సాధువు, - సాధు అనగా మంచి, నెమ్మది యని అర్థము - అందుచేత మంచి ప్రవర్తన కలవారు.
సజ్జనః (మంచిమనిషి)
సత్పురుషః (మంచి పురుషుడు).
రాగాది శూన్యః అనహంకరః
(రాగము మొదలగునవి లేనివాడు - అహంకారము లేనివాడు).
(దేనియందును అనురాగము కాని, రోషము కాని లేనివాడు).
(ఏ విధమైన విషయములందు ఆసక్తి లేనివారు)
(ధర్మగుణము స్వభావముగా గలవాడు)
(తన విద్యుక్త ధర్మమందే ప్రవర్తించువాడు)
(తన ధర్మమందే నిష్ఠ కలిగి యుండువాడు)
శాస్త్రానువర్తీ -
(శాస్త్రములో చెప్పిన ప్రకారము కర్మ చేయువాడు - శాస్త్రములో విధించబడిన కర్మను చేయువాడు)
(సత్పురుషుల ఆచారము కలవాడు)
కృపాళుః (దయ కలవాడు).
“ఆత్మేపమ్యేన సత్వేషు దయాం కుర్వంతి సాధవః”. (హితోపదేశము).
(జీవరాసులన్నింటియందును - సత్వము గలవాటి అన్నింటియందును దయ చూపువారు సాధువులు)
(గుణములు లేని సత్వగుణముగల వాటియందు దయగలవారు)
(ఎల్లపుడు ఇతరులకు ఉపకారము చేయుటయందాసక్తి గలవారు)
(తనకు అపకారము చెసిన వారి యడలనైనను సాధువుగా, నెమ్మదిగా, మంచిగా నుండువాడు సాధువు) అని సత్పురుషులు చెప్పుదురు).
భిందింత మపి వృక్షః స్వచ్ఛాయయా కిం న రక్షతి ||“.
(తనకు అపకారము జరుగుచున్నప్పటికీ ఉపకారము చేయువారు సాధువులు, తనను నరుకుటకు వచ్చిన వానినైనను చెట్టు తన నీడను వానికిచ్చును)
“అరావప్యుచితం కార్య మాతిధ్యం గృహ మాగతే |
ఛేత్తుః పార్శ్విగతాం ఛాయాం నోప సంహార తే ద్రుమః ||“.
(శత్రువైనను తనయింటికి వచ్చినపుడు అతిధిగా సత్కరించవలసినదే - తనను నరుకుటకు వచ్చినవానికైనను చెట్టు తన నీడను యివ్వకుండా ఉండదు).
(ఇతరుల కార్యమును సాధించువారు)
సాధ్నువంతి పరకార్యమితి సాధవః
(ఇతరుల కార్యమును సాధించు వారు కనుక సాధువులు)
అనసూయా పరః - (అసూయ లేనివారు)
సత్య సంధః
(సత్యమును పరిపాలించువాడు - పాటించువాడు - (హరిశ్చంద్రునివలె, శ్రీరామునివలె) “సత్య సంధో జితేంద్రియః” (శ్రీమద్రామాయణం)
(పరబ్రహ్మధ్యానమందే నిష్టగలవాడు)
(సాధుగుణము - మంచి గుణము, సత్ప్రవర్తన యే అలంకారముగా గలవాడు)
(న్యాయమైన ప్రవర్తన కలిగియుండుటచేత సాధువు - కార్యములను సాధించువాదు)
(మహాత్ములు; ధర్మమార్గమందుండువారు)
(సాధువులనగా సన్మార్గములో నడచువారు - పుణ్యము చేయువారు; వేదమార్గమందుండువారు - వేదములో చెప్పినప్రకారము నడుచుకొనువారు; భగవంతుని భక్తులైనవారు)
అనపేక్షులు - అనగా సుఖములందు అపేక్షలేనివారు భగవచ్చిత్తులు - భగవంతునియందు మనస్సు కలవారు - గొప్ప శాంతి కలవారు; సమదర్శనులు; అన్నింటిలోను భగవంతుడుండుటవలన అన్నింటిని సమముగా చూచువారు, మమకారము లేనివారు, ఇది నాది, వీరు నావారు అను అభిమానము లేనివారు - నిరహంకారులు - అనగా, అహంకారము లేనివారు - ఈ పనులన్నీ నేనే చేయుచున్నాను, ఇది నా ప్రభావమే అను భావము లేనివారు, నిర్ద్వందులు - సుఖదుఃఖములు, శీతోష్ణములు మొదలగునవి లేనివారు, నిష్పరిగ్రహులు - అనగా, ఒకరివద్దనుండి యేమియు పుచ్చుకొననివారు - ఇట్టివారు సాధువులు).
“ప్రాయశః సాధవో లోకే పరైర్ద్వం దేషు యోజితాః |
న వ్యధంతి నహృష్యంతి యతః ఆత్మా (అ)గుణాశ్రయః“. (శ్రీమద్భాగవతం - 1 - 18 - 50)
(తరుచుగా ఈ లోకమందు సాధువులు ఇతరులచేత ద్వంద్వములందు - సుఖదుఃఖములందు నియోగింపబడుచున్నారు - కాని సాధువులు సుఖము కలిగిన సంతోషింపరు, కష్టము కలిగిన దుఃఖింపరు - ఇట్టివారు సాధువులు. ఎందుచేతననగా - త్రిగుణములవలన సుఖదుఃఖములు కలుగుచున్నవి. ఆత్మ వాటికి అతీతము; సాధువులు ఆత్మ సమానులు అందుచేత వారికి సుఖదుఃఖములను ఓకటిగానే చూచెదరు)
మిళితములై పరులవలన మేలుం గీడున్
నెలకొనినైన, నాత్మకు
నొలయవు సుఖదుఃఖ చయము యుగ్మములగుచున్“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 18 - 450)
మయ్యనన్యేన భావేన భక్తిం కుర్వంతి యే దృఢాం |
మత్కృతే త్యక్త కర్మాణః, త్యక్త స్వజన బాంధవాః |
మదాశ్రకథా హృష్టాః శృణ్వంతి కధయంతి చ |
తపంతి వివిదాస్తాపా సైనాన్ మద్గత చేతసః |
తే ఏతే సాధవస్సాధ్వీ సర్వ సంగ వివర్జితాః ||“. (శ్రీమద్భాగవతం - 3 - 25 -)
(సాధువులు అజాత శత్రువులు - శత్రువు అన్నది లేనివారు - శాంతులు, మంచితనమే భూషణముగా గలవారు - భగవంతుని యందు అనన్యభక్తి, ధృఢమైన భక్తి గలవారు, భగవంతుని కొఱకు సకల కర్మలను, తమ బంధు జనులను వదలివేసినవారు, భగవత్కథలతో సంతోషించువారు, భగవత్కథలను వినువారు, చెప్పువారు, తపస్సు చేయువారు, భగవంతునియందే మనస్సు గలిగి యుండువారు, దేనియందును ఆసక్తి లేనివారు).
సాధురేవ స మంతవ్యః సమ్యగ్వ్యవసితో హి సః ||“. (శ్రీమద్భగవద్గీత - 9 - 30)
“అతీవ కుత్సితాచారో (అ)జామిళాది రి వా ప్రియః |
కుతశ్చిత్ భాగ్యవశతస్సేవతే మానన్య భాక్ |
స ప్రాగ సాధురప్యేష మంతవ్యః సాధురేవహి ||
సాధు నిశ్చయ నాన్యస్మాత్ ప్రవృత్తః సమ్యగీశ్వరే ||“. (గీతాభావప్రకాశము - 9 - 201, 202)
(ఘోరమైన దురచారమందు ప్రవర్తించువాడైనను - అనగా, అజామిళుడువంటి దుర్మార్గుడైనను - భగవద్భక్తుడు కానివాడైనను, ఏదో యొక భాగ్య వశమున పుణ్యము చేసియుండుటవలన, భగవంతుని అనన్యభక్తితో సేవించినయడల అట్టివాడు, అంతవరకు అసాధువైనను - దుర్మార్గుడైనను భగవద్భక్తియందు ప్రవృత్తి గలవాడైనందువలన సాధువేయని తలచవలెను).
(విద్వాన్సుడు, వివేకముగలవాడు).
(మంచిమార్గ మందుండువాడు)
అనిర్దేశ్యకలోపేతాః సాధవస్త ఉదాహృతాః ||“.
(విశుద్ధ సత్వ గుణము కలవారును, ధీరులును, (విషయ దుఃఖాదులచే చలించనివారు), సమదృష్టి కలవారును, నిర్దేశించుటకు వీలుకాని ఆనందముగలవారును, బ్రహ్మ సాక్షాత్కారము గలవారును సాధువులు).
తే పునంత్యురు కాలేన దర్శనాదేవ సాధవః ||.
(గంగానది మొదలగునవి జలముతో నిండి యున్నందున తీర్థములుకాని మట్టితోను ఱాయితోను చేయబడిన దేవతులుకాని - అవి చాలాకాలమునకు గాని పావనము చేయవు - సాధువులు దర్శనమాత్రమున పవిత్రులుగా చేయుదురు).
సాధుల హృదయంబు నేను జగములనెల్లన్
సాధుల నేన యెఱుంగుదు
సాధులెఱుంగుదురు నాదు చరితము విప్రా“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 9 - 7 - 123)
నాతతమై యుండు, వారి నలచు జనులకున్
హేతిక్రియ భీతి నిచ్చుం
జేతో మోదంబు జెఱచు సిద్ధము సుమ్మీ” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 9 - 7 - 125)
గిలి కొని పోవు చుండుదుర కిల్బిష భక్తి లతా చయంబులన్
నిలువగ బెట్టి కట్టుదురు నేరుపుతో మద కుంభికైవడిన్
వలలకు జిక్కి భక్తిజన వత్సలతం జనకుందు, తాపసా ||“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 9 - 4 - 118)
స విశిష్టః, స సాధుః స్యాత్ తం ప్రయత్నేన సంశ్రియేత్ ||“. (యోగవాశిష్టము - 6 - 20)
(సుజనులైన జనులు (లోకులు) ఎవరిని సాధువు అని చెప్పుదురో అతనే సాధువు - ప్రహ్లాదుడువంటివాడు, మహాత్మాగాంధీవంటివాడు - ఏసుక్రీస్తువంటివాడు - బుద్ధుడువంటివాడు). అట్టివానిని ప్రయత్నించి ఆశ్రయించవలెను) (యోగవాశిష్టము)
రక్షితుడగు సమత జేసి రాయిడులందున్
రక్షణములు వేయి కలిగిన
శిక్షితుడగు ఖలుడు పాపచిత్తుండగుటన్“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - పూ.భా.- 277)
యత్సాధో (అ)స్యగృహే జాతో భవాన్ దైకులపావనః ||“. (శ్రీమద్భాగవతం - ప్రహ్లాద చరిత్ర)
(కులపావనుడవు, సాధువు, అగు నీవు (ప్రహ్లాదుడు) ఈ కుటుంబములో (హిరణ్యకశిపుని వంశములో) పుట్టుటవలన నీ తండ్రి, తనకు ముందు గతించిన ఇరువదియేడు తరముల పితరులతో కూడ పవిత్రుడైనాడు).
(పై శ్లోకమునకు శ్రీమదాంధ్రమహాభాగవతములో ఈ క్రింద విధము తెనిగించడమైనది : -
“మ. నిజ భక్తుండవు నకు, నిన్ను గనుటన్ నీ తండ్రి త్రిసప్త పూ
ర్వజులం గూడి పవిత్రుడై శుభగతిన్ వర్తించు, విజ్ఞాన దీ
ప జనితానేక భవాంధకారు లగు మద్భక్తుల్ వినోదించు దే
శ జనుల్ దుర్జనులైన శుద్ధుల్ సుమీ సత్యంబు దైత్యోత్తమా“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - 10 - 378)
కాలేన ఫలతే తీర్థః, సద్యః సాదు సమాగమః ||“.
(సాధువుల దర్శనము పుణ్యవంతమైనది, వారు తీర్థములతో సమానులు - తీర్థములు ఫలమునిచ్చుటకు కొంతకాలము పట్తును - సాధువులు వెంటనే - దర్శనమాత్రముననే - ఫలము నిత్తురు - సాధు దర్శనము వెంతనే ఫలమునిచ్చును).
పర్వతానాం భయం వజ్రాత్ సాధూనాం దుర్జవాద్భయం ||.
(చెట్లకు గాలివలన భయము, పద్మములకు మంచువలన భయము. కొండలకు వజ్రాయుధము వలన భయము. సాధువులకు దుర్మార్గులవలన భయము - పెనుగాలి వీచిన చెట్లు వేళ్ళూడిపోయి పడిపోవును, మంచువలన పద్మములు వాడిపోవును, పర్వతములకు వజ్రము రెక్కలను నరికి వేయుటవలన ఇంకేమి చేయునో యను భయము - సాధువులను దుర్మార్గులు కష్టపెట్టినను వారిని సాధులేమియును అనరు - కోపము చెందరు, తిరిగి వాళ్ళని కష్టపెట్టే పనులు చేయరు).
sādhuvu, - sādhu anagā maṃci, nemmadi yani arthamu - aṃducēta maṃci pravartana kalavāru.
sajjanaḥ (maṃcimaniṣi)
satpuruṣaḥ (maṃci puruṣuḍu).
rāgādi śūnyaḥ anahaṃkaraḥ
(rāgamu modalagunavi lēnivāḍu - ahaṃkāramu lēnivāḍu).
(dēniyaṃdunu anurāgamu kāni, rōṣamu kāni lēnivāḍu).
(ē vidhamaina viṣayamulaṃdu āsakti lēnivāru)
(dharmaguṇamu svabhāvamugā galavāḍu)
(tana vidyukta dharmamaṃdē pravartiṃcuvāḍu)
(tana dharmamaṃdē niṣṭha kaligi yuṃḍuvāḍu)
śāstrānuvartī -
(śāstramulō ceppina prakāramu karma cēyuvāḍu - śāstramulō vidhiṃcabaḍina karmanu cēyuvāḍu)
(satpuruṣula ācāramu kalavāḍu)
kṛpāḷuḥ (daya kalavāḍu).
“ātmēpamyēna satvēṣu dayāṃ kurvaṃti sādhavaḥ”. (hitōpadēśamu).
(jīvarāsulanniṃṭiyaṃdunu - satvamu galavāṭi anniṃṭiyaṃdunu daya cūpuvāru sādhuvulu)
(guṇamulu lēni satvaguṇamugala vāṭiyaṃdu dayagalavāru)
(ellapuḍu itarulaku upakāramu cēyuṭayaṃdāsakti galavāru)
(tanaku apakāramu cesina vāri yaḍalanainanu sādhuvugā, nemmadigā, maṃcigā nuṃḍuvāḍu sādhuvu) ani satpuruṣulu ceppuduru).
bhiṃdiṃta mapi vṛkṣaḥ svacchāyayā kiṃ na rakṣati ||“.
(tanaku apakāramu jarugucunnappaṭikī upakāramu cēyuvāru sādhuvulu, tananu narukuṭaku vaccina vāninainanu ceṭṭu tana nīḍanu vānikiccunu)
“arāvapyucitaṃ kārya mātidhyaṃ gṛha māgatē |
chēttuḥ pārśvigatāṃ chāyāṃ nōpa saṃhāra tē drumaḥ ||“.
(śatruvainanu tanayiṃṭiki vaccinapuḍu atidhigā satkariṃcavalasinadē - tananu narukuṭaku vaccinavānikainanu ceṭṭu tana nīḍanu yivvakuṃḍā uṃḍadu).
(itarula kāryamunu sādhiṃcuvāru)
sādhnuvaṃti parakāryamiti sādhavaḥ
(itarula kāryamunu sādhiṃcu vāru kanuka sādhuvulu)
anasūyā paraḥ - (asūya lēnivāru)
satya saṃdhaḥ
(satyamunu paripāliṃcuvāḍu - pāṭiṃcuvāḍu - (hariścaṃdrunivale, śrīrāmunivale) “satya saṃdhō jitēṃdriyaḥ” (śrīmadrāmāyaṇaṃ)
(parabrahmadhyānamaṃdē niṣṭagalavāḍu)
(sādhuguṇamu - maṃci guṇamu, satpravartana yē alaṃkāramugā galavāḍu)
(nyāyamaina pravartana kaligiyuṃḍuṭacēta sādhuvu - kāryamulanu sādhiṃcuvādu)
(mahātmulu; dharmamārgamaṃduṃḍuvāru)
(sādhuvulanagā sanmārgamulō naḍacuvāru - puṇyamu cēyuvāru; vēdamārgamaṃduṃḍuvāru - vēdamulō ceppinaprakāramu naḍucukonuvāru; bhagavaṃtuni bhaktulainavāru)
anapēkṣulu - anagā sukhamulaṃdu apēkṣalēnivāru bhagavaccittulu - bhagavaṃtuniyaṃdu manassu kalavāru - goppa śāṃti kalavāru; samadarśanulu; anniṃṭilōnu bhagavaṃtuḍuṃḍuṭavalana anniṃṭini samamugā cūcuvāru, mamakāramu lēnivāru, idi nādi, vīru nāvāru anu abhimānamu lēnivāru - nirahaṃkārulu - anagā, ahaṃkāramu lēnivāru - ī panulannī nēnē cēyucunnānu, idi nā prabhāvamē anu bhāvamu lēnivāru, nirdvaṃdulu - sukhaduḥkhamulu, śītōṣṇamulu modalagunavi lēnivāru, niṣparigrahulu - anagā, okarivaddanuṃḍi yēmiyu puccukonanivāru - iṭṭivāru sādhuvulu).
“prāyaśaḥ sādhavō lōkē parairdvaṃ dēṣu yōjitāḥ |
na vyadhaṃti nahṛṣyaṃti yataḥ ātmā (a)guṇāśrayaḥ”. (śrīmadbhāgavataṃ - 1 - 18 - 50)
(tarucugā ī lōkamaṃdu sādhuvulu itarulacēta dvaṃdvamulaṃdu - sukhaduḥkhamulaṃdu niyōgiṃpabaḍucunnāru - kāni sādhuvulu sukhamu kaligina saṃtōṣiṃparu, kaṣṭamu kaligina duḥkhiṃparu - iṭṭivāru sādhuvulu. eṃducētananagā - triguṇamulavalana sukhaduḥkhamulu kalugucunnavi. ātma vāṭiki atītamu; sādhuvulu ātma samānulu aṃducēta vāriki sukhaduḥkhamulanu ōkaṭigānē cūcedaru)
miḷitamulai parulavalana mēluṃ gīḍun
nelakoninaina, nātmaku
nolayavu sukhaduḥkha cayamu yugmamulagucun”. (śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 18 - 450)
mayyananyēna bhāvēna bhaktiṃ kurvaṃti yē dṛḍhāṃ |
matkṛtē tyakta karmāṇaḥ, tyakta svajana bāṃdhavāḥ |
madāśrakathā hṛṣṭāḥ śṛṇvaṃti kadhayaṃti ca |
tapaṃti vividāstāpā sainān madgata cētasaḥ |
tē ētē sādhavassādhvī sarva saṃga vivarjitāḥ ||“. (śrīmadbhāgavataṃ - 3 - 25 -)
(sādhuvulu ajāta śatruvulu - śatruvu annadi lēnivāru - śāṃtulu, maṃcitanamē bhūṣaṇamugā galavāru - bhagavaṃtuni yaṃdu ananyabhakti, dhṛḍhamaina bhakti galavāru, bhagavaṃtuni koṟaku sakala karmalanu, tama baṃdhu janulanu vadalivēsinavāru, bhagavatkathalatō saṃtōṣiṃcuvāru, bhagavatkathalanu vinuvāru, ceppuvāru, tapassu cēyuvāru, bhagavaṃtuniyaṃdē manassu galigi yuṃḍuvāru, dēniyaṃdunu āsakti lēnivāru).
sādhurēva sa maṃtavyaḥ samyagvyavasitō hi saḥ ||“. (śrīmadbhagavadgīta - 9 - 30)
“atīva kutsitācārō (a)jāmiḷādi ri vā priyaḥ |
kutaścit bhāgyavaśatassēvatē mānanya bhāk |
sa prāga sādhurapyēṣa maṃtavyaḥ sādhurēvahi ||
sādhu niścaya nānyasmāt pravṛttaḥ samyagīśvarē ||“. (gītābhāvaprakāśamu - 9 - 201, 202)
(ghōramaina duracāramaṃdu pravartiṃcuvāḍainanu - anagā, ajāmiḷuḍuvaṃṭi durmārguḍainanu - bhagavadbhaktuḍu kānivāḍainanu, ēdō yoka bhāgya vaśamuna puṇyamu cēsiyuṃḍuṭavalana, bhagavaṃtuni ananyabhaktitō sēviṃcinayaḍala aṭṭivāḍu, aṃtavaraku asādhuvainanu - durmārguḍainanu bhagavadbhaktiyaṃdu pravṛtti galavāḍainaṃduvalana sādhuvēyani talacavalenu).
(vidvānsuḍu, vivēkamugalavāḍu).
(maṃcimārga maṃduṃḍuvāḍu)
anirdēśyakalōpētāḥ sādhavasta udāhṛtāḥ ||“.
(viśuddha satva guṇamu kalavārunu, dhīrulunu, (viṣaya duḥkhādulacē caliṃcanivāru), samadṛṣṭi kalavārunu, nirdēśiṃcuṭaku vīlukāni ānaṃdamugalavārunu, brahma sākṣātkāramu galavārunu sādhuvulu).
tē punaṃtyuru kālēna darśanādēva sādhavaḥ ||.
(gaṃgānadi modalagunavi jalamutō niṃḍi yunnaṃduna tīrthamulukāni maṭṭitōnu ṟāyitōnu cēyabaḍina dēvatulukāni - avi cālākālamunaku gāni pāvanamu cēyavu - sādhuvulu darśanamātramuna pavitrulugā cēyuduru).
sādhula hṛdayaṃbu nēnu jagamulanellan
sādhula nēna yeṟuṃgudu
sādhuleṟuṃguduru nādu caritamu viprā”. (śrīmadāṃdhramahābhāgavatamu - 9 - 7 - 123)
nātatamai yuṃḍu, vāri nalacu janulakun
hētikriya bhīti niccuṃ
jētō mōdaṃbu jeṟacu siddhamu summī” (śrīmadāṃdhramahābhāgavatamu - 9 - 7 - 125)
gili koni pōvu cuṃḍudura kilbiṣa bhakti latā cayaṃbulan
niluvaga beṭṭi kaṭṭuduru nēruputō mada kuṃbhikaivaḍin
valalaku jikki bhaktijana vatsalataṃ janakuṃdu, tāpasā ||“. (śrīmadāṃdhramahābhāgavatamu - 9 - 4 - 118)
sa viśiṣṭaḥ, sa sādhuḥ syāt taṃ prayatnēna saṃśriyēt ||“. (yōgavāśiṣṭamu - 6 - 20)
(sujanulaina janulu (lōkulu) evarini sādhuvu ani ceppudurō atanē sādhuvu - prahlāduḍuvaṃṭivāḍu, mahātmāgāṃdhīvaṃṭivāḍu - ēsukrīstuvaṃṭivāḍu - buddhuḍuvaṃṭivāḍu). aṭṭivānini prayatniṃci āśrayiṃcavalenu) (yōgavāśiṣṭamu)
rakṣituḍagu samata jēsi rāyiḍulaṃdun
rakṣaṇamulu vēyi kaligina
śikṣituḍagu khaluḍu pāpacittuṃḍaguṭan”. (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - pū.bhā.- 277)
yatsādhō (a)syagṛhē jātō bhavān daikulapāvanaḥ ||“. (śrīmadbhāgavataṃ - prahlāda caritra)
(kulapāvanuḍavu, sādhuvu, agu nīvu (prahlāduḍu) ī kuṭuṃbamulō (hiraṇyakaśipuni vaṃśamulō) puṭṭuṭavalana nī taṃḍri, tanaku muṃdu gatiṃcina iruvadiyēḍu taramula pitarulatō kūḍa pavitruḍaināḍu).
(pai ślōkamunaku śrīmadāṃdhramahābhāgavatamulō ī kriṃda vidhamu tenigiṃcaḍamainadi : -
“ma. nija bhaktuṃḍavu naku, ninnu ganuṭan nī taṃḍri trisapta pū
rvajulaṃ gūḍi pavitruḍai śubhagatin vartiṃcu, vijñāna dī
pa janitānēka bhavāṃdhakāru lagu madbhaktul vinōdiṃcu dē
śa janul durjanulaina śuddhul sumī satyaṃbu daityōttamā”. (śrīmadāṃdhramahābhāgavatamu - 7 - 10 - 378)
kālēna phalatē tīrthaḥ, sadyaḥ sādu samāgamaḥ ||“.
(sādhuvula darśanamu puṇyavaṃtamainadi, vāru tīrthamulatō samānulu - tīrthamulu phalamuniccuṭaku koṃtakālamu paṭtunu - sādhuvulu veṃṭanē - darśanamātramunanē - phalamu nitturu - sādhu darśanamu veṃtanē phalamuniccunu).
parvatānāṃ bhayaṃ vajrāt sādhūnāṃ durjavādbhayaṃ ||.
(ceṭlaku gālivalana bhayamu, padmamulaku maṃcuvalana bhayamu. koṃḍalaku vajrāyudhamu valana bhayamu. sādhuvulaku durmārgulavalana bhayamu - penugāli vīcina ceṭlu vēḷḷūḍipōyi paḍipōvunu, maṃcuvalana padmamulu vāḍipōvunu, parvatamulaku vajramu rekkalanu nariki vēyuṭavalana iṃkēmi cēyunō yanu bhayamu - sādhuvulanu durmārgulu kaṣṭapeṭṭinanu vārini sādhulēmiyunu anaru - kōpamu ceṃdaru, tirigi vāḷḷani kaṣṭapeṭṭē panulu cēyaru).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.