← Back to స · Booklets 51–60 (digitized file 6)

సాలగ్రామశిల sālagrāmaśila

Original — తెలుగు
  1. “శ్లో ||. అహం చ శైలరూపేణ గండకీ తెర సన్నిధౌ |

అధిష్టానం కరిష్యామి, భారతే, తవ శావతః |

కోటి సంఖ్యాః తత్రకీటాః తీక్ష్ణ దమ్ష్ట్రావరాయుధైః |

తచ్చిలా కుహరే చక్రం కరిష్యంతి మదీయకం ||

- - -వ్రత్రం దానం ప్రతిష్టాచ శ్రాద్ధంచ దేవ పూజనం |

సాలగ్రామస్య సాన్నిధ్యాత్ ప్రశస్తం తద్భవేదితి ||

సాలగ్రామ శిలా తోయం నిత్యం భుంక్తే చ యో నరః |

సరేప్సితంచ ప్రసాదంచ లభతే నాత్ర సంశయః |

తస్య స్పర్శంచ వాంఛంతి తీర్థాని నిఖిలాని చ |

జీవన్ముక్తో మహాపూతో అప్యం తే యాతి హరేః పదం ||“. (దేవీ భాగవతం)

(నీ శాసనమువల్ల నేను గండకీ తీరమందు శిలారూపముతో అధిష్టించి యుందును. తీక్ష్ణమైన దమ్ష్ట్రములుగల కీటములు కోట్లకొలది ఆ శిలా కోటరములందు నా చక్రమును చేయుచుండును - ఆ సాలగ్రా మము ఎదుట సత్రముగాని, దానముగాని, శ్రాద్ధముగాని, దేవతా పూజ చేసిన అది ప్రశస్తమైన దగును. సాలగ్రామ జలము ఎవడు నిత్యము చేయునో వానికి దేవతలు కోరు ప్రసాదము లభించును. అందుకు సందేహము లేదు - ఆ సాలగ్రామ శిలస్పర్శను సమస్థ తీర్థనులు కోరును - జీవన్ముక్తుడు, మహా పవిత్రుడు అయినవాడు చనిపోయినతర్వాత విష్ణు పదమును (వైకుంఠమును) చేరును).

  1. సాలగ్రామ శిలా యత్ర తత్ర సన్నిహితో హరిః |

తత్రైవ లక్ష్మీ ర్వసతి సర్వ తీర్థ సమన్వితా |

యాని కానిచ పాపాని బ్రహ్మహత్యాదికాని చ |

తాని సర్వాణి నశ్యంతి సాలగ్రామ శిలార్చనాత్ ||.

(సాలగ్రామ శిల ఎక్కడ ఉండునో అక్కడ విష్ణువు ఉండును. అక్కడే సమస్త తీర్థములతోను శ్రీమహాలక్ష్మి నివసించును. సాలగ్రమ శిలను పూజించిన బ్రహ్మహత్య మొదలగు పాపములు అన్నియు నశించును).

  1. విష్ణుమూర్తి చిహ్నిత శిలా విశేషము -

(“సాలగ్రామే హరేర్మూర్తిః”)

  1. సాలగ్రామ శిలావారి తులసీదళ సం యుతం |

సర్వ రోగాది శమనం సర్వ పాప హరం భవేత్ ||.

(సాలగ్రామ తీర్థమును తులసీ దళముతో కలిపి తీసుకొనిన రోగములన్నియు నశుంచును, పాపములన్నియు పోవును).

Transliteration
  1. “ślō ||. ahaṃ ca śailarūpēṇa gaṃḍakī tera sannidhau |

adhiṣṭānaṃ kariṣyāmi, bhāratē, tava śāvataḥ |

kōṭi saṃkhyāḥ tatrakīṭāḥ tīkṣṇa damṣṭrāvarāyudhaiḥ |

taccilā kuharē cakraṃ kariṣyaṃti madīyakaṃ ||

- - -vratraṃ dānaṃ pratiṣṭāca śrāddhaṃca dēva pūjanaṃ |

sālagrāmasya sānnidhyāt praśastaṃ tadbhavēditi ||

sālagrāma śilā tōyaṃ nityaṃ bhuṃktē ca yō naraḥ |

sarēpsitaṃca prasādaṃca labhatē nātra saṃśayaḥ |

tasya sparśaṃca vāṃchaṃti tīrthāni nikhilāni ca |

jīvanmuktō mahāpūtō apyaṃ tē yāti harēḥ padaṃ ||“. (dēvī bhāgavataṃ)

(nī śāsanamuvalla nēnu gaṃḍakī tīramaṃdu śilārūpamutō adhiṣṭiṃci yuṃdunu. tīkṣṇamaina damṣṭramulugala kīṭamulu kōṭlakoladi ā śilā kōṭaramulaṃdu nā cakramunu cēyucuṃḍunu - ā sālagrā mamu eduṭa satramugāni, dānamugāni, śrāddhamugāni, dēvatā pūja cēsina adi praśastamaina dagunu. sālagrāma jalamu evaḍu nityamu cēyunō vāniki dēvatalu kōru prasādamu labhiṃcunu. aṃduku saṃdēhamu lēdu - ā sālagrāma śilasparśanu samastha tīrthanulu kōrunu - jīvanmuktuḍu, mahā pavitruḍu ayinavāḍu canipōyinatarvāta viṣṇu padamunu (vaikuṃṭhamunu) cērunu).

  1. sālagrāma śilā yatra tatra sannihitō hariḥ |

tatraiva lakṣmī rvasati sarva tīrtha samanvitā |

yāni kānica pāpāni brahmahatyādikāni ca |

tāni sarvāṇi naśyaṃti sālagrāma śilārcanāt ||.

(sālagrāma śila ekkaḍa uṃḍunō akkaḍa viṣṇuvu uṃḍunu. akkaḍē samasta tīrthamulatōnu śrīmahālakṣmi nivasiṃcunu. sālagrama śilanu pūjiṃcina brahmahatya modalagu pāpamulu anniyu naśiṃcunu).

  1. viṣṇumūrti cihnita śilā viśēṣamu -

(“sālagrāmē harērmūrtiḥ”)

  1. sālagrāma śilāvāri tulasīdaḷa saṃ yutaṃ |

sarva rōgādi śamanaṃ sarva pāpa haraṃ bhavēt ||.

(sālagrāma tīrthamunu tulasī daḷamutō kalipi tīsukonina rōgamulanniyu naśuṃcunu, pāpamulanniyu pōvunu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.