సత్తు అసత్తు అను నవి కలియుట - చైతన్యము, జడము అని రెండింటి కలియిక.
(ఈ సృష్టిలోని ప్రతివస్తువులోను చిదంశ - చైతన్యము లేక భగవంతుని శక్తి -, జడమైన ప్రకృతి అంశ ఉన్నది –
“యావత్సంజాయతే కించిత్ సత్వం స్థావర జంగమం |
క్షేత్ర క్షేత్రజ్ఞ సం యోగా త్తద్విద్ధి భరతర్షభ||“. (శ్రీమద్భగవద్గీత - 13 - 26)
స్థావరములు, జంగమములు - వీటి సృష్టి క్షేత్రజ్ఞుడైన భగవంతుడు - పురుషుడు - క్షేత్రమని చెప్పబడు ప్రకృతిలో ప్రవేశించుటచేతనే - ప్రకృతితో కలియుట చేతనే - జరుగుచున్నది. ఆధినిక శాస్త్రజ్ఞులుకూడ యీ సృష్టి matter and Energy లు కలియుటచేతనే కలుగుచున్నదని అభిప్రాయ పడుచున్నారు - “Every particle of matter contains ENERGY”. ప్రకృతిలో అణువణువులోను ప్రకృతి అంశ (particle of matter) యున్నూ భగవంతుడు, లేక తన చైతన్యశక్తియున్ను కలిసియే యున్నవి. ఈ విషయమునే మహాభక్తుడు ప్రహ్లాదుడు చెప్పియున్నాడు-
“క. ఇందుగలడందులేడని
సందేహము వలదు చక్రి సర్వోపగతుం
డెందెందు వెతకి చూచిన
నందందే కలడు దానివాగ్రణి వింటే“. (శ్రీమదాంధ్రమహాభాగవతము -)
భగవంతుని అంశ లేని - చిచ్ఛక్తి లేని - ప్రకృతియొక్క పరమాణువు లేదు - పరమాణువుతో కలియక వేరుగనుండు చిచ్ఛక్తి లేదు - ”
క. హరిమయముగాని ద్రవ్యము
పరమాణువు లేదు, వంశపావన వింటె“. (శ్రీమదాంధ్రమహాభాగవతము -)
sattu asattu anu navi kaliyuṭa - caitanyamu, jaḍamu ani reṃḍiṃṭi kaliyika.
(ī sṛṣṭilōni prativastuvulōnu cidaṃśa - caitanyamu lēka bhagavaṃtuni śakti -, jaḍamaina prakṛti aṃśa unnadi –
“yāvatsaṃjāyatē kiṃcit satvaṃ sthāvara jaṃgamaṃ |
kṣētra kṣētrajña saṃ yōgā ttadviddhi bharatarṣabha||“. (śrīmadbhagavadgīta - 13 - 26)
sthāvaramulu, jaṃgamamulu - vīṭi sṛṣṭi kṣētrajñuḍaina bhagavaṃtuḍu - puruṣuḍu - kṣētramani ceppabaḍu prakṛtilō pravēśiṃcuṭacētanē - prakṛtitō kaliyuṭa cētanē - jarugucunnadi. ādhinika śāstrajñulukūḍa yī sṛṣṭi matter and Energy lu kaliyuṭacētanē kalugucunnadani abhiprāya paḍucunnāru - “Every particle of matter contains ENERGY”. prakṛtilō aṇuvaṇuvulōnu prakṛti aṃśa (particle of matter) yunnū bhagavaṃtuḍu, lēka tana caitanyaśaktiyunnu kalisiyē yunnavi. ī viṣayamunē mahābhaktuḍu prahlāduḍu ceppiyunnāḍu-
“ka. iṃdugalaḍaṃdulēḍani
saṃdēhamu valadu cakri sarvōpagatuṃ
ḍeṃdeṃdu vetaki cūcina
naṃdaṃdē kalaḍu dānivāgraṇi viṃṭē”. (śrīmadāṃdhramahābhāgavatamu -)
bhagavaṃtuni aṃśa lēni - cicchakti lēni - prakṛtiyokka paramāṇuvu lēdu - paramāṇuvutō kaliyaka vēruganuṃḍu cicchakti lēdu - ”
ka. harimayamugāni dravyamu
paramāṇuvu lēdu, vaṃśapāvana viṃṭe”. (śrīmadāṃdhramahābhāgavatamu -)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.