← Back to స · Booklets 51–60 (digitized file 6)

సమాధానము samādhānamu

Original — తెలుగు
  1. చిత్తైకాగ్రతా - చిత్తైకాగ్ర్యం -

(చిత్తమును ఒకే విషయమునందు కేంద్రీకరించి యుంచుట).

  1. నిగృహీతస్య మనసః శ్రవణాదౌ తదనుగుణ విషయేచ సమాధిః -

(మనస్సును తనవశములో నుంచుకొని, దానిని శ్రవణమునందు, దాని అనుగుణమైన విషయమునందు సమాధిలో నుంచుట) (అనగా, గురు వాక్యములందును, శాస్త్రములోని బోధయందును మనస్సును దృఢముగా నిలుపుట).

  1. నిద్రాలస్య ప్రమాద త్యాగేన మనస్థితిః సమాధానం |

(నిద్ర, ఆలస్యముచేయుట, ప్రమాదము చేయుట - ఇవి వదలివేసి యుండు మనస్సు యొక్క స్థితి)

  1. లక్ష్మ్యే బ్రహ్మణి చిత్తైకాగ్ర్యం - నిర్గుణ బ్రహ్మణి అనవరత స్థిత్యా జాయతే.

(బ్రహ్మను గురిగా - లక్ష్యముగా - చేసుకొని, చిత్తము నేకాగ్రముగా నుంచుట. ఇది నిర్గుణబ్రహ్మమందు మనస్సును అనవరతము నిలుపుటచేత కలుగును) -

  1. “చిత్తైకాగ్ర్యంతు సలక్ష్యే సమాధానమితి స్మృతం”. (శ్రీశంకరః) (అపరోక్షానుభూతి)

(లక్ష్యమగు దానియందు చిత్తమును ఏకాగ్ర్యము చేయుట అని శ్రుతి)

  1. “సర్వధా స్థాపనం బుద్ధేః శుద్ధే బ్రహ్మణి సర్వదా |

తత్సమాధాన మిత్యుక్తం న తు చిత్తస్యలాలనం ||“. (వివేకచింతామణి)

(శుద్ధబ్రహ్మమునందు - అనగా, నిర్మలమైన బ్రహ్మమునందు అన్ని వేళలందు బుద్ధిని నిలుపుట సమాధానమని చెప్పబడీనది. చిత్తచాలనము సమాధానము కాదు).

  1. సంసారమునకు సంబంధించిన విషయములనుండి అన్ని విధముల బుద్ధిని మరలించి ఇష్టమైనదానిమీద లగ్నముచేయుట సర్వసంకల్పములను విడిచి మనస్సును బ్రహ్మమునందే నిలిపి శాంతముగ నుండుట).
Transliteration
  1. cittaikāgratā - cittaikāgryaṃ -

(cittamunu okē viṣayamunaṃdu kēṃdrīkariṃci yuṃcuṭa).

  1. nigṛhītasya manasaḥ śravaṇādau tadanuguṇa viṣayēca samādhiḥ -

(manassunu tanavaśamulō nuṃcukoni, dānini śravaṇamunaṃdu, dāni anuguṇamaina viṣayamunaṃdu samādhilō nuṃcuṭa) (anagā, guru vākyamulaṃdunu, śāstramulōni bōdhayaṃdunu manassunu dṛḍhamugā nilupuṭa).

  1. nidrālasya pramāda tyāgēna manasthitiḥ samādhānaṃ |

(nidra, ālasyamucēyuṭa, pramādamu cēyuṭa - ivi vadalivēsi yuṃḍu manassu yokka sthiti)

  1. lakṣmyē brahmaṇi cittaikāgryaṃ - nirguṇa brahmaṇi anavarata sthityā jāyatē.

(brahmanu gurigā - lakṣyamugā - cēsukoni, cittamu nēkāgramugā nuṃcuṭa. idi nirguṇabrahmamaṃdu manassunu anavaratamu nilupuṭacēta kalugunu) -

  1. “cittaikāgryaṃtu salakṣyē samādhānamiti smṛtaṃ”. (śrīśaṃkaraḥ) (aparōkṣānubhūti)

(lakṣyamagu dāniyaṃdu cittamunu ēkāgryamu cēyuṭa ani śruti)

  1. “sarvadhā sthāpanaṃ buddhēḥ śuddhē brahmaṇi sarvadā |

tatsamādhāna mityuktaṃ na tu cittasyalālanaṃ ||“. (vivēkaciṃtāmaṇi)

(śuddhabrahmamunaṃdu - anagā, nirmalamaina brahmamunaṃdu anni vēḷalaṃdu buddhini nilupuṭa samādhānamani ceppabaḍīnadi. cittacālanamu samādhānamu kādu).

  1. saṃsāramunaku saṃbaṃdhiṃcina viṣayamulanuṃḍi anni vidhamula buddhini maraliṃci iṣṭamainadānimīda lagnamucēyuṭa sarvasaṃkalpamulanu viḍici manassunu brahmamunaṃdē nilipi śāṃtamuga nuṃḍuṭa).
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.