← Back to స · Booklets 51–60 (digitized file 6)

సద్గుణములు sadguṇamulu

Original — తెలుగు
  1. సతాం ప్రశస్తా గుణాః.

(సత్పురుషుల యొక్క ప్రశస్తమైన గుణములు)

  1. సత్యం శౌచం దయా క్షాంతి స్త్యాగః సంతోష ఆర్జవం |

శమోదమస్తపః సామ్యం తితిక్షో పరతిః శ్రుతం |

జ్ఞానం విరక్తి రైశ్వర్యం శౌర్యం తేజో బలం స్మృతిః |

స్వాతంత్ర్యం కౌశలం కాంతిర్ధైర్యం మార్దవ మేవచ |

ప్రాగల్భ్యం ప్రశ్రయః శీలః సహా ఓజో బలం భ్గః ||

గాంభీర్యం స్థైర్యమాస్తిక్యం కీర్తిర్మానో (అ)సహంకృతిః |

ఏతే చాన్యేవచ భగవన్నిత్యాః యత్ర మహా గుణాః |

పార్థామహిత్వ మిచ్ఛద్భిర్న వియంతి స్మకర్హిచిత్ ||“. (శ్రీమద్భాగవతం - 1 - 16 - 34)

“సత్య శౌచ అయా శాంతులును, త్యాగ సంతోషార్జవంబులును, శం దమ తపంబులును, సమత్వంబును, పరాపరాది సహనంబును, లాభంబు గలయడ నుదాసీనుండై యుండుటయును, శాస్త్ర విచారంబును, విజ్ఞాన విరక్తులును, నైశ్వర్య శౌర్య ప్రభా దక్షత్వంబులును, స్మృతియును, స్వాతంత్ర్యంబును, గౌశల, కాంతి, దైర్య, మార్దన ప్రతిభాతిశయ ప్రశ్రయ శీలంబులును, జ్ఞానేంద్రియ కర్మేంద్రియ మనో బలంబులును, సౌభాగ్య, గాంభీర్య, స్థైర్యంబులును, శ్రద్ధా, కీర్తి, మాన, గర్వా భావంబులును, ననియెడి ముప్పది తొమ్మిది గుణంబులు, నవియునుం గాక బ్రహ్మణ్యతా శరణ్యత్వాది మహా గుణ సమూహంబులు శ్రీకృష్ణదేవునియందు వర్తిల్లు -”.

(శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 10 - 365).

  1. “ఆ. సద్గుణంబులెల్ల సంఘంబులైవచ్చి

అసురరాజతనయునందు నిలిచి

పాసి చ నీవు విష్ణు బాయని విధమున

నేడు తగిలి యుండు నిర్మలాత్మ”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - 4 - 118)

  1. శ్లో||. సత్యం చ సమతా చైవ దమశ్చైవ స సంశయః |

అమాత్సర్యం క్షమాచైవ వ్రీః తితిక్షా అనసూయతా |

త్యాగోధ్యానం అధార్యత్వం ధృతిశ్చ సతతం దయా |

అహింసా చైవ, రాజేంద్రసత్యాకారాః త్రయోదశ ||. (మహాభారతము - శాంతి పర్వము)

(సత్యము, సమత, దమము, మాత్సర్యము లేకుండుట, క్షమ, సంతోషము, తితిక్ష, అసూయ లేకుండుట, త్యాగము, దానము, ధృతి, దయ, అహింస, అను యీ పదమూడును సద్గుణములు).

  1. యథా పార్థివ పరమాణు గణనం అశక్యం తథా విష్ణోః గుణ గణనమపి అశక్యం -

(ధూళి రెణువులను పరమాణువులను లెక్కపెట్ట శక్యము కానట్లు శ్రీమహావిష్ణువు యొక్క సద్గుణములు కూడ లెక్కపెట్టనలవికాదు).

  1. “గుణాః పూజాస్థానం, గుణిషు న చ లింగం, న చ దయః”

(గుణవంతునియందు పూజించతగినవి వారి గుణములు కాని, వారి ఆకారము (లింగము) ఆని, వయస్సు గాని కాదు).

  1. శ్రీమద్రామాయణములో బాలకాండలో శ్రీరాముని సద్గుణములు నారదమహర్హి వర్ణించెను –

“ఇక్ష్వాకు వంశ ప్రభవో రామోనామ జలై శ్శ్రుతః |

నియతాత్మా మహావీరో - - - ||“.

Transliteration
  1. satāṃ praśastā guṇāḥ.

(satpuruṣula yokka praśastamaina guṇamulu)

  1. satyaṃ śaucaṃ dayā kṣāṃti styāgaḥ saṃtōṣa ārjavaṃ |

śamōdamastapaḥ sāmyaṃ titikṣō paratiḥ śrutaṃ |

jñānaṃ virakti raiśvaryaṃ śauryaṃ tējō balaṃ smṛtiḥ |

svātaṃtryaṃ kauśalaṃ kāṃtirdhairyaṃ mārdava mēvaca |

prāgalbhyaṃ praśrayaḥ śīlaḥ sahā ōjō balaṃ bhgaḥ ||

gāṃbhīryaṃ sthairyamāstikyaṃ kīrtirmānō (a)sahaṃkṛtiḥ |

ētē cānyēvaca bhagavannityāḥ yatra mahā guṇāḥ |

pārthāmahitva micchadbhirna viyaṃti smakarhicit ||“. (śrīmadbhāgavataṃ - 1 - 16 - 34)

“satya śauca ayā śāṃtulunu, tyāga saṃtōṣārjavaṃbulunu, śaṃ dama tapaṃbulunu, samatvaṃbunu, parāparādi sahanaṃbunu, lābhaṃbu galayaḍa nudāsīnuṃḍai yuṃḍuṭayunu, śāstra vicāraṃbunu, vijñāna viraktulunu, naiśvarya śaurya prabhā dakṣatvaṃbulunu, smṛtiyunu, svātaṃtryaṃbunu, gauśala, kāṃti, dairya, mārdana pratibhātiśaya praśraya śīlaṃbulunu, jñānēṃdriya karmēṃdriya manō balaṃbulunu, saubhāgya, gāṃbhīrya, sthairyaṃbulunu, śraddhā, kīrti, māna, garvā bhāvaṃbulunu, naniyeḍi muppadi tommidi guṇaṃbulu, naviyunuṃ gāka brahmaṇyatā śaraṇyatvādi mahā guṇa samūhaṃbulu śrīkṛṣṇadēvuniyaṃdu vartillu -”.

(śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 10 - 365).

  1. “ā. sadguṇaṃbulella saṃghaṃbulaivacci

asurarājatanayunaṃdu nilici

pāsi ca nīvu viṣṇu bāyani vidhamuna

nēḍu tagili yuṃḍu nirmalātma”. (śrīmadāṃdhramahābhāgavatamu - 7 - 4 - 118)

  1. ślō||. satyaṃ ca samatā caiva damaścaiva sa saṃśayaḥ |

amātsaryaṃ kṣamācaiva vrīḥ titikṣā anasūyatā |

tyāgōdhyānaṃ adhāryatvaṃ dhṛtiśca satataṃ dayā |

ahiṃsā caiva, rājēṃdrasatyākārāḥ trayōdaśa ||. (mahābhāratamu - śāṃti parvamu)

(satyamu, samata, damamu, mātsaryamu lēkuṃḍuṭa, kṣama, saṃtōṣamu, titikṣa, asūya lēkuṃḍuṭa, tyāgamu, dānamu, dhṛti, daya, ahiṃsa, anu yī padamūḍunu sadguṇamulu).

  1. yathā pārthiva paramāṇu gaṇanaṃ aśakyaṃ tathā viṣṇōḥ guṇa gaṇanamapi aśakyaṃ -

(dhūḷi reṇuvulanu paramāṇuvulanu lekkapeṭṭa śakyamu kānaṭlu śrīmahāviṣṇuvu yokka sadguṇamulu kūḍa lekkapeṭṭanalavikādu).

  1. “guṇāḥ pūjāsthānaṃ, guṇiṣu na ca liṃgaṃ, na ca dayaḥ”

(guṇavaṃtuniyaṃdu pūjiṃcataginavi vāri guṇamulu kāni, vāri ākāramu (liṃgamu) āni, vayassu gāni kādu).

  1. śrīmadrāmāyaṇamulō bālakāṃḍalō śrīrāmuni sadguṇamulu nāradamaharhi varṇiṃcenu –

“ikṣvāku vaṃśa prabhavō rāmōnāma jalai śśrutaḥ |

niyatātmā mahāvīrō - - - ||“.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.