(అనేకములైన శిరములు కలవాడు)
(వేలకొలది, అనంతములైన శిరస్సులు కలవాడు)
(సమష్టి జీవాత్మ యగుటవలన వేలకొలది శిరస్సులు కలవాడు - సహస్రాక్షుడు అను మొదలగునవి చెప్పినపుడు యిట్లే యోజించవలెను).
(వేలకొలది, అనేకములైన శిరస్సులు కల దేవుడు, అనేకమైన కండ్లు గలవాడు, ప్రపంచమునకు శుభము కలుగచేయువాడు).
(సహస్రము అనగా అపరిమితము - పరిమితి లేనన్ని, అనంతములు అని అర్థము తెలియచేయునది - లేక్కలేనన్ని శిరస్సులు కలవాడు - ఇట్లు ఇన్ని శిరస్సులు గలవాడని చెప్పుటచేత సమస్త జగత్తు తన శరీరముగా గల విరాడ్రూపము అగు మహేశ్వరును దేహము - ఆ ప్రకారముగానే మన అందఱి శిరస్సులు తనవే అయినందున ఇన్ని శిరస్సులు కలవాడు తానే - దీనిని బట్టి ఈ ప్రకారముగానే విశ్వాక్షుడు సహస్రాక్షుడు అను మాటలకు అర్థము తెలుసుకొనవలెను).
“వ. అమ్మహనీయ తేజోనిధి మొదలి యవతారంబు సహస్ర శీర్షాది యుక్తంబయి ప్రకృతి ప్రవర్తకంబగు నాది పురుష రూపంబగు - అందు కాల స్వభావంబులను శక్తులుదయించె. అందు గార్య కారణ రూపంబయిన ప్రకృతి జనించె”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 6 - 112)
“సహస్ర శీర్షా పురుష స్సహస్రాక్షస్స హస్రపాత్” - (పురుష సూక్తము -)
(పురుషుడు - భగవంతుడు - వేయి శిరస్సులు, వేలకొలది కండ్లు గలవాడు, వేలకొలది పాదములు కలవాడు).
(సృష్టిలోనున్న కోటాను కోట్ల జీవులు భగవంతునిలోనుండి పుట్టినవే కనుక అవి అన్నియు భగవంతుని రూపములే, ఆ రూపముల అవయవములన్నియు భగవంతుని అవయవములే. అందుచేత వేలకొలది శిరస్సులు మొదలగు అవయవములు కలవాడు. జీవుని శరీరములో నున్న జీవుడు భగవంతుని అంశయే కనుక ఆ శరీరములు భగవంతునివే).
బహూదరం బహుదమ్ష్త్రాకరాళం, దృష్త్ట్వా లోకాః ప్రవ్యధితా స్తదాహం ||“. (శ్రీమద్భగవద్గీత - 11 - 23)
(అనేక వక్త్రములు, నేత్రములు, బాహువులు, పాదములు, ఉదరములు, దమ్ష్ట్రలు గల నీ రూపమహాథ్మ్యమును చూచి, లోకములు, నేను గొప్ప వ్యధ పొందుచున్నాము).
“అత్ర సహస్ర శబ్దః అనంత్యదాచీ, సర్వ ప్రాణినాం యాని ముఖ బాహు చరణ నయనాని తాని సర్వాణి విరాడ్రూపస్య అన్య అస్మ్య దేహాంతః పాతిత్వాత్ ఏతదీయమేవ ఇతి సహస్ర వదనాదికత్వం”.
(ఇక్కడ సహస్రము అనగా అనంతమని చెప్పినట్లే - సమస్త ప్రాణుల యొక్క ముఖములు, బాహువులు, చరణములు, నయనములు ఏవి కలవో అవన్నియు విరాడ్రూపునివే).
(anēkamulaina śiramulu kalavāḍu)
(vēlakoladi, anaṃtamulaina śirassulu kalavāḍu)
(samaṣṭi jīvātma yaguṭavalana vēlakoladi śirassulu kalavāḍu - sahasrākṣuḍu anu modalagunavi ceppinapuḍu yiṭlē yōjiṃcavalenu).
(vēlakoladi, anēkamulaina śirassulu kala dēvuḍu, anēkamaina kaṃḍlu galavāḍu, prapaṃcamunaku śubhamu kalugacēyuvāḍu).
(sahasramu anagā aparimitamu - parimiti lēnanni, anaṃtamulu ani arthamu teliyacēyunadi - lēkkalēnanni śirassulu kalavāḍu - iṭlu inni śirassulu galavāḍani ceppuṭacēta samasta jagattu tana śarīramugā gala virāḍrūpamu agu mahēśvarunu dēhamu - ā prakāramugānē mana aṃdaṟi śirassulu tanavē ayinaṃduna inni śirassulu kalavāḍu tānē - dīnini baṭṭi ī prakāramugānē viśvākṣuḍu sahasrākṣuḍu anu māṭalaku arthamu telusukonavalenu).
“va. ammahanīya tējōnidhi modali yavatāraṃbu sahasra śīrṣādi yuktaṃbayi prakṛti pravartakaṃbagu nādi puruṣa rūpaṃbagu - aṃdu kāla svabhāvaṃbulanu śaktuludayiṃce. aṃdu gārya kāraṇa rūpaṃbayina prakṛti janiṃce”. (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 6 - 112)
“sahasra śīrṣā puruṣa ssahasrākṣassa hasrapāt” - (puruṣa sūktamu -)
(puruṣuḍu - bhagavaṃtuḍu - vēyi śirassulu, vēlakoladi kaṃḍlu galavāḍu, vēlakoladi pādamulu kalavāḍu).
(sṛṣṭilōnunna kōṭānu kōṭla jīvulu bhagavaṃtunilōnuṃḍi puṭṭinavē kanuka avi anniyu bhagavaṃtuni rūpamulē, ā rūpamula avayavamulanniyu bhagavaṃtuni avayavamulē. aṃducēta vēlakoladi śirassulu modalagu avayavamulu kalavāḍu. jīvuni śarīramulō nunna jīvuḍu bhagavaṃtuni aṃśayē kanuka ā śarīramulu bhagavaṃtunivē).
bahūdaraṃ bahudamṣtrākarāḷaṃ, dṛṣtṭvā lōkāḥ pravyadhitā stadāhaṃ ||“. (śrīmadbhagavadgīta - 11 - 23)
(anēka vaktramulu, nētramulu, bāhuvulu, pādamulu, udaramulu, damṣṭralu gala nī rūpamahāthmyamunu cūci, lōkamulu, nēnu goppa vyadha poṃducunnāmu).
“atra sahasra śabdaḥ anaṃtyadācī, sarva prāṇināṃ yāni mukha bāhu caraṇa nayanāni tāni sarvāṇi virāḍrūpasya anya asmya dēhāṃtaḥ pātitvāt ētadīyamēva iti sahasra vadanādikatvaṃ”.
(ikkaḍa sahasramu anagā anaṃtamani ceppinaṭlē - samasta prāṇula yokka mukhamulu, bāhuvulu, caraṇamulu, nayanamulu ēvi kalavō avanniyu virāḍrūpunivē).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.