భూమి,పొలము,మడి, పుణ్యభూమి; శరీరము; యోని -
ఉత్పత్తి భూమిః -
(తనలోనుండి ఇంకొక వస్తువును పుట్టించునది; భూమి; సస్యములను పండించునది; పొలము; కార్య వస్తువులకు కారణమైనది).
(వ్రీహి, యవలు మొదలగు ధాన్యములకు - సస్యములకు ప్రకృతివలె ఉపదానకారణమైనది).
(భోగమునకు క్షేత్రము - అనుభవించుటకు ఉపాధి వంటిది. స్థూలశరీరము లేనిదే అనుభవము లేదు. క్షతత్రాణము అనుటవలనను క్షేత్రమువలె (దున్నబడు భూమి వలె) కర్మలు అను బీజము ఫలించుటకు తగిన స్థానము అగుటవలన శరీరము క్షేత్రమని చెప్పుట ఉచితము).
క్షేత్రమను పొలమునందు నాటబడిన బీజముయొక్క ఫలము వాటి వాటి స్వభావముననుసరించి కాలానుసారముగ ప్రకటమగునట్లు క్షేత్రమందు - శరీరమునందు నాటబడినట్టి కర్మలయొక్క సంస్కార రూపములగు బీజము యొక్క ఫలము వాటి స్వభావముననుసరించి కాలానుసారముగ ప్రకటమగుచుండుటచేత శరీరమునకు క్షేత్రమను పేరు కలిగినది.
ఇంద్రియాణి దశైకం చ పంచ చేంద్రియగోచరాః |
ఇచ్ఛాద్వేషః సుఖం దుఃఖం సంఘాతశ్చేతనా ధృతిః |
ఏ తత్ క్షేత్రం సమాసేన సవికారముదాహృతం || “. (శ్రీమద్భగవద్గీత - 13 - 5, 6)
(పంచమహాభూతములు, అహంకారము, బుద్ధి, అవ్యక్తము కర్మేంద్రియములైదు, అయిదు జ్ఞానేంద్రియములు, శబ్ద స్పర్శ రస రూప గంధములు అను అయిదు విషయములు, ఇచ్ఛా, ద్వేషము, సుఖము, దుఃఖము, మనస్సు, వీటి అన్నింటి సంఘాతము, అంతఃకరణవృత్తులతో కలసి, ధృతి, చైతన్యము - ఇవన్నియు కలిసి క్షేత్రమని చెప్పబడుచున్నది. దీనిని బట్టి క్షేత్రమనగా స్థూల శరీరమే కాక దృశ్యపదార్థములన్నియు క్షేత్రమే. ప్రకృతి, దాని వికారములు - అనగా, ఆ ప్రకృతి సృష్టిలోని వస్తువులన్నింటిగా మారినవన్నియు క్షేత్రమనే చెప్పవలెను - చతుర్వింశతి తత్వమయ సకల జీవ స్థూల శరీరములు - క్షేత్రములే).
సస్యము అభివృద్ధినొందుటకు - ఫలించుటకు - భూమి ఆధారభూతమై యున్నట్లు జీవుని హృదయాంతరమందలి జ్ఞాన బీజము అభివృద్ధినొంది కాలాంతరమున మోక్షఫలము నొసగుటకై ఈ శరీరము ఆధారమగుచున్నది. మోక్షసాధనములు - ఇతర పురుషార్థసాధనములు ఈ శరీరముండిననే చేయవచ్చును - ఇట్లు శరీరము ధర్మ బీజమునకు జ్ఞాన బీజమునకు క్షేత్రమువలె ఉపచరించుచున్నది. అందుచేత శరీరము క్షేత్రమని చెప్పబడుచున్నది - క్షేత్రమువలె ఉపచరించునది శరీరము).
క్షీయంతే అనివసంతి జీవాః ఇతి క్షేత్రం.
(జీవులు పుట్టి పెరిగి క్షీణించుచున్నారు - భూమిమీద సస్యములు పుట్టి, పెరిగి క్షీణించినట్లు - కనుక క్షేత్రమనగా శరీరము).
(అవిద్య వలన ఆత్మను నాశనమొనర్చునదియు, విద్యవలన ఆత్మను రక్షించునదియు) అవిద్యయనగా స్థూల సూక్ష్మ శరీరముల ఆత్మాభిమానము, విద్యయనగా ఆత్మ శరీరముకంటె వేఱు అను వివేకము).
(సుఖ దుఃఖములననుభవించుచు భోగాపవర్గములను సాధించు చేతనునకు (జీవికి) ఆధారమగుటవల్ల కలిగిన భూతసంఘాతము - ప్రకృతి మొదలు పృధివి వరకుగల వస్తువులకు ఆరంభమైనదిన్నీ, ఇంద్రియములకు ఆశ్రయమైనదిన్నీ, ఇచ్ఛాద్వేష సుఖ దుఃఖములను వికారముల సంఘాతమైనదిన్నీ చేతనునికి (జీవునకు) సుఖదుఃఖములకు ప్రయోజనకరమైనదిన్నీ యగునది క్షేత్రమని చెప్పబడుచున్నది).
ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః ||. (శ్రీమద్భగవద్గీత - 13 - 1)
(ఈ శరీరము క్షేత్రమని చెప్పబడుచున్నది; దీనిని తెలిసినవాడు క్షేత్రజ్ఞుడు అని చెప్పబడుచున్నాడు. భగవంతుని యొక్క అపరా ప్రకృతితో అతని పరాప్రకృతి కలియగనే అపరాప్రకృతి అనేక వికారములను పొంది జీవుల అనుభవము నీమిత్తము (భోగము కొఱకు) శరీరముగా మారుచున్నది - ఇది పొలము దున్ని పండించుటనెఱిగిన కర్షకుడువలెనే - ఏ పంట ఎప్పుడు ఎట్లు పండించవలెనో తెలిసినట్లు, త్రిగుణములుగల ఆ పరాప్రకృతిలోనుండి ఏ వస్తువులు పుట్టించవచ్చునో, లేక, దానిని ఏ ఏ వస్తువులుగా మారునట్లు చేయనగునో అను విషయము తెలిసినవాడు భగవంతుడు తన పరాశక్తితో దానిలో ప్రవేశించి, దానికి చైతన్యము కలిగించి, దానిలోనుండి యీ సృష్టిలోని సమస్త వస్తువులను పుట్టినట్లు చేయుచున్నాడు. కనుక భగవంతుడు క్షేత్రమగు ఈ శరీరమును బాగుగా తెలిసినవాడు కనుక క్షేత్రజ్ఞుడు అని చెప్పబడుచున్నాడు).
(క్షేత్రములని చెప్పబడు సర్వ శరీరములందు చైతన్యశక్తిరూపములో నుండు నేనే (భగవంతుడే) క్షేత్రజ్ఞుడు అని తెలుసుకొనుము).
(ప్రకృతిలోనుండి కలిగినవన్నియు శరీరములే క్షేత్రములే - వాటిలో చిచ్ఛక్తి రూపంలోనున్న క్షేత్రజ్ఞుడు, అనగా, భగవంతుని అపరాశక్తి అయిన ప్రకృతి, దాని వికారములన్నియు క్షేత్రములు - వాటిలో పరాశక్తిరూపములో ఉన్న భగవంతుడు క్షేత్రజ్ఞుడు).
క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత||. (శ్రీమద్భగవద్గీత - 13 - 33)
(యథా ఏకః రవిః (సవితా, ఆదిత్యః) కృత్స్నం లోకం ప్రకాశయతి (అవభాసయతి) తథా లోకం ప్రకాశయతి (అవభాసయతి) తథా అవ్యక్తాది స్థావరాంతం మహాభూతాదిపృధ్యంతం క్షేత్రం ఏకస్సన్ క్షేత్రీ (పరమాత్మా ఇత్యర్థః) ప్రకాశయతి. (శ్రీశంకరః)
(ఒకడే అయిన సూర్యుడు లోకములన్నింటిని ప్రకాశింపచేయుచున్నట్లే అవ్యక్తము (ప్రకృతి) మొదలు స్థావరములవఱకు, మహాభూతములు మొదలు పృధివి వఱకు గల క్షేత్రమును క్షేత్రీ (క్షేత్రము గలవాడు) లేక, క్షేత్రజ్ఞుడు అగు పరమాత్మ అన్ని క్షేత్రములలోనుండి వాటి నన్నింటిని ప్రకాశింపచేయుచున్నాడు).
“యథా ఏకః ఆదిత్యం స్వయం ప్రభయా కృత్స్నం ఇమం లోకం ప్రకాశయతి, తథా క్షేత్రమపి క్షేత్రీ కృత్స్నం బహిరాంతశ్చ ఆపాద తల మస్తకం స్వకీయేన జ్ఞానేన ప్రకాశయతి”. (శ్రీమాన్ రామానుజః)
(బహిస్త్వగాదిః. అంతర్మాంసాదిః, ఏకైకస్య శరీరస్య అవయవభేద ప్రయుక్త నానాత్వేన ఆత్మ వ్యతిరేకప్రద ప్రదర్శనార్థం అవయవేషు కస్య చిద్వే దిత్వ శంక వ్యుదాసార్థం కృత్స్న శబ్దః ఇతి భావః). (శ్రీవేదాంత దేశికః)
(ఒకడే అయిన ఆదిత్యుడు (సూర్యుడు) తన కాంతిచేత ఈ లోకమునంతను ప్రకాశింపచేయుచున్నాడు. ఆ ప్రకారముగానే క్షేత్రము లోపల పైన - అనగా, పైన చర్మమును లోపల అనగా మాంసము మొదలగు వాటిని, పాదము మొదలు శిరస్సు వరకుగల అవయవములన్నింటిని క్షేత్రజ్ఞుడు (పరమాత్మ) తన జ్ఞానముచేత ప్రకాశింపచేయ్చున్నాడు).
అనుగ్రాహక భావేన క్షేత్రవత్ క్షేత్రముచ్యతే |
సర్వేషాం చైవ ధర్మాణా ముత్పాదకతయా తథా |
అయం తు పరమో ధర్మో యద్యోగేనాత్మ దర్శనం |
ఆత్మజ్ఞాన మయోధర్మః సాధ్యతే (అ)త్ర ముముక్షుభిః |
క్షయాత్ సమస్త ధర్మాణా మపనర్గేన లాభతః |
త్రాణభూతం ముముక్షోస్తద్ధర్మ క్షేత్రం శరీరకం |
క్షేత్రాణాం పరమం క్షేత్రం శరీరం క్షేత్రముచ్యతే ||“. (గీతాభావప్రకాశము - 1 - 109 to 113)
(కరణములనగా ఇంద్రియములు, వాటికి క్షేత్రము లేక స్థానమైనది శరీరము. క్షేత్రము అనుగ్రాహకము కనుక శరీరము క్షేత్రముగా గ్రహించబడుచున్నది. సర్వ ధర్మములకు ఉత్పాదకమైనది, అనగా, శరీరము కలుగుటచేతనే సమస్తమైన ధర్మములు చేయబడుచున్నవి. పరమ పురుషార్థమైన ధర్మము మోక్షము - యోగముచేత పొందతగినది - ఇది శరీరముండిననే సాధించుటకు వీలగును. అందుచేత మోక్షము కోరువానిని రక్షించునవి. అందుచేత శరీరము క్షేత్రములన్నింటిలోను ఉత్కృష్టమైన క్షేత్రము - క్షేత్రములన్నింటిలోను భగవంతుడున్నట్లే శరీరములో కూడ నున్నాడు -
శరీరాది చతుష్ట యస్య దుష్టత్వం వైరాగ్యార్థం శ్రుత్యా -“భగవన్నస్థి చర్మ స్నాయుమజ్జా మాంస శుక్ల సోణిత శ్లేష్మాశ్రు దూషికా, విణ్మూత్ర వాత పిత్త కథ సంఘాతే దుర్గం ధే నిస్సారే అస్మింశ్ఛరీరే కిం కామ భోగైః ?”.
(క్షేత్రమనగా శరీరము - ఎట్లనగా - విణ్మూత్ర స్వేద శ్లేష్మములు కలిగి, ఊపిరి తీయుచు, వదలుచుండుటవలన భస్త్రిక వలె నుండునది; నీటి బుడగవలె ప్రతి నిమిషము నశించి పోవునను భయము కలది; అధ్యాత్మిక, ఆధిభౌతిక ఆధిదైవిక తాపత్రయము కలది; అగుటచేత దుఃఖము కలిగించునది; సుషుప్త్యవస్థయందు, మూర్చావస్థయందు చైతన్యము లేనిదగుటచేతకూడ గోడ, కఱ్ఱ, ఱాయివలె నుండునది; ఇందుచేత నిత్యశుద్ధ బుద్ధ ముక్తుడు అయిన పరమాత్మ స్వరూపముకన్న వేఱయినది. ఇటువంటి శరీరము భోక్త భోగ్య వస్తువు (తను యింకొక దానిని తినునది, తాను ఇంకొకదానికి ఆహారమగునది) కనుక అనాత్మ (ఆత్మ కానిది) యని తెలియవలెను).
(నాలుగు విధములైన శరీరము దుష్టమైనదని శ్రుతి ఇట్లు చెప్పుచున్నది : - అస్థి (యముకలు), చర్మము, స్నాయువు, మజ్జ, మాంసము, శుక్లము, శోణితము, శ్లేష్మము, అశ్రువులు, విణ్మూత్రములు, వాతము, పైత్యము, కఫము అను వాటితో నిండియుండునదిన్నీ, దుర్గంధము కలది (కంపు కొట్టునదిన్నీ) సారము లేనిదిన్నీ అయిన ఈ శరీరముతో ఏమి భోగములు అనుభవించవచ్చును ?).
(“దేవోహం”, మనుష్యోహం ఇత్యనంతజాతి భేదోప లక్షణం; “స్థూలోహం”, “కృశోహం” ఇత్యనంతగుణ భేదోప లక్షణం).
(నేను దేవుడను, నేను మనుష్యుడను అని అనంతమైన జాతి భేదములు కలిగినటువంటిన్నీ,; నేను స్థూలముగా నున్నాను, నేను కృశించియున్నాను - చిక్కియున్నాను) అను అనంతగుణ భేదములు కలిగినటువంటిదిన్నీ యగు శరీరము భోక్త యగు ఆత్మతో సమానాదికరణ్యము గల భోక్త యగు ఆత్మకు భోగ క్షేత్రము - భోగించుటకు - అనుభవించుటకు స్థలము అయినది అని శరీరము యొక్క యాథాత్మ్యలక్షణములు తెలిసినవారు చెప్పుదురు).
bhūmi,polamu,maḍi, puṇyabhūmi; śarīramu; yōni -
utpatti bhūmiḥ -
(tanalōnuṃḍi iṃkoka vastuvunu puṭṭiṃcunadi; bhūmi; sasyamulanu paṃḍiṃcunadi; polamu; kārya vastuvulaku kāraṇamainadi).
(vrīhi, yavalu modalagu dhānyamulaku - sasyamulaku prakṛtivale upadānakāraṇamainadi).
(bhōgamunaku kṣētramu - anubhaviṃcuṭaku upādhi vaṃṭidi. sthūlaśarīramu lēnidē anubhavamu lēdu. kṣatatrāṇamu anuṭavalananu kṣētramuvale (dunnabaḍu bhūmi vale) karmalu anu bījamu phaliṃcuṭaku tagina sthānamu aguṭavalana śarīramu kṣētramani ceppuṭa ucitamu).
kṣētramanu polamunaṃdu nāṭabaḍina bījamuyokka phalamu vāṭi vāṭi svabhāvamunanusariṃci kālānusāramuga prakaṭamagunaṭlu kṣētramaṃdu - śarīramunaṃdu nāṭabaḍinaṭṭi karmalayokka saṃskāra rūpamulagu bījamu yokka phalamu vāṭi svabhāvamunanusariṃci kālānusāramuga prakaṭamagucuṃḍuṭacēta śarīramunaku kṣētramanu pēru kaliginadi.
iṃdriyāṇi daśaikaṃ ca paṃca cēṃdriyagōcarāḥ |
icchādvēṣaḥ sukhaṃ duḥkhaṃ saṃghātaścētanā dhṛtiḥ |
ē tat kṣētraṃ samāsēna savikāramudāhṛtaṃ || “. (śrīmadbhagavadgīta - 13 - 5, 6)
(paṃcamahābhūtamulu, ahaṃkāramu, buddhi, avyaktamu karmēṃdriyamulaidu, ayidu jñānēṃdriyamulu, śabda sparśa rasa rūpa gaṃdhamulu anu ayidu viṣayamulu, icchā, dvēṣamu, sukhamu, duḥkhamu, manassu, vīṭi anniṃṭi saṃghātamu, aṃtaḥkaraṇavṛttulatō kalasi, dhṛti, caitanyamu - ivanniyu kalisi kṣētramani ceppabaḍucunnadi. dīnini baṭṭi kṣētramanagā sthūla śarīramē kāka dṛśyapadārthamulanniyu kṣētramē. prakṛti, dāni vikāramulu - anagā, ā prakṛti sṛṣṭilōni vastuvulanniṃṭigā mārinavanniyu kṣētramanē ceppavalenu - caturviṃśati tatvamaya sakala jīva sthūla śarīramulu - kṣētramulē).
sasyamu abhivṛddhinoṃduṭaku - phaliṃcuṭaku - bhūmi ādhārabhūtamai yunnaṭlu jīvuni hṛdayāṃtaramaṃdali jñāna bījamu abhivṛddhinoṃdi kālāṃtaramuna mōkṣaphalamu nosaguṭakai ī śarīramu ādhāramagucunnadi. mōkṣasādhanamulu - itara puruṣārthasādhanamulu ī śarīramuṃḍinanē cēyavaccunu - iṭlu śarīramu dharma bījamunaku jñāna bījamunaku kṣētramuvale upacariṃcucunnadi. aṃducēta śarīramu kṣētramani ceppabaḍucunnadi - kṣētramuvale upacariṃcunadi śarīramu).
kṣīyaṃtē anivasaṃti jīvāḥ iti kṣētraṃ.
(jīvulu puṭṭi perigi kṣīṇiṃcucunnāru - bhūmimīda sasyamulu puṭṭi, perigi kṣīṇiṃcinaṭlu - kanuka kṣētramanagā śarīramu).
(avidya valana ātmanu nāśanamonarcunadiyu, vidyavalana ātmanu rakṣiṃcunadiyu) avidyayanagā sthūla sūkṣma śarīramula ātmābhimānamu, vidyayanagā ātma śarīramukaṃṭe vēṟu anu vivēkamu).
(sukha duḥkhamulananubhaviṃcucu bhōgāpavargamulanu sādhiṃcu cētanunaku (jīviki) ādhāramaguṭavalla kaligina bhūtasaṃghātamu - prakṛti modalu pṛdhivi varakugala vastuvulaku āraṃbhamainadinnī, iṃdriyamulaku āśrayamainadinnī, icchādvēṣa sukha duḥkhamulanu vikāramula saṃghātamainadinnī cētanuniki (jīvunaku) sukhaduḥkhamulaku prayōjanakaramainadinnī yagunadi kṣētramani ceppabaḍucunnadi).
ētadyō vētti taṃ prāhuḥ kṣētrajña iti tadvidaḥ ||. (śrīmadbhagavadgīta - 13 - 1)
(ī śarīramu kṣētramani ceppabaḍucunnadi; dīnini telisinavāḍu kṣētrajñuḍu ani ceppabaḍucunnāḍu. bhagavaṃtuni yokka aparā prakṛtitō atani parāprakṛti kaliyaganē aparāprakṛti anēka vikāramulanu poṃdi jīvula anubhavamu nīmittamu (bhōgamu koṟaku) śarīramugā mārucunnadi - idi polamu dunni paṃḍiṃcuṭaneṟigina karṣakuḍuvalenē - ē paṃṭa eppuḍu eṭlu paṃḍiṃcavalenō telisinaṭlu, triguṇamulugala ā parāprakṛtilōnuṃḍi ē vastuvulu puṭṭiṃcavaccunō, lēka, dānini ē ē vastuvulugā mārunaṭlu cēyanagunō anu viṣayamu telisinavāḍu bhagavaṃtuḍu tana parāśaktitō dānilō pravēśiṃci, dāniki caitanyamu kaligiṃci, dānilōnuṃḍi yī sṛṣṭilōni samasta vastuvulanu puṭṭinaṭlu cēyucunnāḍu. kanuka bhagavaṃtuḍu kṣētramagu ī śarīramunu bāgugā telisinavāḍu kanuka kṣētrajñuḍu ani ceppabaḍucunnāḍu).
(kṣētramulani ceppabaḍu sarva śarīramulaṃdu caitanyaśaktirūpamulō nuṃḍu nēnē (bhagavaṃtuḍē) kṣētrajñuḍu ani telusukonumu).
(prakṛtilōnuṃḍi kaliginavanniyu śarīramulē kṣētramulē - vāṭilō cicchakti rūpaṃlōnunna kṣētrajñuḍu, anagā, bhagavaṃtuni aparāśakti ayina prakṛti, dāni vikāramulanniyu kṣētramulu - vāṭilō parāśaktirūpamulō unna bhagavaṃtuḍu kṣētrajñuḍu).
kṣētraṃ kṣētrī tathā kṛtsnaṃ prakāśayati bhārata||. (śrīmadbhagavadgīta - 13 - 33)
(yathā ēkaḥ raviḥ (savitā, ādityaḥ) kṛtsnaṃ lōkaṃ prakāśayati (avabhāsayati) tathā lōkaṃ prakāśayati (avabhāsayati) tathā avyaktādi sthāvarāṃtaṃ mahābhūtādipṛdhyaṃtaṃ kṣētraṃ ēkassan kṣētrī (paramātmā ityarthaḥ) prakāśayati. (śrīśaṃkaraḥ)
(okaḍē ayina sūryuḍu lōkamulanniṃṭini prakāśiṃpacēyucunnaṭlē avyaktamu (prakṛti) modalu sthāvaramulavaṟaku, mahābhūtamulu modalu pṛdhivi vaṟaku gala kṣētramunu kṣētrī (kṣētramu galavāḍu) lēka, kṣētrajñuḍu agu paramātma anni kṣētramulalōnuṃḍi vāṭi nanniṃṭini prakāśiṃpacēyucunnāḍu).
“yathā ēkaḥ ādityaṃ svayaṃ prabhayā kṛtsnaṃ imaṃ lōkaṃ prakāśayati, tathā kṣētramapi kṣētrī kṛtsnaṃ bahirāṃtaśca āpāda tala mastakaṃ svakīyēna jñānēna prakāśayati”. (śrīmān rāmānujaḥ)
(bahistvagādiḥ. aṃtarmāṃsādiḥ, ēkaikasya śarīrasya avayavabhēda prayukta nānātvēna ātma vyatirēkaprada pradarśanārthaṃ avayavēṣu kasya cidvē ditva śaṃka vyudāsārthaṃ kṛtsna śabdaḥ iti bhāvaḥ). (śrīvēdāṃta dēśikaḥ)
(okaḍē ayina ādityuḍu (sūryuḍu) tana kāṃticēta ī lōkamunaṃtanu prakāśiṃpacēyucunnāḍu. ā prakāramugānē kṣētramu lōpala paina - anagā, paina carmamunu lōpala anagā māṃsamu modalagu vāṭini, pādamu modalu śirassu varakugala avayavamulanniṃṭini kṣētrajñuḍu (paramātma) tana jñānamucēta prakāśiṃpacēycunnāḍu).
anugrāhaka bhāvēna kṣētravat kṣētramucyatē |
sarvēṣāṃ caiva dharmāṇā mutpādakatayā tathā |
ayaṃ tu paramō dharmō yadyōgēnātma darśanaṃ |
ātmajñāna mayōdharmaḥ sādhyatē (a)tra mumukṣubhiḥ |
kṣayāt samasta dharmāṇā mapanargēna lābhataḥ |
trāṇabhūtaṃ mumukṣōstaddharma kṣētraṃ śarīrakaṃ |
kṣētrāṇāṃ paramaṃ kṣētraṃ śarīraṃ kṣētramucyatē ||“. (gītābhāvaprakāśamu - 1 - 109 to 113)
(karaṇamulanagā iṃdriyamulu, vāṭiki kṣētramu lēka sthānamainadi śarīramu. kṣētramu anugrāhakamu kanuka śarīramu kṣētramugā grahiṃcabaḍucunnadi. sarva dharmamulaku utpādakamainadi, anagā, śarīramu kaluguṭacētanē samastamaina dharmamulu cēyabaḍucunnavi. parama puruṣārthamaina dharmamu mōkṣamu - yōgamucēta poṃdataginadi - idi śarīramuṃḍinanē sādhiṃcuṭaku vīlagunu. aṃducēta mōkṣamu kōruvānini rakṣiṃcunavi. aṃducēta śarīramu kṣētramulanniṃṭilōnu utkṛṣṭamaina kṣētramu - kṣētramulanniṃṭilōnu bhagavaṃtuḍunnaṭlē śarīramulō kūḍa nunnāḍu -
śarīrādi catuṣṭa yasya duṣṭatvaṃ vairāgyārthaṃ śrutyā -“bhagavannasthi carma snāyumajjā māṃsa śukla sōṇita ślēṣmāśru dūṣikā, viṇmūtra vāta pitta katha saṃghātē durgaṃ dhē nissārē asmiṃścharīrē kiṃ kāma bhōgaiḥ ?”.
(kṣētramanagā śarīramu - eṭlanagā - viṇmūtra svēda ślēṣmamulu kaligi, ūpiri tīyucu, vadalucuṃḍuṭavalana bhastrika vale nuṃḍunadi; nīṭi buḍagavale prati nimiṣamu naśiṃci pōvunanu bhayamu kaladi; adhyātmika, ādhibhautika ādhidaivika tāpatrayamu kaladi; aguṭacēta duḥkhamu kaligiṃcunadi; suṣuptyavasthayaṃdu, mūrcāvasthayaṃdu caitanyamu lēnidaguṭacētakūḍa gōḍa, kaṟṟa, ṟāyivale nuṃḍunadi; iṃducēta nityaśuddha buddha muktuḍu ayina paramātma svarūpamukanna vēṟayinadi. iṭuvaṃṭi śarīramu bhōkta bhōgya vastuvu (tanu yiṃkoka dānini tinunadi, tānu iṃkokadāniki āhāramagunadi) kanuka anātma (ātma kānidi) yani teliyavalenu).
(nālugu vidhamulaina śarīramu duṣṭamainadani śruti iṭlu ceppucunnadi : - asthi (yamukalu), carmamu, snāyuvu, majja, māṃsamu, śuklamu, śōṇitamu, ślēṣmamu, aśruvulu, viṇmūtramulu, vātamu, paityamu, kaphamu anu vāṭitō niṃḍiyuṃḍunadinnī, durgaṃdhamu kaladi (kaṃpu koṭṭunadinnī) sāramu lēnidinnī ayina ī śarīramutō ēmi bhōgamulu anubhaviṃcavaccunu ?).
(“dēvōhaṃ”, manuṣyōhaṃ ityanaṃtajāti bhēdōpa lakṣaṇaṃ; “sthūlōhaṃ”, “kṛśōhaṃ” ityanaṃtaguṇa bhēdōpa lakṣaṇaṃ).
(nēnu dēvuḍanu, nēnu manuṣyuḍanu ani anaṃtamaina jāti bhēdamulu kaliginaṭuvaṃṭinnī,; nēnu sthūlamugā nunnānu, nēnu kṛśiṃciyunnānu - cikkiyunnānu) anu anaṃtaguṇa bhēdamulu kaliginaṭuvaṃṭidinnī yagu śarīramu bhōkta yagu ātmatō samānādikaraṇyamu gala bhōkta yagu ātmaku bhōga kṣētramu - bhōgiṃcuṭaku - anubhaviṃcuṭaku sthalamu ayinadi ani śarīramu yokka yāthātmyalakṣaṇamulu telisinavāru ceppuduru).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.