(సత్ అనగా కళ్ళకు కనబడునది, అనగా, రూపము గలదిగా నుండునది, త్యత్ అనగా దానికంటె ఇతరమైనది, వేరైనది, సత్ కానిది - ఈ రెండును పరబ్రహ్మమే - ఆయెను -
(చేతనములు, అచేతనములు - చైతన్యముగలవి, చైతన్యము లేనివి - అయి నామరూపములుగల వస్తువులన్నియు పరబ్రహ్మమే ఆయెను - పరబ్రహ్మమే ఈ వస్తువులుగా మారెను - సృష్టిలోనున్న ఈ రెండు విధముల వస్తువులుగా మారెను - అందుచేత అవన్నియు పరబ్రహ్మ రూపములే - ఉన్నదంతా పరబ్రహ్మమే)
(సత్ అనగా మూర్తము - రూపము గలది, తత్ అనగా రూపము లేనిది - ఈ రెండును భగవంతుడే ఆయెను. ఈ రెండుగా భగవంతుడే మారెను - పంచీకృతమైన పంచమహాభూతములు, పంచభూతములు ఒకదానితో నొకటి కలిసిన స్థితిలో ఉన్నవి, అట్లు కలియకనుండు స్థితిలో నున్నవి - ఈ రెండునూ భగవంతుడే - పంచభూతములు ఒకదానితోనొకటి కలిసిననే రూపముగల వస్తువు అగును -
(సత్ అనగా కంటికి కనబడు మూడు భూతములు - పృధివి, జలము, అగ్ని; త్యత్ అనగా కంటికి కనబడని రెండు భూతములు - వాయువు, ఆకాశము - నిరుక్తము అనగా చెప్పుటకు వీలయినది, అనిరుక్తము అనగా చెప్పుటకు వీలుకానిది. ఈ రెండునూ పరబ్రహ్మమే ఆయెను. వాటి రూపములతో భగవంతుడే మారెను).
(సత్ అనగా ఆకారము, రూపము గలది, త్యత్ అనగా అకారము లేనిది. ఈ రెండును భగవంతుడే ఆయెను - ఇది ఎట్లంటే - “తత్ సృష్ట్వా తదేవాను ప్రావిశత్; తదను ప్రవిశ్య సచ్చ, త్యచ్చాభవత్” భగవంతుడు లోకములను సృష్టించి వాటిలో తాను ప్రవేశించెను - అట్లు ప్రవేశించి తానే సత్, త్యత్ (మూర్తము, అమూర్తము) గా మారెను - మూర్తామూర్తములనగా వ్యాకృతమై నామరూపములు గలవి, అవ్యాకృతముగానుండి నామరూపములు లేనివి, సూక్ష్మరూపములుగా నున్నవి- ఆత్మ వస్తువు, అనాత్మ వస్తువుగా భగవంతుడే ఆయెను - భగవంతుడు ప్రకృతితో కలియుటచేతనే- ప్రకృతిలో ప్రవేశించుటచేతనే జడమైన ప్రకృతికి చలనము కలిగి ప్రపంచములోని వస్తువులుగా మారెను. అందుచేతనే ప్రపంచములోని ప్రతి వస్తువులోను భగవంతుని అంశ, జడమైన ప్రకృతి అంస కలిసియే యున్నది.” తదెవాను ప్రావొసత్” అనగా సృష్టించిన ప్రతి వస్తువులోను పూర్తిగా తాను వ్యాపించియున్నాడని అర్థము - అందుచేతనే ‘వ్యాపి’)
(‘సత్’ అనగా వికారము - మార్పు - చెందకపోవుటవలన ఎల్లపుడు ఒకే విధముగా నుండు చైతన్యము చెప్పబడుచున్నది. త్యత్ అనగా ఇదివరకు ఉండు అవస్థనుని - మార్పుచెంది - వేఱొక అవస్థను పొందియుండు అచేతన వస్తువు. పరబ్రహ్మయే చేతనములు, అచేతనములు, నామరూపములు గలవి ఆయెను).
“విశేష్యమాణత్వం = ప్రత్యక్షేణ ఉపలభ్యమానత్వం” (శ్రీ ఆనందగిరి)
(ఇతర వస్తువులవలె విశేషములు లేనిదై అసాధారణ ధర్మము కలది. త్యత్ అనగా దీనికి విపరీతమైనది).
(sat anagā kaḷḷaku kanabaḍunadi, anagā, rūpamu galadigā nuṃḍunadi, tyat anagā dānikaṃṭe itaramainadi, vērainadi, sat kānidi - ī reṃḍunu parabrahmamē - āyenu -
(cētanamulu, acētanamulu - caitanyamugalavi, caitanyamu lēnivi - ayi nāmarūpamulugala vastuvulanniyu parabrahmamē āyenu - parabrahmamē ī vastuvulugā mārenu - sṛṣṭilōnunna ī reṃḍu vidhamula vastuvulugā mārenu - aṃducēta avanniyu parabrahma rūpamulē - unnadaṃtā parabrahmamē)
(sat anagā mūrtamu - rūpamu galadi, tat anagā rūpamu lēnidi - ī reṃḍunu bhagavaṃtuḍē āyenu. ī reṃḍugā bhagavaṃtuḍē mārenu - paṃcīkṛtamaina paṃcamahābhūtamulu, paṃcabhūtamulu okadānitō nokaṭi kalisina sthitilō unnavi, aṭlu kaliyakanuṃḍu sthitilō nunnavi - ī reṃḍunū bhagavaṃtuḍē - paṃcabhūtamulu okadānitōnokaṭi kalisinanē rūpamugala vastuvu agunu -
(sat anagā kaṃṭiki kanabaḍu mūḍu bhūtamulu - pṛdhivi, jalamu, agni; tyat anagā kaṃṭiki kanabaḍani reṃḍu bhūtamulu - vāyuvu, ākāśamu - niruktamu anagā ceppuṭaku vīlayinadi, aniruktamu anagā ceppuṭaku vīlukānidi. ī reṃḍunū parabrahmamē āyenu. vāṭi rūpamulatō bhagavaṃtuḍē mārenu).
(sat anagā ākāramu, rūpamu galadi, tyat anagā akāramu lēnidi. ī reṃḍunu bhagavaṃtuḍē āyenu - idi eṭlaṃṭē - “tat sṛṣṭvā tadēvānu prāviśat; tadanu praviśya sacca, tyaccābhavat” bhagavaṃtuḍu lōkamulanu sṛṣṭiṃci vāṭilō tānu pravēśiṃcenu - aṭlu pravēśiṃci tānē sat, tyat (mūrtamu, amūrtamu) gā mārenu - mūrtāmūrtamulanagā vyākṛtamai nāmarūpamulu galavi, avyākṛtamugānuṃḍi nāmarūpamulu lēnivi, sūkṣmarūpamulugā nunnavi- ātma vastuvu, anātma vastuvugā bhagavaṃtuḍē āyenu - bhagavaṃtuḍu prakṛtitō kaliyuṭacētanē- prakṛtilō pravēśiṃcuṭacētanē jaḍamaina prakṛtiki calanamu kaligi prapaṃcamulōni vastuvulugā mārenu. aṃducētanē prapaṃcamulōni prati vastuvulōnu bhagavaṃtuni aṃśa, jaḍamaina prakṛti aṃsa kalisiyē yunnadi.” tadevānu prāvosat” anagā sṛṣṭiṃcina prati vastuvulōnu pūrtigā tānu vyāpiṃciyunnāḍani arthamu - aṃducētanē ‘vyāpi’)
(‘sat’ anagā vikāramu - mārpu - ceṃdakapōvuṭavalana ellapuḍu okē vidhamugā nuṃḍu caitanyamu ceppabaḍucunnadi. tyat anagā idivaraku uṃḍu avasthanuni - mārpuceṃdi - vēṟoka avasthanu poṃdiyuṃḍu acētana vastuvu. parabrahmayē cētanamulu, acētanamulu, nāmarūpamulu galavi āyenu).
“viśēṣyamāṇatvaṃ = pratyakṣēṇa upalabhyamānatvaṃ” (śrī ānaṃdagiri)
(itara vastuvulavale viśēṣamulu lēnidai asādhāraṇa dharmamu kaladi. tyat anagā dīniki viparītamainadi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.