(చిత్తమును ఒకే వస్తువుమీద కేంద్రీకరించి యుంచుట).
(చిత్తమును స్థిరముగా నుంచుట - ధ్యానింపబడుచున్న విషయమునందు చిత్తమును స్థిరముగ నుంచుట).
(బాగుగా నిర్ణయించబడిన అర్థములను ఈశ్వరునియందు సమాధానము చేసుకొని యుండుట).
(యోగము యొక్క ప్రభావము, ఫలము, శక్తి).
(ఆత్మజ్ఞానము దీనిలో లెస్సగా, సంశయము లేకుండునట్లు స్థిరమగును - మనస్సు)
(దీనిలో చిత్తము లెస్సగా, సంశయము లేకుండగ స్థిరమగును కనుక ఆత్మ సమాధి).
చిత్తైకాగ్ర్యం. పరమేశ్వరైకా గ్ర్యాభిముఖత్వం -
(పరమేశ్వరునియందు ఒకే దృష్టి కలిగియుండుట).
(పరమాత్మ భోగము నిమిత్తము ఈ ప్రపంచమంతయు దీనిలో అంతఃకరణములో సమాధానమగుచున్నది).
సం యమము; చిత్తలయము, నియమము, తపస్సు, యోగము -
“ధ్యాన విస్మృతిః సమాధిః” (మండలోపనిషత్)
(ధ్యానము చేయుచుండుట మఱచిపోవు స్థితి)
(కర్మేంద్రియములను, జ్ఞానేంద్రియములను, బుద్ధిని పరబ్రహ్మమునందు నిలుపు అవస్థ).
(సమస్త వస్తువులకు కారణమైన పరబ్రహ్మయందు విషయములన్ని యున్నవని ధ్యానించుట).
(ఇచ్చట, అనగా పరబ్రహ్మయందు మనస్సు నిశ్చలముగా నుంచబడును - మనస్సు పరబ్రహ్మలో లీనమగు నట్లుండుట సమాధి).
(నేను బ్రహ్మను అయితిని - అను బుద్ధి స్మాధానరూపము సమాధి - నేను బ్రహ్మను అయితిని అని భావమును పొందియుండుట సమాధి) - (నేను బ్రహ్మను అయితిని అను మహావాక్యార్థము సార్థకము చేసుకొను యోగాంగము).
(బ్రహ్మను నేనే, నేనే బ్రహ్మను అని పరమాత్మగుఱించి తలచి పరబ్రహ్మచేత సృష్టింపబడిన ప్రపంచమనతటిని ఆత్మయే యని తలచుట సమాధి).
(ఏ స్థితిని పొందిన పిమ్మట అన్నింటిని సమముగా చూచు స్థితి - సమాధి)
(ధ్యానించువాడు, ధ్యానము అను భావము విడిచి గాలి లేనిచోట కదలక వెలుగు దీపమువలె ధ్యానము చేయవలసిన విషయము (అగు పరమాత్మ) నొక్కటినే గాంచు చిత్తము సమాధి).
నివాత దీద వచ్చిత్తం సమాధిరిభిధీయతే ||“. (అధ్యాత్మోపనిషత్)
(ధ్యానించువాడు, ధ్యానము అను భావమును క్రమముగా వదలి ధ్యేయ వస్తువు - ధ్యానింపతగిన వస్తువు - అయిన పరబ్రహ్మను గాలి లేని చోట కదలని దీపమువలె చూచు మనస్సు సమాధి యని చెప్పబడుచున్నది).
(పరమాత్మతో జీవాత్మ ఐక్యమగు అవస్థ, త్రిపుటి లేనిది - అనగా, దృశ్యము, దృక్, ద్రష్ట అను మూడు లేనిది, పరమానంద స్వరూపమైనది, శుద్ధ చైతన్యరూపము - ఇట్టి అవస్థ).
సర్వ శూన్యం నిరాకారం సమాధిరభిధీయతే“.
(చెప్పుటకు, తెలిసికొనుటకు, చింతించుటకు అలవికాక దోషము లేనిదై సర్వ శూన్యమై నిరాకారమైనది సమాధి).
వృత్తివిస్మరణం సమ్యక్ సమాధిరభిదీయతే “.
(నిర్వికారమగు వృత్తిచేగాని, బ్రహ్మాకారమగు వృత్తిచేగాని వృత్తులను విస్మరించుట సమాధియని చెప్పబడుచున్నది).
యా సంప్రజ్ఞాతనామా సా సమాధిరభిధీయతే ||“.
(వృత్తి శూన్యమైన మనస్సు బ్రహ్మాకారముతో నుండు స్థితి సంప్రజ్ఞాత సమాధి అని చెప్పబడినది).
(భక్తిరూపముగా మారిన జ్ఞానము)
అజస్రమంబు వహనా యథా నద్యా న రుద్యతే ||“. (యోగవాశిష్టము - 62 - 9)
(పరాప్రజ్ఞయే సమాధి యని పండిరులు చెప్పుదురు - ఎల్లపుడు పారుచు కట్టబడనటువంటి నదివలె భగవంతునియందు లీనమై యుండు మనస్సు యొక్క స్థితి).
నిర్వికల్ప స్థితో విద్వాన్ భూయో నాప్యనిశోచతి |
సలిలే సైంధవం యద్వత్ సామ్యం భవతి యోగతః |
తదాత్మ మనసోరైక్యం సమాధి రభిధీయతే |
యథా సంక్షీయతో ప్రాణో మానసం చ ప్రలీయతే |
తద సమరసత్వం యత్ సమాధిరభిధీయతే |
యత్సమత్వం తయోరత్ర జీవాత్మ పరమాత్మనోః |
సమస్తనుష్ట సంకల్ప స్సమాధి రభిధీయతే |
ప్రభా శూన్యం, మనశ్శూన్యం బుద్ది శూన్యం నిరామయం |
సర్వ శూన్యం నిరాభావం సమాధిరభిధీయతే |
స్వయముచ్చరితే దేహే నిత్యం సమాధినా |
నిశ్చలం తం విజానీయతే సమాధి రభిధీయతే ||“. (సౌభాగ్యలక్ష్మ్యుపనిషత్)
(అహంభావమును విడిచిపెట్టి జగత్తుకు ఈశ్వరుడు లేడు అను భావమును విడిచిపెట్టి నిర్వికల్ప స్థితిలో నుండు పండితుడైన వాడు (జ్ఞాని), నీటిలో ఉప్పు కరిగి కలిసిపోయినట్లు, యోగాభ్యాసమువలన ఆత్మను మనస్సును ఒకటిగా కలుపుట సమాధి యని చెప్పబడును - ప్రాణము క్షీణించి, మనస్సు క్షీణించి ఒకటే యగుట సమాధి - జీవాత్మ పరమాత్మలు ఏ విధమైన సంకల్పములు లేక సమముగానుండుట సమాధియని చెప్పబడును - ప్రభాశూన్యము, మనశ్శూన్యము, బుద్ధిశూన్యము, నిరామయము, సర్వ శూన్యము అయినది సమాధి యని చెప్పబడినది. దేహము ఎల్లపుడు ఉచ్చలితమై నిశ్చలముగా నుండుట సమాధి యని చెప్పబడుచున్నది).
చిన్నిష్పం దాంశమాత్రత్వం నాన్యదస్తీతి భావయ |
నిత్య ప్రబుద్ధ చిత్తస్త్వం కుర్వన్నాపి జగత్క్రియాం |
ఆత్మైకత్వం విదిత్వా త్వం తిష్టాక్షుబ్ధి మహాబ్ధివత్ |
తత్వా బోధయే వాసౌ వాసనా తృణ పావకః |
ప్రోక్త సమాధి శబ్దేన న చ తూష్ణీ మవ స్థితః“. (మహోపనిషత్తు)
(ఈ కనబడుచున్న ప్రపంచమంతయు చైతన్యము యొక్క - చిన్మాత్రము యొక్క - అంశయే. ఇంతకంటె వేరైనది ఏదియు లేదు అని తలంచుము - నిత్యము జ్ఞానము గలవాడవై - ఇట్టి బ్రహ్మజ్ఞానము గలవాడవై - ప్రపంచమునకు సంబధించిన పని దేనినైనను చేయుచున్నను. ఆత్మ ఒక్కటే యని తెలుసుకొని, అలలు లేని సముద్రమువలే నిశ్చలముగా నుండుము - ఇదియే తత్వజ్ఞానము - భగవత్ జ్ఞానము, భగవత్తత్త్వము. ఇది వాసనలు (జన్మమును కలుగచేయు వాసనలు) అను గడ్డి పరకకు అగ్నివంటిది - దానిని కాల్చివేయునది).
కింతేన సూరతేనార్థః కింతేన సమాధినా ||“.
(రతిలోను, సమాధిలోను మనస్సు లీనముకానిచో ఆ రతివలన, ఆ సమాధివలన నేమి ప్రయోజనము).
“సమాధిః ద్వివిధః - స వికల్పకో, నిర్వికల్పకశ్చేతి - సవికల్పక సమాధిః సాధనం, నిర్వికల్పక సమాధిః ఫలం”.
(సవికల్పక సమాధి. నిర్వికల్పక సమాధి అని సమాధి రెండు విధములు - సవికల్పక సమాధి నిర్వికల్పక సమాధికి సాధనము - సవికల్పక సమాధికి నిర్వికల్పక సమాధి ఫలము -).
సమాధి రెండు విదములు - జడ సమాధి, సహజ సమాధి. జడ సమాధిలోనికి వెళ్ళినప్పుడు శరీరవ్యాపారము ఆగిపోయి చేష్టా రహితముగా యుండును - తర్వాత ఉత్తరస్థితి అంటే సమాధిస్థితి నుండి తిరిగి ప్రపంచములోనికి వచ్చేదశ - ఉంటుంది. సహజ సమాధిలో ఎంత గాఢస్థితిలోనికి వెళ్ళినా శరీరవ్యవహారములు సాగుచునే యుండును - జడ స్థితి ఏర్పడదు - అంటే చేష్టా రహితం కాదు - సహజ సమాధి స్థితికి ప్రహ్లాదుని జీవితమే ఉదాహరణము -
“తదేవావిర్భావం స్వరూప శూన్యమివ సమాధిః”. (పతంజలి యోగసూత్రములు)
“యతో పరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయా |
యత్ర చైనాత్మనా త్మానం పశ్యన్నాత్మని తు తుష్యతి |
సుఖ మాత్యంతికం యత్తద్బుద్ధి గ్రాహ్య మతీంద్రియం |
వేత్తి యత్ర న చైవాయం స్థితశ్చలతి తత్త్వ తః |
యం లబ్ద్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః |
యస్మిన్ స్థితోన దుఃఖేన గురుణాపి విచాల్యతే |
తం విద్యా ద్దుఃఖ సం యోగ వియోగం యోగ సంజ్ఞితం |
స నిశ్చయే న యోక్తవ్యో యోగో (అ)నిర్విణ్ణ చేతసా |
సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వా నశేషతః |
మనసైవేంద్రియగ్రామం వినియమ్య సమంతతః |
శనైః శనైరుపరవేద్బుద్ధ్యా ధృతిగృహీతయా |
ఆత్మ సంస్థం మనః కృత్వా స కించిదపి చింతయేత్ ||
యతో యతో నిశ్చరతి మనస్చంచల మస్థిరం |
ప్రశాంత మనసంహ్యేనం యోగినం సుఖ ముత్తమం |
ఉపైతి శాంతరజసం బ్రహ్మ భూతమకల్మషం |
సుఖేన సంస్పర్శమత్యంతం సుఖమశ్నుతే “. (శ్రీమద్భగవద్గీత - 6 - 20 to 28)
“ఏవం సామాన్యతో యోగం ప్రోచ్యే దానీం విశేషతః |
సమాధిం విస్తరేణాహ భగవాన్ యోగినాం గతిః |
పరిణామ విశేషే హి యస్మిన్నభ్యాస పాటవాత్ |
జాతే చిత్తం నిరుద్ధం సచ్ఛాంతం నిస్నేహదీపవత్ |
యస్మింశ్చ పరిణామే సత్యాత్మానం చిదద్వయం |
వేదాంతమానసం జాతవృత్యా పశ్యంశ్చిదాత్మని |
తుష్యదాత్మ సుఖాదన్య త్తోష హేతోరభావతః |
ఆనందః పర ఏవాత్మా భేద సంసర్గ వర్జితః |
స ఏవస్వ స్వరూపేణ వ్యజ్యతే పుణ్యకర్మభిః |
యావద్యానత్తమో(అ)నైతి బుద్ధౌద్దర్ర్మ సమాహితం |
తావత్తావద్దియః స్వాస్థ్యం త్తావత్తానత్సుఖోన్నతిః |
యత్రావస్థ విశేషే చిద్ఘనానాం తాద్వయం సుఖం |
విషయేంద్రియ సం యోగా నభివ్యంగ్య ధియాచ్చయా |
సత్వమాత్ర ప్రవాహిన్యా గ్రాహ్యం చాని భవత్యయం |
యత్రాయం చ స్థితో విద్వా నాత్మ తత్వ స్వరూపతః |
నైవ ప్రచ్యవతే తం చ బిద్యా దిత్యస్య యో మునిః ||
యమభ్యాసాతి వై శ ద్యా లబ్ధ్వా లాభం చిదద్వయం |
తతో నైవాపరం లాభమధికం మన్యతే బుధః |
కృతకృత్య తయా ప్రాప్త ప్రాప ణీయ తయా తథా |
పరమాత్మ సుఖేయస్మిన్ స్థితో దుఃఖేన నోమునిః |
మహతా శస్త్రపాతాది హేతుకేనాపి చాల్యతే |
యత్రో పరమతే చిత్తమత్యారభ్య విశషణైః |
చిత్తావస్థా విశేషో య ఉక్తస్తం చిత్త సం యమం |
సర్వ దుఃఖ విరోధిత్వా ద్దుఃఖ సం యోగ ఘాతకం |
జానీయా ద్దుఃఖ సం యోగ వియోగం నంతమస్యముం |
విపరీత న యే నైవ యోగ శబ్దాభిదేయకం |
శాస్త్రాచార్య గిరాం భావ విషయో(అ)ర్థః స నిశ్చయాత్ |
సత్య ఏవేతి యోక్తవ్యో యోగో నిర్వేద శూన్యయా |
- - - త్యక్త్వా నిర్వేద మాత్యంత ధైర్య యుక్తేన చేతసా |
యోగోస్త్వభ్యసనీ యోయం యధోక్తం సాంప్రదాయికైః |
- - - దృష్ట్వా సంసార మాగార మాపదాం భ్రాంతి జన్మనాం |
విరజ్యాల్ప సిఖేభృశ్చ భోగేభ్యోమతి మాన్నరః |
కృష్ణ పాదరతో భూత్వా సద్గురుం ప్రాప్య శాంతిదం |
లబ్ధ్వాతతః పరబ్రహ్మోపదేశం యోగమభ్యసేత్ |
యావత్ బ్రహ్మ ద్వయానందే ప్రతిష్ఠాం నిశ్చలాం పరాం |
ధియోన విందతే తావద్యోగో యోక్తవ్య ఆదరాత్ |
ప్రతిష్ఠాయాం చ సిద్ధాయాం కృతకృత్యో భవేన్మునిః |
ఇదం మేస్యాదిదం మేస్యాదితి సంకల్ప జానిమాన్ |
శోభనాధ్యాన జాన్ కామాన్ దుష్టేషు విషయేష్వపి |
త్యక్త్వా భోగాభిలాషా ఖ్యాన్దోషవృష్ట్యాస్యశేషతః |
సర్వాన్ దృహిణి లోకాంతాన్వాసనా సహితాన్ మునిః |
ప్రత్యాహృతేంద్రియ గ్రామం విషయేభ్యః సమంతతః |
కామాపాయే విశేషేణ యుక్తా యాధీ స్తయామనః |
ఆత్మన్యేవ సమాప్తిర్హి యస్య తద్బ్రహ్మా గోచరం |
కృత్వాపి చింతయే న్నాన్యద్గతి మన్యాం సదా శ్రయేత్ |
ఆత్మైవా స్త్యఖిలం నాన్యదితి మన్యాం సదాశ్రయేత్ |
ఆత్మైవా స్త్యఖిలం నాన్యదితి నిశ్చిత్యవా మునిః |
నాన్య ద్విచింతయేత్ కించిద్యోగ న్యాయం పరో(అ)వధిః ||“. (గీతాభావప్రకాశము - 6 - 92 to 118)
(యోగము గుఱించి శ్రీకృష్ణభగవానుడు సామాన్యముగా చెప్పి సమాధి గుఱించి విస్తరించి యీ క్రింద విధముగా చెప్పుచున్నాడు: - యోగాభ్యాసము వలన చిత్తము మార్పు చెంది, నూనె లేని దీపమువలె శాంతిని పొందును - ఆ స్థితిలో చైతన్య రూపుడు, అద్వయుడు, అగు పరమాత్మయందు తన ఆత్మను చూచును - అప్పుడు పరమానందమును పొందును - ఆత్మ సుఖముకంటె గొప్ప సుఖము లేదు కనుక తనలోని తమస్సు - అజ్ఞానము - ఎప్పుడెప్పుడు నశించుచూ వచ్చునో అప్పుడే చిత్తము శాంతి నిందును).
(ఇంద్రియముల శక్తిని మించిన బుద్ధి చేత గ్రహించబడునది అత్యంత సుఖము - అట్టి స్థితిని పొంది ఆ స్థితినుండి చలించకుండ నుండుట సమాధి. అట్టి స్థితిలో నుండువానికి అంతకంటె ఉత్కృష్టమగు లాభము ఉండదు, గొప్ప దుఃఖము కూడ కలుగదు - దుఃఖము లేనిదగుటచేత నిదియే యోగము - ఇది నాకు కావలెను అను కోరిక - సంకల్పము - దాని వలన కలిగిన విషయములు భ్రాంతివలన కలిగినవని తెలుసుకొని వాటిని విడిచి ఇంద్రియములను వాటి గుఱించి పోనీయక మనసుచేత నరికట్టి, మెల్ల మెల్లగా బుద్ధిని దృఢము చేసుకొని ఆత్మయందు మనస్సును నిలిపి, అంతయు ఆత్మయే, ఆత్మ కానిదేదియు లేదు - అని నిశ్చయము చేసుకొని, చలింపక ఇతర వస్తువు గుఱించి చలింప కూడదు - ఇట్లు శాంతిని పొందిన యోగిని ఉత్తమసుఖము దానంతట అదియే వచ్చి పొందును. ఇట్లు చేయుట సమాధి యనిపించుకొనును).
(cittamunu okē vastuvumīda kēṃdrīkariṃci yuṃcuṭa).
(cittamunu sthiramugā nuṃcuṭa - dhyāniṃpabaḍucunna viṣayamunaṃdu cittamunu sthiramuga nuṃcuṭa).
(bāgugā nirṇayiṃcabaḍina arthamulanu īśvaruniyaṃdu samādhānamu cēsukoni yuṃḍuṭa).
(yōgamu yokka prabhāvamu, phalamu, śakti).
(ātmajñānamu dīnilō lessagā, saṃśayamu lēkuṃḍunaṭlu sthiramagunu - manassu)
(dīnilō cittamu lessagā, saṃśayamu lēkuṃḍaga sthiramagunu kanuka ātma samādhi).
cittaikāgryaṃ. paramēśvaraikā gryābhimukhatvaṃ -
(paramēśvaruniyaṃdu okē dṛṣṭi kaligiyuṃḍuṭa).
(paramātma bhōgamu nimittamu ī prapaṃcamaṃtayu dīnilō aṃtaḥkaraṇamulō samādhānamagucunnadi).
saṃ yamamu; cittalayamu, niyamamu, tapassu, yōgamu -
“dhyāna vismṛtiḥ samādhiḥ” (maṃḍalōpaniṣat)
(dhyānamu cēyucuṃḍuṭa maṟacipōvu sthiti)
(karmēṃdriyamulanu, jñānēṃdriyamulanu, buddhini parabrahmamunaṃdu nilupu avastha).
(samasta vastuvulaku kāraṇamaina parabrahmayaṃdu viṣayamulanni yunnavani dhyāniṃcuṭa).
(iccaṭa, anagā parabrahmayaṃdu manassu niścalamugā nuṃcabaḍunu - manassu parabrahmalō līnamagu naṭluṃḍuṭa samādhi).
(nēnu brahmanu ayitini - anu buddhi smādhānarūpamu samādhi - nēnu brahmanu ayitini ani bhāvamunu poṃdiyuṃḍuṭa samādhi) - (nēnu brahmanu ayitini anu mahāvākyārthamu sārthakamu cēsukonu yōgāṃgamu).
(brahmanu nēnē, nēnē brahmanu ani paramātmaguṟiṃci talaci parabrahmacēta sṛṣṭiṃpabaḍina prapaṃcamanataṭini ātmayē yani talacuṭa samādhi).
(ē sthitini poṃdina pimmaṭa anniṃṭini samamugā cūcu sthiti - samādhi)
(dhyāniṃcuvāḍu, dhyānamu anu bhāvamu viḍici gāli lēnicōṭa kadalaka velugu dīpamuvale dhyānamu cēyavalasina viṣayamu (agu paramātma) nokkaṭinē gāṃcu cittamu samādhi).
nivāta dīda vaccittaṃ samādhiribhidhīyatē ||“. (adhyātmōpaniṣat)
(dhyāniṃcuvāḍu, dhyānamu anu bhāvamunu kramamugā vadali dhyēya vastuvu - dhyāniṃpatagina vastuvu - ayina parabrahmanu gāli lēni cōṭa kadalani dīpamuvale cūcu manassu samādhi yani ceppabaḍucunnadi).
(paramātmatō jīvātma aikyamagu avastha, tripuṭi lēnidi - anagā, dṛśyamu, dṛk, draṣṭa anu mūḍu lēnidi, paramānaṃda svarūpamainadi, śuddha caitanyarūpamu - iṭṭi avastha).
sarva śūnyaṃ nirākāraṃ samādhirabhidhīyatē”.
(ceppuṭaku, telisikonuṭaku, ciṃtiṃcuṭaku alavikāka dōṣamu lēnidai sarva śūnyamai nirākāramainadi samādhi).
vṛttivismaraṇaṃ samyak samādhirabhidīyatē “.
(nirvikāramagu vṛtticēgāni, brahmākāramagu vṛtticēgāni vṛttulanu vismariṃcuṭa samādhiyani ceppabaḍucunnadi).
yā saṃprajñātanāmā sā samādhirabhidhīyatē ||“.
(vṛtti śūnyamaina manassu brahmākāramutō nuṃḍu sthiti saṃprajñāta samādhi ani ceppabaḍinadi).
(bhaktirūpamugā mārina jñānamu)
ajasramaṃbu vahanā yathā nadyā na rudyatē ||“. (yōgavāśiṣṭamu - 62 - 9)
(parāprajñayē samādhi yani paṃḍirulu ceppuduru - ellapuḍu pārucu kaṭṭabaḍanaṭuvaṃṭi nadivale bhagavaṃtuniyaṃdu līnamai yuṃḍu manassu yokka sthiti).
nirvikalpa sthitō vidvān bhūyō nāpyaniśōcati |
salilē saiṃdhavaṃ yadvat sāmyaṃ bhavati yōgataḥ |
tadātma manasōraikyaṃ samādhi rabhidhīyatē |
yathā saṃkṣīyatō prāṇō mānasaṃ ca pralīyatē |
tada samarasatvaṃ yat samādhirabhidhīyatē |
yatsamatvaṃ tayōratra jīvātma paramātmanōḥ |
samastanuṣṭa saṃkalpa ssamādhi rabhidhīyatē |
prabhā śūnyaṃ, manaśśūnyaṃ buddi śūnyaṃ nirāmayaṃ |
sarva śūnyaṃ nirābhāvaṃ samādhirabhidhīyatē |
svayamuccaritē dēhē nityaṃ samādhinā |
niścalaṃ taṃ vijānīyatē samādhi rabhidhīyatē ||“. (saubhāgyalakṣmyupaniṣat)
(ahaṃbhāvamunu viḍicipeṭṭi jagattuku īśvaruḍu lēḍu anu bhāvamunu viḍicipeṭṭi nirvikalpa sthitilō nuṃḍu paṃḍituḍaina vāḍu (jñāni), nīṭilō uppu karigi kalisipōyinaṭlu, yōgābhyāsamuvalana ātmanu manassunu okaṭigā kalupuṭa samādhi yani ceppabaḍunu - prāṇamu kṣīṇiṃci, manassu kṣīṇiṃci okaṭē yaguṭa samādhi - jīvātma paramātmalu ē vidhamaina saṃkalpamulu lēka samamugānuṃḍuṭa samādhiyani ceppabaḍunu - prabhāśūnyamu, manaśśūnyamu, buddhiśūnyamu, nirāmayamu, sarva śūnyamu ayinadi samādhi yani ceppabaḍinadi. dēhamu ellapuḍu uccalitamai niścalamugā nuṃḍuṭa samādhi yani ceppabaḍucunnadi).
cinniṣpaṃ dāṃśamātratvaṃ nānyadastīti bhāvaya |
nitya prabuddha cittastvaṃ kurvannāpi jagatkriyāṃ |
ātmaikatvaṃ viditvā tvaṃ tiṣṭākṣubdhi mahābdhivat |
tatvā bōdhayē vāsau vāsanā tṛṇa pāvakaḥ |
prōkta samādhi śabdēna na ca tūṣṇī mava sthitaḥ”. (mahōpaniṣattu)
(ī kanabaḍucunna prapaṃcamaṃtayu caitanyamu yokka - cinmātramu yokka - aṃśayē. iṃtakaṃṭe vērainadi ēdiyu lēdu ani talaṃcumu - nityamu jñānamu galavāḍavai - iṭṭi brahmajñānamu galavāḍavai - prapaṃcamunaku saṃbadhiṃcina pani dēninainanu cēyucunnanu. ātma okkaṭē yani telusukoni, alalu lēni samudramuvalē niścalamugā nuṃḍumu - idiyē tatvajñānamu - bhagavat jñānamu, bhagavattattvamu. idi vāsanalu (janmamunu kalugacēyu vāsanalu) anu gaḍḍi parakaku agnivaṃṭidi - dānini kālcivēyunadi).
kiṃtēna sūratēnārthaḥ kiṃtēna samādhinā ||“.
(ratilōnu, samādhilōnu manassu līnamukānicō ā rativalana, ā samādhivalana nēmi prayōjanamu).
“samādhiḥ dvividhaḥ - sa vikalpakō, nirvikalpakaścēti - savikalpaka samādhiḥ sādhanaṃ, nirvikalpaka samādhiḥ phalaṃ”.
(savikalpaka samādhi. nirvikalpaka samādhi ani samādhi reṃḍu vidhamulu - savikalpaka samādhi nirvikalpaka samādhiki sādhanamu - savikalpaka samādhiki nirvikalpaka samādhi phalamu -).
samādhi reṃḍu vidamulu - jaḍa samādhi, sahaja samādhi. jaḍa samādhilōniki veḷḷinappuḍu śarīravyāpāramu āgipōyi cēṣṭā rahitamugā yuṃḍunu - tarvāta uttarasthiti aṃṭē samādhisthiti nuṃḍi tirigi prapaṃcamulōniki vaccēdaśa - uṃṭuṃdi. sahaja samādhilō eṃta gāḍhasthitilōniki veḷḷinā śarīravyavahāramulu sāgucunē yuṃḍunu - jaḍa sthiti ērpaḍadu - aṃṭē cēṣṭā rahitaṃ kādu - sahaja samādhi sthitiki prahlāduni jīvitamē udāharaṇamu -
“tadēvāvirbhāvaṃ svarūpa śūnyamiva samādhiḥ”. (pataṃjali yōgasūtramulu)
“yatō paramatē cittaṃ niruddhaṃ yōga sēvayā |
yatra cainātmanā tmānaṃ paśyannātmani tu tuṣyati |
sukha mātyaṃtikaṃ yattadbuddhi grāhya matīṃdriyaṃ |
vētti yatra na caivāyaṃ sthitaścalati tattva taḥ |
yaṃ labdvā cāparaṃ lābhaṃ manyatē nādhikaṃ tataḥ |
yasmin sthitōna duḥkhēna guruṇāpi vicālyatē |
taṃ vidyā dduḥkha saṃ yōga viyōgaṃ yōga saṃjñitaṃ |
sa niścayē na yōktavyō yōgō (a)nirviṇṇa cētasā |
saṃkalpa prabhavān kāmān tyaktvā sarvā naśēṣataḥ |
manasaivēṃdriyagrāmaṃ viniyamya samaṃtataḥ |
śanaiḥ śanairuparavēdbuddhyā dhṛtigṛhītayā |
ātma saṃsthaṃ manaḥ kṛtvā sa kiṃcidapi ciṃtayēt ||
yatō yatō niścarati manascaṃcala masthiraṃ |
praśāṃta manasaṃhyēnaṃ yōginaṃ sukha muttamaṃ |
upaiti śāṃtarajasaṃ brahma bhūtamakalmaṣaṃ |
sukhēna saṃsparśamatyaṃtaṃ sukhamaśnutē “. (śrīmadbhagavadgīta - 6 - 20 to 28)
“ēvaṃ sāmānyatō yōgaṃ prōcyē dānīṃ viśēṣataḥ |
samādhiṃ vistarēṇāha bhagavān yōgināṃ gatiḥ |
pariṇāma viśēṣē hi yasminnabhyāsa pāṭavāt |
jātē cittaṃ niruddhaṃ sacchāṃtaṃ nisnēhadīpavat |
yasmiṃśca pariṇāmē satyātmānaṃ cidadvayaṃ |
vēdāṃtamānasaṃ jātavṛtyā paśyaṃścidātmani |
tuṣyadātma sukhādanya ttōṣa hētōrabhāvataḥ |
ānaṃdaḥ para ēvātmā bhēda saṃsarga varjitaḥ |
sa ēvasva svarūpēṇa vyajyatē puṇyakarmabhiḥ |
yāvadyānattamō(a)naiti buddhauddarrma samāhitaṃ |
tāvattāvaddiyaḥ svāsthyaṃ ttāvattānatsukhōnnatiḥ |
yatrāvastha viśēṣē cidghanānāṃ tādvayaṃ sukhaṃ |
viṣayēṃdriya saṃ yōgā nabhivyaṃgya dhiyāccayā |
satvamātra pravāhinyā grāhyaṃ cāni bhavatyayaṃ |
yatrāyaṃ ca sthitō vidvā nātma tatva svarūpataḥ |
naiva pracyavatē taṃ ca bidyā dityasya yō muniḥ ||
yamabhyāsāti vai śa dyā labdhvā lābhaṃ cidadvayaṃ |
tatō naivāparaṃ lābhamadhikaṃ manyatē budhaḥ |
kṛtakṛtya tayā prāpta prāpa ṇīya tayā tathā |
paramātma sukhēyasmin sthitō duḥkhēna nōmuniḥ |
mahatā śastrapātādi hētukēnāpi cālyatē |
yatrō paramatē cittamatyārabhya viśaṣaṇaiḥ |
cittāvasthā viśēṣō ya uktastaṃ citta saṃ yamaṃ |
sarva duḥkha virōdhitvā dduḥkha saṃ yōga ghātakaṃ |
jānīyā dduḥkha saṃ yōga viyōgaṃ naṃtamasyamuṃ |
viparīta na yē naiva yōga śabdābhidēyakaṃ |
śāstrācārya girāṃ bhāva viṣayō(a)rthaḥ sa niścayāt |
satya ēvēti yōktavyō yōgō nirvēda śūnyayā |
- - - tyaktvā nirvēda mātyaṃta dhairya yuktēna cētasā |
yōgōstvabhyasanī yōyaṃ yadhōktaṃ sāṃpradāyikaiḥ |
- - - dṛṣṭvā saṃsāra māgāra māpadāṃ bhrāṃti janmanāṃ |
virajyālpa sikhēbhṛśca bhōgēbhyōmati mānnaraḥ |
kṛṣṇa pādaratō bhūtvā sadguruṃ prāpya śāṃtidaṃ |
labdhvātataḥ parabrahmōpadēśaṃ yōgamabhyasēt |
yāvat brahma dvayānaṃdē pratiṣṭhāṃ niścalāṃ parāṃ |
dhiyōna viṃdatē tāvadyōgō yōktavya ādarāt |
pratiṣṭhāyāṃ ca siddhāyāṃ kṛtakṛtyō bhavēnmuniḥ |
idaṃ mēsyādidaṃ mēsyāditi saṃkalpa jānimān |
śōbhanādhyāna jān kāmān duṣṭēṣu viṣayēṣvapi |
tyaktvā bhōgābhilāṣā khyāndōṣavṛṣṭyāsyaśēṣataḥ |
sarvān dṛhiṇi lōkāṃtānvāsanā sahitān muniḥ |
pratyāhṛtēṃdriya grāmaṃ viṣayēbhyaḥ samaṃtataḥ |
kāmāpāyē viśēṣēṇa yuktā yādhī stayāmanaḥ |
ātmanyēva samāptirhi yasya tadbrahmā gōcaraṃ |
kṛtvāpi ciṃtayē nnānyadgati manyāṃ sadā śrayēt |
ātmaivā styakhilaṃ nānyaditi manyāṃ sadāśrayēt |
ātmaivā styakhilaṃ nānyaditi niścityavā muniḥ |
nānya dviciṃtayēt kiṃcidyōga nyāyaṃ parō(a)vadhiḥ ||“. (gītābhāvaprakāśamu - 6 - 92 to 118)
(yōgamu guṟiṃci śrīkṛṣṇabhagavānuḍu sāmānyamugā ceppi samādhi guṟiṃci vistariṃci yī kriṃda vidhamugā ceppucunnāḍu: - yōgābhyāsamu valana cittamu mārpu ceṃdi, nūne lēni dīpamuvale śāṃtini poṃdunu - ā sthitilō caitanya rūpuḍu, advayuḍu, agu paramātmayaṃdu tana ātmanu cūcunu - appuḍu paramānaṃdamunu poṃdunu - ātma sukhamukaṃṭe goppa sukhamu lēdu kanuka tanalōni tamassu - ajñānamu - eppuḍeppuḍu naśiṃcucū vaccunō appuḍē cittamu śāṃti niṃdunu).
(iṃdriyamula śaktini miṃcina buddhi cēta grahiṃcabaḍunadi atyaṃta sukhamu - aṭṭi sthitini poṃdi ā sthitinuṃḍi caliṃcakuṃḍa nuṃḍuṭa samādhi. aṭṭi sthitilō nuṃḍuvāniki aṃtakaṃṭe utkṛṣṭamagu lābhamu uṃḍadu, goppa duḥkhamu kūḍa kalugadu - duḥkhamu lēnidaguṭacēta nidiyē yōgamu - idi nāku kāvalenu anu kōrika - saṃkalpamu - dāni valana kaligina viṣayamulu bhrāṃtivalana kaliginavani telusukoni vāṭini viḍici iṃdriyamulanu vāṭi guṟiṃci pōnīyaka manasucēta narikaṭṭi, mella mellagā buddhini dṛḍhamu cēsukoni ātmayaṃdu manassunu nilipi, aṃtayu ātmayē, ātma kānidēdiyu lēdu - ani niścayamu cēsukoni, caliṃpaka itara vastuvu guṟiṃci caliṃpa kūḍadu - iṭlu śāṃtini poṃdina yōgini uttamasukhamu dānaṃtaṭa adiyē vacci poṃdunu. iṭlu cēyuṭa samādhi yanipiṃcukonunu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.