← Back to స · Booklets 51–60 (digitized file 6)

సహస్ర ముఖుడు sahasra mukhuḍu

Original — తెలుగు
  1. అత్ర సహస్ర శబ్దః అనంత్యవాచీ, సర్వ ప్రాణినాం యాని ముఖ బాహు, చరణ, నయనాది తాని సర్వాణి విరాడ్రూపస్య అస్య దేహాంత పాతిత్వాత్ ఏ తదీయాః ఏవ ఇతి సహస్ర వదనాదికత్వం -

వేలకొలది ముఖములు కలవాడు - ఇచ్చట సహస్రమనగా వేయి అనే కాదు, వేనవేలు, వేలకొలది - పదివేలు, లక్ష, పదిలక్షలు, కోటి. పదికోట్లు, అర్బుదము, నిర్బుదము, ఇంకా ఎన్నో, లెక్క లేనన్ని, అంతము లేనన్ని యని యర్థము - సమస్త ప్రాణుల యొక్క ముఖములు, బాహువులు, కాళ్ళు, చేతులు, కండ్లు అవన్నియు విరాడ్రూపుడైన - వివిధరూపముగల, వివిధ రూపములు తానే అయిన భగవంతునివే. అందుచేత వేల కొలది ముఖములు మొదలగునవన్నియు కలవాడు భగవంతుడు అని చెప్పబడినది).

  1. సర్వాశ్చర్యమయం దేవ మనంతం విశ్వతో ముఖం

(అందఱికి ఆశ్చర్యము కలుగచేయు, లేక, అని విధముల ఆశ్చర్యకరమగు దేవుని గిఱించి నమస్కారము - అంతము లేనివాడు, ఏ విధముగా చూచినను - అంతము లేనివాడు, అన్ని చోట్ల, అన్నింటిలోను ముఖములు కలవాడు - సృష్టిలోనున్న రూపములన్నియు తనవే కనుక ఆ రూపములు, ముఖములు తనవే కనుక విశ్వతోముఖుడు)

Transliteration
  1. atra sahasra śabdaḥ anaṃtyavācī, sarva prāṇināṃ yāni mukha bāhu, caraṇa, nayanādi tāni sarvāṇi virāḍrūpasya asya dēhāṃta pātitvāt ē tadīyāḥ ēva iti sahasra vadanādikatvaṃ -

vēlakoladi mukhamulu kalavāḍu - iccaṭa sahasramanagā vēyi anē kādu, vēnavēlu, vēlakoladi - padivēlu, lakṣa, padilakṣalu, kōṭi. padikōṭlu, arbudamu, nirbudamu, iṃkā ennō, lekka lēnanni, aṃtamu lēnanni yani yarthamu - samasta prāṇula yokka mukhamulu, bāhuvulu, kāḷḷu, cētulu, kaṃḍlu avanniyu virāḍrūpuḍaina - vividharūpamugala, vividha rūpamulu tānē ayina bhagavaṃtunivē. aṃducēta vēla koladi mukhamulu modalagunavanniyu kalavāḍu bhagavaṃtuḍu ani ceppabaḍinadi).

  1. sarvāścaryamayaṃ dēva manaṃtaṃ viśvatō mukhaṃ

(aṃdaṟiki āścaryamu kalugacēyu, lēka, ani vidhamula āścaryakaramagu dēvuni giṟiṃci namaskāramu - aṃtamu lēnivāḍu, ē vidhamugā cūcinanu - aṃtamu lēnivāḍu, anni cōṭla, anniṃṭilōnu mukhamulu kalavāḍu - sṛṣṭilōnunna rūpamulanniyu tanavē kanuka ā rūpamulu, mukhamulu tanavē kanuka viśvatōmukhuḍu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.