ఉప్పుగల్లు - దీనిలో నున్న రసమంతయు ఉప్పు రసమే అయినట్లు భగవంతుడు (పరబ్రహ్మ) ఈ ప్రపంచమంతట - ఈ ప్రపంచములోనున్న వస్తువులన్నింటిలోను - లోపల పైన - వ్యాపించి నిండియున్నాడు - అన్ని వస్తువులలోను - లోపల పైన భగవంతుని తప్పించి ఇతర వస్తువులేదు - ఆ ప్రకారముగా అన్నింటిలోను, అంతట, పూర్తిగా నిండి యుండుటచేత పూర్ణుడని చెప్పుచున్నారు –
“యచ్చ కించిత్ జగత్సర్వం (సత్యం) దృశ్యతే శ్రూయతే పి వా |
అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణస్థితః ||“. (మంత్ర పుష్పము)
“హరిమయము విశ్వమంతయు - - -ఆ హరిమయముగాని ద్రవ్యము పరమాణువు లేదు - - -”,
“తత్సృష్ట్వా తదేవ ప్రావిశత్ |
తదను ప్రవిశ్య సచ్చత్యచ్చ భవత్ “.
(లోకములను - సృష్టించి దానిలో ప్రవేశించి - అందులోన, పైన తానే పూర్తిగా వ్యాపించి సత్ పదార్థము అసత్ పదార్థము - ఆత్మ వస్తువు అనాత్మ వస్తువు తానే ఆయెను) దీనిని బట్టి తెలియునదేమనగా సృష్టిలో నున్నదంతా - అన్ని వస్తువులుగా - పూర్తిగా భగవంతుడే మారెను - ఉప్పుగల్లులోని అంతటను - లోపల పైన ఉప్పురసమే ఉన్నట్లు).
uppugallu - dīnilō nunna rasamaṃtayu uppu rasamē ayinaṭlu bhagavaṃtuḍu (parabrahma) ī prapaṃcamaṃtaṭa - ī prapaṃcamulōnunna vastuvulanniṃṭilōnu - lōpala paina - vyāpiṃci niṃḍiyunnāḍu - anni vastuvulalōnu - lōpala paina bhagavaṃtuni tappiṃci itara vastuvulēdu - ā prakāramugā anniṃṭilōnu, aṃtaṭa, pūrtigā niṃḍi yuṃḍuṭacēta pūrṇuḍani ceppucunnāru –
“yacca kiṃcit jagatsarvaṃ (satyaṃ) dṛśyatē śrūyatē pi vā |
aṃtarbahiśca tatsarvaṃ vyāpya nārāyaṇasthitaḥ ||“. (maṃtra puṣpamu)
“harimayamu viśvamaṃtayu - - -ā harimayamugāni dravyamu paramāṇuvu lēdu - - -”,
“tatsṛṣṭvā tadēva prāviśat |
tadanu praviśya saccatyacca bhavat “.
(lōkamulanu - sṛṣṭiṃci dānilō pravēśiṃci - aṃdulōna, paina tānē pūrtigā vyāpiṃci sat padārthamu asat padārthamu - ātma vastuvu anātma vastuvu tānē āyenu) dīnini baṭṭi teliyunadēmanagā sṛṣṭilō nunnadaṃtā - anni vastuvulugā - pūrtigā bhagavaṃtuḍē mārenu - uppugallulōni aṃtaṭanu - lōpala paina uppurasamē unnaṭlu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.