← Back to క్ష · Booklets 51–60 (digitized file 6)

క్షీరసాగర విహారుడు kṣīrasāgara vihāruḍu

Original — తెలుగు

“తే. విలయ సమయ సముత్కట విపుల చండ

వాత ధూతోర్మిజాల దుర్వార వార్థి

భువనములు ముంచు నమ్మూడు భువనములను

దత్పయోరాశిమీద బద్మావిభుండు.

ఉ. చారు పటీరహీర ఘనసార తుషార మరాళ చంద్రికా

పూర మృణాళ హార పరిపూర్ణ సుధాకరకాశ మల్లికా

సార నిభాంగ శోభిత భుజంగమ తల్పమందు యోగని

ద్రారతి జెందియుండు జఠరస్థిత భూర్భువరా విలోకుండై“. (శ్రీమదాంధ్రమహాభాగతము - 3 - 11 - 355, 356)

Transliteration

“tē. vilaya samaya samutkaṭa vipula caṃḍa

vāta dhūtōrmijāla durvāra vārthi

bhuvanamulu muṃcu nammūḍu bhuvanamulanu

datpayōrāśimīda badmāvibhuṃḍu.

  1. cāru paṭīrahīra ghanasāra tuṣāra marāḷa caṃdrikā

pūra mṛṇāḷa hāra paripūrṇa sudhākarakāśa mallikā

sāra nibhāṃga śōbhita bhujaṃgama talpamaṃdu yōgani

drārati jeṃdiyuṃḍu jaṭharasthita bhūrbhuvarā vilōkuṃḍai”. (śrīmadāṃdhramahābhāgatamu - 3 - 11 - 355, 356)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.