(సత్వ రజస్తమోగుణములుగల ప్రకృతియొక్క కార్యమైన పృధివి మొదలగునవి శరీరముగాగల పరబ్రహ్మ, పరమాత్మ)
(శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 20 - 891)
- - - బరముడుననైనట్టి యీశుండు సే
వక యోగీంద్రకుమార సిద్ధముని దేవశ్రేణి యోగ ప్రవ
ర్తకమై తన్ను భజింప జూపు సగుణబ్రహ్మంబు లీలాగతిన్“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 32 - 1019)
(మాయయని చెప్పబడు ప్రకృతితో కలిసియున్న పరబ్రహ్మ చైతన్యము అయిన కారణబ్రహ్మయే సగుణబ్రహ్మయని చెప్పబడుచున్నది. లేక, కారణ బ్రహ్మకు ఉపలక్షణములైన హిరణ్యగర్భుడు, వైశ్యానరుడు, విష్ణువు, శివుడు, గౌరి, గణాధిపతి, సూర్యుడు మొదలగు కార్యబ్రహ్మరూపములు సగుణబ్రహ్మ యనియే ధ్యానించ తగినవి. లేక, ఈ విష్ణువు, శివుడు మొదలగువారియొక్క ప్రతీకములైన సాలగ్రామము మొదలగునవి, వాటి ప్రతిమలు సగుణబ్రహ్మయని ఉపాసించతగినవి).
(పరబ్రహ్మ సత్యము, జ్ఞానము అనంతము అను గుణములు కలవాడని చెప్పబడినది. దీనివలన, ఈ గుణములుగలవాడుకనుక సగుణబ్రహ్మ అని చెప్పబడినది).
(బ్రహ్మగుఱించి శ్రుతులు రెండు విధములుగా చెప్పుచున్నవి - “సర్వ కర్మలు, సర్వ గంధములు, సర్వరసములు తానే అని చెప్పు వాక్యములు బ్రహ్మ సవిశేషమని, సగుణమని - అనేక కల్యాణగుణములు కలవాడని - తెలియచేయుచున్నవి. స్థూలమైనదికాదు, పరమాణువంత చిన్నదియు కాదు, పెద్దది కాదు, పొడుగు అయినదికాదు పొట్టిది కాదు” అను వాక్యములు బ్రహ్మ నిర్విశేషము అని చెప్పుచున్నవి. ఇట్లు చెప్పుటచేత బ్రహ్మ సగుణమా - సవిశేషమా -, లేక నిర్గుణమా? బ్రహ్మ రెండు విధములుగానుండదు. ఏ వస్తువైనను సాధారణముగా రెండు విరుద్ధ ధర్మములు - వ్యతిరేక ధర్మములు - కలిగి యుండవు - బ్రహ్మ యుండు స్థానమును బట్టి - ఉపాధిని బట్టి - ఇట్లుండవచ్చుననుట పొసగదు - స్ఫటికము స్వభావమువలన నిర్మలమైన దైనను ఉపాధివలన మలినమైనదిగా కనుపించునుగాని, స్వచ్చముగా నిర్మలమైనదే. మలినముగా కనబడుట అభినివేశమువలన, ఉపాధి వలననే. ఇట్లే పరబ్రహ్మకూడ ఏ విధమైన విశేషములు లేనివాడు - నిర్విశేషుడు - నిర్వికల్పుడు, నిర్గుణుడు. శ్రుతులలో బ్రహ్మ స్వరూపమును చెప్పు వాక్యములు బ్రహ్మ “అశబ్దము, అస్పర్శము, అరూపము, అద్వయము” అని బ్రహ్మ నిర్విశేషమనియే చెప్పుచున్నవి.
(కొన్ని శ్రుతులలో బ్రహ్మ నిర్గుణమని బోధింపబడినది. మఱి కొన్నింటిలో బ్రహ్మ సగుణమని బోధింపబడినది. కొన్ని శ్రుతులందు లోకములన్నియు పరబ్రహ్మ స్వరూపమే (దేహమే) అని చెప్పబడియున్నది - “యశ్చా యమస్యాం పృధివ్యాం తేజోమయో(అ)మృతమయః పురుషో యశ్చాయ మధ్యాత్మం శారీరస్తేజోమయో(అ)మృతమయః పురుషో (అ)యమేవ స యో (అ)యమాత్మా” (తేజో రూపుడును ఆనందరూపుడును అగు ఏ పురుషుడు భూమి మొదలగు ఉపాధులందుండునో, తేజోరూపుడు, ఆనందరూపుడు అగునట్టి యే పురుషుడు జీవరూపమున దేహమున నున్నాడో అట్టి పురుషులిద్దరు ఒక్కటే ఆత్మయే పృధివీ మొదలగువాటియందు ఆయా ఆకారములతో నున్నాడు, అని ఒకే రూపము చెప్పబడియున్నది. దీనిని బట్టి ఉపాసనకొఱకు భగవంతునికి ఆకార భేదములు చెప్పబడియున్నవి, అంతియేకాని పరబ్రహ్మకు ఇన్ని ఆకారములులేవు - అసలు ఆకారమే లేదు - నిరాకారుడు).
(ఈ పరమేశ్వరుడు కంటికి కనబడువాడు కాడు కనుక - మనసుతోనే పొందతగినవాడు. ఈ ప్రపంచమంతయు పరబ్రహ్మములోనుండి పుట్టినదే కనుక పరబ్రహ్మమే. పరబ్రహ్మ తప్ప ఈ సృష్టిలో మఱియొక వస్తువు లేదు - పరబ్రహ్మకాక ఇతర వస్తువు ఉన్నదని ఎవడు తలంచునో వాడు మరణము తర్వాత మరణమును పొందును - అనగా, జన్మ తర్వాత ఇంకొక జన్మ యీ రీతిగ సంసారములో పడియుండును - ఇట్లు శ్రుతి చెప్పుటవలన అంతా పరబ్రహ్మమే - అనేక రూపములుగల ప్రపంచకమంతయు భగవంతుని ఆకారమే అనియు తెలియచున్నది).
ఎండకాని, వెన్నెలకాని ఆకాశమంతయు మేఘములతో నిండియున్నపుడు కిటికీలద్వారా వాటి ఆకారములబట్టి నిలువుగాను, గుండ్రముగాను కనబడినట్లు పరబ్రహ్మ తాను ఆకారము లేనివాడైనను, అన్నింటిలోను వ్యాపించి యుండువాడైనను తాను ఉన్న పృధివి మొదలగు ఉపాధులనుబట్టి ఆయా రూపములతో నున్నాడనిపించునుగాని యదార్థముగా ఏ రూపము లేనివాడు - నిరాకారుడు, నిర్గుణుడు.
“ఆ. జన్మకర్మములును జన్మంబులును లేవు
శిష్టరక్షణము సేయవలసి
గుణవిరహితుడయ్యు గుణియయి సర్వ ర
క్షణ వినాశకేళి సలుపుచుండు“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - పూ.భా. - 1451)
“అశబ్ద మస్పర్శమరూప మవ్యయం” (కాఠకము - 3 - 15)
- ఉపాధులలోనున్న పరబ్రహ్మ గుఱించి యీ విధముగా చెప్పబడినది.
“యశ్చాయ మస్యాం పృదివ్యాం తేజో మయః అమృతమయః పురుషో యశ్చాయ మధ్యాత్మం శారీ రస్తేజో మయో (అ)మృతమయః పురుషో యమేవ సయో యమాత్మా” (బృహదారణ్యకోపనిషత్ - 2 - 5 - 1)
(ఈ భూమిలో - భూమి యను ఉపాధిలో - నున్నవాడు, తేజోమయుడు, అమృతమయుడు అగు పురుషుడు, అధ్యాత్మ, పృధివియను శరీరముకలవాడు - ఆత్మ అయినవాడు). ఇట్లు చెప్పుటవలన ఉపాధిలోనుండు పరబ్రహ్మ నిర్గుణ, నిర్విశేష పరబ్రహ్మయే - మఱియు, “మనసైవేదమాప్తవ్యం నేహనా నాస్తి కించన, మృత్యో స్సమృత్యుమాప్నోతి య ఇవ నానేవ పశ్యతి” (కాఠి - 4 - 11)
(పరబ్రహ్మ మనస్సుచేతనే తెలియ తగినవాడు - కంటికి కనబడువాడు కాడు) ఇట్టి నిరాకార నిర్గుణ పరబ్రహ్మను తెలుసుకొనిన, ఈ సృష్టిలో అనేక వస్తువులున్నట్లు కనబడదు. అంతా పర బ్రహ్మమే కనుక మనస్సులో నిర్గుణపరబ్రహ్మను తెలుసుకొనినవాడు - బ్రహ్మ అనేకరూపములు గలవాడు అని తలచువాడు అనేక జన్మములనొందును). “యథా సైంధవఘనో (అ)నంతరో, అబాహ్యః కృత్స్నో రసఘన ఏవ, ఏవం వా అరే (అ)యమాత్మా నంతరో(అ)బాహ్యః కృత్స్నః ప్రజ్ఞాన ఘన ఏవ”. (బృహదారణ్యకోపనిషత్ 4 - 5 - 13)
(ఉప్పుగడ్డ లోపల పైన అంతటను ఉప్పు రసమే కలిగి యున్నట్లు - ఒకే రసము కలిగియిన్నట్లు -పరబ్రహ్మ లోపల పైన ఒకే చైతన్యముతో నిండియున్నాడు - శ్రుతి కూడ - (శ్రీమద్భగవద్గీత కూడ- 13 - 12)
- “అనాది మత్పరం బ్రహ్మ న సత్యన్నా సదుచ్యతే” (పరబ్రహ్మ అనాది - జన్మలేనిది, సత్తుకాదు, అసత్ కాదు) అని చెప్పబడుచున్నది. “తదుప్యక్తమాహుః” (బ్రహ్మసూత్రములు - 3 - 2 - 23)
(పరబ్రహ్మ అవ్యక్తము - వ్యక్తము కాదు, కనబడదు) ఇట్లు చెప్పుటచేత పరబ్రహ్మము నిరాకారము).
(అంతటను చేతులు పాదములు కలది, అంతటను కండ్లు, శిరస్సులు, ముఖములు కలది అనీన్నీ, వేలకొలది శిరస్సులుగల పురుషుడు, వేలకొలది కన్నులు గలవాడు, వేలకొలది పాదములు కలవాడు అని శ్రుతి చెప్పుచున్నది. సృష్టిలోని ప్రాణులన్నియు భగవంతుని రూపములే కనుక వాటి పాదములు, చేతులు, శిరస్సులు, అన్నియు భగవంతినివేయని చెప్పబడినది. ఇట్లు చెప్పుటవలన భగవంతుడు అవయవములు కలవాడు అని చెప్పబడినది. అవయవములు కలుగుట త్రిగుణములవలననే. అందుచేత అట్లు ఆ రూపముగల బ్రహ్మ సగుణబ్రహ్మ - సాకారబ్రహ్మ).
“సీ. జలధరదేహు నాజాను చతుర్బాహు సరసీరుహాక్షు విశాల వక్షు
జారు గదా శంఖ చక్ర పద్మ విలాసు గంఠ కౌస్తుభమణికాంతిభాసు
గమనీయ కటిసూత్ర కంకణ కేయూర, శీవత్స లాంఛనాంచిత విహారు
మకర కుండల ప్రభాయుత కుంతల లలాటు, వైడూర్య మణిగణ వరకిరీటు
- - - ” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - పూ. హా. - 112)
(satva rajastamōguṇamulugala prakṛtiyokka kāryamaina pṛdhivi modalagunavi śarīramugāgala parabrahma, paramātma)
(śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 20 - 891)
- - - baramuḍunanainaṭṭi yīśuṃḍu sē
vaka yōgīṃdrakumāra siddhamuni dēvaśrēṇi yōga prava
rtakamai tannu bhajiṃpa jūpu saguṇabrahmaṃbu līlāgatin”. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 32 - 1019)
(māyayani ceppabaḍu prakṛtitō kalisiyunna parabrahma caitanyamu ayina kāraṇabrahmayē saguṇabrahmayani ceppabaḍucunnadi. lēka, kāraṇa brahmaku upalakṣaṇamulaina hiraṇyagarbhuḍu, vaiśyānaruḍu, viṣṇuvu, śivuḍu, gauri, gaṇādhipati, sūryuḍu modalagu kāryabrahmarūpamulu saguṇabrahma yaniyē dhyāniṃca taginavi. lēka, ī viṣṇuvu, śivuḍu modalaguvāriyokka pratīkamulaina sālagrāmamu modalagunavi, vāṭi pratimalu saguṇabrahmayani upāsiṃcataginavi).
(parabrahma satyamu, jñānamu anaṃtamu anu guṇamulu kalavāḍani ceppabaḍinadi. dīnivalana, ī guṇamulugalavāḍukanuka saguṇabrahma ani ceppabaḍinadi).
(brahmaguṟiṃci śrutulu reṃḍu vidhamulugā ceppucunnavi - “sarva karmalu, sarva gaṃdhamulu, sarvarasamulu tānē ani ceppu vākyamulu brahma saviśēṣamani, saguṇamani - anēka kalyāṇaguṇamulu kalavāḍani - teliyacēyucunnavi. sthūlamainadikādu, paramāṇuvaṃta cinnadiyu kādu, peddadi kādu, poḍugu ayinadikādu poṭṭidi kādu” anu vākyamulu brahma nirviśēṣamu ani ceppucunnavi. iṭlu ceppuṭacēta brahma saguṇamā - saviśēṣamā -, lēka nirguṇamā? brahma reṃḍu vidhamulugānuṃḍadu. ē vastuvainanu sādhāraṇamugā reṃḍu viruddha dharmamulu - vyatirēka dharmamulu - kaligi yuṃḍavu - brahma yuṃḍu sthānamunu baṭṭi - upādhini baṭṭi - iṭluṃḍavaccunanuṭa posagadu - sphaṭikamu svabhāvamuvalana nirmalamaina dainanu upādhivalana malinamainadigā kanupiṃcunugāni, svaccamugā nirmalamainadē. malinamugā kanabaḍuṭa abhinivēśamuvalana, upādhi valananē. iṭlē parabrahmakūḍa ē vidhamaina viśēṣamulu lēnivāḍu - nirviśēṣuḍu - nirvikalpuḍu, nirguṇuḍu. śrutulalō brahma svarūpamunu ceppu vākyamulu brahma “aśabdamu, asparśamu, arūpamu, advayamu” ani brahma nirviśēṣamaniyē ceppucunnavi.
(konni śrutulalō brahma nirguṇamani bōdhiṃpabaḍinadi. maṟi konniṃṭilō brahma saguṇamani bōdhiṃpabaḍinadi. konni śrutulaṃdu lōkamulanniyu parabrahma svarūpamē (dēhamē) ani ceppabaḍiyunnadi - “yaścā yamasyāṃ pṛdhivyāṃ tējōmayō(a)mṛtamayaḥ puruṣō yaścāya madhyātmaṃ śārīrastējōmayō(a)mṛtamayaḥ puruṣō (a)yamēva sa yō (a)yamātmā” (tējō rūpuḍunu ānaṃdarūpuḍunu agu ē puruṣuḍu bhūmi modalagu upādhulaṃduṃḍunō, tējōrūpuḍu, ānaṃdarūpuḍu agunaṭṭi yē puruṣuḍu jīvarūpamuna dēhamuna nunnāḍō aṭṭi puruṣuliddaru okkaṭē ātmayē pṛdhivī modalaguvāṭiyaṃdu āyā ākāramulatō nunnāḍu, ani okē rūpamu ceppabaḍiyunnadi. dīnini baṭṭi upāsanakoṟaku bhagavaṃtuniki ākāra bhēdamulu ceppabaḍiyunnavi, aṃtiyēkāni parabrahmaku inni ākāramululēvu - asalu ākāramē lēdu - nirākāruḍu).
(ī paramēśvaruḍu kaṃṭiki kanabaḍuvāḍu kāḍu kanuka - manasutōnē poṃdataginavāḍu. ī prapaṃcamaṃtayu parabrahmamulōnuṃḍi puṭṭinadē kanuka parabrahmamē. parabrahma tappa ī sṛṣṭilō maṟiyoka vastuvu lēdu - parabrahmakāka itara vastuvu unnadani evaḍu talaṃcunō vāḍu maraṇamu tarvāta maraṇamunu poṃdunu - anagā, janma tarvāta iṃkoka janma yī rītiga saṃsāramulō paḍiyuṃḍunu - iṭlu śruti ceppuṭavalana aṃtā parabrahmamē - anēka rūpamulugala prapaṃcakamaṃtayu bhagavaṃtuni ākāramē aniyu teliyacunnadi).
eṃḍakāni, vennelakāni ākāśamaṃtayu mēghamulatō niṃḍiyunnapuḍu kiṭikīladvārā vāṭi ākāramulabaṭṭi niluvugānu, guṃḍramugānu kanabaḍinaṭlu parabrahma tānu ākāramu lēnivāḍainanu, anniṃṭilōnu vyāpiṃci yuṃḍuvāḍainanu tānu unna pṛdhivi modalagu upādhulanubaṭṭi āyā rūpamulatō nunnāḍanipiṃcunugāni yadārthamugā ē rūpamu lēnivāḍu - nirākāruḍu, nirguṇuḍu.
“ā. janmakarmamulunu janmaṃbulunu lēvu
śiṣṭarakṣaṇamu sēyavalasi
guṇavirahituḍayyu guṇiyayi sarva ra
kṣaṇa vināśakēḷi salupucuṃḍu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - pū.bhā. - 1451)
“aśabda masparśamarūpa mavyayaṃ” (kāṭhakamu - 3 - 15)
- upādhulalōnunna parabrahma guṟiṃci yī vidhamugā ceppabaḍinadi.
“yaścāya masyāṃ pṛdivyāṃ tējō mayaḥ amṛtamayaḥ puruṣō yaścāya madhyātmaṃ śārī rastējō mayō (a)mṛtamayaḥ puruṣō yamēva sayō yamātmā” (bṛhadāraṇyakōpaniṣat - 2 - 5 - 1)
(ī bhūmilō - bhūmi yanu upādhilō - nunnavāḍu, tējōmayuḍu, amṛtamayuḍu agu puruṣuḍu, adhyātma, pṛdhiviyanu śarīramukalavāḍu - ātma ayinavāḍu). iṭlu ceppuṭavalana upādhilōnuṃḍu parabrahma nirguṇa, nirviśēṣa parabrahmayē - maṟiyu, “manasaivēdamāptavyaṃ nēhanā nāsti kiṃcana, mṛtyō ssamṛtyumāpnōti ya iva nānēva paśyati” (kāṭhi - 4 - 11)
(parabrahma manassucētanē teliya taginavāḍu - kaṃṭiki kanabaḍuvāḍu kāḍu) iṭṭi nirākāra nirguṇa parabrahmanu telusukonina, ī sṛṣṭilō anēka vastuvulunnaṭlu kanabaḍadu. aṃtā para brahmamē kanuka manassulō nirguṇaparabrahmanu telusukoninavāḍu - brahma anēkarūpamulu galavāḍu ani talacuvāḍu anēka janmamulanoṃdunu). “yathā saiṃdhavaghanō (a)naṃtarō, abāhyaḥ kṛtsnō rasaghana ēva, ēvaṃ vā arē (a)yamātmā naṃtarō(a)bāhyaḥ kṛtsnaḥ prajñāna ghana ēva”. (bṛhadāraṇyakōpaniṣat 4 - 5 - 13)
(uppugaḍḍa lōpala paina aṃtaṭanu uppu rasamē kaligi yunnaṭlu - okē rasamu kaligiyinnaṭlu -parabrahma lōpala paina okē caitanyamutō niṃḍiyunnāḍu - śruti kūḍa - (śrīmadbhagavadgīta kūḍa- 13 - 12)
- “anādi matparaṃ brahma na satyannā saducyatē” (parabrahma anādi - janmalēnidi, sattukādu, asat kādu) ani ceppabaḍucunnadi. “tadupyaktamāhuḥ” (brahmasūtramulu - 3 - 2 - 23)
(parabrahma avyaktamu - vyaktamu kādu, kanabaḍadu) iṭlu ceppuṭacēta parabrahmamu nirākāramu).
(aṃtaṭanu cētulu pādamulu kaladi, aṃtaṭanu kaṃḍlu, śirassulu, mukhamulu kaladi anīnnī, vēlakoladi śirassulugala puruṣuḍu, vēlakoladi kannulu galavāḍu, vēlakoladi pādamulu kalavāḍu ani śruti ceppucunnadi. sṛṣṭilōni prāṇulanniyu bhagavaṃtuni rūpamulē kanuka vāṭi pādamulu, cētulu, śirassulu, anniyu bhagavaṃtinivēyani ceppabaḍinadi. iṭlu ceppuṭavalana bhagavaṃtuḍu avayavamulu kalavāḍu ani ceppabaḍinadi. avayavamulu kaluguṭa triguṇamulavalananē. aṃducēta aṭlu ā rūpamugala brahma saguṇabrahma - sākārabrahma).
“sī. jaladharadēhu nājānu caturbāhu sarasīruhākṣu viśāla vakṣu
jāru gadā śaṃkha cakra padma vilāsu gaṃṭha kaustubhamaṇikāṃtibhāsu
gamanīya kaṭisūtra kaṃkaṇa kēyūra, śīvatsa lāṃchanāṃcita vihāru
makara kuṃḍala prabhāyuta kuṃtala lalāṭu, vaiḍūrya maṇigaṇa varakirīṭu
- - - ” (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - pū. hā. - 112)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.