. ఈ ప్రకారము క్షేత్ర క్షేత్రజ్ఞ లక్షణములు గల ఈ ప్రకృతి నాకు ఉపాధి. సర్వజ్ఞుడు, హరి, అనంతశక్తిమంతుడు అయిన నాకు ఈ ప్రకృతి ఉపాధి యగుటవల్ల నేను ఈ మాయ యను ఉపాధిగలవాడనై, అధీశ్వరుడనై కార్యమైన యా సమస్త జగత్తునకు సృష్టి కారణమై యున్నాను. ఆ ప్రకారమే చరాచర రూపమైన దీనికంతకు వినాశ కారణము (లయ కారణము) నేనే. స్వప్నమువలె మాయాకార్యము (ప్రకృతి యొక్క కార్యము) యీ సర్వ ప్రపంచమునకు నేను ఉపాదాన కారణము - మాయ అయిన ప్రకృతితో కలిసియుండు వాడనగుటచేత మాయ (ప్రకృతి) యీ కార్యమును చేయుచుండగా ఊరక చూచుచుండువాడనగుటచేత ద్రష్టను) (ఊరక చూచుచుండువాడను).

  1. “సర్వా వాసం వాసుదేవం క్షేత్రజ్ఞం విద్ధి తత్పతః”

(అన్నింటిలోను నివసించియుండు వాసుదేవుడు క్షేత్రజ్ఞుడని తెలుసుకొనుము).

  1. క్షేత్రజ్ఞో ద్వివిధః - త్వం పదార్థో జీవః,తత్పదార్థ ఈశ్వరః -

(క్షేత్రజ్ఞుడు రెండు విధములు - ‘తత్వమసి’ అను మహావాక్యములోని ‘త్వం’ (నీవు) అను పదమునకు అర్థము అయిన జీవుడు; తత్ (= అది) (ఆ పరమాత్మ) పదమునకు అర్థమయిన ఈశ్వరుడు).

  1. క్షేత్రజ్ఞుని యితర పేర్లు - ప్రత్యగాత్మ, అంతర్యామి, కూటష్తుడు, సాక్షి, ద్రష్ట, ఉపద్రిష్ట, తురీయుడు,.
Transliteration
  1. kṣatramunu telisinavāḍu.kṣētramanagāpolamu - dāni saṃgati pūrtigā telisinavāḍu - dānilō dēnini eṭlu paṃḍiṃcuṭaku vīlagunō bāgugā telisinavāḍu - aṭlē kṣētramanagā śarīramu. dāni lōpalanuṃḍi dānini bāgugā neṟiginavāḍu - jīvuḍu, ātma (jīvātma) (paramātma) anni jīvula śarīramu anu upādhilō aṃtaryāmigā nuṃḍu jīvātma - paramātma.

  2. sarva prāṇinā maṃtaryāmi tayā ātmarūpaḥ -

(samasta prāṇulalōnu, jīvulalōnu, aṃtaryāmigā nuṃḍu ātma ayinavāḍu).

  1. “kṣētraṃ śarīraṃ jānātīti kṣētrajñaḥ” (śrīśaṃkaraḥ)

(kṣētramanagā śarīramu; dānini telisinavāḍu kṣētrajñuḍu).

  1. kṣētrākhyāni śarīrāṇi tēṣāṃ caiva yadhā sukhaṃ |

tānidēttisayōgātmā tataḥ kṣētrajña ucyatē ||.

(kṣētramulanagā śarīramulu - vāṭi sukhamunu telisinavāḍu yōgātmuḍu,kṣētrajñuḍu).

  1. “kṣētrāṇi hi śarīrāṇi bījāṃ cāpi śubhā śubhaṃ |

tāni vētti sa yōgātmā, tataḥ kṣētrajña ucyatē -“. (mahābhāratē)

(śarīramulu kṣētramulu - polamu vaṃṭivi - dānilō nāṭu vittanamulu śubhā śubhamulu, kaṣṭa sukhamulu, sukha duḥkhamulu, pāpa puṇyamulu - vāṭini telisinavāḍu pratyagātma - śarīramulōnuṃḍu jīvuḍu - atanē kṣētrajñuḍu ani ceppabaḍucunnāḍu).

  1. ē tat śarīraṃ kṣētraṃ yaḥ vētti, vijānāti āpāda tala mastakaṃ, jñānēna viṣayī karōti, svābhāvikēna vā vivētti vibhāgataḥ, taṃ vēditāraṃ prāhuḥ kadhayaṃti kṣētrajñaḥ iti.

(ī śarīramu kṣētramu; dīnini pādamu modalu śirassu varaku telusukonuvāḍu - anagā, jñānamucēta viṣayamulanu telusukonunō, lēka svabhāvamuvalana telusukonunō vānini kṣētrajñuḍani ceppucunnāru).

  1. “prati dēhaṃtu cinmātrō ghaṭākāśa iva sthitaḥ |

dēhaṃ sākṣitayā jānan kṣētrajña iti kadhyatē ||“.

(ghaṭākāśamuvale - kuṃḍalōnuṃḍu ākāśamuvale prati dēhamaṃdu caitanya svarūpuḍagu paramātma sākṣigā nuṃḍi dānini telusukonucunnāḍu kanuka kṣētrajñuḍu).

  1. kṣētraṃ śarīraṃ yathāvat jānātīti kṣētrajñaḥ -

(śarīramanu kṣētramunu yathārthamugā telisinavāḍu kṣētrajñuḍu).

  1. viśvamūrthā viśvabhujō viśvapādākṣi nāsikaḥ |

ēkaścarati dēhēṣu syaira cārī yathā sukhaṃ ||

kṣētrāṇi ca śarīrāṇi jñānāni ca śubhā śubhē |

tāni vētti sa yōgātmā tataḥ kṣētrajña ucyatē ||.

(anēkamaina śirassulu, bhujamulu, pādamulu, kaḷḷu, nālukalu gala prapaṃcamulōni śarīramulanniyu bhagavaṃtunivē kanuka paramātma okkaḍē inni dēhamulaṃdu tana yiṣṭamu vaccinaṭlu saṃcariṃcucunnāḍu. ī śarīramulanniyu kṣētramulu - vātini telusukonuṭa yanagā śarīramula valana kalugu śubhā śubhamulanu - kaṣṭa sukhamulanu telusukonuvāḍu, kanuka kṣētrajñuḍani ceppabaḍucunnāḍu).

  1. “kṣētraṃ jñaṃ cāpi māṃ viddi” (śrīmadbhagavadgīta - 13 -2)

“ityādinā aṃtaryāmi rūpēṇa sarvasyātmata yaikyābhidhānāṃ”. (śrīmān rāmānujaḥ)

(kṣētrajñuḍu - kṣētramulanniṃṭiyaṃduṃḍu kṣētrajñuḍugā nuṃḍuvāḍanu nēnē anu telusukonumu - ani śrīmadbhagavadgītalō śrīkṛṣṇabhagavānuḍu ceppuṭavalana aṃtaryāmigā anni śarīramulalōnunnavāḍu okkaḍē ayina bhagavaṃtuḍaguṭacēta anni śarīramulanu - kṣētramulaṃdunu - bhagavaṃtuḍanuvāḍu okkaḍē yaguṭavalana anni śarīramulaku kṣētrajñuḍokkaḍē).

  1. “unmīlita nimīlata madhyastha jīva paramātmanōrmadhyē jīvātma kṣētrajñaḥ iti vijñāyatē”. (śārīrakōpaniṣat)

(unmīlata nimīlatamula madhya - kanureppapāṭulamadhyanuṃḍu jīva paramātmalalō jīvātma kṣētrajñuḍani ceppabaḍucunnāḍu).

  1. aṃtaryāmī; ātmavyāpī -

(anniṃṭilōnu saṃcariṃcucu nuṃḍuvāḍu).

  1. buddhi modalaguvāṭiki draṣṭayai yuṃḍuvāḍu.

  2. “paṃca sūkṣma bhūtamulu, mahābhūtamulaku kāraṇamagu ahaṃkāramu, ahaṃkāra kāraṇamagubuddhi, buddhiki kāraṇamagu mūla prakṛti (avyākṛta brahma śakti), daśēṃdriyamulu, manassu, iṃdriya viṣayamulagu sthūla bhūtamulu (śabdādulu), icchā dvēṣa duḥkhamulunu, vīṭi saṃghātamaina śarīramunu dāni yaṃdu tōcu cētanamunu, dhṛtiyunu kalisi kṣētramanabaḍucunnadi”.

“ē tē parāparē prōktē kṣētra kṣētrajña lakṣaṇē |

prakṛti yōni rapyēṣāṃ ētadyōnīni tānivai |

carā carā sarvāṇi bhūtānītyupadhāraya |

ēvaṃ cōpādhi bhūtamē kṣētra kṣētrajña lakṣaṇē |

jagataḥ prakṛtī yasmāt taddvārāhaṃ tatō hariḥ |

sarvajñō(a)naṃta śaktiśca māyōpādhi radhīśvaraḥ |

sarvasya kārya vargasya jagatō janma kāraṇaṃ |

vināśa kāraṇaṃ tadvat sthira jaṃgama rūpiṇaḥ |

svāpnika syēva viśvasya māyikasyāsya sarvataḥ |

upādānaṃ tathā draṣṭā māyāvi tvādahaṃ hariḥ ||“. (gītābhāvaprakāśamu - 7- 37 to 41)

(kṣētra kṣētrajña lakṣaṇamulainaṭṭi yī nā parāprakṝti aparā prakṛti yī carācaramulaina samasta bhūtamulaku yōni (anagā, puṭṭuka sthānamu). ī carācara rūpamulaina bhūtamulanniyu nī prakṛtilōnuṃḍi puṭṭinavi. ī bhūtamulukā prakṛti yōnigā galavi. ī prakāramu kṣētra kṣētrajña lakṣaṇamulu gala ī prakṛti nāku upādhi. sarvajñuḍu, hari, anaṃtaśaktimaṃtuḍu ayina nāku ī prakṛti upādhi yaguṭavalla nēnu ī māya yanu upādhigalavāḍanai, adhīśvaruḍanai kāryamaina yā samasta jagattunaku sṛṣṭi kāraṇamai yunnānu. ā prakāramē carācara rūpamaina dīnikaṃtaku vināśa kāraṇamu (laya kāraṇamu) nēnē. svapnamuvale māyākāryamu (prakṛti yokka kāryamu) yī sarva prapaṃcamunaku nēnu upādāna kāraṇamu - māya ayina prakṛtitō kalisiyuṃḍu vāḍanaguṭacēta māya (prakṛti) yī kāryamunu cēyucuṃḍagā ūraka cūcucuṃḍuvāḍanaguṭacēta draṣṭanu) (ūraka cūcucuṃḍuvāḍanu).

  1. “sarvā vāsaṃ vāsudēvaṃ kṣētrajñaṃ viddhi tatpataḥ”

(anniṃṭilōnu nivasiṃciyuṃḍu vāsudēvuḍu kṣētrajñuḍani telusukonumu).

  1. kṣētrajñō dvividhaḥ - tvaṃ padārthō jīvaḥ,tatpadārtha īśvaraḥ -

(kṣētrajñuḍu reṃḍu vidhamulu - ‘tatvamasi’ anu mahāvākyamulōni ‘tvaṃ’ (nīvu) anu padamunaku arthamu ayina jīvuḍu; tat (= adi) (ā paramātma) padamunaku arthamayina īśvaruḍu).

  1. kṣētrajñuni yitara pērlu - pratyagātma, aṃtaryāmi, kūṭaṣtuḍu, sākṣi, draṣṭa, upadriṣṭa, turīyuḍu,.
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.