← Back to స · Booklets 51–60 (digitized file 6)

సాధుసంగమము sādhusaṃgamamu

Original — తెలుగు
  1. సాధువులందు సద్గుణములును దైవ భక్తియు నిండియుండును - కనుక వారి శరీరములందుండు అణువులు అతి వేగములగు స్పందములకు అభ్యాసపడి యుండును - వారి తేజోబలము చాల అధికము. వారి శరీరముల సమీపమునకు సాధారణ జనులు భక్తియుక్తులై పోయినయడల వారి తేజస్సు యొక్క స్పంద వేగమునకు ఓర్వలేక సాధారణ జనుని యొక్క శరీరము నందుండు తామస రాజస అణువులు సాధారణ జనునియొక్క శరీరమునుండి రాలిపోవును - సాధారణ జనుని శరీరమందు ఆసురసంపత్స్వభావ అణువులకు ఉనికి పట్టు అయి యుండును. అట్టి సాధారణ జనుడు సాధువుల సాంగత్యమును కోరి, వారికి కైంకర్యము చేయుచు వచ్చెనేని పరిమళ ద్రవ్యము వద్దకు దోమలు ఈగలు పోలేకపోయినరీతిగా, సాధారణ జనుని శరీరమందుండు తామస రాజస అణువులు రాలిపోవును - రాలిపోయిన అణువుల యొక్క స్థానమందు సాధువుల శరీరమునందలి యణువులు వచ్చి చేరును - ఒక నిమిషమాత్రమే అయినను సాధు సాంగత్యము జరిగినయడల కొన్ని తామస స్వభావముగల అణువులను మనము పోగొట్టుకొని వానికి భర్తీగా సాత్విల అణువులను సంపాదించుకొనగలము - ఒక నిమిషకాలమునకు బదులు వారి వద్దనే ఉండి వారికి కైంకర్యము చేయుచు వచ్చినయడల క్రమేణ తామస రాజస అణువులు మన శరీరములను వదలిపోవును. సాత్విక అణువులు మన శరీరములయందు చేరును. కాలాంతరమునందు సాత్విక సాత్విక అణువులలెక్క చాల అధికమగును - ఆ విధమున మన శరీరము సత్వ ప్రథానమగును. సత్వ ప్రథానమగు శరీరమందు సత్వ ప్రథానమైన మనస్సును దపించుటకు సాధ్యమగును. అందువలన సత్వ శుద్ధి కలుగును.

  2. చంద్ర చందన యోశ్చాపి శీతలా సాధు సంగతిః.

(చంద్రుని కన్నను, చందనము కన్నను సాధు సంగతి సుఖ శీతలము)

Transliteration
  1. sādhuvulaṃdu sadguṇamulunu daiva bhaktiyu niṃḍiyuṃḍunu - kanuka vāri śarīramulaṃduṃḍu aṇuvulu ati vēgamulagu spaṃdamulaku abhyāsapaḍi yuṃḍunu - vāri tējōbalamu cāla adhikamu. vāri śarīramula samīpamunaku sādhāraṇa janulu bhaktiyuktulai pōyinayaḍala vāri tējassu yokka spaṃda vēgamunaku ōrvalēka sādhāraṇa januni yokka śarīramu naṃduṃḍu tāmasa rājasa aṇuvulu sādhāraṇa januniyokka śarīramunuṃḍi rālipōvunu - sādhāraṇa januni śarīramaṃdu āsurasaṃpatsvabhāva aṇuvulaku uniki paṭṭu ayi yuṃḍunu. aṭṭi sādhāraṇa januḍu sādhuvula sāṃgatyamunu kōri, vāriki kaiṃkaryamu cēyucu vaccenēni parimaḷa dravyamu vaddaku dōmalu īgalu pōlēkapōyinarītigā, sādhāraṇa januni śarīramaṃduṃḍu tāmasa rājasa aṇuvulu rālipōvunu - rālipōyina aṇuvula yokka sthānamaṃdu sādhuvula śarīramunaṃdali yaṇuvulu vacci cērunu - oka nimiṣamātramē ayinanu sādhu sāṃgatyamu jariginayaḍala konni tāmasa svabhāvamugala aṇuvulanu manamu pōgoṭṭukoni vāniki bhartīgā sātvila aṇuvulanu saṃpādiṃcukonagalamu - oka nimiṣakālamunaku badulu vāri vaddanē uṃḍi vāriki kaiṃkaryamu cēyucu vaccinayaḍala kramēṇa tāmasa rājasa aṇuvulu mana śarīramulanu vadalipōvunu. sātvika aṇuvulu mana śarīramulayaṃdu cērunu. kālāṃtaramunaṃdu sātvika sātvika aṇuvulalekka cāla adhikamagunu - ā vidhamuna mana śarīramu satva prathānamagunu. satva prathānamagu śarīramaṃdu satva prathānamaina manassunu dapiṃcuṭaku sādhyamagunu. aṃduvalana satva śuddhi kalugunu.

  2. caṃdra caṃdana yōścāpi śītalā sādhu saṃgatiḥ.

(caṃdruni kannanu, caṃdanamu kannanu sādhu saṃgati sukha śītalamu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.