← Back to ష · Booklets 51–60 (digitized file 6)

షడక్షరీమంత్రము ṣaḍakṣarīmaṃtramu

Original — తెలుగు
  1. “ఓం రామాయనమః” -

  2. స్వప్రకాశః పరంజ్యోతిః స్వాని భూత్యేక చిన్మయః |

తదేవ రామచంద్రస్య మనోరాద్యక్షరః స్మృతః |

అఖందైక రసానందస్తారక బ్రహ్మ వాచకః |

రామాయేతి సువిజ్ఞేయః సత్యానంద చిదాత్మకః |

నామః పదం సువిజ్ఞేయం పూర్ణనందైక విగ్రహం |

సదా నమ ఇతి హృదయే సర్వే దేవాః ముముక్షవః ||.

“షదక్షరాద్య బీజార్థం ఆహ -” స్వప్రకాశ ఇతి. ‘రామాయ’ ఇతి త్ర్యక్షరార్థం నిగమయతి, “అఖండేతి” నమశ్సబ్దార్థమా చష్టే - “నమః” పదమితి విశిష్టార్థస్తు ‘ఓ’ రామాయ ఇత్యక్షర ద్వయం త్వంసద లక్ష్య బోధకం. లక్షణా సాపేక్ష్యద్వయగత విశేషాం శాపహ్నప సిద్ధం నిష్ప్రతియోగిక బ్రహ్మమాత్ర మిత్యర్థః ||.

(షడక్షరమంత్ర,ముయొక్క బీజాక్షరములైన ‘రామ’ అను పదమునకు అర్థము - స్వప్రాకాశము (స్వయంప్రకాశము - స్వయం జ్యోతి పరమ జ్యోతిస్వరూపము, అఖండైకానందరసమయుడు అయిన తారకబ్రహ్మవాచనము సచ్చిదానందము. “నమః” అనగా పూర్ణానందైక విగ్రహుడైన ఆ పరమాత్మను దేవతలందరు మోక్షము కోరువారు ఎల్లపుడు హృదయమందు నమస్కరించుచుందురు - ఆ మంత్రములోని ” ఓం రామాయ” అను నాలుగు అక్షరములు ‘తత్వమసి’ అను మహా వాక్యములోని ‘తత్’ అను పదమును బోధించును - ‘నమః’ అను రెండు అక్షరములు మహావాక్యములోని ‘త్వం’ అనుదాని అర్థమును బోధించును).

  1. “గాణా పత్యేషు శైవేషు శక్త సౌరేష్వభీష్టదః |

వైష్ణవేష్వపి సర్వేషు రామమంత్రః ఫలాదికః |

గాణాది పత్యాది మంత్రేషు కోటి కోటి గుణాధికః |

మంత్రాస్తేష్వ ప్యనాయాస ఫల దోయం షాడకక్షరః |

షడక్షరో యం మంత్రస్యాత్ సర్వాఘౌఘ నివారణః |

మంత్ర రాజ ఇతి ప్రోక్తస్సర్వేషా ముత్తమోత్తమం ||” (రామతాపిన్యుపనిషత్)

(గాణాపత్ర మంత్రములలోను, శైవ మంత్రములలోను, సౌర మంత్రములలోను, వైష్ణవమంత్రములన్నింటిలోను ఈ షడక్షరీమంత్రము అభీష్టమునిచ్చునది. అధికఫలము నిచ్చునది. గనపతి ఉపాసనా మంత్రములు, శివోపాసనామంత్రములు, సూర్యోపాసనామంత్రముల కంటె ఈ షడక్షరీమంత్రము ఎక్కువగా ఫలమునిచ్చునది, కోట్లకొలది హెచ్చు గుణములు కలది, ఆయాసములేకనే ఫలమునిచ్చునది. సమస్తమైన పాపములను నశింపచేయునది, అన్ని మంత్రములలో ఉత్తమమైనవాటికంటె మిక్కిలి ఉత్తమమైనది కనుక దీనిని మంత్రరాజమని పేరు వచ్చినది)

  1. “సర్వేషు రామమంత్రేషు మంత్రరాజష్షడక్షరః” (రామరహస్యోపనిషత్)

(రామమంత్రములన్నింటిలోను షడక్షరీమంత్రము మంత్రరాజము)

  1. “శ్రీరామమంత్ర రాజస్య సమ్యగర్ధో యముచ్యతే |

నారాయణాష్టరేచ శివపంచాక్షరే తథా |

సార్థ కారం ద్వయం రామో రమంత్రే యత్ర యోగినః ||“.

(శ్రీరామమంత్రరాజముయొక్క అర్థము ఇట్లు చెప్పబడినది - “ఓం నమోనారాయాణాయ” అను నారాయణాష్టాక్షరీమంత్రములోని ‘రా’ అను అక్షరము, “ఓం నమశ్శివాయః” అను శివపంచాక్షరీమంత్రములోని ‘మ’ అను అక్షరము కలిసి ‘రామ’ అయినది. రెండు మంత్రములలోను శక్తివంతములైన బీజాక్షరములగు ‘రా’, ‘మ’ కలిసి (రామ) శ్రీరామమంత్రమగుటచేత అధిక శక్తివంతమైనది. ‘రామ’ అనగా యోగులు ఇతను యందు రమింతురు కనుక రాముడని చెప్పబడినది. రమించుట యనగా నిత్యము తదేకధ్యానముతో అతని నామములు జపించుత - “రమంతే యోగినో యస్మిన్ - - -” (చూడుము - ‘రాముడు’). శివుడుకూడ ఒకయోగివలె రామునియందే రమించును –

“శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే |

సహస్ర నామ తస్తుల్యం రామనామ వరాననే ||“.

  1. ఆద్యో ‘రా’ తత్పదార్థస్వాత్ మకారస్త్వం పదార్థవాన్ |

తయో స్సం యోజనమసీత్యర్థే తత్వ విదోపి విదుః ||. (రామరాహస్యోపనిషత్)

(‘రామ’ అను అక్షరములోని మొదటి అక్షరమగు ‘రా’ ‘తత్వమసి’ యను మహావాక్యములోని తత్ అను మాటకు అర్థము - (ఆ అర్థమును సూచించును). ‘తత్’ అనగా పరమాత్మ, పరబ్రహ్మ –

“ఒం తత్ సత్ ఇతి నిర్దేశో బ్రహ్మణస్త్రివిధస్స్మృతః ||”. (శ్రీమద్భగవద్గీత - 17 - 23)

‘రామ’ అను నామములోని రెండవ అక్షరము ‘తత్వమసి’ అను మాహావాక్యములోని ‘త్వం’ అను మాటకు అర్థము - (అను అర్థమును సూచించును) ‘త్వం’ అనగా నీవు అని అర్థము. ఈ రెండక్షరములు ‘రా’, ‘మ’ కలియుట ‘అసి’ అను మహావాక్యములోని మాటకు అర్థము - ఈ ప్రకారముగా ‘రామ’ అను నామమున కర్థము తత్వవేత్తలు - పరబ్రహ్మ తత్వమును తెలిసినవారు - తెలియుదురు).

  1. ఆద్యో ‘రా’ తత్పదార్థస్వాత్ మకారస్త్వం పదార్థవాన్ |

తయో స్సం యోజనమసీత్యర్థే తత్వ విదోపి విదుః ||. (రామరాహస్యోపనిషత్)

(‘రామ’ అను అక్షరములోని మొదటి అక్షరమగు ‘రా’ ‘తత్వమసి’ యను మహావాక్యములోని తత్ అను మాటకు అర్థము - (ఆ అర్థమును సూచించును). ‘త’ అనగా పరమాత్మ, పరబ్రహ్మ –

“ఒం తత్ సత్ ఇతి నిర్దేశో బ్రహ్మణస్త్రివిధస్స్మతః ||”. (శ్రీమద్భగవద్గీత - 17 - 23)

‘రామ’ అను నామములోని రెండవ అక్షరము ‘తతవమసి’ అను మాహావాక్యములోని ‘త్వం’ అను మాటకు అర్థము - (అను అర్థమును సూచించును) ‘త్వం’ అనగా నీవు అని అర్థము. ఈ రందఖరములు ‘రా’, ‘మ’ కలియుట ‘అసి’ అను మహావాక్యములోని మాటకు అర్థము - ఈ ప్రకారముగా ‘రామ’ అను నామమున కర్థము తత్వవేత్తలు - పరబ్రహ్మ తత్వమును తెలిసినవారు - తెలియుదురు).

Transliteration
  1. “ōṃ rāmāyanamaḥ” -

  2. svaprakāśaḥ paraṃjyōtiḥ svāni bhūtyēka cinmayaḥ |

tadēva rāmacaṃdrasya manōrādyakṣaraḥ smṛtaḥ |

akhaṃdaika rasānaṃdastāraka brahma vācakaḥ |

rāmāyēti suvijñēyaḥ satyānaṃda cidātmakaḥ |

nāmaḥ padaṃ suvijñēyaṃ pūrṇanaṃdaika vigrahaṃ |

sadā nama iti hṛdayē sarvē dēvāḥ mumukṣavaḥ ||.

“ṣadakṣarādya bījārthaṃ āha -” svaprakāśa iti. ‘rāmāya’ iti tryakṣarārthaṃ nigamayati, “akhaṃḍēti” namaśsabdārthamā caṣṭē - “namaḥ” padamiti viśiṣṭārthastu ‘ō’ rāmāya ityakṣara dvayaṃ tvaṃsada lakṣya bōdhakaṃ. lakṣaṇā sāpēkṣyadvayagata viśēṣāṃ śāpahnapa siddhaṃ niṣpratiyōgika brahmamātra mityarthaḥ ||.

(ṣaḍakṣaramaṃtra,muyokka bījākṣaramulaina ‘rāma’ anu padamunaku arthamu - svaprākāśamu (svayaṃprakāśamu - svayaṃ jyōti parama jyōtisvarūpamu, akhaṃḍaikānaṃdarasamayuḍu ayina tārakabrahmavācanamu saccidānaṃdamu. “namaḥ” anagā pūrṇānaṃdaika vigrahuḍaina ā paramātmanu dēvatalaṃdaru mōkṣamu kōruvāru ellapuḍu hṛdayamaṃdu namaskariṃcucuṃduru - ā maṃtramulōni ” ōṃ rāmāya” anu nālugu akṣaramulu ‘tatvamasi’ anu mahā vākyamulōni ‘tat’ anu padamunu bōdhiṃcunu - ‘namaḥ’ anu reṃḍu akṣaramulu mahāvākyamulōni ‘tvaṃ’ anudāni arthamunu bōdhiṃcunu).

  1. “gāṇā patyēṣu śaivēṣu śakta saurēṣvabhīṣṭadaḥ |

vaiṣṇavēṣvapi sarvēṣu rāmamaṃtraḥ phalādikaḥ |

gāṇādi patyādi maṃtrēṣu kōṭi kōṭi guṇādhikaḥ |

maṃtrāstēṣva pyanāyāsa phala dōyaṃ ṣāḍakakṣaraḥ |

ṣaḍakṣarō yaṃ maṃtrasyāt sarvāghaugha nivāraṇaḥ |

maṃtra rāja iti prōktassarvēṣā muttamōttamaṃ ||” (rāmatāpinyupaniṣat)

(gāṇāpatra maṃtramulalōnu, śaiva maṃtramulalōnu, saura maṃtramulalōnu, vaiṣṇavamaṃtramulanniṃṭilōnu ī ṣaḍakṣarīmaṃtramu abhīṣṭamuniccunadi. adhikaphalamu niccunadi. ganapati upāsanā maṃtramulu, śivōpāsanāmaṃtramulu, sūryōpāsanāmaṃtramula kaṃṭe ī ṣaḍakṣarīmaṃtramu ekkuvagā phalamuniccunadi, kōṭlakoladi heccu guṇamulu kaladi, āyāsamulēkanē phalamuniccunadi. samastamaina pāpamulanu naśiṃpacēyunadi, anni maṃtramulalō uttamamainavāṭikaṃṭe mikkili uttamamainadi kanuka dīnini maṃtrarājamani pēru vaccinadi)

  1. “sarvēṣu rāmamaṃtrēṣu maṃtrarājaṣṣaḍakṣaraḥ” (rāmarahasyōpaniṣat)

(rāmamaṃtramulanniṃṭilōnu ṣaḍakṣarīmaṃtramu maṃtrarājamu)

  1. “śrīrāmamaṃtra rājasya samyagardhō yamucyatē |

nārāyaṇāṣṭarēca śivapaṃcākṣarē tathā |

sārtha kāraṃ dvayaṃ rāmō ramaṃtrē yatra yōginaḥ ||“.

(śrīrāmamaṃtrarājamuyokka arthamu iṭlu ceppabaḍinadi - “ōṃ namōnārāyāṇāya” anu nārāyaṇāṣṭākṣarīmaṃtramulōni ‘rā’ anu akṣaramu, “ōṃ namaśśivāyaḥ” anu śivapaṃcākṣarīmaṃtramulōni ‘ma’ anu akṣaramu kalisi ‘rāma’ ayinadi. reṃḍu maṃtramulalōnu śaktivaṃtamulaina bījākṣaramulagu ‘rā’, ‘ma’ kalisi (rāma) śrīrāmamaṃtramaguṭacēta adhika śaktivaṃtamainadi. ‘rāma’ anagā yōgulu itanu yaṃdu ramiṃturu kanuka rāmuḍani ceppabaḍinadi. ramiṃcuṭa yanagā nityamu tadēkadhyānamutō atani nāmamulu japiṃcuta - “ramaṃtē yōginō yasmin - - -” (cūḍumu - ‘rāmuḍu’). śivuḍukūḍa okayōgivale rāmuniyaṃdē ramiṃcunu –

“śrīrāma rāma rāmēti ramē rāmē manōramē |

sahasra nāma tastulyaṃ rāmanāma varānanē ||“.

  1. ādyō ‘rā’ tatpadārthasvāt makārastvaṃ padārthavān |

tayō ssaṃ yōjanamasītyarthē tatva vidōpi viduḥ ||. (rāmarāhasyōpaniṣat)

(‘rāma’ anu akṣaramulōni modaṭi akṣaramagu ‘rā’ ‘tatvamasi’ yanu mahāvākyamulōni tat anu māṭaku arthamu - (ā arthamunu sūciṃcunu). ‘tat’ anagā paramātma, parabrahma –

“oṃ tat sat iti nirdēśō brahmaṇastrividhassmṛtaḥ ||”. (śrīmadbhagavadgīta - 17 - 23)

‘rāma’ anu nāmamulōni reṃḍava akṣaramu ‘tatvamasi’ anu māhāvākyamulōni ‘tvaṃ’ anu māṭaku arthamu - (anu arthamunu sūciṃcunu) ‘tvaṃ’ anagā nīvu ani arthamu. ī reṃḍakṣaramulu ‘rā’, ‘ma’ kaliyuṭa ‘asi’ anu mahāvākyamulōni māṭaku arthamu - ī prakāramugā ‘rāma’ anu nāmamuna karthamu tatvavēttalu - parabrahma tatvamunu telisinavāru - teliyuduru).

  1. ādyō ‘rā’ tatpadārthasvāt makārastvaṃ padārthavān |

tayō ssaṃ yōjanamasītyarthē tatva vidōpi viduḥ ||. (rāmarāhasyōpaniṣat)

(‘rāma’ anu akṣaramulōni modaṭi akṣaramagu ‘rā’ ‘tatvamasi’ yanu mahāvākyamulōni tat anu māṭaku arthamu - (ā arthamunu sūciṃcunu). ‘ta’ anagā paramātma, parabrahma –

“oṃ tat sat iti nirdēśō brahmaṇastrividhassmataḥ ||”. (śrīmadbhagavadgīta - 17 - 23)

‘rāma’ anu nāmamulōni reṃḍava akṣaramu ‘tatavamasi’ anu māhāvākyamulōni ‘tvaṃ’ anu māṭaku arthamu - (anu arthamunu sūciṃcunu) ‘tvaṃ’ anagā nīvu ani arthamu. ī raṃdakharamulu ‘rā’, ‘ma’ kaliyuṭa ‘asi’ anu mahāvākyamulōni māṭaku arthamu - ī prakāramugā ‘rāma’ anu nāmamuna karthamu tatvavēttalu - parabrahma tatvamunu telisinavāru - teliyuduru).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.