(కార్య వస్తువులకు, కారణ వస్తువులకు కారనమైనవాడు. కార్యకారణ వస్తువులకంటె ఉత్కృష్టమైనవాడు - కార్యకారణ వస్తువులకంటె వేఱైనవాడు)
“ఉ. కారణ కార్య హేతువగు కంజదళాక్షుని కంటె నన్యు లె
వ్వారును లేరు - - -“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 7 - 211)
(ఈ ప్రపంచమంతయు సత్ అసత్తుల సం యోగము వలన అనేక వస్తువులు గలది.
(సత్తు అసత్తులు అనగా భగవంతుని చైతన్యశక్తి, లేక ఆ రూపములో నున్న భగవంతుడు - ఆత్మ. మఱియు జడము, అచిత్, అనాత్మ యగు ప్రకృతి దాని వికారములు - ఈ రెండింటి సం యోగము వలననే ప్రపంచములోని వస్తువులన్నియు పుట్టుచున్నవి. ప్రపంచములోని వస్తువులన్నింటిలోను చైతన్యాంశ ప్రకృతి అంశ, రెండునూ ఉండును).
(చిత్, అచిత్ - ఆత్మ, అనాత్మ వస్తువులతో కూడియున్న యీ ప్రపంచముకంటె ఉత్కృష్టమైనదియు, వేరు లక్షణములు కలదియు, నిరుక్తము, అనిరుక్తము, నిలయము, అనిలయము, విజ్ఞానము, అవిజ్ఞానము, సత్యము, అసత్యము అను పేర్లతో పురుష ప్రకృతులను - పరబ్రహ్మ ప్రకృతులను - నిర్దేశించి వాటికి అంతరాత్మగా వాటిలో ప్రవేశించియుండి జీవుని కంటె వేరైనవాడు - పరమాత్మ) (చూడుము - సచ్చత్యచ్చ్య అభవత్).
(సత్, అసత్, వాటికంటె ఉత్కృష్టమై నాశములేని పరతత్వము నీవే -)
(సర్వ వస్తువులు, అసద్వస్తువులు వాటి కూటమి, సదసత్తులు కలిసిన కూటమి, సదసత్తులు కలిసిన వస్తువులకంటె పరుడైనవాడు, ఉత్కృష్టమైనవాడు, చిత్ అచిత్ వస్తువులకంటె వేరు లక్షణములు కలవాడు - వేఱైనవాడు).
(సత్ అసత్తులకంటె, స్థూలవస్తువులకంటె, అన్నమయమైన వాటికంటె పరుడు, వాటికి సాక్షియగుటవలన వాటికంటె వ్యతిరేకమైనవాడు).
(సత్ + సత్ = సదసత్ - వాటికి పరమైనవాడు, వాటికంటె ఉత్కృష్టమైనవాడు, - సదసత్ తత్పరుడు - కార్యము కారణము - ఈ రెంటిని మించినవాడు - అనగా ఈ మూడు విధములు తానే అయినవాడు).
(సత్ అనగా శాస్త్రరీత్యా చేయతగినది, అసత్ అనగా శాస్త్రములో నిషేధించబడినది, లేక సత్ అనగా వ్యక్తము. అసత్ అనగా అవ్యక్తము - ఈ సదసత్తుల రెండింటికంటె పరమ ఉత్కృష్టము, మూలకారణమైనది, అనగా, దానికంటె వేరైన వస్తువు లేదు అని అర్థము). 85
(సత్ అనగా వేదముచేత విధించబడీంది, వ్యక్తము, కార్యము. అసత్ అనగా నిషేధించబడినది. అవ్యక్త విషయములు, నాస్తికబుద్ధి)
(సత్ అసత్తులకు ఉపాధిగావున అక్షరుడు అయిన పరబ్రహ్మ సత్ సత్ కూడాను - తత్వరీత్యా సత్తు అసత్తులకంటె ఉత్క్ష్టతత్వమే పరబ్రహ్మ - పరతత్వమే).
(kārya vastuvulaku, kāraṇa vastuvulaku kāranamainavāḍu. kāryakāraṇa vastuvulakaṃṭe utkṛṣṭamainavāḍu - kāryakāraṇa vastuvulakaṃṭe vēṟainavāḍu)
“u. kāraṇa kārya hētuvagu kaṃjadaḷākṣuni kaṃṭe nanyu le
vvārunu lēru - - -“. (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 7 - 211)
(ī prapaṃcamaṃtayu sat asattula saṃ yōgamu valana anēka vastuvulu galadi.
(sattu asattulu anagā bhagavaṃtuni caitanyaśakti, lēka ā rūpamulō nunna bhagavaṃtuḍu - ātma. maṟiyu jaḍamu, acit, anātma yagu prakṛti dāni vikāramulu - ī reṃḍiṃṭi saṃ yōgamu valananē prapaṃcamulōni vastuvulanniyu puṭṭucunnavi. prapaṃcamulōni vastuvulanniṃṭilōnu caitanyāṃśa prakṛti aṃśa, reṃḍunū uṃḍunu).
(cit, acit - ātma, anātma vastuvulatō kūḍiyunna yī prapaṃcamukaṃṭe utkṛṣṭamainadiyu, vēru lakṣaṇamulu kaladiyu, niruktamu, aniruktamu, nilayamu, anilayamu, vijñānamu, avijñānamu, satyamu, asatyamu anu pērlatō puruṣa prakṛtulanu - parabrahma prakṛtulanu - nirdēśiṃci vāṭiki aṃtarātmagā vāṭilō pravēśiṃciyuṃḍi jīvuni kaṃṭe vērainavāḍu - paramātma) (cūḍumu - saccatyaccya abhavat).
(sat, asat, vāṭikaṃṭe utkṛṣṭamai nāśamulēni paratatvamu nīvē -)
(sarva vastuvulu, asadvastuvulu vāṭi kūṭami, sadasattulu kalisina kūṭami, sadasattulu kalisina vastuvulakaṃṭe paruḍainavāḍu, utkṛṣṭamainavāḍu, cit acit vastuvulakaṃṭe vēru lakṣaṇamulu kalavāḍu - vēṟainavāḍu).
(sat asattulakaṃṭe, sthūlavastuvulakaṃṭe, annamayamaina vāṭikaṃṭe paruḍu, vāṭiki sākṣiyaguṭavalana vāṭikaṃṭe vyatirēkamainavāḍu).
(sat + sat = sadasat - vāṭiki paramainavāḍu, vāṭikaṃṭe utkṛṣṭamainavāḍu, - sadasat tatparuḍu - kāryamu kāraṇamu - ī reṃṭini miṃcinavāḍu - anagā ī mūḍu vidhamulu tānē ayinavāḍu).
(sat anagā śāstrarītyā cēyataginadi, asat anagā śāstramulō niṣēdhiṃcabaḍinadi, lēka sat anagā vyaktamu. asat anagā avyaktamu - ī sadasattula reṃḍiṃṭikaṃṭe parama utkṛṣṭamu, mūlakāraṇamainadi, anagā, dānikaṃṭe vēraina vastuvu lēdu ani arthamu). 85
(sat anagā vēdamucēta vidhiṃcabaḍīṃdi, vyaktamu, kāryamu. asat anagā niṣēdhiṃcabaḍinadi. avyakta viṣayamulu, nāstikabuddhi)
(sat asattulaku upādhigāvuna akṣaruḍu ayina parabrahma sat sat kūḍānu - tatvarītyā sattu asattulakaṃṭe utkṣṭatatvamē parabrahma - paratatvamē).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.