← Back to స · Booklets 51–60 (digitized file 6)

సజాతీయ భేదము sajātīya bhēdamu

Original — తెలుగు
  1. సజాతీయానాం పరస్పరం - భేదః సజాతీయ భేదః - యథా బ్రాహ్మణా దీనాం అన్యోన్య భేదః -

(ఒకే జాతికి చెందినవాటిలో ఒకదానితో ఇంకొక దానికి గల భేదము - బ్రాహ్మణులలో ఒకే తెగకు - శాఖకు చెందినవారికి ఇంకొక శాఖకు చెందినవారికి గల భేదము).

  1. ఒక పదార్థమునకు సమానజాతిగల రెండవ పదార్థముతో గలుగు భేదము సజాతీయ భేదము. ఒక మామిడి చెట్టునకును మఱియొక మామిడిచెట్టునకునుగలభేదము - రెండు చెట్లు మామిడిచెట్లే అయినను ఈ మామిడి చెట్టు ఆ మామిడి చెట్టు కాదు, ఒక మామిడి చెట్టునకును చింత చెట్టునకును, లేక మఱియే ఇతరజాతి చెట్టునకును గల భేదము - రెండునూ చెట్లే అయినను ఈ మామిడి చెట్టు ఆ చింతచెట్టు కాదు, ఆ చింత చెట్టు ఈ మామిడిచెట్టు కాదు. తన జాతి యందు తనకు గల భేదము గోవులలో ఒకదానికిని వేరొకదానికిని గల భేదము వంటిది.

  2. “సర్వం ఖిల్విదం బ్రహ్మ” ఇతి సర్వస్య ద్వైతస్యబ్రహ్మ మాత్రత్వోక్త్యా, బ్రహ్మాంతరాభావాచ్చ - “ఏకమేవా ద్వితీయం” ఇతి శ్రుత్యా ఏక శబ్దేన ఉచ్యతే.

(“ఇదంతయు - యీ సృష్టి అంతయు బ్రహ్మమే, బ్రహ్మరూపమే” అని చెప్పుటవలన, మఱియొక బ్రహ్మ లేకపోవుటవలన బ్రహ్మ సజాతీయ భేదము లేనివాడు. “బ్రహ్మ ఒక్కడే రెండవ బ్రహ్మ లేడు” అని “ఏకః ఏవ బ్రహ్మ” (బ్రహ్మ ఒక్కడే) అని చెప్పినదానినుండి తెలియవచ్చుచున్నది - స్పష్టము)

Transliteration
  1. sajātīyānāṃ parasparaṃ - bhēdaḥ sajātīya bhēdaḥ - yathā brāhmaṇā dīnāṃ anyōnya bhēdaḥ -

(okē jātiki ceṃdinavāṭilō okadānitō iṃkoka dāniki gala bhēdamu - brāhmaṇulalō okē tegaku - śākhaku ceṃdinavāriki iṃkoka śākhaku ceṃdinavāriki gala bhēdamu).

  1. oka padārthamunaku samānajātigala reṃḍava padārthamutō galugu bhēdamu sajātīya bhēdamu. oka māmiḍi ceṭṭunakunu maṟiyoka māmiḍiceṭṭunakunugalabhēdamu - reṃḍu ceṭlu māmiḍiceṭlē ayinanu ī māmiḍi ceṭṭu ā māmiḍi ceṭṭu kādu, oka māmiḍi ceṭṭunakunu ciṃta ceṭṭunakunu, lēka maṟiyē itarajāti ceṭṭunakunu gala bhēdamu - reṃḍunū ceṭlē ayinanu ī māmiḍi ceṭṭu ā ciṃtaceṭṭu kādu, ā ciṃta ceṭṭu ī māmiḍiceṭṭu kādu. tana jāti yaṃdu tanaku gala bhēdamu gōvulalō okadānikini vērokadānikini gala bhēdamu vaṃṭidi.

  2. “sarvaṃ khilvidaṃ brahma” iti sarvasya dvaitasyabrahma mātratvōktyā, brahmāṃtarābhāvācca - “ēkamēvā dvitīyaṃ” iti śrutyā ēka śabdēna ucyatē.

(“idaṃtayu - yī sṛṣṭi aṃtayu brahmamē, brahmarūpamē” ani ceppuṭavalana, maṟiyoka brahma lēkapōvuṭavalana brahma sajātīya bhēdamu lēnivāḍu. “brahma okkaḍē reṃḍava brahma lēḍu” ani “ēkaḥ ēva brahma” (brahma okkaḍē) ani ceppinadāninuṃḍi teliyavaccucunnadi - spaṣṭamu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.