← Back to స · Booklets 51–60 (digitized file 6)

సాక్షాత్కారము sākṣātkāramu

Original — తెలుగు
  1. త్రాడును చూచి యందుగల స్ర్పభ్రాంతి.

(త్రాడును చూచి సర్పమని భ్రమించుట) తొలగిన త్రాడు త్రాడుగనే కనిపించుట. (క్రొత్తగా ప్రత్యక్షమైనట్లు). స్వస్వరూపుడగు పరమేశ్వరుడు ప్రత్యక్షమగుటయే - కంటికి కనబడుటయే; అవిద్య పోవుటయే; అజ్ఞానము పోయి జ్ఞానము (భగవత్ జ్ఞానము) కలుగుటయే).

  1. స్వయమేవ నిమ్రీభూత వృక్షశాఖా వ ద్వినైవ స్వప్రయత్నం “అహం బ్రహ్మస్మి” ఇతి వేదాంత జన్యా అనాత్మాకార వృత్తిరూపాంతరాయ రహితా బ్రహ్మాకారవృత్తిః సాక్షాత్కారః ఉచ్యతే ||.

(స్వయముగానే వంగియుండు చెట్టుకొమ్మ వలె తన ప్రయత్నము లేకనే “నేనే బ్రహ్మనయితిని” అను ఉపనిషత్తుద్వారా తెలుసుకొనుటవలన కలిగిన అనాత్మాకారమను అంతరాయము లేనటువంటి బ్రహ్మాకార వృత్తియే సాక్షాత్కారమని చెప్పబడుచున్నది).

  1. అరాగా దైహిక త్యాగాత్ ఇత్యేతైరేవ సం యుతైః |

అపరోక్ష దర్శనం విష్ణో ర్జాయతే నాన్యథా క్వచిత్ ||.

(దేనియందును అనురాగము లేకుండుటవలనను, ఈ లోక సంబంధములైన వాటిని విడిచిపెట్టుటవలనను, విష్ణువు యొక్క అపరోక్షదర్శనము కలుగును - ఇతర విధముల వలన కలుగదు).

  1. “చ. సరసగతిన్ మునీంద్రులు ప్రసన్న శరీర హృషీక మానస

స్ఫురణ గలప్పుడవ్విభుని భూరి కళా కలిత స్వరూపముం

దరమిడి జూతురెప్పుడు, కుతర్క తమో హతిచేత నజ్ఞతం

బొరసిన యప్పుడవ్విభుని మూర్తి గనుంగొనలేరు, మాధవా“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 6 - 111)

  1. “చ. అభవు నమేయు నవ్యయు ననంతు నినారతు బూని మేనిలో

ను భయమునై వెలుంగు పురుషోత్తముగానరు చిత్తకర్మవా

గ్విభవగరిష్ఠులై వెదకి వేరిడి ప్రాణులు సర్వ వస్తువుల్

శుభగతి చూడనేర్చి తను చూడగనేరని కంటిపోలికన్“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 6 - 3 - 172)

  1. “ఉ. ఏల కుమార! శోషిలగ నీ జననంబున నన్ను గానగా

జాలవు గామముఖషట్కము నిర్దళితంబు సేసి ని

ర్మూలిత కర్ముడైన ముని ముఖ్యుడుగాని, కుయోగి గానగా

జాలడు, నీదు కొర్కి గొనసాగుటకై నిజమూర్తి జూపితిన్“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 1- 6 - 126)

  1. “యావద్ర్యాగ వినాశః స్యాద్విరక్తో భక్తి సం యుతః |

సర్వ దైవా ప్రమత్తశ్చ పశ్యేనేవ పరం హరిం ||“.

(భోగములందనురాగము నశించి విరక్తుడై, భక్తిగలవాడై, ఎల్లపుడు అప్రమత్తుడైయున్నవాడు పరతత్వమైన హరిని - భగవంతుని సందర్శించును).

Transliteration
  1. trāḍunu cūci yaṃdugala srpabhrāṃti.

(trāḍunu cūci sarpamani bhramiṃcuṭa) tolagina trāḍu trāḍuganē kanipiṃcuṭa. (krottagā pratyakṣamainaṭlu). svasvarūpuḍagu paramēśvaruḍu pratyakṣamaguṭayē - kaṃṭiki kanabaḍuṭayē; avidya pōvuṭayē; ajñānamu pōyi jñānamu (bhagavat jñānamu) kaluguṭayē).

  1. svayamēva nimrībhūta vṛkṣaśākhā va dvinaiva svaprayatnaṃ “ahaṃ brahmasmi” iti vēdāṃta janyā anātmākāra vṛttirūpāṃtarāya rahitā brahmākāravṛttiḥ sākṣātkāraḥ ucyatē ||.

(svayamugānē vaṃgiyuṃḍu ceṭṭukomma vale tana prayatnamu lēkanē “nēnē brahmanayitini” anu upaniṣattudvārā telusukonuṭavalana kaligina anātmākāramanu aṃtarāyamu lēnaṭuvaṃṭi brahmākāra vṛttiyē sākṣātkāramani ceppabaḍucunnadi).

  1. arāgā daihika tyāgāt ityētairēva saṃ yutaiḥ |

aparōkṣa darśanaṃ viṣṇō rjāyatē nānyathā kvacit ||.

(dēniyaṃdunu anurāgamu lēkuṃḍuṭavalananu, ī lōka saṃbaṃdhamulaina vāṭini viḍicipeṭṭuṭavalananu, viṣṇuvu yokka aparōkṣadarśanamu kalugunu - itara vidhamula valana kalugadu).

  1. “ca. sarasagatin munīṃdrulu prasanna śarīra hṛṣīka mānasa

sphuraṇa galappuḍavvibhuni bhūri kaḷā kalita svarūpamuṃ

daramiḍi jūtureppuḍu, kutarka tamō haticēta najñataṃ

borasina yappuḍavvibhuni mūrti ganuṃgonalēru, mādhavā”. (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 6 - 111)

  1. “ca. abhavu namēyu navyayu nanaṃtu nināratu būni mēnilō

nu bhayamunai veluṃgu puruṣōttamugānaru cittakarmavā

gvibhavagariṣṭhulai vedaki vēriḍi prāṇulu sarva vastuvul

śubhagati cūḍanērci tanu cūḍaganērani kaṃṭipōlikan”. (śrīmadāṃdhramahābhāgavatamu - 6 - 3 - 172)

  1. “u. ēla kumāra! śōṣilaga nī jananaṃbuna nannu gānagā

jālavu gāmamukhaṣaṭkamu nirdaḷitaṃbu sēsi ni

rmūlita karmuḍaina muni mukhyuḍugāni, kuyōgi gānagā

jālaḍu, nīdu korki gonasāguṭakai nijamūrti jūpitin”. (śrīmadāṃdhramahābhāgavatamu - 1- 6 - 126)

  1. “yāvadryāga vināśaḥ syādviraktō bhakti saṃ yutaḥ |

sarva daivā pramattaśca paśyēnēva paraṃ hariṃ ||“.

(bhōgamulaṃdanurāgamu naśiṃci viraktuḍai, bhaktigalavāḍai, ellapuḍu apramattuḍaiyunnavāḍu paratatvamaina harini - bhagavaṃtuni saṃdarśiṃcunu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.