(వేలకొలది కన్నులు కలవాడు).
(జీవ సమష్టిరూపములో నుండునప్పటి రూపము - తనదే యగుటవలన ఆ జీవుల కళ్ళు అన్నియు తనవే యగుటచేత సహస్రాక్షుడు - వేలకొలది - లెక్కలేనన్ని కండ్లు గలవాడు).
భగవంతుడే జగత్తు, జగత్తే భగవంతుడు కనుక భగవంతునుకి జగత్తునకు భేదములేదు కనుక అన్ని జీవుల కండ్లు అతనివే యని అర్థము -
వశ్వాని సర్వాణి అస్మదీయాని అక్షాణి ఇంద్రియాణి సర్వ జగదాత్మకస్య, విరూడ్రూపస్య అక్షాణి ఏవ ఇతి విశ్వాక్షత్వం. ఉక్తే సహస్ర శీర్షే విరాడ్రూపే దేహే అవస్థితస్య మహేశ్వరస్య నిజస్వరూపం ద్వితీయార్దేన ఉచ్యతే.
(అక్షములనగా ఇంద్రియములు - మన ఇంద్రియములన్నియు ఈ జగత్తు అంతయు శరీరముగాగల విరాడ్రూపుడైన భగవంతుని ఇంద్రియములే. అందుచేత అతను విశ్వాక్షుడు సహస్రశీర్షుడు అని చెప్పబడిన విరాడ్రూపము యొక్క దేహమందుండు మహేశ్వరుని స్వరూపము).
విహరించున్ బహు దేహిగతుడై, విద్వాంసులూహించి త
ద్బహు రూపావయవంబులన్ భువనపంక్తిన్ విచారింతురు - - - - “. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 6 - 88)
(vēlakoladi kannulu kalavāḍu).
(jīva samaṣṭirūpamulō nuṃḍunappaṭi rūpamu - tanadē yaguṭavalana ā jīvula kaḷḷu anniyu tanavē yaguṭacēta sahasrākṣuḍu - vēlakoladi - lekkalēnanni kaṃḍlu galavāḍu).
bhagavaṃtuḍē jagattu, jagattē bhagavaṃtuḍu kanuka bhagavaṃtunuki jagattunaku bhēdamulēdu kanuka anni jīvula kaṃḍlu atanivē yani arthamu -
vaśvāni sarvāṇi asmadīyāni akṣāṇi iṃdriyāṇi sarva jagadātmakasya, virūḍrūpasya akṣāṇi ēva iti viśvākṣatvaṃ. uktē sahasra śīrṣē virāḍrūpē dēhē avasthitasya mahēśvarasya nijasvarūpaṃ dvitīyārdēna ucyatē.
(akṣamulanagā iṃdriyamulu - mana iṃdriyamulanniyu ī jagattu aṃtayu śarīramugāgala virāḍrūpuḍaina bhagavaṃtuni iṃdriyamulē. aṃducēta atanu viśvākṣuḍu sahasraśīrṣuḍu ani ceppabaḍina virāḍrūpamu yokka dēhamaṃduṃḍu mahēśvaruni svarūpamu).
vihariṃcun bahu dēhigatuḍai, vidvāṃsulūhiṃci ta
dbahu rūpāvayavaṃbulan bhuvanapaṃktin vicāriṃturu - - - - “. (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 6 - 88)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.